Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుఃపఞ్చాశదుత్తరశతతమోధ్యాయః.

అథ వివాహః

పుష్కర ఉవాచ :

విప్రశ్చతస్రో విన్దేత భార్యాస్తిస్రస్తు భూమిపః | ద్వే చ వైశ్యో యథాకామం భార్యైకామపి చాన్త్యజః. 1

ధర్మకార్యాణి సర్వాణి న కార్యాణ్యసవర్ణయా | పాణిర్గ్రాహ్యః సవర్ణాసు గృహ్ణీయాత్‌ క్షత్రియా శరమ్‌. 2

వైశ్యా ప్రతోదమాదద్యాద్దశాం వై చాన్త్యజా తథా | సకృత్కన్యా ప్రదాతవ్యా హరంస్తాం చౌరదణ్డభాక్‌. 3

అపత్యవిక్రియాసక్తే నిష్కృతిర్న విధీయతే | కన్యాదానం శచీయాగో వివాహోథ చతుర్థికా. 4

వివాహమేతత్‌ కథితం నామకర్మ చతుష్టయమ్‌ | నష్టే మృతే ప్రవ్రజితే క్లీబే చ పతితే పతౌ. 5

పఞ్చస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే | మృతే తు దేవరే దేయా తదభావే యథేచ్ఛయా. 6

పూర్వాత్రితయమాగ్నేయం వాయవ్యం చోత్తరాత్రతయమ్‌ | రోహిణీ చేతి చరణ భగణః శస్యతే సదా. 7

నైకగోత్రాం తు వరయేన్నైకార్షేయాం చ భార్గవ | పితృతః సప్తమాదూర్ధ్వం మాతృతః పఞ్చమాత్తథా. 8

పుష్కరుడు చెప్పెను : పరశురామా ! బ్రాహ్మణుడు తన ఇచ్ఛానుసారముగా నాలుగు వర్ణముల కన్యలను వివాహ మాడవచ్చును, క్షత్రియుడు మూడు వర్ణములవారిని, వైశ్యుడు రెండు వర్ణముల వివాహ మాడవచ్చును. శూద్రుడు స్వవర్ణము కన్యను వివాహ మాడవలెను. అసమానవర్ణ యగు భార్యతో ధార్మికకర్మలేవియు చేయరాదు. సమానవర్ణ కన్యను వివాహము చేసికొనినపుడు భర్త ఆమె హస్తము గ్రహించవలెను. బ్రాహ్మణునితో క్షత్రియ కన్యకు వివాహ మగునపుడు ఆమె అతని చేతిలో నున్న బాణమును పట్టుకొనవలెను. వైశ్యకన్య బ్రాహ్మణ - క్షత్రియులతో వివాహము చేయునపుడు ఆమె వారి చేతిలో నుంచిన కొరడా పట్టుకొనవలెను. శూద్రకన్య వస్త్రాగ్రమును పట్టుకొనవలెను. కన్యాదాన మనునది ఒక్క పర్యాయమే జరుగును. ఇచ్చిన కన్యను అపహరించిన వారిని చోరుని దండించి నట్లు దండించవలెను. సంతానము అమ్మువానికి పాపవిముక్తి కలుగదు. కన్యాదానము, శచీపూజ, వివాహము, చతుర్థీకర్మ - ఈ నాల్గిచిటికిని వివాహము అని పేరు. పతి జాడ తెలియకుండ పోయినను. మరణించినను సంద్యాసి యైనను, నపుంసకు డైనను. పతితు డైనను - ఈ ఆపదలం దును భార్య మరి యొక భర్తను బడయ వచ్చును. పతి మరణించిన కన్యను మరిదికి ఇవ్వవలెను. మరిది లేని పక్షమున ఇష్టమువచ్చినవారికి ఇవ్వవచ్చును. వర - వధూవరణములకు మూడు ఉత్తరా నక్షత్రములు, కృత్తిక, స్వాతి, మూడు పూర్వానక్షత్రములును మంచివి. పరశురామా! సమాన గోత్రప్రవరలు గల కన్యను వివాహ మాడరాదు. తండ్రి తరవాత ఏడు పురుషములు, తల్లితరువాత ఐదు పురుషములు దాటిన వారిని వివాహము చేసికొనవచ్చును.

ఆహూయ దానం బ్రాహ్మః స్యాత్కులశీలయుతాయ తు | పురుషాంస్తారయేత్తజ్జో నిత్యం కన్యాప్రదానతః. 9

తథా గోమిథునాదానాద్వివాహస్త్వార్ష ఉచ్యతే | ప్రార్థితా దీయతే యస్య ప్రాజాపత్యః స ధర్మకృత్‌. 10

శుల్కేన చాసురో మన్ధో గాన్దర్వో వరణాన్మిథః | రాక్షసో యుద్ధమరణాత్పైశాచ ః కన్యకాచ్ఛలాత్‌. 11

వై వాహికేహ్ని కుర్వీత కుమ్భకారమృదా శచీమ్‌ |

జలాశ##యే తు తాం పూజ్య వాద్యాద్యైః స్త్రీం గృహం నయేత్‌. 12

ప్రసుప్తే కేశ##వే నైవ వివాహః కార్య ఏవ హి | పౌషే చైత్రీ కుజదినే రిక్తావిష్టితిథౌ న చ. 13

న శుక్రణివేస్తమితే న శశాఙ్కే గ్రహార్దితే | అర్కార్కిభౌమయుక్తే ఖే వ్యతీపాతహరే న హి. 14

సౌమ్యం పిత్ర్యం చ వాయవ్యం సావిత్రం రోహిణీ తథా|

ఉత్తరాత్రితయం మూలం మైత్రం పౌష్టం వివాహభమ్‌. 15

మానుషాఖ్యస్తథా లగ్నో మానుషాఖ్యాంశకః శుభః | తృతీయేచ తథా షష్ఠే దశ మైకాదశే ష్టమే. 16

అర్కార్కిచన్ద్రతనయాః ప్రశస్తాన కుజోష్టమః | సప్తాన్త్యాస్టమవర్గేషు శేసాః శస్తా గ్రాహోత్తమాః. 17

తేషామపి తథామధ్యాత్షష్ఠః శుక్రో న శస్యతే | వైవాహి కే భే కర్తవ్యా తథైవ చ చతుర్థికా. 18

న దాతవ్యా గ్రహాస్తత్ర చతురాద్యాస్తథైకగాః | పర్వవర్జం స్త్రియం గచ్ఛేత్సత్యా దత్తా తదా రతిః. 19

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వివాహోనామ చతుష్పఞ్చాశదధికశతతమోధ్యాయః.

ఉత్తమవంశమునందు పుట్టిన, సదాచారవంతుడైన వరుని ఇంటికిపిలిచి కన్యాదానము చేయుట ''బ్రాహ్మవివాహము'' ఈ వివాహప్రభావముచే, ఈ దంపతుల పుత్రుడు వెనుకటితరములవారిని ఉద్ధరించును. వరునినుండి ఒక ఆవును, ఒక ఎద్దును తీసికొని కన్యాదానము చేసినచో అది ''ఆర్షవివాహము'' అడిగినవానికి కన్యాదానము చేసినచో అది 'ప్రాజాపత్య' వివాహము. దీనివలన ధర్మసిద్ధి కలుగును. శుల్కము తీసికొని కన్యాదానము చేసినచో ''ఆసురవివాహము'' ఇదినీచకృత్యము; వధూవరులు తాము ఇష్టపడి చేసికొనిన వివాహము 'గాంధర్వము'. యుద్ధము చేసి కన్యను హరించి చేసికొన్నది 'రాక్షస వివాహము' మోసగించి కన్యను అపహరించినచో ''పైశాచవివాహము'' వివాహదివసమున కుమ్మరి మట్టితో శచిప్రతిమ తయారు చేసి, జలాశయ సమీపమున దానికి మంగళవాద్యాదులతో పూజ చేయించి, కన్యను ఇంటికి తీసికొనివెళ్ళవలెను. ఆషాడ శుద్ధైకాదశినుండి కార్తి కశుద్ధైకాదశి వరకు శ్రీమహావిష్ణువు శయనించి యున్నపుడు వివాహము చేయరాదు. పౌషచైత్రమాసములందు మంగళవారమునందు రిక్తాభద్రాతిథులందును గురుశుక్రులు అస్తంగతు లైనపుడును, చంద్రగ్రహణము పట్టబోవు నపుడునన, లగ్నమునందు రవి - శని - కుజు లున్నపుడును, వ్యతీపాతదోష మున్నపుడును వివాహము నిషిద్ధము. మృగశిర, మఘ, స్వాతి, హస్త, రోహిణి, ఉత్తరాత్రయము - మూల, అనురాధ, రేవతి - ఇవి వివాహనక్షత్రములు. పురుషవాచక మగు లగ్నము, దాని నవమాంశము మంచిది. లగ్నమునుండి తృతీయ - షష్ఠ - దశమ - ఏకాదశ ద్వాదశ స్థానములందు రవి - శని - బుధు లున్న శుభము. అష్టమమున కుజు డున్న అశుభము. మిగిలిని గ్రహములు సప్తమ - ద్వాదశ - అష్టమస్థానములందున్నచో శుభము. షష్ఠశుక్రుడు అశుభుడు చతుర్థీకర్మ కూడ వైవాహికనక్షత్రమునందు చేయవలెను. లగ్న - చతుర్థాదిస్థానములందు గ్రహములు లేకుండుట మంచిది. పర్వదినములను విడచి ఇతరదివసములందు స్త్రీసమాగమము చేయవలెను. దీనివలన సతీదేవి ఆశీర్వాదముచే సర్వదా సుఖము కలుగును. (?)

అగ్ని మహాపురాణమునందు వివాహ మను నూటఏబది నాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters