Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనషష్ట్యధిక శతతమోధ్యాయః

అథ అసంస్కృతాశౌచమ్‌.

పుష్కర ఉవాచ :

సంస్కృతస్యాసంస్కృతస్య స్వర్గో మోక్షో హరిస్మృతేః |

అస్థ్నాం గఙ్గామ్భసి క్షేపాత్‌ ప్రేతస్యాభ్యుదయో భ##వేత్‌. 1

గంగాతోయే నరస్యాస్థి యావత్తావద్దివి స్థితిః | ఆత్మనస్త్యాగినాం నాస్తి పతితానాం తథా క్రియా. 2

తేషామపి తథా గాఙ్గే తోయేస్థాన్నం పతనం హితమ్‌ |

తేషాం దత్తం జలం చాన్నం గగనే తత్ప్రీలీయతే. 3

అనుగ్రహేణ మహతా ప్రేతస్య పతితస్య చ| నారాయణబలిః కార్యస్తేనాను గ్రహమశ్నుతే. 4

అక్షయః పుణ్డరీకాక్ష స్తత్ర దత్తం న నశ్యతి | పతనాత్త్రాయతే యస్మాత్తస్మాత్పాత్త్రం జనార్దనః. 5

పతతాం భుక్తిముక్త్యాదిప్రద ఏకో హరిర్ధ్రువమ్‌ |

దృష్ట్వా లోకాన్మ్రియమాణాన్‌ సహాయం ధర్మమాచరేత్‌. 6

జాయావర్జం హి సర్వస్య యామ్యః పన్థా విభిద్యతే. 7

ధర్మ ఏకో వ్రజత్యేనం యత్ర క్వచన గామినమ్‌ | శ్వః కార్యమద్య కుర్వీత పూర్వాహ్ణే చా పరాహ్ణికమ్‌. 8

న హి ప్రతీక్షతే మృత్యుః కృతం వాస్య న వా కృతమ్‌ | క్షేత్రాపణ గృహాసక్త మన్యత్ర గతమానసమ్‌. 9

వృకీవోరణమాసాద్య మృత్యురాదాయ గచ్ఛతి | న కాలస్య ప్రియః కశ్చిద్ద్వేష్యశ్చాస్య న విద్యతే. 10

ఆయుష్యే కర్మణి క్షీణ ప్రసహ్య హరతే జనమ్‌ | నా ప్రాప్తకాలో మ్రియతే విద్ధః శరశ##తైరపి. 11

కుశాగ్రేణాపి సంస్పృష్టః ప్రాప్తకాలో న జీవతి | ఔషధాని న మన్త్రాద్యాస్త్రాయన్తే మృత్యునాన్వితమ్‌. 12

వత్సవత్ప్రాక్కృతం కర్మ కర్తారం విన్దతి ధ్రువమ్‌ | అవ్యక్తాది వ్యక్తమధ్యమవ్యక్త నిధనం జగత్‌. 13

కౌమారాది యథాదేహే తథా దేహాన్తరాగమః | నవమన్యద్యథా వస్త్రం గృహ్ణాత్యేవం శరీరకమ్‌. 14

దేహీ నిత్యమవధ్యోయం యతః శోకం తతస్త్యజేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయేసంస్కృతాద్యా శౌచవర్ణనం నామైకోన షష్ట్యధిక శతతమోధ్యాయః.

పుష్కరుడు చెప్పెను : మరణించినవానికి సంస్కారము జరిగినను జరుగకపోయినను శ్రీహరినామస్మరణ చేసినచో వానికి స్వర్గమోక్షములు రెండును లభించును. మృతుని అస్థులను గంగలో పడవేయుటచే ఆతనికి అభ్యుదయము కలుగును. తన ఆస్థులు గంగలో ఎంత కాల ముండునో అంత కాలము మానవుడు స్వర్గములో నుండును. ఆత్మహత్య చేసికొన్న వానికిని, పతితునకును పిండోదకక్రియలేకున్నను వాని అస్థులను గంగలో పడవేసినచో వానికి మంచి కలుగును. వానికై ఇచ్చిన అన్నజలములు ఆకాశములో లీనమైపోవును. పతితు డగువాని ప్రతేను ఉద్ధేశించి మహానుగ్రహబుద్ధితో నారాయణబలి ఇవ్వవలెను. వానికి నారాయణానుగ్రహము లభించును. కమలోచను డగు శ్రీహరి వినాశరహితుడు. అందుచే ఆతని కర్చించినది వినాశరహితమై యుండును. జనార్దనుడు జీవుని పతితుడు కాకుండ కాపాడును; అందుచే అతడే ఉత్తమ పాత్ర. పతితు లైబోవ నున్న జీవులకు భోగమోక్షముల నిచ్చు ఏకైక ప్రభువు శ్రీమహావిష్ణువు. ''జగత్తులో నున్న వారందరును ఏదో ఒక రోజున మరణింపవలసినవారే'' అను విషయమును గుర్తించి, తనకు నిజముగ సహాయముగా నిలువబోవు ధర్మమును ఆచరించవలెను. పతివ్రతయైన పత్ని తప్ప మరి యే బంధువును గూడ మరణించినవానికొరకై మరణించియు అతనితో కలిసి వెళ్ళజాలరు. యమలోకమార్గము ప్రతి ఒక్కరికిని వేరువేరుగా నుండును. జీవుడు ఎచటికి వెళ్ళినను ఆతనితో కూడ కలిసి వెళ్ళు ఏకైకసహాయము ధర్మమే. రేపు చేయవలసిన పని ఈ రోజునే చేయవలెను. మధ్యాహ్నమునచేయవలసిన పని పూర్వాహ్ణమునందే చేయవలెను. ఏలనన ఈతడు చేయవలసిన పని పూర్తి యైనదా లేదా అని మృత్యువు నిరీక్షించదు. మనుష్యుడు పొలములు, ఆపణములు, గృహములు మొదలగు వాటియందు ఆసక్తుడై మనస్సంతయు మరొక వైవున ఉండి యుండగా ఏమరియున్న గొర్రెను అడతోడేలు వచ్చి తన్నుకొనిపోయి నట్లు మృత్యువు తీసికొనిపోవును. కాలమునకు ఇష్టుడు గాని, అనిష్టుడు గాని లేడు. ఆయుర్దాయము, ప్రారబ్ధకర్మ పూర్తి యైన వెంటనే మృత్యువు హటాత్తుగా వచ్చి జీవుని ఎత్తికొనిపోవును. కాలము రానివానిని వందలకొలది బాణములతో కొట్టినను మరణించడు. కాలము వచ్చినవానిని కుశాగ్రముతో ముట్టినను వాడు మరణించును. మృత్యుగ్రస్తుని ఔషధములు గాని, మంత్రాదులు గాని రక్షింపజాలవు. లేగ దూడ సరిగా తన తల్లిదగ్గరకే వెళ్ళి నట్లు పూర్వజన్మకృతమైన కర్మ కర్తను అనుసరించును. ఈ జగత్తుయొక్క ఆది అవ్యక్తము అంతయు కూడ అవ్యక్తమే. కేవలము మధ్యయే వ్యక్తము. శరీరమునందు కౌమార - ¸°వనాద్యవస్థలు వచ్చిన విధముననే మరొక శరీరము కూడ వచ్చును. నూతన వస్త్రమును ధరించిన విధముగ జీవుడు వెనుకటి శరీరమును విడచి క్రొత్త శరీరమును పొందును. జీవుడు సర్వదా అవధ్యుడు. వాడు ఎన్నడను మరణించడు. అందుచే మృత్యువును గూర్చి శోకమును విడువవలెను.

అగ్నిమహాపురాణమునందు అసంస్కృతాదిశుద్ధి యను నూట ఏబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters