Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్విసప్తత్యుత్తర శతతమో7ధ్యాయః

అథ పునః స్తోత్రప్రాయశ్చిత్తాని.

పుష్కర ఉవాచ:

పరదారపరద్రవ్య జీవహింసాదికే యథా | ప్రవర్తతే నృణాం చిత్తం ప్రాయశ్చిత్తస్తుతిస్త థా. 1

విష్ణవే విష్ణవే నిత్యం విష్ణవే విష్ణవే నమః | నమామి విష్ణుం చిత్తస్థమహఙ్కారగతిం హరిమ్‌. 2

చిత్తస్థమీశమవ్యక్త మనన్త మపరాజితమ్‌ | విష్ణుమీడ్యమ శేషేణ హ్యనాదినిధనం విభుమ్‌. 3

విష్ణుశ్చిత్తగతో యన్మే విష్ణుర్బుద్ధిగతశ్భ యత్‌ | యచ్చాహఙ్కారగో విష్ణుర్యద్విష్ణుర్మయి సంస్థితః. 4

కరోతి కర్మభూతో7సౌ స్థావరస్య చరస్య చ | తత్పాపం నాశమాయాతు తస్మిన్నేవ హి చిన్తితే. 5

ధ్యాతో హరతి యత్పాపం స్వప్నే దృష్టస్తు భావనాత్‌ |

తముపేన్ద్రమహం విష్ణుం ప్రణతార్తిహరం హరిమ్‌.

జగత్యస్మిన్నిరాధారే మజ్జమానే తమస్యధః | హస్తావలమ్బనం విష్ణుం ప్రణమామి పరాత్పరమ్‌. 7

సర్వేశ్వరేశ్వర విభో పరమాత్మన్నధోక్షజ | హృషీకేశ హృషీ కేశ హృషీ కేశ నమోస్తు తే. 8

నృసింహానన్త గోవిన్ద భూతభావన కేశవ | దురితం దుష్కృతం ధ్యాతం శమయాఘం నమో7స్తు తే. 9

యన్మయా చిన్తితం దుష్టం స్వచిత్తవశవర్తినా | అకార్యం మహదత్యుగ్రం తచ్ఛమం నయ కేశవ. 10

బ్రహ్మణ్య దేవ గోవిన్ద పరమార్థ పరాయణ | జగన్నాథ జగద్దాతః పాపం ప్రశమయాచ్యుత. 11

యథాపరాహ్ణే సాయాహ్నే మధ్యాహ్నే చ తథా నిశి | కాయేన మనసా వాచా కృతం పాపమజానతా. 12

జానతా చ హృషీకేశ పుణ్డరీకాక్ష మాధవ | నామత్రయోచ్చారణతః స్వప్నే యాతు మమ క్షయమ్‌. 13

శారీరం మే హృషీకేశ పుణ్డరీకాక్ష మాధవ | పాపం ప్రశమయాద్య త్వం వాక్కృతం మమ మాధవ. 14

యద్భుఞ్ఛన్యత్స్వపం స్తిష్ఠన్గచ్ఛజ్జాగ్రద్యదా స్థితః | కృతవాన్‌ పాపమద్యాహం కాయేన వచసా గిరా. 15

యత్స్వల్పమపి యత్థ్సూలం కుయోనినరకావహమ్‌ | తద్యాతు ప్రశమం సర్వం వాసుదేవానుకీర్తనాత్‌. 16

వరంబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం చ యత్‌.

తస్మిన్‌ ప్రకీర్తితే విష్ణౌ యత్పాపం తత్‌ ప్రణశ్యతు. 17

యత్ప్రాప్య న నివర్తన్తే గన్దస్పర్శాదివర్జితమ్‌ | సూరయస్తత్పదం విష్ణోస్తత్సర్వం శమయత్వఘమ్‌. 18

పాపప్రణాశనం స్తోత్రం యః పఠేచ్ఛృణుయాదపి |

శారీరైర్మానసైర్వాగ్జైః కృతైః పాపైః ప్రముచ్యతే. 19

సర్వపాపగ్రహాదిభ్యో యాతి విష్ణోః పరం పదమ్‌|

తస్మాత్పాపే కృతే జప్యం స్తోత్రం నర్వాఘమర్దనమ్‌. 20

ప్రాయశ్చిత్తమఫ°ఘానాం స్తోత్రం వ్రతకృతే వరమ్‌ | ప్రాయశ్చిత్తైః స్తోత్రజపైర్వ్రతైర్నశ్యతి పాతకమ్‌.

తతః కార్యాణి సంసిధ్యైతాని వై భుక్తిముక్తయే.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే సర్వపాపప్రాయశ్చిత్తే పాపనాశనస్త్రోత్రం

నామ ద్విసప్తత్యధిక శతతోమో7ధ్యాయః

పుష్కరుడు చెప్పెను : మానవుల మనస్సు పరభార్యాపరధన జీవహింసాదులయందు ప్రవర్తించు నపుడు విష్ణుస్తుతియే ప్రాయశ్చిత్తము. సర్వదా విష్ణువునకు నమస్కారము. చిత్తమునం దున్నవాడును., అహాంకారమునకు గతి యైనవాడును, హరియు, ఈశుడును, అవ్యక్తుడును, అపరాజితుడును అగు విష్ణువును నమస్కరించుచున్నాను. ఏ కారణమువలన విష్ణువు నా మనస్సులో నున్నాడో, నా బుద్ధిలో నున్నాడో, నా అహంకారములో నున్నాడో, నాలోఉన్నాడో, స్థావరజంగమాత్మ ప్రపంచముయొక్క కర్మ ఆ కర్మగా నుండి చేయుచున్నాడో, ఆ కారణమువలన ఆ విష్ణువునే చింతించుటచే పాపము నశించుగాక! ఏ కారణమువలన ధ్యానము చేయగానే పాపమును హరించునో, భావనాబలమువలన స్వప్నమునందు కనబడునో అట్టి ఉపేంద్రుడును ప్రణతార్తిహరుడును అగు విష్ణువును నమస్కరించుచున్నపుడు హస్తావలంబనము నిచ్చు పరాత్పరుడైన విష్ణువును నమస్కరించుచున్నాను. ఓ సర్వేశ్వరేశ్వా! విభూ పరమాత్మా! అధోక్షజా! నీకు నమస్కారము. నృసింహా! అనంతా! భూతభావనా! భూతేశా! హృషీకేశా! నీకు నమస్కారము. నృసింహా! అనంతా! భూతభావనా! భూతేశా! కేశవా! నేను దుష్టవాక్కు పలుకుటచేతను, చెడు కార్యములుచేయుటచేతను, చెడుఆలోచనలు చేయుటచేతను కలిగిన పాపమును శాంతింప చేయుము. నీకు నమస్కారమగుగాక. కేశవా! నాచిత్తమునకు లొంగిపోయిన నేను చేసిన దురాలోచనలను ఉగ్రమైన దుష్కార్యమును, నశింపచేయుము. బ్రహ్మణ్యదేవా! గోవిందా! పరమార్థపరాయణా! జగన్నాధా జగత్పోషకా! అచ్యుతా! నా పాపమును శాంతింపచేయు. హృషీకేశా! పుండరీకాక్షా! మాధవా! తెలిసికాని, తెలియక గాని నేను అపరాహ్ణమునందును, సాయాహ్నమునందును, మధ్యాహ్నమునందును రాత్రియందును మనోవాక్కాయములచే చేసిన పాపాము నీ నామమాత్రోచ్చారణముచే నా స్వప్నమునందే నశించిపోవుగాక. హృషీకేశా! పుండరీకాక్షా! మాధవా! శరీరమునకు సంబంధించినది గాని, వాక్కుచేత చేసినది గాని అయిన నా పపము శమింపచేయుము. భుజించుచు గాని, నిద్రించుచు గాని, నిలచి గాని మెలకువగా నుండి గాని, నే నీ రోజున మనోవాక్కాయములచే చేసిన పాపమును నశింపచేయుము. పాపజన్మలు నరకము ఇచ్చు స్వల్పమైనను అధిక మైనను నా పాపము వాసుదేవనామకీర్తనమువలన శమించుగాక, పరబ్రహ్మస్వరూపుడును పరమస్థానమును, పరమపవిత్రుడును అగు విష్ణువు కీర్తింపబడగనే సమస్తపాపము నశించుగాక! గంధస్పర్శాదివర్జితమగు ఏ విష్ణు పదమును పొందిన పండితులు మరల వెనుకకు రారో అట్టి విష్ణుపదము సకలపాపములను నశింపచేయుగాక. ఈ పాపప్రణాశనస్తోత్రమును చదివినవాడును, విన్నవాడును, మనోవాక్కాయజన్యము లగు పాపములనుండి విముక్తుడగును. సర్వపాపగ్రహాదులనుండి గూడ విముక్తుడై శ్రీ మహావిష్ణువుయొక్క ఉత్తమస్థానమును చేరును. అందువలన పాపము చేసినపుడు సర్వాఘనాశకమగు ఈ స్తోత్రమును జపించవలెను. వ్రతము నిమిత్తమై కూడ ఇది శ్రేష్ఠము పాపము ప్రాయశ్చిత్తములచేతను స్తోత్తజపములచేతను వ్రతములచేతను నశించును. అటుపిమ్మట సిద్ధినిమిత్తమై చేసిన కర్మలు భుక్తి ముక్తి ప్రదము లగును.

అగ్నిమహాపురాణమునందు సర్వపాపప్రాయశ్చిత్తమున పాపనాశనస్తోత్ర మను నూటడెబ్బది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters