Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చషష్ట్యుత్తరశతతమోధ్యాయః

అథ నానాధర్మనిరూపణమ్‌.

అగ్ని రువాచ :

ధ్యేయ ఆత్మా స్థితో యోసౌ హృదయే దీపవత్ర్పభుః | అనన్యవిషయం కృత్వా మనోబుద్ధిస్మృతీన్ధ్రియమ్‌.

శ్రాద్ధం తు ధ్యాయినే దేయం గవ్యం దధి ఘృతం పయః |

ప్రియంగవో మసూరశ్చ వార్తాకుః కోద్రవో న హి. 2

సైంహికేయో యదా సూర్యం గ్రసతే పర్వసన్దిషు | హస్తిచ్ఛాయా తు సా జ్ఞేయా శ్రాద్ధదానాదికేక్షయా. 3

పైత్రే చైవ యదా సోమో హంసే చైవ కరే స్థితే | తిథిర్వైవస్వతీనామ సా ఛాయా కుఞ్జరస్య తు. 4

అగ్నౌకరణ శేషం తు న దద్యాద్వైశ్వదైవికే | అగ్న్యభావే తు విప్రస్య హస్తే దద్యాత్తు దక్షిణ. 5

న స్త్రీదుష్యతి జారేణ న విప్రోవేదకర్మణా | బలాత్కారోపభుక్తా చేద్వైరిహస్తగతాపి వా. 6

సన్త్యజేద్దూషితాం నారీమృతుకాలేన శుధ్యతి | పూర్వం స్త్రియః సురైర్భుక్తాః సోమగన్ధర్వవహ్నిభిః. 7

భుఞ్జతే మానుషాః పశ్చాన్నైతా దుష్యన్తి కేన చిత్‌ | అసవర్ణేన యో గర్భః స్త్రీణాం యోనౌ నిషిచ్యతే. 8

అశుద్ధా తు భ##వేన్నారీ యావచ్ఛల్యం న ముఞ్చతి | నిఃసృతే తు తతః శ##ల్యే రజసా శుద్ధ్యతే తతః. 9

అగ్నిదేవుడు చెప్పెను : సర్వశక్తుడైన ఏపరమాత్మ హృదయమునందు దీపమువలె ప్రకాశించుచున్నాడో ఆ పరమాత్మను అన్యవిషయముల సంబంధము లేని మనో - బుద్ధి - స్మృతులతో ధ్యానించవలెను. అట్లు ధ్యానము చేయు బ్రాహ్మణునకే ఆవు నెయ్యి, పెరుగు, పాలు మొదలగు పదార్థములను శ్రాద్ధము నిమిత్తము దానము చేయవలెను. ప్రియంగు మసూరము, వంకాయ, కొఱ్ఱలు మాత్రము వడ్డించగూడగు. పర్వసంధులందు రాహువు సూర్యుని గ్రసించునపుడు అది ''హస్తిచ్ఛాయాయోగము.'' అపుడు చేసిన శ్రాద్ధకర్మయు, శుభకర్మలును అక్షయ్యము లగును. చంద్రుడు మఘా - హస్త నక్షత్రములం దున్నపుడు అది ''వైవస్వతీతిథి''. అది కూడ ''హస్తిచ్చాయాయోగమే''. బలివైశ్వదేవము చేయగా మిగిలిన అన్నము బలివైశ్వదేవమండలమునందు ఉంచరాదు. అగ్ని లేనిచో దానిని బ్రాహ్మణుని కుడి చేతిలో హోమము చేయవలెను. వేదోక్తకర్మ చేయకపోవుటచే బ్రాహ్మణుడును, వ్యభిచారి పురుషునిచే స్త్రీయు దూషితులు కారు. బలాత్కారముచే భోగింపబడిన స్త్రీని, శత్రువులకు వశ మైన స్త్రీని ఋతుకాలపర్యంతము పరిత్యజించవలెను. ఋతుదర్శనానంతరము ఆమె శుద్ధురాలగును. స్త్రీలు ముందుగా సోముడు, గంధర్వుడు, వహ్ని అను దేవతలచేత అనుభవింపబడుదురు. మనుష్యులు వీరిని తరువాత అనుభవింతురు. అందుచే వీరు ఎవనిచేతను దూషింపబడరు. అసవర్ణుడైనవానిచే స్త్రీయోనియందు గర్భము ఉంచబడినచో ఆ స్త్రీ గర్భము లోపల నున్నంతవరకును అశుద్ధురాలు. ఆ గర్భము బైటకు వెడలినతరువాత రజస్సుచే శుద్ధురాలగును.

య ఆత్మవ్యతిరేకేణ ద్వితీయం నాత్ర పశ్యతి | బ్రహ్మభూతః స ఏవేహ యోగీ చాత్మరతోమలః. 10

విషయేన్ద్రియసంయోగాత్కేచిద్యోగం వదన్తి వై | అధర్మో ధర్మబుద్ధ్యా తు గృహీతసై#్తరపణ్డితైః. 11

ఆత్మనో మనసశ్చైవ సంయోగం చ తథాపరే | వృత్తిహీనం మనః కృత్వా క్షేత్రజ్ఞే పరమాత్మని.12

ఏకీకృత్య విముచ్యేత బన్ధాద్యోగోయముత్తమః | కుటుమ్బైః పఞ్చభిర్గ్రామః షష్ఠస్తత్ర మహత్తరః. 13

దేవాసురమనుషై#్యర్వా సజేతుం నైవ శక్యతే | బహిర్ముఖాని సర్వాణి కృత్వా చాభిముఖాని వై. 14

మనస్యేవన్ద్రియ గ్రామం మనశ్చాత్మని యోజయేత్‌ | సర్వభావవినిర్ముక్తః క్షేత్రజ్ఞం బ్రహ్మణి న్యసేత్‌.

ఏతద్‌జ్ఞానం చ ధ్యానం చ శేషోన్యో గ్రన్థవిస్తరః | యన్నాస్తి సర్వలోకస్య తదస్తీతి నిరుధ్యతే. 16

కథ్యమానం తథా న్యస్యహృదయేనావతిష్ఠతే | అసంవేద్యం హి తద్బ్రహ్మ కుమారీస్త్రీసుఖం యథా. 17

అయోగీనైవ జానాతి జాత్యన్ధో హి ఘటం యథా | సన్న్యసన్తం ద్విజం దృష్ట్వా స్థానాచ్చలతి భాస్కరః.

ఏషమే మణ్ణలం భిత్త్వా పరం బ్రహ్మాధిగచ్ఛతి | ఉపవాసవ్రతం చైవ స్నానం తీర్థం ఫలం తపః. 19

ద్విజసమ్పాదనం చైవ సంపన్నం తస్య తత్ఫలమ్‌ | ఏకాక్షరం పరం బ్రహ్మ ప్రాణాయామః పరం తపః. 20

సావిత్ర్యాస్తు పరం నాస్తి పావనం పరమం న్మృతమ్‌ | ధ్యానేన సదృశం నాస్తి శోధనం పాపకర్మణామ్‌.

శ్వపాకేష్వపి భుఞ్జానో ధ్యానేన హి విశుధ్యతి | ఆత్మా ధ్యాతా మనో ధ్యానం ధ్యేయో విష్ణుః ఫలం హరిః.

అక్షయాయ యతిః శ్రాద్ధే పంక్తి పావనపావనః |

ఆత్మకంటె భిన్న మైన రెండవ వస్తువును చూడనివాడే బ్రహ్మభూతుడైన, ఆత్మరతుడైన నిర్మలుడైన యోగి. విషయములతో ఇంద్రియముల సంయోగమే యోగ మని కొంద రందురు. అపండింతులైన వారు అధర్మమును ధర్మ మని సంగ్రహించుచున్నారు. ఆత్మ మనఃసంయోగము యోగ మని మరి కొంద రందురు. మనస్సును వృత్తిహీనముగ చేసి, క్షేత్రజ్ఞుడైన పరమాత్మునియందు ఏకము చేసి. బంఢవిముక్తుడగును. ఇది ఉత్తమ మైన యోగము. ఐదు ఇంద్రియములనెడు కుటుంబములతో గ్రామ మేర్పడినది. అందు ఆరవ దగు మనస్సు చాల శ్రేష్ఠమైనది. ఆ మనస్సు దేవాసురమనుష్యులచేత గూడ జయింప శక్యము కానిది. బహిర్ముఖములగు అన్ని ఇంద్రియములను అంతర్ముఖములుగ చేసి, మనస్సునందు నిలపవలెను. మనస్సును ఆత్మయందు నిలుపవలెను. సర్వభావశూన్యుడగు జీవుని బ్రహ్మయందు నిలుపవలెను. ఇదియే జ్ఞానము; ఇదియే ధ్యానము. ఇంక ఏమి చెప్పినను గ్రంథవిస్తరమేన. సకలలోకుల దృష్టిలో ఏది ఏదో అది (బహ్మ) ఉన్నడని చెప్పి తద్భిన్నము నిషేధింపబడు చున్నది. ఈ విధముగా చెప్పిన విషయము ఇతరుని హృదయమునందు నిలువదు. బాలికకు స్త్రీసుఖము ఎట్లు అనుభవగోచరము కాదో అట్లే ఆ బ్రహ్మ తెలియశక్యము కాదు. పుట్టుకతో గ్రుడ్డి వాడు ఘటమనగా ఏదో ఎట్లు తెలుసుకొనజాలడో అట్లే యోగి కానివాడు బ్రహ్మను తెలుసుకొనజాలడు. బ్రాహ్మణుడు సన్యసించుట జూచి - ''ఈతడు నామండలమును భేదించుకొని పరబ్రహ్మను పొందును'' అని భాస్కరుడు చలించును. సంన్యాసికి ఉపవాసవ్రతము, స్నానము, తీర్థము, ఫలము, తపస్సు, ద్విజసంపాదనము ఇవన్నియు జ్ఞానికి జ్ఞానఫల రూపమున సంపన్నము లగును. ఏకాక్షర (ఓంకార) రూప మైనది. ప్రాణాయామమే గొప్ప తపస్సు. సావిత్రికంటె పరమపావనము మరొకటి లేదు. పాపకర్మలను నశింపచేయుటకు ధ్యానసదృశ మైనది మరొకటి లేదు. శ్వపాచకుల ఇంటి భోజనము చేసినవాడు కూడ ధ్యానముచే శుద్ధుడగును. ఆత్మ ధ్యానము చేయువాడు. మనస్సుధ్యాన సాధనము. ధ్యానింపదగినవాడు విష్ణువు. ఫలముకూడ విష్ణువే. శ్రాద్ధమునందు పంక్తిపావనుడైన యతి అక్షయఫలము నిచ్చును.

ఆరూఢో నైష్ఠికం ధర్మం యస్తు ప్రచ్యవతే ద్విజః. 23

ప్రాయశ్చిత్తం న పశ్యామి యేన శుద్యేత్స ఆత్మహా |

యే చ ప్రవ్రజితాః పత్న్యాం యా చైషాం బీజసన్తతిః. 24

బిన్దులా నామ చణ్డాలా జాయన్తే నాత్ర సంశయః | శతికో మ్రియతే గృధ్రః శ్వాసౌ ద్వాదశికస్తథా. 25

భాసో వింశతివర్షాణి సూకరో దశభిస్తథా | అపుష్పో విఫలో వృక్షో జాయతే కణ్టకావృతః. 26

తతో దావాగ్నిదగ్ధస్తు స్థాణుర్భవతి సానుగః | తతో వర్షశతాన్యష్టౌ ద్వే చ తిష్ఠత్యచేతనః. 27

పూర్ణే వర్షసహస్రే తు జాయతే బ్రహ్మరాక్షసః | ప్లవేన లభ##తే మోక్షం కులస్యోత్సాదనేన వా. 28

యోగమేవ నిషేవేత నాన్యం మన్త్రమఘాపహమ్‌.

ఇత్యాది పురాణ ఆగ్నేయే నానాధర్మో నామ పఞ్చషష్ట్యధిక శతతమోధ్యాయః

నైష్ఠికధర్మమును (సంన్యాసాశ్రమమును) అధిరోహించి అచటినుండి పతితుడైన ఆత్మఘాతుకుడైన బ్రాహ్మణునకు శుద్ధిని కలిగించు ప్రాయశ్చిత్తము లేదు. ఈ విధముగ ఆరూఢపతితులైన సంన్యసించినవారును, వారి భార్యయందు జనించిన సంతతియు, బిందులు లను చండాలులుగా జనింతురు. సంశయము లేదు. అట్టి సంన్యాసి నూరు వత్సరముల ఆయుర్దాయము గల గృధ్రముగా పుట్టి మరణించును. పిదప పండ్రెండు సంవత్సరముల ఆయువు గల శునకముగాను, పిదప పండ్రెండు సంవత్సరముల ఆయువు గల భాసపక్షిగాను, పది సంవత్సరములు సూకరముగాను, పిదప పుష్పఫలరహిత మగు ముండ్ల చెట్టుగాను ఉండును. పిదప దావాగ్నిదగ్ధుడై తన సహచరులతో గూడ మోడగును. పిదప వేయి సంవత్సరములు చైతన్యరహితుడుగ పడియుండును. వర్షసహస్రము నిండిన పిదప బ్రహ్మరాక్షసు డగును. తారకమగు యోగము చేతగాని, కులమును నశింపచేయుటచేతగాని మోక్షమును పొందును. అందుచే యోగమునే సేవించవలెను. పాపవినాశక మగు ఏ యితర మంత్రమును సేవించినను ప్రయోజనము లేదు.

అగ్ని మహాపురాణమునందు నానాధర్మవర్ణన మను నూటఅరువదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters