Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుఃషష్ట్యధిక శతతమోధ్యాయః

అథ నవగ్రహహోమ నిరూపణమ్‌.

పుష్కర ఉవాచ :

శ్రీకామః శాన్తికామో వా గ్రహయజ్ఞం సమారభేత్‌ | వృష్ట్యాయుఃపుష్టికామో వా తథైవాభిచరన్‌ పునః. 1

సూర్యః సోమో మఙ్గలశ్చ బుధశ్చాథ బృహస్పతిః | శుక్రః శ##నైశ్చరో రాహుః కేతుశ్చేతి గ్రహాః స్మృతాంః.

తామ్రకాత్‌ స్ఫటికాద్రక్తచన్దనాత్‌ స్వర్ణకాదుభౌ | రజతాదయసః సీసాద్గ్రహాః కార్యాః క్రమాదిమే. 3

స్వర్ణ్వైర్వాయజేల్లిఖ్య గన్ధమణ్డలకేషు వా | యథావర్ణం ప్రదేయాని వాసాంసి కుసుమాని చ. 4

గన్ధాశ్చ బలయశ్చైవ ధూపో దేయస్తు గుగ్గులుః | కర్తవ్యా మన్త్రవన్తశ్చ చరవః ప్రతిదైవతమ్‌. 5

ఆ కృష్ణేన ఇమం దేవా అగ్నిర్మూర్థా దివః కకుత్‌ | ఉద్బుధ్యస్వేతి చ ఋచో యథాసంఖ్యం ప్రకీర్తితాః.

బృహస్పతే అతియదర్యస్తథైవాన్నాత్పరిస్రుతః | శన్నో దేవీస్తథా కాణ్డాత్‌ కేతుం కృణ్వన్విమాం స్తథా. 7

అర్కః పలాశః ఖదిరో హ్యపామార్గోథ పిప్పలః | ఉదుమ్బరః శమీ దూర్వా కుశాశ్చసమిధః క్రమాత్‌. 8

ఏకైకస్యాత్రాష్టశతమష్టావింశతిరేవ వా | హోతవ్యా మధుసర్పిర్భ్యాం దధ్నా చైవ సమన్వితాంః. 9

గుడౌదనం పాయసం చ హవిష్యం క్షీరయష్టికమ్‌ | దధ్యోదనం హవిః పూపాన్‌ మాంసం చిత్రాన్నమేవ చ.

దద్యాద్గ్రహక్రమాదేతద్ద్విజేభ్యో భోజనం బుధః | శక్తితో వా యథాలాభం సత్కృత్య విధిపూర్వకమ్‌. 11

ధేనుః శఙ్ఖస్తథానడ్వాన్హేమవాసో హయస్తథా | కృష్ణాగౌరాయసశ్ఛాగ ఏతా వై దక్షిణాః క్రమాత్‌. 12

యశ్చ యస్య యదా దూష్యః స తం యత్నేన పూజయేత్‌ |

బ్రహ్మణౖషాం వరో దత్తః పూజితాః పూజితస్య చ. 13

గ్రహాధీనా నరేన్ద్రాణాముచ్ఛ్రాయాః పతనాని చ | భావాభావౌ చ జగతస్తస్మాత్పూజ్యతమా గ్రహాః. 14

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నవగ్రహ నిరూపణంనామ చతుఃషష్ట్యధికశతమోధ్యాయః

లక్ష్మిని కోరువాడును, శాంతికాముడును, వృష్టి - అయుర్దాయ-పుష్టులు కోరువాడును లేదా అభిచారప్రక్రియ ప్రారంభించ నున్నవాడును గ్రహపూజ ప్రారంభించవలెను. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అని గ్రహములు. ఈ గ్రహముల మూర్తులను క్రమముగ రాగి, స్పటికము, రక్త చందనము, స్వర్ణము (ఋధగురువులు), రజతము, ఇనుము, సీసము (రాహుకేతువులు) - వీటితో నిర్మించవలెను లేదా ఆయా గ్రహముల రంగులతో వ్రాసి గాని, గంధమండలములపై గాని పూజించవలెను. వారి వారి రంగులననుసరించి వస్త్రములు, పుష్పములు, గంధములు, బలులు ఇవ్వవలెను. గుగ్గులుధూప మీయవలెను. ప్రతిగ్రహమునకును మంత్ర పూతము లైన చరువులు ఇవ్వవలెను. ఈ గ్రహములకు వరుసగా ''ఆకృష్ణేన ..... '' ''ఇమం దేవా......'' ''అగ్ని ర్మూర్ధా దివః కకుత్‌...'' ''ఉద్బుధ్యస్వ...'' ''బృహస్పతే అతి యదర్యః....'', అన్నాత్పరిస్రుతః...'', ''శన్నో దేవీః...'', ''కాణ్డాత్‌'', ''కేతుం కృణ్వన్నిమాన్‌...'' అను మంత్రములు వినియోగించవలెను. ఈ గ్రహములకు క్రమముగ - అర్కము - పలాశ - ఖదిర - అపామార్గ - పిప్పల - ఉదుంబర - శమీ - దూర్వా - కుశలు సమిధలు. ఒక్కొక్క గ్రహమునకు ఈ సమిధులు నూటఎనిమిది గాని, నూటఇరువదిగాని, మధు - ఆజ్య - దధులతో హోమము చేయవలెను. ఈ గ్రహముల నుద్దేశించి బ్రాహ్మణులకు భోజనమునందు వరుసగా బెల్లముతో వండిన అన్నము, పాయసము, హవిష్యము, క్షీరయష్టికము, దధ్యోదనము, హవిస్సు, అపూపములు, మాంసము, చిత్రాన్నము ఇవ్వవలెను. వారిని యథాశక్తిగా, యథా లాభముగా సత్కరించవలెను ఈ గ్రహముల నుద్దేశించి క్రమముగా ఈయ దగిన దక్షిణలు - ధేనువు, శంఖము, ఎద్దు, సువర్ణము, వస్త్రము, అశ్వము, కపిలధేనువు, మేక. ఏగ్రహము ఎవనికి దుష్టస్థానాదుల నుండుటచే అపకారిగా నుండునో అతడు ఆ గ్రహమును పూజించవలెను. ''మిమ్ములను ఎవరు పూజింతురో వారిని మీరు పూజించవలెను (రక్షించవలెను).'' అని బ్రహ్మ ఈ గ్రహములకు వరములిచ్చెను రాజుల ఉన్నతి పతనము కూడ గ్రహాధీన మైనది. జగత్తుయొక్క స్థితి లయములు గూడ వీటిపై ఆధారపడి యున్నవి. అందుచే గ్రహములు చాల పూజింపదగినవి.

అగ్ని మహాపురాణమునందు నవగ్రహహోమా నిరూపణ మను నూట అరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters