Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షష్ట్యుత్తర శతతమోధ్యాయః

అథ వర్ణధర్మాదికథనమ్‌

పుష్కర ఉవాచ :

వేదస్మార్తం ప్రవక్ష్యామి ధర్మం వై పఞ్చధా స్మృతమ్‌ | వర్ణత్వమేకమాశ్రిత్య యోధికారః ప్రవర్తతే. 1

వర్ణధర్మః స విజ్ఞేయో యథోపనయనం త్రిషు | యస్త్వాశ్రమం సమాశ్రిత్య పదార్థః సంవిధీయతే. 2

ఉక్త ఆశ్రమధర్మస్తు భిన్నపిణ్డాదికో యథా | ఉభ##యేన నిమిత్తేన యో విధిః సంప్రవర్తతే. 3

నైమిత్తికః స విజ్ఞేయః ప్రాయశ్చిత్తవిధిర్యథా | బ్రహ్మచారీ గృహీ వాపి వానప్రస్థో యతిర్నరః. 4

ఉక్త ఆశ్రమధర్మస్తు ధర్మః స్యాత్పఞ్చధా పరః | షాడ్గుణ్యస్యాభిధానేయో దృష్టార్థః స ఉదాహృతః. 5

స త్రేధా మన్త్రయాగాద్యదృష్టార్థ ఇతి మానవాః | ఉభయార్థో వ్యవహారస్తు దణ్డధారణమేవ చ. 6

తుల్యార్థానాం వికల్పః స్యాద్యాగమూలః ప్రకీర్తితః | వేదే తు విహితో ధర్మః స్మృతౌ తాదృశ ఏవ చ. 7

అనువాదం స్మృతిం సూతే కార్యార్థమితి మానవాః | గుణార్థః పరిసంఖ్యార్థో వానువాదో విశేషతః. 8

విశేషదృష్ట ఏవాసౌ ఫలార్థ ఇత మానవాః |

పుష్కరుడు పలికెను : ఇపుడు శ్రౌతస్మార్తధర్మములను గూర్చి చెప్పెదను. అది ఐదు విధములు. కేవలము వర్ణమును మాత్రమే నిమిత్తముగా చేసి కొని చెప్పిన ధర్మము-ఉదా : పై మూడువర్ణముల వారికి ఉపనయన సంస్కారము ఆవశ్యకము. ఇది వర్ణధర్మము. ఆశ్రమమును బట్టి విధించిన ధర్మము ఆశ్రమధర్మము. ఉదా : భిన్న పిండాది విధానము. రెండింటిని పట్టి విధించినది నైమిత్తికము. ఉదా : ప్రాయశ్చిత్తవిధానము. నరుడు బ్రహ్మచారి యైనను, గృహస్థుడైనను, వానప్రస్థుడైనను, సంన్యాసి యైనను విధింపబడిన ధర్మము ఆశ్రమ ధర్మము. మరొక విధమున గూడ ధర్మము ఐదు విధములు. సంధివిగ్రహాదిషాడ్గుణ్యవిధానము దృష్టఫలము; మంత్రయజ్ఞాదులు అదృష్ట ఫలములు. అని మనువు చెప్పెను. ఇవి కాక ఉభయప్రయోజనములు గల వ్యవహారము, దండధారణము, తుల్యార్థవికల్పము ఇవి కూడ యజ్ఞమూలక మగు ధర్మమునకు అంగములు. వేదములో చెప్పిన ధర్మమునే స్మృతులు కూడ బోధించుచున్నవి. కార్యముకొరకై స్మృతి వేదోక్తధర్మమును అనువదించుచున్నది. అని మన్వాదుల అభిప్రాయము. అందుచే స్మృతులలో చెప్పిన ధర్మము వేదోక్తధర్మమునకు గుణము, పరిసంఖ్య, విశేషతః అనువాదము, లేదా విశిష్టదృష్ట ఫలము నిరూపించుటకై ఉద్దిష్ట మైనది. ఇది మనుసిద్ధాంతము.

స్యాదష్టచత్వారింశద్భిః | సంస్కారైర్బ్రహ్మలోకగః. 9

గర్భాధానం పుంసవనం సీమన్తోన్నయనం తతః | జాతకర్మ నామకృతిరన్నప్రాశనచౌడకమ్‌. 10

సంస్కారశ్చోపనయనం వేదవ్రతచతుష్టయమ్‌ | స్నానం స్వధర్మచారిణ్యా యోగః స్యాద్యజ్ఞపఞ్చకమ్‌. 11

దేవయజ్ఞఃపితృయజ్ఞో మనుష్యభూతయజ్ఞకాః | బ్రాహ్మయజ్ఞః సప్త పాకయజ్ఞసంస్థాః పురోష్టకాః. 12

పార్వణశ్రాద్ధం శ్రావణ్యాగ్రహాయణీ చ చైత్ర్యపి | ఆశ్యయుజీసప్తహవిర్యజ్ఞసంస్థాస్తతః స్మృతాః. 13

అగ్న్యాధేయమగ్నిహోత్రం ధర్మః స్యాత్పౌర్ణమాసకః |

చాతుర్మాస్యాగ్రహాయణ్యష్టిర్నిరూడపశుబన్ధకః. 14

సౌత్రామణిః సప్త సోమసంస్థాగ్నిష్టోమ ఆదితః | అత్యగ్నిష్టోమ ఉక్థశ్చ షోడశీ వాఙపేయకః. 15

అతిరాత్రస్థథా స్తోమాజ్ఞఅష్టౌ చాత్మగుణాస్తతః | దయా క్షమానసూయా చ అనాయాసోథ మంగలమ్‌. 16

అకార్పణ్యాస్పృహాశౌచం యసై#్యతే స పరం వ్రజేత్‌ | ప్రచారే మైథునే చైవ ప్రస్రావే దన్తధానవే. 17

స్నానభోజనకాలే చ షట్సు మౌనం సమాచరేత్‌ | పునర్దానం పృథక్పానమాజ్యేన పయసా నిశి. 18

దన్తచ్ఛేదనముష్ణం చ సప్త సక్తుషు వర్జయేత్‌ | స్నాత్వా పుష్పం న గృహ్ణీయాద్దేవాయోగ్యం తదీరితమ్‌. 19

అన్యగోత్రోప్యసంబన్దః ప్రేతస్యాగ్నిం దదాతి యః | పిణ్డం చోదకదానం చ స దశాహం సమాపయేత్‌. 20

ఉదకం చ తృణం భస్మ ద్వారం పన్థా స్తథైవ చ | ఏభిరన్తరితం శ్రుత్వా పంక్తిదోషో న విద్యతే. 21

పఞ్చ ప్రాణాహుతీర్దద్యాదనామాఙ్గుష్ఠయోగతః.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వర్ణధర్మాదివర్ణనం నామ షట్‌షష్ట్యధిక శతతమోధ్యాయః.

ఈ క్రింద చెప్పిన నలుబది ఎనిమిది సంస్కారములు చేసికొనిన మానవుడు బ్రహ్మలోకమును పొందును. గర్బాధానము, పుంసవనము, సీమంతోన్నయము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, చూడాకర్మ, ఉపనయనము, నాలుగు వేదవ్రతములు, స్నానము, వివాహము, దేవయజ్ఞ-పితృయజ్ఞ-మనుష్యయజ్ఞ-భూతయజ్ఞ-బ్రహ్మయజ్ఞములను పంచయజ్ఞములు, ఏడుపాకయజ్ఞసంస్థలు, అష్టకాసహితములగు మూడు పార్వణశ్రాద్ధములు, శ్రావణి, ఆగ్రహాయణి, చైత్రి, ఆశ్వయుజి, అగ్న్యాధేయ-అగ్నిహోత్ర-ధర్మపౌర్ణమాస-చాతుర్మాస్య-ఆగ్రహాయణష్టి-నిరూఢపశుబంధ-సౌత్రామణులు ఏడు హవిర్యజ్ఞము, అత్యగ్నిష్టోమ-ఉక్థ్య-షోడశీ-వాజపేయ-అతిరాత్ర-ఆప్తోర్యామము లను సప్తసోమసంస్థలు ఇవి నలుబదిఎనిమిది సంస్కారములు. దయ, క్షమ, అనసూయ, అనాయాసము, మాంగల్యము, అకార్పణ్యము అస్పృహ, శౌచము అనునవి ఎనిమిది ఆత్మగుణములు. ఈ ఎనిమిది ఆత్మగుణములు కలవాడు స్వర్గమును పొందును. మార్గగమనము, మైథునముమలమూత్రోత్సర్గము, దంతధావనము, స్నానము, భోజనము-ఈఆరు పనులు చేయునపుడు మౌనము పాటింపవలెను. సక్తువులవిషయమున మరల దానముచేయుట, నేయి కలిపి, పాలు కలిపి వేరువేరుగా త్రాగుట, రాత్రి త్రాగుట, దంతము లతో కొరకుట, చాలవేడిగా త్రాగుట - ఈ ఏడు పనులు త్యజించవలెను. స్నానానంతరము పుష్పములు కోయగూడదు. అవి దేవతాపూజకు పనికిరావు. అన్యగోత్రీయుడు ఎవరి కైన అగ్ని సంస్కారము చేసినచో, పది దినముల వరకును పిండోదక దానములు ఆతడే చేయవలెను. జలము, తృణము, భస్మము, ద్వారము, మార్గము ఇవి మధ్యలో ఉన్నచో పంక్తిదోషము లేదు. అనామికా-అంగుష్ఠములను కలిపిపట్టి ప్రాణాహుతులు తీసికొనవలెను.

అగ్ని మహాపురాణమునందు వర్ణశ్రామాదిధర్మవర్ణన మను నూటఅరువదిఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters