Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రిపఞ్చాశదధిక శతతోమో7ధ్యాయః

అణ బ్రహ్మచర్యాశ్రమధర్మః

పుష్కర ఉవాచ:

ధర్మమాశ్రమిణాం వక్ష్యే భుక్తిముక్తి ప్రదం శృణు | షోడశర్తుర్నిశాః స్త్రీణామద్యాస్తిస్రస్తు గర్హితాః 1

వ్రజేద్యుగ్మాసు పుత్రార్థీ కర్మాధానిక మిష్యతే | గర్భస్య స్పష్టతాజ్ఞానే సవనం స్పన్దనాత్పురా. 2

షష్ఠే7ష్టమే వా సీమన్తం పుత్రీయం నామభం శుభమ్‌ | అచ్ఛిన్ననాడ్యాం కర్తవ్యం జాతకర్మ విచక్షణౖః 3

ఆశౌచే తు వ్యతిక్రాన్తే నామకర్మ విధీయతే | శర్మాన్తం బ్రహ్మణస్యోక్తం వర్మాన్తం క్షత్రియస్య తు. 4

గుప్తదాసాత్మకం నామ ప్రశస్తం వైశ్యశూద్రయోః | బాలం నివేదయేద్భర్త్రె తవ పుత్రో7య మిత్యుత. 5

యథాకులం తు చూడాకృద్బ్రాహ్మణ స్యోపనాయనమ్‌ | గర్భాష్టమే7ష్టమే వాబ్దే గర్భాదేకాదశే నృపే. 6

గర్భాత్తు ద్వాదశే వైశ్యే షోడశాబ్దాదితో నహి |

పుష్కరుడు పలికెను. ఇపుడు ఆశ్రమవంతులగు వారి ధర్మములను చెప్పెదను. ఇది భుక్తి ముక్తి ప్రదము. స్త్రీల ఋతుకాలము పదునారు రాత్రులు. వీటిలో మొదటి మూడు రాత్రులు నింద్యములు, పురుష సంతానము గోరువారు మిగిలినవాటిలో సరిసంఖ్య గల రాత్రులలో స్త్రీ సమాగము చేయవలెను. అది గర్భాధాన సంస్కారము. గర్భనవతియైనది. అని నిశ్చయము కలుగగనే, శిశువు కదలక పూర్వమే పుంసవన సంస్కారము చేయవలెను. ఆ రోజున పుంలింగనక్షక్రమున్నచో మంచిది. బాలుడు పుట్టినతరువాత నాభిచ్ఛేదమునకుపూర్వమే జాతకర్మ సంస్కారము చేయవలెను. సూతకము తొలగిన తరువాత నామకరణము- బ్రహ్మణుని పెరుకు చివర శర్మా అనియు క్షత్రియునకు వర్మా అనియు వైశ్య శూద్రులకు క్రమముగ గుప్తదాస అనియు చేర్చుట మంచిది. ఆ సంస్కారము చేయు సమయమున పత్ని ఇతడు నీ పుత్రుడు అని చెప్పుచు భర్త ఒడిలో బాలుని ఉంచవలెను. పిదప కులాచారము ప్రకారము చూడాకరణము చేయ వలెను. బ్రాహ్మణునకు ఉపనయనసంస్కారము గర్భాష్టమునందు, లేదా ఎనిమిది యేటను క్షత్రియునకు గర్భైకా దశమునందును, వైశ్యునకు గర్భద్వాదశమునందును చేయవలెను. బ్రాహ్మణాదులుకు షోడశాద్యబ్ధములు దాటిన పిమ్మట ఉపనయనము చేసియు ప్రయోజనములేదు.

ముఞ్జానాం వల్కలానాం తు క్రమాన్మౌఞ్జ్యః ప్రకీర్తితాః 7

మార్గవైయాఘ్రవాస్తాని చర్మాణి వ్రతచారిణామ్‌ | పర్ణపిప్పలబిల్వానాం క్రమాద్దణ్డాః ప్రకీర్తితాః 8

కేశ##దేశలలాటాస్యతుల్యాః ప్రోక్తాః క్రమేణ తు | అవక్రాః సత్వచః సర్వే నాతిపుష్టాస్తు దణ్డకాః 9

వాసోపవీతే కార్పాసక్షౌమోర్ణానాం యథాక్రమమ్‌ | ఆదిమధ్యావసానేషు భవచ్ఛబ్దోపలక్షితమ్‌. 10

ప్రథమం తత్ర భిక్షేత యత్ర భిక్షాధ్రువం భ##వేత్‌ | స్త్రీణామమన్త్రతస్తాని వివాహస్తు సమన్త్రకః. 11

ఉపనీయ గురుః శిష్యం శిక్షయేచ్ఛౌచమాదితః | ఆచారమగ్నికార్యం చ సన్ద్యోపాసనమేవ చ. 12

ఆయుష్యం ప్రాజ్ముఖో భుం క్తే యశస్యం ధక్షిణాముఖః|

శ్రియం ప్రత్యఙ్ముఖో భుంక్తే ఋతం భుం క్తే హ్యుదఙ్ముఖః. 13

సాయం ప్రాతశ్చ జుహుయాన్నామేధ్యం వ్యస్తహస్తకమ్‌|

మధు మాంసం జనైః సార్ధం గీతం నృత్యం చ వై త్యజేత్‌.14

హింసాం పరాపవాదం వై హ్యశ్లీలం చ విశేషతః | దణ్డాది ధారయేన్నష్టమప్సు క్షిప్త్వాన్యధారణమ్‌. 15

వేదస్వీకరణం కృత్వా స్నాయాద్వై దత్తదక్షిణః | నైష్ఠికో బ్రహ్మచారీ వా దేహాన్తంనివసేద్గురౌ. 16

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే బ్రహ్మచర్యాశ్రమో నామ త్రిపఞ్చాశదధికశతతమో7ధ్యాయః

మూడు వర్ణముల వారికిని వరుసగ ముంజ-ప్రత్యంచా-వల్కలములతో చేసిన మేఖల విధింపబడినది. ఇట్లే వరుసగా మృగ-వ్యాఘ్ర-అజచర్మలు, పలాశ - పిప్పల-బిల్వదండములు విధింపబడినవి. బ్రాహ్మణ బ్రహ్మచారి దండము ఆతని కేశముల వరకును, క్షత్రియుని దండము లలాటమువరకును, వైశ్యుని దండము లలాటమువరకును పొడవు ఉండవలెను. దండములు వంకరగాను, చర్మరహితము గాను ఉండగూడదు. నిప్పుతగిలినవి కాకూడదు మూడు వర్ణముల వారికి వస్త్రములు వరుసగా పత్తి పట్టు ఉన్ని-వీటితో నిర్మించినవి కావలెను. బ్రహ్మణ బ్రహ్మచారి భిక్ష అడుగనపుడు భవచ్ఛబ్దమును వాక్యము మొదట ప్రయోగించవలెను. క్షత్రియుడు వాక్యమధ్యుమునందును వైశ్యుడు అంతమునందు ప్రయోగించవలెను. తప్పక లభించు ననుచోటనే ప్రథమభిక్ష యాచించవలెను. స్త్రీలకు వివాహము తప్ప మిగిలిన అన్ని సంస్కారములును మంత్రరహితముగ జరుపవలెను. వివాహము మాత్రము వైదికమంత్రముతో జరుపవలెను. శిష్యునకు ఉపనయనము చేసి గురువు ముందుగా సదాచారము. శౌచాచారము అగ్నికార్యము, సంధ్యోపాసన నేర్పవలెను. తూర్పు ముఖముగా కూర్చుండి భోజనము చేయువాడు ఆయుర్దాయమును అనుభవించును. దక్షిణాభిముఖముగా చేయువాడు కీర్తిని, పశ్చిమముఖముగాచేయువాడుఐశ్వర్యమును, ఉత్తరాభిముఖముగాచేయువాడు సత్యమును అనుభవించును, బ్రహ్మచారిసాయంప్రాతః కాలములందు అగ్నికార్యము చేయవలెను. అపవిత్రవస్తువును హోమముచేయరాదు. హోమ సమయమున చేతి వ్రేళ్ళను దూరముగా ఉంచుకొనవలెను. మధుమాంసములను జనులతో కూడికను నృత్యసంగీతములను హింసను, ఇతరనిందను, అశ్లీలసంభాషణమును, విడువవలెను. దండములను ధరించి ఉండవలెను. ఆ దండము విరిగిపోయిన దానిని జలమునందు విసర్జించి క్రొత్తది గ్రహింపవలెను. వేదాధ్యయచనానంతరము గురువుకు దక్షిణ సమర్పించి వ్రతాంతస్నానము చేయవలెను. లేదా నైష్ఠిక బ్రహ్మచారియై ఆ జీవనాంతము గురుకులమునందే ఉండిపోవలెను.

అగ్ని మహాపురాణమునందు బ్రహ్మచర్యాశ్రమవర్జన మను నూట ఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters