Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనవింశో7ధ్యాయః

అథ కశ్యపవంశవర్ణనమ్‌

అగ్ని రువాచ :

కశ్యపస్య వదే సర్గమాదిత్యాదిషు హే మునే | చాక్షుషే తుషితా దేవాస్తే7దిత్యాం కశ్యపాత్పునః 1

ఆసన్విష్ణుశ్చ శక్రశ్చ త్వష్టా దాతా తధార్యమా | పుషా లివస్వాన్‌ సవితా మిత్రో7థ వరుణో భగః 2

అంశాశ్చ ద్వాదశాదిత్యా ఆసన్వైవస్య తాన్తరే | అరిష్టనేమిపత్నీ నామపత్యానీహ షోడశ 3

ఓ మునీశ్వరుడా! అపుడు కశ్యపునకు అదిత్యాదులయందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. చాక్షుష మన్వంతరము నందు తుషితదేవతలుగా ఉన్నవారే మరల వై వస్వతమన్వంతరమునందు - విష్ణువు, శక్రుడు, త్వష్ట, ధాత అర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, భగుడు, అంశువు అను ద్వాదశాదిత్యులుగా అదితి యందు కశ్యపునకు జనించిరి. అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జనించిరి.

బహుపుత్రస్య విదుషశ్చతస్రో విద్యుతః సుతాః | ప్రత్యఙ్గిరసజాః శ్రేష్ఠా కృశాశ్వస్య సురాయుధాః 4

ఉదయాస్తమనే సూర్యే తద్వదేతే యుగే యుగే

విద్వాంసుడైన బహుపుత్రునకు నలుగురు విద్యుత్తులు కుమార్తెలుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్ఠమైన సురాయుధములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగమునందును, సూర్యుని ఉదయాస్త మనముల వలె, వీరి ఉదయాన్తమనములు (పుట్టుక, తిరోధానము) జరుగు చుండును.

హిరణ్యకశిపుర్దిత్యాం హిరణ్యాక్షశ్చ కశ్యపాతీ. 5

సింహికా బాభవత్కన్యా విప్రచిత్తేః పరిగ్రహః | రాహుప్రభృతయస్తస్యాం స్తెంహికేయా ఇతి శ్రుతాః 6

దితికి క్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సంహికయను కుమార్తెయు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి స్తెంహినేయులని ప్రసిద్ది పొందిరి.

హిరణ్యకశిపోః పుత్రాశ్చత్వారః ప్రధితాజసః | అనుహ్రాదశ్చ హ్రాదశ్చ ప్రహ్లాదశ్చాతివైష్ణవః 7

సంహ్రాదశ్చ చతుర్ధో7భూద్రాదపుత్రో హ్రదస్తథా | సంహ్రాదపుత్ర ఆయుష్మాన్‌ శిబిర్బాష్కల ఏవ చ 8

విరోచనస్తు ప్రాహ్లోదిర్బవిర్జజ్ఞే విరోచనాత్‌ | బలేః పుత్రశతం త్వాసీత్‌ బాణజ్యేష్ఠం మహామునేః 9

హిరణకశిపునకు ప్రసిద్దమైన తేజస్సుగల అనుహ్రాదుడు, హ్రాదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంహ్రాదుడు అను నలుగరు పుత్తరులు జనించిరి. హ్రాదుని పుత్రుడు హ్రదుడు, ఆయుష్మంతుడు, éశిబి, బాష్కలుడు అనువారు సంహ్రాదుని కుమారులు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.

పురా కల్పే హి బాణన ప్రసాద్యోమాపంతి వరః | పార్శ్వతో విహరిష్యామీత్యేవం ప్రాప్తశ్చ ఈశ్వరాత్‌. 10

పూర్వకల్పమునందు బాణుడు ఉమాపతిని అనుగ్రహింప చేసికొని ఆతనినుండి ఆతని సమీపముననే విహరించుట అను వరమును పొందెను.

హిరణ్యాక్షసుతాః పఞ్చ శద్భుదః శకునిస్త్వితి | ద్విమూర్దా శజ్కురాద్యశ్చ శతమాసన్దనోః సుతాః. 11

స్వర్భానోః సుప్రభా కన్యా పులోమ్నస్తు శచీ స్మృతా | ఉపదానలీ హయశిరా శర్మిష్ఠా వార్షపర్వణీ. 12

ప్రలోమా కాలకా చైవ వైశ్వానరసుతే ఉభే | కశ్యపస్య తు భార్యే ద్వే తయోః పుత్రాశ్చ కోటయః 13

స్వర్భానువునకు సుప్రభ అను కన్యయు, పులోమునకు శచియు జనించిరి. ఉపదనువు కుమార్తె హయశిరస్సు- వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ, పులోమ కాలక అను ఇరువురును వైశ్వానరుని కుమార్తెలు. వారిద్దరును కశ్యపుని భార్యలు వారికి కోట్లకొలది పుత్రులు జనించిరి.

ప్రహ్రాదస్య చతుష్కోట్యో నివాతకవచాః కులే | తామ్రాయాః షట్సుతాః స్యుశ్చ కాకీ శ్యేనీ చ భాస్యపి. 14

గృధ్రికా చ శుచి గ్రీవా తాభ్యః కాకాదయో భవన్‌ | అశ్వాశ్చోష్ట్రాశ్చ తామ్రాయా అరుణో గరుడ స్తథా. 15

వినతాయః సహస్రం తు సర్పాశ్చ సురసాభవాః | కాద్రవేయాః సహస్రం తు శేషవాసుకితక్షకాః 16

దంష్ట్రణః క్రోధవశగా ధరోత్థాః పక్షిణోజలే | సురభ్యాం గోమహిష్యాదిరిరోత్పన్నాస్తృణాదయః. 17

ఖసాయాం యక్షరక్షాంసి మునేరప్సరసో7భవన్‌ | అరిష్టాయాన్తు గన్దర్వాః కశ్యపాద్ది స్థిరం చరమ్‌. 18

ఏషాం పుత్రాదయో7సంఖ్యా దేవైర్వై దానవా జితాః

ప్రహ్రాదుని కులమునందు నాలుగు కోట్ల నివాతకవచులు పుట్టిరి. కశ్యపుని భార్యయైన తామ్రకు ఆరుగురు కుమారులును కాకి, శ్యేని, బాసి, గృధ్రిక, శుచిగ్రీవ అను భార్యలకు కాకులు మొదలగునవి జనించినవి. తామ్రవలననే అశ్వములను. ఒంటెలను జనించినవి. వినతవలన అరుణుడును, ఆగరుడుడును పుట్టిరి. సురసనుండి వేయిసర్పములు పుట్టినవి. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన వేయిమంది కద్రువకు పుత్రులు. వీరందరును కోరలుకలిగినవారు. చాల కోపము కలవారు. భూమిపై నివసించువారు. జలములో వీరు రెక్కలు కలిగియుందరు. సురభి (కామధేనువునందు) గోవులు, మహిష్యాదులును పుట్టెను. ఇరనుండి తృణాదులు పుట్టెను. ఆ కశ్యపమునివలననే ఖసయను అప్సరస యందు యక్షులు, రాక్షసులను, అరిష్టయందు గంధర్వులును జనించిరి. ఈ విధముగ కశ్యపుని నుండి చరాచర జగత్తు జనించినది. వీరి పుత్రాదులు అసంఖ్యాకులు ఒకప్పుడు దేవతలు దానవులను జయించిరి.

దితిర్వినష్టపుత్రా వై తోషయామాస కశ్యపమ్‌. 19

పుత్రమిన్ద్రప్రహర్తారమిచ్ఛతీ ప్రాప కశ్యపాత్‌.

ఈ విధముగ పుత్రులు నశించగా దితా ఇంద్రుని సంహరింపగల కుమారుడు కావలెనని కోరుచు కశ్యపుని అను గ్రహింపచేసికొని అట్టి వానిని పొందెను.

పాద(దా) ప్రక్షాళనాత్యుప్తా తస్యా గర్భం జఘాన హ. 20

భిద్రమన్విష్య చేన్ద్రస్తు తే దేవా మరోతో7భవన్‌ | శక్రసై#్యకోనపఞ్చాశత్సహాయా దీప్తతేజనః. 21

ఆమె పాదప్రక్షాళనము చేసికొనకుండగనే నిద్రించెను. ఇంద్రుడు ఆ అవకాశమును చూచుకొని ఆమె గర్భమును ఛేదించెను. వారు (గర్భఖండములు) గొప్ప తేజస్సు గలవారును, ఇంద్రునికి సాహాయ్యము చేయువారును అగు నలుబది తొమ్మండుగురు మరుత్తులను దేవతలుగా అయిరి (నవి)

ఏతత్సర్వం హరిర్బ్రహ్మా అభిషిచ్య పృథుం నృపమ్‌ | దదౌ క్రమేణ రాజ్యాని అన్యేషామధిపో హరిః. 22

హరియు, బ్రహ్మయు, పృథువును రాజ్యాభిషిక్తుని చేసి దీని నంతను ఆతని కిచ్చిరి. ప్రభువైన హరి క్రమముగా ఇతరులకు ఆయా రాజ్యాధికారముల నిచ్చెను.

ద్విజౌషధీనాం చన్ధ్రశ్చ అపాం తు వరుణో నృపః | రాజ్ఞాం వైశ్రవణో రాజా సూర్యాణాం విష్ణురీశ్వరః. 23

వసూనాం పావకోరాజా మరుతాం వాసవః ప్రభుః | ప్రజాపతీనాం దక్షో7థ ప్రహ్లాదో దానవాధిపః. 24

పితౄణాం చ యమో రాజా భూతాదీనాం హరః ప్రభుః |

హిమవాంశ్చై వ శైలానాం నదీనాం సాగరః ప్రభుః. 25

గన్దర్వాణాం చిత్రరథో నాగానామథ వాసుకిః | సర్పాణాం తక్షకోరాజా గరుడః పక్షిణామథ. 26

ఐరావతోగజేన్ద్రాణాం గోవృషో7థ గవామపి | మృగాణామధ శార్ధూలః ప్లక్షో వనస్పతీశ్వరః. 27

ఉచ్చైః శ్రవాస్తథాశ్వానా సుధన్వా పూర్వపాలకః | దక్షిణస్యాం శఙ్ఖపదః కేతుమాన్పాలకోజలే. 28

హిరణ్య రోమకః సౌమ్యే ప్రతిసర్గో7యమీరితః

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ప్రతిసర్గవర్ణనం నామ ఏకోనవింశో7ధ్యాయః

బ్రాహ్మణులకును, ఓషధులకును చంద్రుడు రాజు, జలములకు కరుణుడు, రాజులకు వైశ్రవణుడు, సూర్యులకు విష్ణువు, వసువులకు అగ్ని, మరుత్తులకు ఇంద్రుడు, ప్రజాపతులకు దక్షుడు, దానవులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు యముడు, భూతాదులకు శివుడు, శైలములకు హిమవంతుడు, నదులకు సముద్రుడు, గంధర్వులకు చిత్రరథుడు, నాగులకు వాసుకి, సర్పములకు తక్షకుడు, పక్షులకు గరుత్మంతుడు, గజేంద్రములకు ఐరావతము, గోవులకు వృషభము, మృగములకు పులి, వనస్పతులకు ప్లక్షము, అశ్వములకు ఉచ్ఛైఃశ్రవము ప్రభువలు తూర్పున సుధన్వ, దక్షిణమున శంఖపదుడు, పశ్చిమమున కేతుమంతుడు, ఉత్తరమున హిరణ్యరోమకుడును పాలకులు ఈ విధముగ అవాంతర సృష్టి (ప్రతి సర్గము ) చెప్పబడినది.

అగ్ని మహాపురాణమున ప్రతి సర్గవర్ణనమను ఏకోనవింశా ధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters