Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రిషష్ట్యుత్తర శతతమోధ్యాయః

అథ శ్రాద్ధకల్పనిరూపణమ్‌.

పుష్కర ఉవాచ :

శ్రాద్ధకల్పం ప్రవక్ష్యామి భుక్తిముక్తిప్రదం శృణు |

నిమన్త్ర్య విప్రాన్పూర్వేద్యుః స్వాగతానపరాహ్ణతః

ప్రార్చ్యోవేశ##యేత్పీఠే యుగ్మాన్దైవేథ పైత్ర్య్రకే |

అయుగ్మాన్‌ ప్రాఙ్ముఖాన్‌ దైవే త్రీన్‌ పైత్ర్యే చైకమేవ వా. 2

మాతామహానామప్యేవం తన్త్రం వా వైశ్వదైవికమ్‌ | పాణిప్రక్షాళనం దత్త్వా విష్టరార్థం కుశానపి. 3

ఆవాహయేదనుజ్ఞాతో విశ్వేదేవాస ఇత్యృచా | యవైరన్వవకీర్యాథ భాజనే సపవిత్రకే. 4

శన్నోదేవ్యా పయః క్షిప్త్వా యవోసీతి యవాంస్తథా |

యా దివ్యా ఇతి మన్త్రేణ హస్తేహ్యర్ఘ్యం వినిక్షిపేత్‌. 5

దత్త్వోదకం గన్ధమాల్యం ధూపదానం ప్రదీపకమ్‌ | అపసవ్యం తతః కృత్వా పితౄణామప్రదక్షిణమ్‌. 6

ద్విగుణాంస్తుకుశాన్‌ కృత్వా హ్యుశన్తస్త్వేత్యృచా పితౄన్‌ |

ఆవాహ్య తదనుజ్ఞాతో జపేదాయాన్తు నస్తతః. 7

యవార్థాస్తు తిలైః కార్యాః కుర్యాదర్ఘ్యాది పూర్వవత్‌ | దత్త్వార్ఘ్యం సంస్రవాఞ్ఛేషాన్పాత్రే కృత్వావిధానతః. 8

పితృభ్యః స్థానమసీతి న్యుబ్జం పాత్రం కరోత్యధః |

అగ్నౌ కరిష్య ఆదాయ పృచ్ఛత్యన్నం ఘృతప్లుతమ్‌. 9

కురుష్వేతి హ్యనుజ్ఞాతో హుత్వాగ్నౌ పితృయజ్ఞవత్‌ | హుతశేషం ప్రదద్యాత్తు భాజనేషు సమాహితః.10

యథాలాభోపపన్నేషు రౌప్యేషు తు విశేషతః | దత్త్వాన్నం పృథివీపాత్రమితి పాత్రాభిమన్త్రణమ్‌. 11

పుష్కరుడు చెప్పెను. ఇపుడు భుక్తిముక్తి ప్రద మగు శ్రాద్ధ కల్పమును గూర్చి చెప్పెదను. సావధానముగా వినుము. శ్రాద్ధకర్త మనస్సును, ఇంద్రియములను వశమునందుంచుకొని పవిత్రుడై ఒక రోజు ముందుగా బ్రాహ్మణులను నిమంత్రించ వలెను. శ్రాద్ధదివసమున, అపరాహ్ణకాలమునందు వచ్చిన ఆ బ్రాహ్మణులను స్వాగతాదులచే పూజించవలెను. వారిని పీఠముపై కూర్చుండ బెట్టవలెను. దైవస్థానమున సరిసంఖ్య కలవారిని, పితృస్థానమునందు బేసి సంఖ్యకలవారిని కూర్చుండబెట్టవలెను. దైవస్థానమున ప్రాఙ్ముఖముగ కూర్చుండబెట్టవలెను. పితృస్థానమునందు ఒకరిని లేదా ముగ్గురిని కూర్చుండబెట్టవలెను. లేదా రెండింటియందును ఒక్కరొక్కరే ఉండవచ్చును. మాతామహశ్రాద్ధమునందు గూడ ఇట్లే; పాణిప్రక్షాళనోదకమును, ఆసనముకొరకై కుశలను ఇచ్చి, అనుజ్ఞ పొంది ''విశ్వేదేవాసః'' ఇత్యాదిమంత్రముచే ఆవాహనము చేసి, సపవిత్ర మగు పాత్రయందు యవలు చల్లి శం నో దేవీః అను మంత్రముచే నీళ్ళు పోసి, 'యవోసి' అను మంత్రముచే యవలు చల్లి, 'యా దివ్యా ఆపః' అను మంత్రముచే హస్తమునందు అర్ఘ్యము ఇవ్వవలెను. పిదప ఉదకమును, గంధమాల్యములను, ధూపదీపములను ఇవ్వవలెను. పిదప అపసవ్యము చేసుకొని పితృదేవతలకు అప్రదక్షిణముగా ద్విగుణము లగు కుశలను ఆసనముగా ఇచ్చి, ''ఉశన్తస్త్వా'' అను మంత్రముచే ఆ పితృదేవతల ఆవావాసము చేసి, అనుజ్ఞ పొందినవాడై, 'ఆ యాన్తు నః' అను మంత్రము జపించవలెను. ఇచట యవలకు బదులు తిలలు వాడవలెను. అర్ఘ్యాదికమును వెనుకటివలెనే ఇచ్చి, సంస్రవమును (కారిన జలమును) పితృపాత్రమునందు గ్రహించి దానిని 'పితృభ్యః స్థానమసి' అని చెప్పుచు ఆధోముఖము చేయవలెను. ''అగ్నౌ కరిష్యే'' అని చెప్పి కురుష్వ అని అనుజ్ఞ పొంది, ఘృతమిశ్రిత మగు అన్నము గ్రహించి, పితృయజ్ఞమునందు వలె అగ్నిలో హోమము చేసి, హోమము చేయగా మిగిలిన అన్నమును పాత్రలలో ఉంచవలెను. లభ్య మగు పాత్రలలో - విశేషించి రజత పాత్రలలో - అన్న ముంచి, ''పృథివీ తే పాత్రమ్‌'' ఇత్యాదిమంత్రముచే పాత్రాభిమంత్రణ చేయవలెను.

కృత్వేదం విష్ణురిత్యన్నే ద్విజాఙ్గుష్ఠం నివేశ##యేత్‌ |

సవ్యాహృతికాం గాయత్రీం మధు వాతా ఇతి త్యృచమ్‌. 12

జప్త్వా యథాసుఖం వాచ్యం భుఞ్జీరంస్తేపి వాగ్యతాః |

అన్నమిష్టం హవిష్యం చ దద్యాజ్జప్త్వా పవిత్రికమ్‌. 13

అన్నమాదాయ తృప్తాః స్థ శేషం చైవాన్నమస్య చ |

తదన్నం వికిరేద్భూమౌ దద్యాచ్చాపః సకృత్సకృత్‌. 14

సర్వమన్న ముపాదాయ సలిలం దక్షిణాముఖః | ఉచ్ఛిష్టసంనిధౌ పిణ్డాన్ద్ర్పదద్యా త్పితృయజ్ఞవత్‌. 15

మాతామహానామప్యేవం దద్యాదాచమనం తతః | స్వస్తి వాచ్యం తతః కుర్యాదక్షయోదకమేవ చ. 16

దత్త్వా తు దక్షిణాం శక్త్యా స్వధాకారముదాహరేత్‌ |

వాచ్యత్యామిత్యనుజ్ఞాతః స్వపితృభ్యః స్వధోచ్యతామ్‌. 17

కుర్యురస్తు స్వధేత్యుక్తే భూమౌ సిఞ్చేత్తతో జలమ్‌ |

ప్రీయన్తామితి వై దైవే విశ్వేదేవా జలం దదేత్‌. 18

దాతారో నోభివర్ధన్తాం వేదాః సన్తతిరేవ చ | శ్రద్ధా చ నో మా వ్యగమద్బహుదేయం చ నోస్త్వితి. 19

ఇత్యుక్త్వాతు ప్రియా వాచః ప్రణిపత్య విసర్జయేత్‌ | వాజేవాజ ఇతి ప్రీతపితృపూర్వం విసర్జనమ్‌. 20

యస్మింస్తు సంస్రవాః పూర్వమర్ఘ్యపాత్రే నిపాతితాః |

పితృపాత్రం తదుత్తానం కృత్వా విప్రాన్విసర్జయేత్‌. 21

''ఇదం విష్ణుః'' అను మంత్రముచేత ద్విజుని అంగుష్ఠము అన్నమునందు ఉంచవలెను. వ్యాహృతులతో గూడిన గాయత్రిని, మధువాతాః ఇత్యాది ఋక్త్రయమును జపించి ''సుఖముగా భుజించండి'' అని చెప్పవలెను. వారు కూడ మౌనముతో భుజింపవలెను. వారికి ఇష్టము, హవిర్యోగ్యము అయిన అన్నము వడ్డించవలెను. పవిత్ర మంత్రము జపించి అన్నమును గ్రహించి, 'తృప్తి చెందినారా?' అని పశ్నించి 'తృప్తి చెందితిమి' అని వారు సమాధానము చెప్పిన తరువాత ''శేషాన్నమును ఏమి చేయవలెను'' అని ప్రశ్నించగా ''వారు ఇష్టులతో కూడి భుజించండి'' అని సమాధానము చెప్పవలెను. వారు తినగా మిగిలిన అన్నమును భూమిపై చల్లి ఒక్కొక పర్యాయము ఉదకము ఇవ్వవలెను. ఆ అన్నము నంతను గ్రహించి, దక్షిణాభిముఖుడై, ఉచ్ఛిష్టసమీపమున పితృయజ్ఞమునందు వలె పిండ ప్రదానము చేయవలెను. మాతామహులకు కూడ ఇట్లే చేయవలెను. పిదపఆచమనము ఇచ్చి, స్వస్తివాచనము చేయవలెను. అక్షయ్యోదకము ఇవ్వవలెను. యథాశక్తిగా దక్షిణ సమర్పించి 'వాచ్యతామ్‌' అని అనుజ్ఞపొంది స్వధా అని పలుకవలెను. 'అస్తు స్వధా' అని చెప్పగా పిదప జలమును భూమిపై విడువవలెను. 'ప్రీయన్తాంవిశ్వేదేవాః'' అని అనుచుదేవస్థానమున ఉదకము ఇవ్వవలెను. ''మాలో దాతలు వృద్ధి పొందుదురుగాక. వేదములు, సంతానము కూడ వృద్ధిపొందుగాక! మాశ్రద్ధ కూడ తగ్గకుండుగాక. మావద్ద ఇతరులకు ఇచ్చుటకు అధికధనాదికము ఉండుగాక! ఈ విధముగ ప్రియవాక్కులు పలుకుచు నమస్కరించి విజర్జించవలెను. ముందుగా 'వాజే వాజే' ఇత్యాది మంత్రముతో పితృదేవతావిసర్జనము చేయవలెను పూర్వము సంస్రవములు పడిన అర్ఘ్యపాత్రలను ఉత్తానము చేసి బ్రామ్మణులను పంపి వేయవలెను.

ప్రదక్షిణమనువ్రజ్య భుక్త్వా తు పితృసేవితమ్‌ | బ్రహ్మచారీ భ##వేత్తాం తు రజనీం బ్రాహ్మణౖః సహ. 22

ఏవం ప్రదక్షిణం కృత్వా వృద్ధౌ నాన్దీముఖాన్‌ పితౄన్‌ | యజేత దధికర్క న్ధూమిశ్రాన్‌ పిణ్ణాన్యవైః క్రియా.

ఏకోద్దిష్టం దైవహీనమేకార్ఘైక పవిత్రకమ్‌ | ఆవాహనాగ్నౌకరణరహితం హ్యపసవ్యవత్‌. 24

ఉపతిష్ఠతామిత్యక్షయ్యస్థానే పితృవిసర్జనే | అభిరమ్యతామితి వదేద్బ్రూయుస్తేభిరతాః స్మ హ. 25

గన్ధోదకతిలైర్యుక్తం కుర్యాత్పాత్రచతుష్టయమ్‌ | అర్ఘార్థం పితృపాత్రేషు ప్రేతపాత్రం ప్రసేచయేత్‌. 26

యే సమానా ఇతి ద్వాభ్యాం శేషం పూర్వవదాచరేత్‌ | ఏతత్సపిణ్డీకరణమేకోద్దిష్టం స్త్రియా సహ. 27

అర్వాక్సపిణ్డీకరణం యస్య సంవత్సరాద్భవేత్‌ | తస్యాప్యన్న స్యోదకుమ్భం దద్యాత్సంవత్సరం ద్విజ. 28

మృతాహని చ కర్తవ్యం ప్రతిమాసం తు వత్సరమ్‌ | ప్రతిసంవత్సరం కార్యం శ్రాద్ధం వై మాసికాన్నవత్‌.

హవిష్యాన్నేన వై మాసం పాయసేన తు వత్సరమ్‌ | మాత్స్యహారిణకౌరభ్రశాకునచ్ఛాగపార్షతైః. 30

ఐణరౌరవవారాహశాశైర్మాంసైర్యథాక్రమమ్‌ | మాసవృద్ధ్యాభితృప్యన్తి దత్తైరేవ పితామహాః. 31

ఖడ్గామిషం మహాశల్కం మధుయుక్తాన్నమేవ చ | లోహామిషం కాలశాకం మాంసం వార్ధీణసస్య చ. 32

యద్దవాతి గయాస్థశ్చ సర్వమానన్త్యమశ్నుతే | తథా వర్షాత్త్రయోదశ్యాం మఘాసు చ న సంశయః. 33

కన్యాం ప్రజాం వన్దినశ్చ పశూన్ముఖ్యాన్‌ సుతానపి | ఘృతం కృషిం చ వాణిజ్యం ద్విశ##ఫైకశఫంతథా. 34

బ్రహ్మవర్చస్వినః పుత్రాన్‌ స్వర్ణరూప్యే సకుప్యకే | జ్ఞాతిశ్రైష్ఠ్యం సర్వకామానావాప్నోతి శ్రాద్ధదఃసదా.

బ్రాహ్మణులను ప్రదక్షిణక్రమమున కొంతదూరము అనుసరించి వెళ్ళి మరలవచ్చి పితృదేవభుక్తశేషమును భుజించి, ఆ రాత్రి తాను, బ్రాహ్మణులతో గూడ బ్రహ్మచారిగా ఉండవలెను. ఇదేవిధముగ పుత్రజన్మాది వృద్ధిసమయములందు ప్రదక్షిణావృత్తిచే నాందీముఖపితృదేవతలను పూజించవలెను. పెరుగు కర్కంధూఫలము కలిసిన అన్నముతో పిండ దానము చేసి, తిలస్థానమున యవలను ఉపయోగించవలెను. ఏకోద్దిష్టశ్రాద్ధమున విశ్వేదేవపూజ ఉండదు. ఒకే అర్ఘ్యపాత్ర, ఒకే పవిత్రము ఉండును. ఆవాహనము, అగ్నౌకరణము ఉండదు. యజ్ఞోపవీతమును అపసవ్యముగా చేసికొని అన్ని కార్యములు చేయబడును. 'అక్షయ్యమస్తు' అనుటకు బదులు ''ఉపతిష్ఠతామ్‌'' అని చెప్పవలెను. ''వాజే వాజే'' ఇత్యాదమంత్రముతో బ్రాహ్మణవిసర్జన చేయునపుడు 'అభిరమ్యతామ్‌' అని చెప్పగా, వారు ''అభిరతాః స్మః'' అని పలుకుదురు. సపిండీ కరణ శ్రాద్ధమునందు వెనుక చెప్పిన విధముగ అర్ఘ్యసిద్ధికొరకై గంధ-జల-తిలయుక్తములగు నాలుగు అర్ఘ్యపాత్రలు చేసి కొనవలెను. ప్రేతపాత్రజలములు పితృపాత్రమునందు పోయవలెను. ఆ సమయమునందు ''యే సమానాః'' ఇత్యాది మంత్ర ద్వయమును పఠించవలెను. మిగిలిన క్రియాకలాపము వెనుకటివలెనే. ఈ సపిండీకరణ ఏకోద్దిష్ట, శ్రాద్ధములు తల్లికి గూడ చేయవలెను. సపిండీకరణము సంవత్సరమునకు ముందుగానే చేసివేసినవాని నిమిత్తమై సంవత్సరము పాటు, ఉదకుంభ సహిత అన్నమును ఇవ్వవలెను. ఒక సంవత్సరముపాటు ప్రతిమాసమునందును ఒక పర్యాయము క్షయాహతిథియందు ఏకోద్దిష్టముచేయుట ఉచితము. మొదటి ఏకోద్దిష్టము పదకొండవదినమునందు చేయబడును. శ్రాద్ధమునందు హవిష్యాన్న మును ఇచ్చుటచే ఒక మాసము వరకును, పాయసము నిచ్చుటచే సంవత్సరమువరకును పితృదేవతలకు తృప్తి కలుగును. మత్స్య - హరిణ -ఉరభ్ర-శకుని-ఛాగ-పృషత-ఐణ-రురు-వరాహ- శశమాంసములు ఇచ్చినచో పితామహులకు వరుసగా ఒక్కొక్కమాసము అధికముగతృప్తి కలుగును. ఖడ్గమృగమాంసము, మహాశల్కమాంసము, మధుయుక్తాన్నము, లోహ మాంసము, కాలశాకము, వార్ధీణసమాంసము, గయాదత్తము - ఇవి అన్నియు అనంత తృప్తిని ఇచ్చును. భాద్రపద కృష్ణ త్రయోదశియందు - విశేషించి మఘానక్షత్రయోగమున - పితృదేవతల కిచ్చినది అక్షయ మగును. శ్రాద్ధము చేసినవాడు సర్వదా రూపశీలవతి యైన కన్యను, సంతానమును, స్తోత్రపాఠకులను, మంచి పశువులను, సుతులను, నెయ్యి, కృషి, వాణిజ్యము, రెండు డెక్కల జంతువులను, ఒక శఫము గల జంతువులను, బ్రహ్మవర్చస్సు గల పుత్రులను, స్వర్గమును, వెండిని, కుప్యమును, జ్ఞాతులలో శ్రేష్ఠత్వమును, సర్వకామములను పొందును.

ప్రతిపత్రృభృతిష్వేతాన్వర్జయిత్వా చతుర్దశీమ్‌ | శ##స్త్రేణ తు హతా యే వై తేషాం తత్ర ప్రదీయతే. 36

స్వర్గం హ్యపత్యమోజశ్చ శౌర్యం క్షేత్రం బలం తథా |

పుత్ర శ్రైష్ఠ్యం ససౌభాగ్యమసత్యం ముఖ్యతాం సుతాన్‌. 37

ప్రవృత్తచక్రతాం పుత్రాన్వాణిజ్యం ప్రభుతాం తథా | ఆరోగిత్వం యశో వీతశోకతాం పరమాం గతిమ్‌. 38

ధనం విద్యాం భిషక్‌సిద్ధిం రూప్యం గాశ్చాప్యజావికమ్‌ | అశ్వానాయుశ్చ విధివద్యః శ్రాద్ధం సంప్రయచ్ఛతి.

కృత్తికాదిభరణ్యన్తే స కామానాప్నుయాదిమాన్‌ | వసురుద్రాదితిసుతాః పితరః శ్రాద్ధదేవతాః. 40

ప్రీణయన్తి మనుష్యాణాం వితౄఞ్ఛ్రాద్ధేన తర్పితాః |

ఆయుః ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ. 41

ప్రయచ్ఛన్తి తథా రాజ్యం ప్రీతా నౄణాం పితామహాః.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే శ్రాద్ధకల్పవర్ణనం నామ త్రిషష్ట్యధికశతతమోధ్యాయః.

చతుర్దశితప్ప, ప్రతిపత్తు మొదలు పదునైదు తిథులందు, శస్త్రహతులకు శ్రాద్ధము చేయబడును. కృత్తిక మొదలు భరణివరకును యథాశాస్త్రముగ శ్రాద్ధము నిచ్చువాడు స్వర్గమును, సంతానమును, తేజస్సును' శౌర్యమును, సుతులను, అధికారమును, పుత్రులను, వాణిజ్యమును, ప్రభుత్వమును, ఆరోగ్యమును, యశస్సును, శోకవినాశనమును, పరమగతిని, ధనమును, విద్యను, వైద్యసిద్ధిని, వెండిని, గోవులను, గొఱ్ఱలను, అశ్వములను, ఆయుస్సును పొందును. శ్రాద్ధముచేత తర్పితులై వసురుద్రాదిత్యరూపులైన శ్రాద్ధదేవత లైన పితృదేవతలు, మనుష్యుల పితరులను సంతోషింపచేయుదురు. సంతసించిన పితామహులు మనుష్యులకు ఆయుః ప్రజా - ధన - విద్యలను, సర్గ - మోక్ష - సుఖములను రాజ్యమును ఇత్తురు.

ఆగ్నేయమహాపురాణమునందు శ్రాద్ధకల్పవర్ణన మను నూటఅరువది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters