Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టసప్తత్యుత్తర శతతమోధ్యాయః

అథ తృతీయావ్రతాని.

అగ్ని రువాచ :

తృతీయావ్రతాన్యాఖ్యాస్యే భుక్తిముక్తిప్రదాని తే | లలితాయాం తృతీయాయాం మూలగౌరీవ్రతం శృణు.1

తృతీయాయాం చైత్రశుక్లే హ్యూఢా గౌరీ హరేణ హి |

తిలైః స్నాతో7ర్చయేచ్ఛమ్భుం గౌర్యా హేమఫలాదిభిః. 2

నమోస్తు పాటలాయైవ పాదౌ దేవ్యాః శివస్యచ | శివాయేతి చ సంకీర్త్య జయాయై గుల్పయోర్యజేత్‌. 3

త్రిపురఘ్నాయ రుద్రాయ భవాన్యై జఙ్ఘయోర్ద్వయోః | శివం రుద్రాయేశ్వరాయ విజయాయై చ జానునీ. 4

ఈశాయేతి కటిం దేవ్యాః శంకరాయేతి శంకరమ్‌ | కుక్షిద్వయం చ కోటవ్యై శూలినం శూలిపాణయే. 5

మఙ్గలాయై నమస్తుభ్యముదరే చాభిపూజయేత్‌ | సర్వాత్మనే నమో రుద్రమైశాన్యై చ కుచద్వయమ్‌.

శివం దేవాత్మనే తద్వద్దాయిన్యై కణ్ఠమర్చయేత్‌ | మహాదేవాయ శివమనన్తాయై కరద్వయమ్‌. 7

త్రిలోచనాయేతి హరం బాహుం కాలానలప్రియే | సౌభాగ్యాయై మహేశాయ భూషణాని ప్రపూజయేత్‌. 8

అశోకమధువాసిన్యై చేశ్వరాయేతి చోష్ఠకౌ | చతుర్ముఖప్రియా చాస్యం హరాయ స్థాణవే నమః. 9

నమోర్ధ నారీశహరమమితాఙ్గ్యైచ నాసికామ్‌ | నమ ఉగ్రాయ లోకేశం లలితేతి పునర్ర్భవౌ. 10

అగ్ని దేవుడు చెప్పెను. ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు తృతీయా వ్రతములను చెప్పెదను. లలితాతృతీయ నాడు చేయు మూలగౌరీ వ్రతమును వినుము. పరమేశ్వరుడు చైత్ర శుక్ల తృతీయ దివసమున పార్వతిని వివాహ మాడెను. అందుచే ఆ దివసమున తిలమివ్ర జలముతో స్నానమాచరించి, పార్వతీసమేతుడగు పరమేశ్వరుని బంగారము, ఫలములు మొదలగు వాటితో పూజించవలెను. నమోస్తు పాటలాయై అని చెప్పి పార్వతి పాదములను, శంకరుని పాదములను పూజించవలెను. శివాయ నమః అని శివుని, జయాయైనమః అని పార్వతిని అర్చించవలెను. త్రిపురఘ్నాయ నమః ''భవాన్యై నమః'' అని చెప్పుచు క్రమముగా శివపార్వతుల జంఘలను పూజించవలెను. ''రుద్రేశ్వరాయ నమః'' ''విజయాయై నమః'' అని చెప్పుచు శివపార్వతుల మోకాళ్ళు పూజించవలెను. ''ఈశాయై నమః'' ''శంకరాయ నమః'' అని చెప్పుచు వరుసగా పార్వతీ శివుల కటి భాగమును, ''కోటవ్యై నమః ''శూలపాణయే నమః '' అని చెప్పుచు కుక్షి ప్రదేశములను, ''మఙ్గలాయై నమః'' ''తుభ్యం నమః '' అని చెప్పుచు వారి ఉదరమును పూజించవలెను. ''సర్వాత్మనే నమః'' ''ఈశాన్యై నమః'' అని చెప్పుచు వరుసగా శివపార్వతుల స్తనములను, దేవాత్మనే నమః'' ''హ్రాదిన్యై నమః'' అని చెప్పుచు కంఠప్రదేశమున, ''మహాదేవాయ నమః'' అనన్తాయై నమః'' అని హస్తములను, ''త్రిలోచనాయ నమః'' ''కాలానల ప్రియాయై నమః'' అని భుజములను, ''మహేశాయ నమః'' ''సౌభాగ్యాయై నమః'' అని వారి అలంకారములను పూజించవలెను. పిదప ''అశోక మధువాసిన్యై నమః'' ''ఈశ్వరాయ నమః'' అని చెప్పుచు వరుసగా పార్వతీ పరమేశ్వరుల ఓష్ఠములను, ''చతుర్ముఖ ప్రియాయై నమః'' హరాయ స్థాణవే నమః'' అని ముఖములను పూజించవలెను. ''అర్ధనారీశాయ నమః'' ''అమితాఙ్గాయై నమః'' అని వరుసగ శివపార్వతుల నాసికలను, ''ఉగ్రాయ నమః'' ''లలితాయై నమః'' అని కనుబొమ్మలను పూజించవలెను.

శర్వాయ పురహన్తారం వాసన్త్యై చైవ తాలుకమ్‌ | నమః శ్రీకణ్ఠనాథాయై శితికణ్ఠాయ కేశకమ్‌. 11

భీమోగ్రాయ సురూపిణ్యౖ శిరః సర్వాత్మనే నమః | మల్లికాశోక కమలకున్దం తగరమాలతీ. 12

కదమ్బకరవీరం చ బాణమవ్లూనకుజ్కుమమ్‌ | సిన్దువారం చ మాసేషు సర్వేషు క్రమశః స్మృతమ్‌. 13

ఉమామహేశ్వరౌ పూజ్య సౌభాగ్యాష్టకమగ్రతః | స్థాపయేద్ఘృతనిష్పావకుసుమ్భక్షీరజీవకమ్‌. 14

తరురాజేక్షులవణం కుస్తుమ్చురుమథాష్టమమ్‌ | చైత్రే శృజ్గోదకం ప్రాశ్య దేవదేవ్యగ్రతః స్వపేత్‌. 15

ప్రాతః స్నాత్వా సమభ్యర్చ్య విప్రచామ్పత్యమర్చయేత్‌ | తదష్టకం ద్విజే దద్యాల్లలితా ప్రీయతాం మమ.

శృఙ్గోదకం గోమయం చ మన్దారం బిల్వపత్రకమ్‌ | కుశోదకం దధి క్షీరం కార్తికే పృషదాజ్యకమ్‌. 17

గోమూత్రాజ్యం కృష్ణతిలం పఞ్చగవ్యం క్రమాశనమ్‌ | లలితా విజయా భద్రా భవానీ కుముదా శివా. 18

వాసుదేవీ తథా గౌరీ మఙ్గలా కమలా సతీ | చైత్రాదౌ దానకాలే చ ప్రీయతామితి చార్చయేత్‌. 19

ఫలమేకం పరిత్యాజ్యం వ్రతాన్తే శయనం దదేత్‌ | ఉమామహేశ్వరం హైమం వృషభం చ గవా సహ. 20

గురుం చ మిథునాన్యర్చ్య వస్త్రాతద్యైర్భుక్తిముక్తిభాక్‌ | సౌభాగ్యారోగ్యరూపాయుః సౌభాగ్యశయనవ్రతాత్‌.

''శర్వాయ నమః'' ''వాసన్త్యై నమః'' అని చెప్పుచు వరుసగ శివపార్వతుల తాలుప్రదేశమును పూజించవలెను. ''శ్రీకణ్ఠనాధాయై నమః'' ''శితికణ్ఠాయ నమః'' అని చెప్పుచు వరుసగా పార్వతీ పరమేశ్వరుల కేశపాశములను పూజించవలెను. ''భీమోగ్రాయ నమః'' ''సురూపిణ్యౖ నమః'' అని చెప్పుచు శివపార్వతుల శిరస్సులను పూజించవలెను. ''సర్వాత్మనే నమః'' అని చెప్పి పూజను ఉపసంహరించవలెను. చైత్రము మొదలు పండ్రెండు మాసములందు వరుసగా మల్లిక, అశోకము, కమలము, కుందము, తగరము, మాలతి, కదంబము, కరవీరము, బాణము, అవ్లూనము, కుంకుమము, సిందువారము- ఈ పుష్పములతో శివపూజ చేయవలెను. ఉమామహేశ్వర పూజానంతరము వారి ఎదుట - ఘృతమిశ్ర నిష్పావము, కుసుంభము, దుగ్ధము, జీవకము, దూర్వలు, చెరకు కర్ర, ఉప్పు, కొత్తిమిరి అను ఎనిమిది సౌభాగ్యద్రవ్యములను ఉంచవలెను. చైత్రమాసమున పర్వత శిఖరాగ్ర జలము త్రాగి పార్వతీ పరమేశ్వరుల సంముఖమున శయనించవలెను. ప్రాతః స్నానముచేసి, పార్వతీపరమేశ్వరుల పూజ చేసి, బ్రాహ్మణ దంపతులను అర్చించి ''లలితాత ప్రీయతాం మమ'' అని చెప్పుచు ఆ అష్ట సౌభాగ్యద్రవ్యములను దానము చేయవలెను. వ్రతమాచరించువాడు, చైత్రాదిమాసములందు వరుసగా వ్రతదినములో, పర్వత శిఖరజలమును, గోమయమును, మందారమును, బిల్వపత్రములను, ఘృతమిశ్రమగు పెరుగును, గోమూత్రమును, ఘృతమును. నల్లని తిలలను పంచగవ్యములను భుజించవలెను. సౌభాగ్యాష్టకము దానము చేయు సమయమున, చైత్రాదిమాసములందు, వరుసగా ''ప్రీయతాం మమ'' అనుదానికి ''లలితా, విజయా, భద్రా, భవానీ, కుముదా, శివా, వాసుదేవీ, గౌరీ, మంగళా, కమలా, సతీ'' అనునవి చేర్చవలెను. వ్రతము ముగిసిన తరువాత ఏదైన ఒక ఫలమును పరిత్యజించలెను. గురువునకు తలగడలతో గూడిన శయ్యను, స్వర్ణ నిర్మిత మగు ఉమామహేశ్వరమూర్తిని, గోసహిత వృషభమును దానము చేయవలెను. గురువునకును, బ్రాహ్మణదంపతులకును వస్త్రాదులతో సత్కారము చేసిన వాడు భుక్తిముక్తులను పొందును. ''సౌభాగ్యశయనము'' అను ఈ వ్రతమును ఆచరించుటచే మనుష్యుడు సౌభాగ్య - ఆరోగ్య - రూప - దీర్ఘాయువులను పొందును.

నభ##స్యే వాథ వై శాఖే కుర్యాన్మార్గశిరస్యథ | శుక్లపక్షే తృతీయాయాం లలితాయై నమో యజేత్‌. 22

ప్రతిపక్షం తతః ప్రార్చ్య వ్రతాన్తే మిథునాని చ | చతుర్వింశతిమభ్యర్చ్య వస్త్రాద్యైర్భుక్తి ముక్తిభాక్‌. 23

ఉక్తో మార్గో ద్వితీయోయం సౌభాగ్యవ్రతమావదే | ఫాల్గునాదితృతీయాయాం లవణం యస్తు వర్జయేత్‌. 24

సమాప్తే శయనం దద్యాద్గృహం చోపస్కరాన్వితమ్‌ | సంపూజ్య విప్రమిథునం భవానీ ప్రీయతామితి. 25

సౌభాగ్యం తృతీయోక్తా గౌరీలోకాదిదాయినీ | మాఘే భాద్రే చ వైశాఖేతృతీయా వ్రతకృత్తథా. 26

దమనకతృతీయాకృచ్చైత్రే దేవీం దమనకైర్యజేత్‌ | ఆత్మతృతీయా మార్గస్య ప్రార్చ్యేచ్ఛాభోజనాదినా. 27

గౌరీ కాలీ హ్యుమా భ్రద్రా దుర్గా కాన్తిః సరస్వతీ | వైష్ణవీ లక్ష్మీః ప్రకృతిః శివా నారాయణీ క్రమాత్‌. 28

మార్గతృతీయామారభ్య సౌభాగ్యం స్వర్గమాప్నుయాత్‌.

ఇత్యాది మహాపురాణ అగ్నేయే తృతీయావ్రతాని నామాష్టసప్తత్యధిక శతతమోధ్యాయః.

భాద్రపద - వైశాఖ - మార్గశీర్ష శుక్ల తృతీయలందు గూడ ఈ వ్రతము చేయవచ్చును. ''లలితాయై నమః'' అని చెప్పుచు పార్వతీపూజ చేయలెను. ప్రతి పక్షమునందును ఈవిధముగా పూజించి వ్రతాంతమునందు ఇరువది నలుగురు దంపతులకు వస్త్రదానము చేయువాడు భుక్తిముక్తులను పొందును. ఇది సౌభాగ్యశయన వ్రతము రెండవవిధి. ఇపుడు సౌభాగ్యవ్రతమును గూర్చి చెప్పెదను. ఫాల్గుణాది మాసముల శుక్లపక్ష తృతీయలయందు వ్రతము చేయువాడు ఉప్పు పరిత్యజించవలెను. వ్రతము సమాప్తమైన పిమ్మట బ్రాహ్మణదంపతి పూజ చేసి, ''భవానీ ప్రీయతామ్‌ '' అని చెప్పి శయ్య, సంపూర్ణ సామగ్రి చేర్చి గృహము దానము చేయవలెను. ఇది సౌభాగ్య తృతీయా వ్రతము. ఇది పార్వత్యాదిలోకముల నిచ్చును. మాఘ - భాద్రపద - వైశాఖ తృతీయలందు గూడ ఈ విధముగనే చేయవలెను. చైత్రమునందు దమనక తృతీయవ్రతమాచరించి దమనక పుష్పముతో పార్వతిని పూజించవలెను. మార్గశీర్షమున ఆత్మ తృతీయావ్రత మాచరించవలెను. దానియందు పార్వతీ పూజ చేసి బ్రాహ్మణులకు యథేచ్ఛగా భోజనము పెట్టవలెను. మార్గశీర్ష తృతీయతో ప్రారంభించి, క్రమముగా పౌషాదిమాసములందుపై వ్రతమును ఆచరించి ''గౌరీ, కాలీ, ఉమా, భద్రా, దుర్గా, కాంతి, సరస్వతీ వైష్ణవీ, లక్ష్మీ, ప్రకృతి, శివా, నారయణీ'' అను నామములకు ప్రీయతామ్‌ అని చేర్చి చెప్పవలెను. ఈ విధముగా వ్రతము చేయువాడు సౌభాగ్యమును స్వర్గమును పొందును.

అగ్ని మహాపురాణమునందు తృతీయా వ్రతవర్ణనమను నూటడెబ్బది ఎనిమిదివ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters