Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుశ్చత్వారింశదధిక శతతమోధ్యాయః

అథ కుబ్జికాపూజా

ఈశ్వర ఉవాచ :

శ్రీమతీం కుబ్జికాం వక్ష్యే ధర్మార్థాదిజయప్రదామ్‌ | పూజయేన్మూలమన్త్రేణ పరివారయుతేన వా. 1

ఓం ఐంహ్రౌం శ్రీం ఖైం హ్రేం హ స క్ష మ ల వ ర య ఊం భగవతి అమ్బికే హ్రీం హ్రీం క్షాం క్షాం

క్షూం క్రీం కుబ్జికే హ్రీం ఓం ఙ ఞ ణ న మే అ ఘోరముఖి వాం ఛ్రాం ఛ్రీం కిలి కిలి క్షౌం విచ్చే ఖ్యోం

శ్రీం క్రోం ఓం హ్రోం ఐం వజ్రకుబ్జిని స్త్రీం త్త్రె లోక్యాకర్షిణి హ్రీం కామాఞ్గ ద్రావిణి హ్రీం స్త్రీం మహాక్షోభ

కారిణి ఐం హ్రీం క్షౌం ఐం హ్రీం శ్రీం ఫేం క్షౌం నమో భగవతి క్షౌం కుబ్జికే హ్రీ హ్రీం క్త్రెం ఙ ఞ ణ న మే అఘోరముఖి ఛ్రాం ఛ్రీం విచ్చే ఓం కిలి కిలి.

కృత్వా కరాఙ్గ న్యాసం చ సన్ద్యావన్దనమాచరేత్‌ | వామా జ్యేష్టా తథా రౌద్రీ సన్ద్యా త్రయమనుక్రమాత్‌. 2

కులవాగీశివిద్మ హే మహాకాలీతి ధీమహి | తన్నః కౌలీ ప్రచోదయాత్‌..

మన్త్రాః పఞ్చ ప్రణవాద్యా పాదుకాం పూజయామి చ | మధ్యేనామ చతుర్ధ్యన్తం ద్వినవాత్మకబీజకాః. 3

నమోన్తావాథ షష్ఠ్యా తు సర్వే జ్ఞేయా వదామి తాన్‌ | కౌలీశనాదో ముకులా జన్మతం కుబ్జికా తతః. 4

శ్రీకణ్ఠనాథః కౌలేశో గగనానన్దనాథకః | చటులా దేవీ మైత్త్రేశీ కరాలీ తూర్ణనాధకః. 5

అతలదేవీ శ్రీచన్ద్రదేవీ త్యన్తాస్తతస్త్విమే | భగాత్మపుఞ్గణదేవమోహనీ పాదుకాం యజేత్‌. 6

అతీత భువనానన్దరత్నాఢ్యాం పాదుకాం యజేత్‌ | బ్రహ్మజ్ఞానాథ కమలా పరమా విద్యయా సహ. 7

విద్యాదేవీ గురు శుద్ధి స్త్రి శుద్ధిం ప్రవదామి తే | గగనశ్చటులీ చాత్మాపద్మానన్దో మణిః కలా. 8

కమలో మాణిక్యకణ్ఠో గగనః కుముదస్తథా | శ్రీపద్మో భైరవానన్ధో దేవః కమలఇత్యతః. 9

శివో భవోథ కృష్ణశ్చ నవ సిద్దాశ్చ షోడశ | చన్ద్రపూరోధ గుల్మశ్చ శుభః కామోతిముక్తకః. 10

కణ్ఠో వీరః ప్రయోగో థ కుశలో దేవభోగకః | విశ్వదేవః ఖడ్గదేవో రుద్రో ధాతాసిదేవ చ. 11

ముద్రాస్ఫోటో వంశపూరో భోజః షోడశ సిద్ధకాః | సమయాన్యస్తు దేహస్తు షోఢా న్యాసేన యన్త్రితః. 12

పరమేశ్వరుడు చెప్పెను : ఇపుడు, ధర్మార్ధకామవిజయాదులను ప్రసాదించు కుబ్జికాదేవీ మంత్రము చెప్పెదను. మూలమంత్రముతో పరివారసహితురా లగు ఈ దేవి పూజ చేయవలెను. ''ఓం ఐం హ్రీం శ్రీం....... కిలి కిలి'' అనునది (మూలోక్తము) కుబ్జికామంత్రము - అంగన్యాసకరన్యాసములు చేసి సంధ్యావందనము చేయవలెను. వామా - జ్యేష్ఠా రౌద్రులు ముగ్గురు సంధ్యలు. ''కాలవాగీశి విద్మహే మహాకౌలీతి ధీమహి తన్న ః కౌలీ ప్రచోదయాత్‌ అనునది కౌలీగాయత్రి.దీనిలో ఐదు మంత్రము లున్నవి. ప్రారంభమున ప్రణవము అంతమున నమః ప్రయోగించవలెను. మధ్య ఐదుగురు నాథుల పేర్లు, అంతమున ''శ్రీ పాదుకాం పూజయామి'' అని చేర్చవలెను. మధ్యయందు చతుర్థ్యంత మగు దేవతానామము చేర్చవలెను. ఈ విధముగ ఐదు మంత్రములలో ఒక్కొక్కటి దాదాపు పదునెనిమిది అక్షరములు కలిగి ఉండును. ఈ పేరు లన్నింటిని షష్ఠీవిభక్తిలో ప్రయోగించవలెను. ఈ విధముగ వాక్యయోజన చేసి ఈ మంత్రముల స్వరూపమును తెలిసికొనవలెను. కౌలీశనాథ - శ్రీకంఠనాధ - కౌలనాథ - గగనానందనాథ - తూర్ణనాధు లనువారు పంచనాధులు. వీరి పూజా మంత్ర వాక్యములు ''ఓం కౌలీశనాధాయ నమస్తసై#్మ పాదుకాంపూజయామి'' ఇత్యాది విధమున నుండవలెను. వీరితో పాటు, పుట్టుక నుండియు గూను ఉండుటచే కుబ్జికా అను పేరు గల సుకలాదేవి, చటులాదేవి, వికరాలరూపము గల మైత్రేశీదేవి అతలదేవి,శ్రీ చంద్రాదేవి అను ఐదుగురు దేవులను పూజించవలెను. వీరి పేర్లకు చివర దేవీ అను ఉండును. పూజామంత్రవాక్యములు-"సుకలాదేవ్యై నమస్తసై#్య భగాత్మ పుంగణ దేవమోహినీం పాదుకాం పూజయామి" ఇత్యాది విధమున ఉండును. చటులాదేవి పాదుకకు ''అతీత భువనానన్దరత్నాఢ్యాం'' అను విశేషణము, మూడవ దేవిపాదుకకు ''బ్రహ్మజ్ఞానాఢ్యామ్‌'' అను విశేషణమును, నాల్గవ దేవి పాదుకకు ''కమలాఢ్యామ్‌'' అను విశేషణమును ఐదవ పాదుకకు ''పరమ విద్యాఢ్యామ్‌'' అను విశేషణమును చేర్చవలెను. ఈ విధముగ విద్యా - దేవీ - గురువుల శుద్ధికి త్రిశుద్ధి'' అని పేరు. గగనానంద - చటులి - ఆత్మానంద - పద్మానంద - మణి - కలా - కమల - మాణిక్యకంఠ - గగన - కుముద - శ్రీ పద్మభైరవానంద - కమలదేవ - శివ భవకృష్ణులు అను పదునారుగురు నూతనసిద్ధులు, చంద్రపూర - గుల్మ - శుభకామ - అతిముక్తక వీరకంఠ - కుశల - దేవభోగక - విశ్వదేవ - ఖడ్గదేవ - రుద్ర - ధాతృ - అసి ముద్రాస్ఫోట - వంశపూర - భోజు లను పదునారుగురు సిద్దులు.

ప్రక్షిప్య మణ్డలే పుష్పం ''మణ్డలాన్యథ పూజయేత్‌ | అనన్తం చ మహాన్తాం చ సర్వదా శివపాదుకామ్‌. 13

మహావ్యాప్తిం చ శూన్యం చ పఞ్చతత్త్వాత్తమణ్డలమ్‌ | శ్రీకణ్ఠనాథపాదుకాం శఙ్కరానన్తకౌ యజేత్‌.

సదాశివః పిఙ్గలశ్చ భృగ్వానన్దశ్చ నాథకః | లాఙ్గాలానన్దసంవర్తౌ మణ్డలస్థానకే యజేత్‌. 15

నైరృత్యే శ్రీ మహాకాలః పినాకే చ మహేన్ద్రకః | ఖడ్గో భుజఙ్గో బాణశ్చ అథాసిః శబ్దకో వశః. 16

ఆజ్ఞారూపో నన్దరూపో బలిం దత్త్వా క్రమం యజేత్‌.

హ్రీం ఖం ఖం హ్రూం బటుకాయ అరు అరు అర్ఘం పుష్పం ధూపం దీపం గన్దం బలిం పూజాం గృహ్ణ నమస్తుభ్యమ్‌.

ఓం హ్రాం హ్రీం హ్రూం క్షేం క్షేత్రపాలాయ అవతర అవతర మమాకపిల జటాభార భాస్వర త్రినేత్ర జ్వాలాముఖ ఏ హ్యేహి గన్దం పుష్పం బలిపూజాం గృహ్ణ గృహ్ణ ఖః ఖః ఓం కః ఓం లః

ఓం మహాడామరాధిపతయే స్వాహా.

బలిశేషేథ యజేత్‌ హ్రీం హ్రూం హ్రాం శ్రీం వై త్రికూటకమ్‌. 17

వామే దక్షిణహ్యగ్రే యామ్యే నిశానాథపాదుకాః | దక్షే తమోరినాథస్య హ్యగ్రే కాలానలస్య చ. 18

ఉడ్డియాణం జాలన్దరం పూర్ణం వై కామరూపకమ్‌ | గగనానన్దదేవం చ స్వర్గానన్దసవర్గకమ్‌. 19

పరమానన్దదేవం చ సత్యానన్దస్వపాదుకామ్‌ | నాగానన్దం చవర్గాఖ్యముక్తం తే రత్నపఞ్చకమ్‌. 20

సౌమ్యే శివే యజేత్షట్కం సురనాథస్య పాదుకామ్‌ | శ్రీమత్సమయకోటీశం విద్యకోటీశ్వరం యజేత్‌. 21

కోటీశం బిన్దుకోటీశం సిద్దకోటీశ్వరం తథా | సిద్ధచతుష్కమాగ్నేయ్యామమరీశేశ్వరం యజేత్‌. 22

చక్రీశనాథం కురఙ్గేశం వృత్రేశం చన్ద్రనాథకమ్‌ | యజేద్గన్దాదిభిశ్చైతాన్యామ్యేవిమలపఞ్చకమ్‌. 23

యజేదనాదివిమలం సర్వజ్ఞవిమలం తతః | యజేద్యోగేశవిమలం సిద్ధాఖ్యం సమయాఖ్యకమ్‌. 24

వీరి దేహము కూడ షడ్విధన్యాసనియంత్రితమై ఆత్మతో సమాన మగును. మండలముపై పుష్పములు చల్లి మండలపూజ చేయవలెను. అనంత - మహత్‌ - శివపాదుకా - శూన్య - పంచతత్త్వాత్మకమండల - శ్రీకంఠనాథపాదుకా - శంకర - అనంతుల పూజ చేయవలెను. సదాశివ - పింగల - భృగ్వానంద - నాథసముదాయ - లాంగూలానంద - సంవర్తులను మండలస్థానమున పూజించవలెను. నైరృతియందు శ్రీమహాకాల - పినాకి - మహేన్ద్ర - ఖడ్గ - నాగ - బాణ - అఘాసి - శబ్ద - వశ - ఆజ్ఞారూప - నందరూపములకు బలి ఇచ్చి క్రమముగా వాటిని పూజించవలెను. వటుకునకు అర్ఘ్య- పుష్ప - ధూప - దీప - గంధ - బలులను క్షేత్రపాలునకు పుష్ప- బలులను సమర్పించవలెను. అపుడు ''హ్రీం ఖం ఖం... నమస్తుభ్యమ్‌'' ''ఓం హ్రాం హ్రీం .. .. స్వాహా'' అను (మూరోక్తములగు ) మంత్రములను వినియోగించవలెను. బలి చివర కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన, ఎదుట త్రికూటమును పూజించవలెను. ఇందుకు మంత్రము-- ''హ్రీం హ్రూం హ్రాం శ్రీం త్రికూటాయ నమః '' పిదప ఎడమ ప్రక్కన నిశానాథుని, కుడి ప్రక్కన తమోరినాథుని (సూర్యనాథుని), ఎదుట కాలానలుని పాదుకలను పూజించవలెను. పిదప ఉడ్డియాస - జాలంధర - పూర్ణగిరి - కామరూపులను, గగనానంద దేవ వర్గసహితస్వర్గానందదేవ - పరనమానందదేవ - సత్యానందదేవపాదుకా - నాగానందదేవులను పూజించవలెను. ఈ విధముగ 'వర్గము' అను పేరు గల పంచరత్నములను గూర్చి చెప్పబడినది. ఉత్తర-ఈశాన్యములందు సురనాధపాదుకను, సమయ కోటీశ్వరుని, విద్యాకోటీశ్వరుని, కోటీశ్వరుని, బిందుకోటీశ్వరుని, సిద్దకోటీశ్వరుని పూజించవలెను. ఆగ్నేయమున నలుగురు సిద్ధులను, అమరీశేశ్వర - చక్రీశేశ్వర - కురంగేశ్వర - వృత్రీశ్వర- చంద్రనాథులను గంధాదిపంచోపచారములతో పూజించవలెను. దక్షిణమున అనాదివిమల - సర్వజ్ఞవిమల - యోగీశవిమల - సిద్ధవిమల - సమయవిమలులను పూజించవలెను.

నైరృత్యే చతురో వేదాన్‌ యజేత్కన్దర్పనాథకమ్‌ | పూర్వాః శక్తీశ్చ నర్వాశ్చ కుబ్జికాపాదుకాం యజేత్‌.

నవాత్మకేన మన్త్రేణ పఞ్చప్రణవకేన వా | సహస్రాక్షమనవద్యం విష్ణుం శివం సదా యజేత్‌. 26

పూర్వాచ్ఛివాన్తం బ్రహ్మాదిం బ్రహ్మాణీ చ మహేశ్వరీ | కౌమారీ వైష్ణవీ చైవ వారాహీ శక్రశక్తికా. 27

చాముణ్డా చ మహాలక్ష్మీః పూర్వాదీశాన్తమర్చయేత్‌ | డాకినీ రాకిణీ పూజ్యా లాకినీ డాకినీ తథా. 28

శాకినీ యాకినీ పూజ్యా వాయవ్యాదుగ్రషట్సు చ | యజేద్ధ్యాత్వా తతో దేవీం ద్వాత్రింశద్వర్ణకాత్మికామ్‌. 29

పఞ్చప్రణవకేనాపి హ్రీంకారేణాథవా యజేత్‌ | నీలోత్పలదలశ్యామా షడ్వక్త్రా షట్ప్రకారికా. 30

చిచ్ఛక్తిరష్టాదశాఖ్యా బాహుద్వాదశసంయుతా | సింహాసనసుఖాసీనా ప్రేతపద్మోపరి స్థితా. 31

కులకోటిసహస్రాఢ్యా కర్కోటో మేఖాలాస్థితః | తక్షణోపరిష్టాచ్చ గలే హరశ్చ వాసుకిః. 32

కాలికః కర్ణయోర్యస్యాః కూర్మః కుణ్డలమణ్డలః | భ్రువోః పద్మో మహాపద్మో వామే నాగః కపాలకః 33

అక్షసూత్రం చ ఖట్వాఙ్గం శఙ్ఖం పుస్తం చ దక్షిణ | త్రిశూలం దర్పణం ఖడ్గం రత్నమాలాంకుశం ధనుః.

శ్వేతమూర్ధ్వముఖం దేవ్యాహ్యూర్థ్వశ్వేతం తథాపరమ్‌ |

పూర్వాస్యం పాణ్డురం క్రోధి దక్షిణం కృష్ణవర్ణకమ్‌. 35

హిమకున్దేన్దుభం సౌమ్యం బ్రహ్మా పాదస్థలే స్థితః | విష్ణుస్తు జఘనే రుద్రో హృది కణ్ఠ తథేశ్వరః. 36

సదాశివో లలాటే స్యాచ్ఛివస్తస్యోర్ధ్వతః స్థితః | ఆఘూర్ణితా కుబ్జికైవం ధ్యేయా పూజాదికర్మసు. 37

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే కుబ్జికాపూజా నామ చతుశ్చత్వారింశదధికశతతమోధ్యాయః.

నైరృతియందు నాలుగు వేదములను, కందర్పనాథుని, వెనుక చెప్పిన అందరు శక్తులను, కుబ్జిక శ్రీపాదుకను పూజించవలెను. కుబ్జీకాపూజ "ఓం హ్రాం హ్రీం కుబ్జికాయై నమః" అను నవాక్షరమంత్రముతో గాని, లేదా కేవలము పంచప్రణవరూప మగు మంత్రముతో గాని చేయవలెను. తూర్పు మొదలు ఈశాన్యమువరకు బ్రహ్మ-ఇంద్ర-అగ్ని-యమ-నిరృతి-అనంత-వరుణ-వాయు-కుబేర-ఈశాను లను దశదిక్పాలకులను పూజించవలెను. సహస్రనేత్రు డగు ఇంద్రుని, అనవద్యు డగు విష్ణువును, శివుని సదా పూజించవలెను. తూర్పు మొదలు ఈశాన్యము వరకును ఎనిమిది దిక్కులలో క్రమముగా బ్రహ్మిణీ, మహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఐంద్రీ, చాముండా, మహాలక్ష్ములను పూజించవలెను. వాయవ్యము మొదలు ఆరు ఉగ్రదిక్కులందు వరుసగ డాకినీ-రాకిణీ-లాకినీ-కాకినీ-శాకినీ-యాకినులను పూజించవలెను. పిదప ధ్యానపూర్వకముగ కుబ్జికాదేవిని పూజించవలెను. ముప్పది రెండు వ్యంజనాక్షరములు ఆమె శరీరము. ఆమెను పూజించునపుడు ఐదు ప్రణవములను గాని, 'హ్రీం' గాని బీజరూపమున ఉచ్చరించవలెను. ఆమె దేహచ్ఛాయ నీలకమలదలశ్యామము. ఆరు ముఖము లుండును. వాటి కాంతి గూడ ఆరు విధముల నుండును. ఆమె చైతన్య శక్తిస్వరూపురాలు, అష్టాదశాక్షర మంత్రముచే ప్రతిపాదింపబడునది. పండ్రెండు భుజములు లుండును. సుఖముగా సింహాసనముపై కూర్చుండును. కర్కోటకుడు ఆమెకు మేఖల. తక్షకుడు శిరస్సుపై నుండును. వాసుకి కంఠహారము. రఆమె రెండు చెవులకును, కులికుడు, కూర్ముడు అనునాగములు కుండలముగా నున్నవి. రెండు కనుబొమ్మలపై పద్మ- మహాపద్మము లను నాగము లున్నవి. వామహస్తములందు నాగ-కపాల-అక్షసూత్ర-ఖట్వాంగ, శంఖ-పుస్తకములు, దక్షిణ హస్తములందు త్రిశూల-దర్పణ-ఖడ్గ-రత్నమాలా-అంకుశ-ధనస్సులు ఉండును. ఆ దేవీ ముఖమలు రెండు పై వైపునకు ఉండును. వాటిలో ఒకటి పూర్తిగా తెల్లగాను, రెండవది సగము తెల్లగాను ఉండును. తూర్పు వైపు ముఖము పాండువర్ణము గలది., దక్షిణము వైపు ముఖము కోపముతో నున్నట్లు కనబడును. పశ్చిమ ముఖము నల్లగాను, ఉత్తరముఖము హిమ-కుంద-చంద్రుల వలె తెల్లగాను ఉండును. ఆమె చరణతలమున బ్రహ్మయు, జఘనమున విష్ణువు, హృదయమున రుద్రుడు, కంఠమునందు ఈశ్వరుడు, లలాటమునందు సదాశివుడు ఆమె పై భాగమునందు శివుడును ఉందురు. కుబ్జికాదేవి ఊగు తున్నట్లు ఉండును. పూజాదిసమయములందు కుబ్జికను ఈ విధముగ ధ్యానించవలెను.

అగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున కుబ్జికాపూజావర్ణన మను నూటనలుబది నాల్గువ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters