Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చసప్తత్యుత్తర శతతమో7ధ్యాయః

అథ వ్రతపరిభాషాః.

అగ్నిరువాచ :

తిథివారరదివసమాసర్త్వబ్దార్కసంక్రమే | నృస్త్రీవ్రతాది వక్ష్యామి వసిష్ఠ శృణు తత్ర్కమాత్‌. 1

శాస్త్రోదితో హి నియమో వ్రతం తచ్చ తపో మతమ్‌ | నియమాస్తు విశేషాస్తు వ్రతసై#్యవ దమాదయః. 2

వ్రతం హి కర్తృ సన్తాపాత్తప ఇత్యభిధీయతే | ఇన్ద్రియగ్రామనియమో నియమశ్చాభిధీయతే 3

అనగ్నయస్తు యే విప్రాస్తేషాం శ్రేయో7భిధీయతే | వ్రతోపవాసనియమైర్నానాదానై స్తథా ద్విజః. 4

తే స్యుర్దేవాదయః ప్రీతా భుక్తిముక్తిప్రదాయకాః | ఉపావృత్తస్య పాపేభ్యో యస్తు వాసోగుణౖః సహ. 5

ఉపవాసః స విజ్ఞేయః సర్వభోగవివర్జితః | కాంస్యం మాంసం మసూరం చ చణకం కోరదూషకమ్‌. 6

శాకం మధు పరాన్నం చ త్యజేదుపవనస్‌ స్త్రియమ్‌ | పుష్పాలఙ్కారవస్త్రాణి ధూపగన్ధానులేపనమ్‌. 7

ఉపవాసే న శస్యన్తి దన్తధావనమఞ్జనమ్‌ | దన్తకాష్ఠం పఞ్చగవ్యం కృత్వాప్రాతర్వ్రతం చరేత్‌. 8

అసకృజ్జలపానాచ్చ తామ్బూలస్య చ భక్షణాత్‌ | ఉపవాసః ప్రదుష్యేత దివాస్వప్నాచ్చ మైథునాత్‌. 9

క్షమా సత్యం దయాదానం శౌచమిన్ద్రియనిగ్రహః | దేవపూజాగ్నిహరణం సన్తోషో7స్తేయమేవ చ. 10

సర్వవ్రతేష్వయం ధర్మః సామాన్యో దశధా స్మృతః | పవిత్రాణి జపేచ్చైవ జుహుయాచ్చైవ శక్తితః. 11

నిత్యస్నాయీ మితాహారీ గురుదేవద్విజార్చకః | క్షారం క్షౌద్రం చ లవణం మధు మాంసాని వర్జయేత్‌. 12

తిలమూద్గాదృతే సశ్యసస్యే గోధూమకోద్రవౌ | చీనకం దేవధాన్యం చ శమీధాన్యం తథైక్షవమ్‌. 13

శితధాన్యం తథా పణ్యం మూలం క్షారగణః స్మృతః | వ్రీహిషష్టికముద్గాశ్చ కలాయాః సతిలా యవాః. 14

శ్యామాకాశ్చైవ నీవారా గోధూమాద్యా వ్రతే హితాః

కూష్మాణ్డాలాబు వార్తాకాన్పాలఙ్కీం పూతికాంత్యజేత్‌. 15

చరుభక్ష్యం సక్తుకణాః శాకం దధి ఘృతం పయః | శ్యామాకశాలినీవారా యవకం మూలతణ్డులమ్‌.

హవిష్యం వ్రతనక్తాదావగ్ని కార్యాదికే హితమ్‌ | మధు మాంసం విహాయాన్యద్వ్రతే వా హితమీరితమ్‌. 17

అగ్నిదేవుడు పలికెను : వసిష్ఠా! తిథి, వారము, నక్షత్రము, దివసము, మాసము, ఋతువు, సంవత్సరము సూర్యసంక్రమణము-వీటియందు పురుషులు స్త్రీలు ఆచరించదగిన వ్రతములను క్రమముగా చెప్పెదను; వినుము. శాస్త్రములలో చెప్పిన నియమమే 'వ్రతము' అదియే తపస్సు. దమము మొదలగునవి వ్రతమునకే విశిష్టమైన నియమములు. కర్తను తపింపచేయుటచే వ్రతమే 'తపస్సు' అని చెప్పబడును. ఇంద్రియసముదాయమును వశములో నుంచుకొనుట నియమము. అగ్నిరహితు లగు వివ్రులకు ఇది శ్రేయస్కర మని చెప్పబడినది, వ్రతోపవాసనియమము లచేతను, నానావిధము లగు దానములచేతను దేవాదులు సంతసించినవారై భుక్తి ముక్తులను ప్రసాదింతురు. పాపములనుండి మరలినవాడై గుణములతో నివసించుటయే సకలభోగములు విడనాడిన ఉపవాసము. ఉపవాసము చేయువాడు కంచుపాత్రలు, మాంసము, మసూరము, శనగ, కొఱ్ఱలు, శాకము, మధువు, పరాన్నము, స్త్రీ- వీటిని విడువవలెను. ఉపవాస సమయమున పుష్పాలంకారవస్త్రములు, ధూపగంధాను లేపనములు, దంతకాష్ఠముతో దంతధావనము, అంజనము ఇవి నిషిద్ధములు. ప్రాతఃకాలమునందే పంచగవ్యము చేసి వ్రతము ప్రారంభింపవలెను., మాటిమాటికి నీరు త్రాగినను, దానము శౌచము, ఇంద్రియనిగ్రహము, దేవపూజ అగ్నిహరణము, సంతోషము, అస్తేయము ఈ పదియు సర్వవ్రతము లందును అనుసరించవలసిన సామాన్యధర్మములు. పవిత్ర మంత్రములను జపించవలెను. యథాశక్తిగా హోమము చేయవలెను. నిత్యస్నానము చేయుచు, మితముగా భుజించుచు, గురు-దేవ-బ్రాహ్మణులను పూజించుచు, క్షారము తేనె, లవణము మధువు, మాంసము విడువవలెను. తిలలు పెసలు తప్ప మిగిలిన పప్పుదినుసులు, సస్యములతో గోధుమలు కొఱ్ఱలు, చీనకము, దేవధాన్యము, శమీధాన్యము, చెరకు నుండి తయారైనవి, శితధాన్యము, పణ్యము, మూలము ఇవి క్షారగణమునకు చెందినవి గాన త్యాజ్యములు, షష్టికవ్రీహి, పెసలు, కలాయములు తిలలు యవలు, శ్యమాకములు, గోధూమాదులు, శ్యామాకములు వ్రతమునందు హితమైనవి. గుమ్మడి. ఆనపకాయ, వంకాయ, పాలంకి, పూతిక పరిత్యజించవలెను. వ్రతమునందును నక్తాదులందును, అగ్నికార్యములందును, భిక్షాలబ్ధ మగు చరువు, సక్తుకణములు, శాకము పెరుగు, నెయ్యి, పాలు, శ్యామాక-శాలి నీవారములు, యవలు, మూలతండులములు, హవిష్యములు హితములు లేదా వ్రతమునందు మధుమాంసములు తప్ప మిగిలిన వన్నియు హితములే.

త్య్రహం ప్రాతస్త్ర్యహం సాయం త్య్రహమద్యాదయాచితమ్‌ |

త్య్రహం పరం చ నాశ్నీ యాత్ర్పాజాపత్యం చరన్‌ ద్విజః. 18

ఏకైకం గ్రాసమశ్నీయాత్త్ర్యహాణి త్రీణి పూర్వవత్‌ | త్య్రహం చోపవసేదన్త్యమతికృచ్ఛ్రం చరన్ద్విజః. 19

గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిః కుశోదకమ్‌ |

ఏకరాత్రోపవాసశ్చ కృచ్ఛ్రం సాన్తపనం స్మృతమ్‌. 20

పృథక్సాన్తపనద్రవ్యైః షడహః సోపవాసకః సప్తాహీనన్తు కృచ్ఛ్రో7యం మహాసాన్తపనో7ఘహా. 21

ద్వాదశాహోపవాసేన పరాకః సర్వపాపహా | మహాపరాకస్త్రిగుణ స్త్వయమేవ ప్రకీర్తితః. 22

పౌర్ణమాస్యాం పఞ్చదశగ్రాస్యమావాస్యభోజనః | ఏకాపాయే తేతు వృద్దౌ చాన్ద్రాయణమతో7 న్యధా. 23

కపిలాగోః పలం మూత్రమర్ధాఙ్గుష్ఠం చ గోమయమ్‌ | క్షీరం సప్తపలం దద్యాద్దధ్నశ్చైవ పలద్వయమ్‌. 24

ఘృతమేకపలం దద్యాత్పలమేకం కుశోదకమ్‌ | గాయత్య్రా గృహ్యా గోమూత్రం గన్దద్వారేతి గోమయమ్‌.

ఆప్యాయస్వేతి చ క్షీరం దధిక్రావ్ణేతి వై దధి | తేజో7సీతి తథాచాజ్యం దేవస్యేతి కుశోదకమ్‌. 26

బ్రహ్మకూర్చో భవత్యేవ మాపోహిష్ఠేత్యృచం జపేత్‌ | అఘమర్షణసూక్తేన సంయోజ్య ప్రణవేన వా. 27

పీత్వా సర్వాఘనిర్ముక్తో విష్ణులోకే హ్యుపోషితః | ఉవాసే సాయంభోజీ యతిః షష్ఠాత్మకాలవాన్‌. 28

మాంసవర్జీ చాశ్వమేధీ సత్య వాదీ దివం వ్రజేత్‌ | అగ్న్యాధేయం ప్రతిష్ఠా చ యజ్ఞదానవ్రతాని చ. 29

దేవవ్రతవృషోత్సర్గచూడాకరణమేఖలాః | మాఙ్గల్యమభిషేకం చ మలమాసే వివర్జయేత్‌. 30

ప్రాజాపత్యము నాచరించు ద్విజుడు మూడు దినములు ప్రాతఃకాలము, మూడు దినములు సాయంకాలము అయా చితాహారము భుజించవలెను. పిదప మూడు దినములు ఏమియు తినగూడదు. అతికృచ్ఛ్రము చేయు ద్విజుడు వెనుక చెప్పినట్లుగనే మూడు దివసములు ఒక్కొక్క గ్రాసమును తినవలెను. చివర మూడు దివసములు ఉపవాసము చేయవలెను. గోమూత్రము. గోమయము, క్షీరము, పెరుగు, నెయ్యి, కుశోదకము భుజించుట ఒకరాత్రి ఉపవాసము ఇది కృచ్ర్ఛసాంతపనము. సాంతపనమునకు చెప్పిన ద్రవ్యములు వేరు వేరుగా ఒక్కొక్క రోజుచొప్పున ఆరు రోజులు భుజించి ఏడవ రోజున ఉపవాసము చేసినచో ఇది పాపములను నశింపచేయు మహాసాంతపనము. పండ్రెండు రోజులు ఉపవాసము చేసినచో ఆది సర్వపాపములను తొలగించు పరాకము. ఇది మూడు రెట్లుచేసినచో ''మహాపరాకము'' పూర్ణిమ నాడు పదునైదు గ్రాసములు భుజించి పిదప ప్రతిదినము ఒక్కొక్క గ్రాసమును తగ్గించుచు అమావాస్యనాడు ఉపవాసము చేయవలెను. పిదప ప్రతిపత్తున ఒక గ్రాసము తినుటతో ప్రారంభించి ప్రతిదినము ఒక్కొక్క గ్రాసము పెంచుతూ తినవలెను. ఇది ''చాంద్రాయణము. ఈ వ్రతము పైన చెప్పిన క్రమమునకు విపరీతముగా కూడ చేయవచ్చును, ఒక పలము కపిల గోమూత్రము, అర్థాం గుష్ఠప్రమాణ మగు గోమయము, ఏడు పలముల క్షీరము, రెండు పలముల పెరుగు, ఒక పలము ఘృతము, కుశోదకము ఒక పలము- వీటిలో గోమూత్రమును గాయత్రీమంత్రము చేతను, గోమయమును ''గంధధ్వారా'' ఇత్యాదిమంత్రముచేతను, క్షీరమును ''ఆప్యాయస్వ'' ఇత్యాదిమంత్రముచేతను, పెరుగును. ''దధిక్రాక్ణంః'' అను మంత్రముచేతను ఆజ్యమును ''తేజో7సి'' ఇత్యాదిమంత్రముచేతను, కుశోదకమును ''దేవస్య'' ఇత్యాదిమంత్రము చేతను. ఈ విధముగ గ్రహించినచో అది ''బ్రహ్మకూర్చము'' అఘమర్షణసూక్తముతో గాని, ప్రణవముతో గాని చేర్చి ''ఆపో హి ష్ఠామ'' ఇత్యాదిమంత్రమును జపించవలెను. ఈ విధముగా త్రాగి పిదప ఉపవాసమున్నవాడు సర్వపాపవిముక్తుడై విష్ణులోకము చేరగల్గును. పగలు ఉపవాసము ముండి సాయంకాలము భుజించువాడును, దివసము ఎనిమిది భాగములలో కేవలము ఆరవ భాగమునందు మాత్రము భుజించు సంన్యాసియు, అశ్వమేధయాజియు, సత్యము పలుకువాడును స్వర్గమునకు వెళ్ళును. అగ్న్యాధానము, ప్రతిష్ఠ యజ్ఞము, దానము, వ్రతము, దేవవ్రతము, వృషోత్సర్గము, చూడాకరణము, మేఖలాబంధము, వివాహము, మొదలగు మంగళకార్యములును, అభిషేకము మలమాసములో చేయగూడదు.

దర్శాద్దర్శస్తు చాన్ద్రః స్యాత్త్రింశాహశ్చైవ సావనః | మాసః సౌరస్తు సంక్రాన్తేర్నాక్షత్రో భవివర్తనాత్‌. 31

సౌరో మాసో వివాహాదౌ యజ్ఞాదౌ సావనః స్మృతః | ఆబ్దికే పితృకార్యే చ చాన్ద్రోమాసః ప్రశస్యతే. 32

ఆషాఢీమవధిం కృత్వా యః స్యాత్పక్షస్తు పఞ్చమః |

కుర్యాచ్ర్ఛాద్దం తత్ర రవిః కన్యాం గచ్ఛతు వా న వా. 33

మాసి సంవత్సరే చైవ తిథిద్వైధం యదా భ##వేత్‌ | తత్రో త్తరో త్తమా జ్ఞేయా పూర్వా తు స్యాన్మలివ్లుుచా. 34

ఉపోషితవ్యం నక్షత్రం యేనాస్తం యాతి భాస్కరః | దివా పుణ్యాస్తు తిథయో రాత్రౌ నక్తవ్రతే శుభాః. 35

యుగ్మాగ్ని యుగభూతాని షణ్యున్యోర్వసురన్ధ్రయోః | రుద్రేణ ద్వాదశీయుక్తా చతుర్దశ్యా తు పూర్ణిమా. 36

ప్రతిపద్యప్యమావాస్యా తిథ్యోర్యుగ్మం మహాఫలమ్‌ | ఏతద్వ్యస్తం మహాఘోరం హన్తి పుణ్యం పురాకృతమ్‌.

నరేన్ద్రమన్త్రి వ్రతినాం వివాహోపద్రవాదిషు | సద్యః శౌచం సమాఖ్యాతం కాన్తారాపది సంసది. 38

ఆరబ్ధదీర్ఘతపసాం న రాజా వ్రతహా స్త్రియాః | గర్భిణీ సూతికా నక్తం కుమారీ చ రజస్వలా. 39

యదాశుద్ధా తదాన్యేన కారయేత క్రియాః సదా | క్రోధాత్ర్పమాదాల్లోభాద్వా వ్రతభఙ్గో భ##వేద్యది. 40

దినత్రయం న భుఞ్జీత ముణ్డనం శిరసోథ వా | అసామర్థ్యే వ్రతకృతౌ పత్నీం వా కారయేత్సుతమ్‌. 41

సూతకే మృతకే కార్యం ప్రారబ్ధం పూజనోజ్ఘితమ్‌ | వ్రతస్థం మూర్ఛితం దుగ్ధపానాద్యైరుద్ధరేద్గురుః. 42

అష్టౌ తాన్యవ్రతఘ్నాని ఆపో మూలం ఫలం పయః | హరిర్ర్భాహ్మణకామ్యా చ గురోర్వచనమౌషధమ్‌.

కీర్తిసన్తానవిద్యాది సౌభాగ్యారోగ్యవృద్దయే | నైర్మల్యభుక్తిముక్త్యర్థం కుర్వే వ్రతపతే వ్రతమ్‌. 44

ఇదం వ్రతం మయా శ్రేష్ఠం గృహీతం పురతస్తవ | నిర్విఘ్నం సిద్ధిమాయాతు త్వత్ర్పసాదాజ్జగత్పతే. 45

గృహీతేస్మిన్ర్వతవరే యద్యపూర్ణే మ్రియే హ్యహమ్‌ | తత్సర్వం పూర్ణమేవాస్తు ప్రసన్నే త్వయి సత్పతౌ.

అమావాస్యనుండి అమావాస్యకు ''చాంద్రమాసము.'' ముప్పది దినములు ''సావనమాసము.'' సంక్రాంతినుండి సంక్రాంతికి ''సౌరమాసము''. అన్ని నక్షత్రములును ఒక పర్యాయము తిరిగి వచ్చినచో నక్షత్రమాసము. వివాహాదులకు సౌరమాసము, యజ్ఞాదులకు సావనమాసము, శ్రాద్దాది పితృకార్యములకు చాంద్రమాసము ఉత్తమమైనవి. ఆషాడపూర్ణిమ తరువాత వచ్చు ఐదవ పక్షమునందు పితరులకు తప్పక శ్రాద్ధముచేయవలెను. అప్పటికి సూర్యుడు కన్యారాశి చేరినాడా లేదా అను విచారము అనావశ్యకము. మాసిక -వార్షిక వ్రతములకు ఏదైన ఒక తిథి దినద్వయవ్యాప్త మైనచో రెండవ దినమునందలి తిథి ఉత్తమ మైనది. మొదటిది మలినము. నక్షత్రవ్రతమునందు, సూర్యుడు ఏ నక్షత్రమునందు అస్తమించునో ఆ నక్షత్రమునందే ఉపవాసము చేయవలెను. దివసవ్రతములకు దినవ్యాపితిథులును, నక్తవ్రతములకు రాత్రివ్యాపితిథులును పుణ్యప్రదములు, శుభకరములు.ద్వితీయతో, తృతీయ, చతుర్దశితో పూర్ణిమ, అమావాస్యతో ప్రతిపత్తు కలియుట మంచిది. ఇది గొప్ఫఫలము నిచ్చును. ఇందుకు విపరీత మగు కలయిక ప్రతిపత్తుతో ద్వితీయ ఇత్యాదివిధమున భయానకము. పూర్వము చేసిన పుణ్యములను గూడ నశింపజేయును. రాజు, మంత్రి, వ్రతమధ్యమునందున్నవాడు - వీరికి వివాహము, ఉపద్రవాదులు, దుర్గమస్థానము, సంకటసమయము యుద్ధము-వీటియందు తత్కాలశుద్ధి చెప్పబడినది. దీర్గకాలికవ్రతము నారంభించిన స్త్రీ మధ్యలో రజస్వల యైనను వ్రతభంగము కాదు. గర్భవతి, ప్రసవగృహమునందున్న స్త్రీ, రజస్వల యగు కన్య శుద్ధులై వ్రతము చేయుటకు అయోగ్యులుగా నున్నపుడు ఆ శుభకార్యమును ఇతరులచే చేయించవలెను. క్రోధము చేత గాని, పొరబాటుచేత గాని, లోభముచేత గాని వ్రతభంగ మైనచో మూడు దినములు ఉపవాసముండవలెను. లేదా శిరోముండనము చేయించుకొనవలెను. స్వయముగా వ్రతము నాచరించుటకు సామర్థ్యము లేనిచో భార్యచేత గాని, పుత్రునిచేత గాని చేయించవలెను. ప్రాంభించిన వ్రతమును జననాశౌచ-మరణాశౌచములందు కూడ నడిపింపవలెను; పూజాకార్యము మాత్రము చేయగూడదు. వ్రతము నవలంబించినవాడు ఉపవాసము చేయుటచే మూర్ఛితుడైనచో గురువు ఆతనిని పాలు త్రాగించి గాని, మరి యేదైన ఉపాయముచేత గాని మరల స్పృహలోనికి వచ్చునట్లు చేయవలెను. జలము, ఫలము, మూలము, పాలు, హవిష్యము (నెయ్యి) బ్రాహ్మణచ్ఛాపూర్తి, గురువచనము, ఔషధము-ఇవి వ్రతభంగకరములు కావు. (వ్రతము చేయువాడు ఆ దేవతను ఈ విధముగా ప్రార్థించవలెను.); ''వ్రతపతే! కీర్తి-సంతాన-విద్యాదులకొరకును. సౌభాగ్య-ఆరోగ్య-అభివృద్ది-నిర్మలతా-భోగ-మోక్షములకొరకును నేను ఈ వ్రతము నాచరించుచున్నాను. ఈ శ్రేష్ఠవ్రతమును నీ ఎదుటనే గ్రహించినాను. జగత్పతీ! నీ అనుగ్రహముచే ఇది నిర్విఘ్నముగ కొనసాగుగాక. ఓ వ్రతపాలకా! ఈ వ్రతమును గ్రహించిన తరువాత ఇది పూర్తి కాకుండగనే నేను మరణించినచో, నీ అనుగ్రహముచే ఇది పూర్ణముగుగాక.

వ్రతమూర్తిం -జగద్భూతిం మణ్డలే సర్వసిద్దయే | ఆవాహయేన్నమస్తుభ్యం సన్నిధౌ భవ కేశవ. 47

మనసా కల్పితైర్భక్త్యా పఞ్చగవ్యైర్జలైః శుభైః | పఞ్చామృతైః స్నాపయామి త్వం మే చ భవ పాపహా. 48

గన్దపుష్పోదకైర్యుక్తమర్ఘ్యమర్ఘపతే శుభమ్‌ | గృహాణ పాద్యమాచామమర్ఘ్యార్హం కురు మాం సదా. 49

వస్త్రం వస్త్రపతే పుణ్యం గృహాణ కురు మాం సదా | భూషణాద్యైః సువస్త్రాద్యైశ్ఛాదితం వ్రతసత్పతే. 50

సుగన్ధిగన్ధం విమలం గన్దమూర్తే గృహాణ వై | పాపగన్ధవిహీనం మాం కురు త్వం హి సుగన్ధినమ్‌. 51

పుష్పం గృహాణ పుష్పాదిపూర్ణం మాం కురు సర్వదా | పుష్పగన్దం సువిమలం ఆయురారోగ్యవృద్ధయే. 51

దశాఙ్గం గుగ్గులుఘృతయుక్తం ధూపం గృహాణ వై | సధూపధూపితం మాం త్వం కురు ధూపితసత్పతే. 53

దీపమూర్ధ్వశిఖం దీప్తం గృహాణాఖిలభాసకమ్‌ | దీపమూర్తే ప్రకాశాఢ్యం సర్వదోర్ద్వగతిం కురు. 54

అన్నాదికం చనైవేద్యం గృహాణాన్నాదిసత్పతే | అన్నాదిపూర్ణం కురు మామన్నదం సర్వదాయకమ్‌. 55

మన్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయా ప్రభో | యత్పూజితం వ్రతపతే పరిపూర్ణం తదస్తు మే. 56

ధర్మం దేహి ధనం దేహి సౌభాగ్యం గుణసన్తతిమ్‌ |

కీర్తిం విద్యాం దేహి చాయుః స్వర్గం మోక్షం చ దేహి మే 57

ఇమాం పూజాం వ్రతపతే గృహీత్వా వ్రజ సాంప్రతమ్‌ | పునరాగమనాయైవ వరదానాయ వై ప్రభో. 58

స్నాత్వా వ్రతవతా సర్వవ్రతేషు వ్రతమూర్తయః | పూజ్యాః సువర్ణజాస్తా వై శక్త్యా వై భూమిశాయినా. 59

జపో హోమశ్చ సామాన్యం వ్రతాన్తే దానమేవ చ | చతుర్వింశతిద్ద్వాదశ వా పఞ్చ వా త్రయ ఏకకః. 60

విప్రాః ప్రపూజ్యా గురవో భోజ్యాః శక్త్యా తు దక్షిణా |

దేయా గావః సువర్ణాద్యాః పాదుకోపానహౌ పృథక్‌. 61

జలపాత్రం చాన్నపాత్రమృత్తికాచ్ఛత్రమాసనమ్‌ | శయ్యా వస్త్రయుగం కుమ్భాః పరిభాషేయమీరితా. 62

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వ్రతపరిభాషానామ పఞ్చసప్తత్యధిక శతతమోధ్యాయః.

కేశవా! వ్రతస్వరూపుడవును, జగత్కారణధూతుడవును అగు నిన్ను సర్వసిద్ధి నిమిత్తమై మండలములపై ఆవాహనము చేయుచున్నాను. నీకు నమస్కారము. సన్నిహితుడవై ఉండుము. మనస్పుచే కత్పితములగు పంచగవ్యముల తోను, శుభములైన జలములతోడను. పంచామృతములతోడను భక్తి పూర్వకముగ అభిషేకము చేయుచున్నాను. నీవు నా పాపములను తొలగించుము. ఓ! అర్ఘ్యపతీ! గంధపుష్ప - ఉదకయుక్త మగు శుభ##మైన అర్ఘ్యమును స్వీకరించి నన్ను సర్వదా అర్ఘ్యయోగ్యునిగా చేయుము. ఓ! వస్త్రపతీ! పుణ్యమైన వస్త్రములను గ్రహింపుము. ఓ వ్రత సత్పతీ! నన్ను భూషణ-సువస్త్రాదుల చే ఆచ్ఛాదింపబడిన వానినిగా చేయుము. ఓ గంధమూర్తీ ! విమల మైన సుగంధియగు గంధమును స్వీకరింపుము. నన్ను పాప గంధ విహీనునిగాను మంచి గంధము కలవానిని గాను చేయుము. పుష్పమును గ్రహింపుము నన్ను పుష్పపూర్ణునిగాను, పుష్పగంధము గలవానినిగాను, ఆయురారోగ్యవృద్ధి కొరకై చాల విమలునిగాను చేయుము. దశాంగములు గలదియు గుగ్గులు ఘృతయుక్తమును అగు ధూపమును గ్రహింపుము. ధూపితుడవై ఓ సత్పతీ ! నన్ను ధూపధూపితునిగా చేయుము. ఊర్ధ్వశిఖగలదియు సర్వమును ప్రకాశింపచేయునదియు అగు దీపించుచున్న దీపమును గ్రహింపుము. ఓ !దీపమూర్తీ ! నన్ను సర్వదా ప్రకాశముతో నిండిన వానినిగాను, ఊర్ధ్వగమనము కలవానినిగాను చేయుము. అన్నాదులకు ప్రభువైనవాడా! అన్నాదిక మగు నైవేద్యమును స్వీకరింపుము. నన్ను అన్నాదులతో పూర్ణునిగాను అన్నదానము చేయువానినిగాను, సర్వదాతగాను చేయుము. ఓ! ప్రభూ! వ్రతపతీ! మంత్రహీనముగా గాని, క్రియాహీనముగాగాని, భక్తిహీనముగా గాని నేను చేసిన పూజ పరిపూర్ణ మగు గాక. నాకు ధర్మమును ఇమ్ము. ధనమును, సౌభాగ్యమును, గుణసముదాయమును, కీర్తిని, విద్యను ఆయుర్దాయమును, స్వర్గమును, మోక్షమును ఇమ్ము, ఓ! వ్రతపతీ! ఈ పూజను స్వీకరించి పునరాగమనార్థమును వరముల నిచ్చుటకును ఇపుడు వెళ్ళుము. అన్ని వ్రతములందును వ్రతధారి యగువాడు భూమిపై శయనించుచు సువర్ణమయములగు ఆ వ్రతమూర్తులను యథాశక్తిగా పూజించవలెను. వ్రతాంతమునందు జపము హోమము దానము ఇవి సామాన్యకర్తవ్యములు. పూజ్యులగు విప్రులకు ఇరువదినలుగురికి గాని, పండ్రెండుగురికి గాని ఐదు గురికి గాని, ఒకరికి గాని భోజనము పెట్టవలెను. శక్త్యనుసారము దక్షిణలుగా వారికి వేరువేరుగా గోవులను, సువర్ణాదులను, జలపాత్రమును, అన్నపాత్రమును, మృత్తికను, ఛత్రమును, ఆసనమును, శయ్యను, వస్త్రయుగమును, కుంభములను ఇవ్వవలెను. ఇట్లు వ్రతపరిభాష చెప్పబడినది.

అగ్ని మహాపురాణమునందు వ్రతపరిభాషయను నూటడెబ్బదిఐదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters