Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనత్రింశదధికశతతమోధ్యాయః.

అథర్ఘాకాణ్డమ్‌.

ఈశ్వరవాచ :

అర్ఘమానే ప్రవక్ష్యామి ఉల్కపాతో7థ భూశ్చలా | నిర్ఘాతో గ్రహణ వేశో దిశాం దాహో భ##వేద్యదా. 1

లక్షయేన్మాసి మాస్యేవం యద్యేతాఃస్యుశ్చ చైత్రకే | అలఙ్కారాదిసంగృహ్య షడ్భిర్మాసైశ్చ తుర్గుణమ్‌. 2

వైశాఖే చాష్టమే మాసి షడ్గుణం సర్వసంగ్రహామ్‌ | జ్యేష్ఠే మాసి తథాషాడే యవగోధూమధాన్యకైః. 3

శ్రావణ ఘృతతైలాద్యైరాశ్వినే వస్త్రధాన్యకైః | కార్తికే ధాన్యకైః క్రీతైర్మా

సే స్యాన్మార్మార్గశీర్షకే. 4

వుష్యే కుజ్కుమగన్దాద్యైర్లాభో దాన్యైశ్చ మాఘకే | గన్దాదైః ఫాల్గునేక్రీతైరర్ఘకాణ్డముదాహృతమ్‌. 5

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే అర్ఘకాణ్డం నామోనత్రింశదధికశతతమో7ధ్యాయః.

పరమేశ్వరుడు పలికెను. : వస్తువుల మూల్యమును (అల్పత్వాధికత్వముల) గూర్చి చెప్పెదను. భూతలముపై ఉల్కాపాతము, భూకంపము, వజ్రపాతము, చంద్రసూర్య గ్రహణములు, దిక్కులందు అధికముగ వేడి కలుగు నపుడు ఈ విషయమును ప్రత్యేకమాసమునందును పరిశీలించవలెను. పైన చెప్పిన లక్షణములలో ఏదైన లక్షణము చైత్రమునం దైనచో అలంకారసామగ్రిని (వెండి, బంగారము మొ||) సంగ్రహించుకొనవలెను. ఆరు మాసముల తరువాత అవి నాలుగు రెట్లు మూల్యమునకు అమ్ముడుపోవును. వైశాఖమునందైనచో వస్త్ర-ధాన్య-సువర్ణ-ఘృతాదులను సంగ్రహించుకొనవలెను. ఎనిమిదవ మాసమున ఆరు రెట్ల మూల్యమునకు అమ్ముడుపోవును. జ్యేష్ఠాషాఢములందైనచో యవలు, గోధుమలు, ధాన్యము సంగ్రహించు కొనవలెను. శ్రావణమునం దైనచో ఘృతతైలాదిరస పదార్థములను సంగ్రహించవలెను. ఆశ్వయజ మాసముందైనచో వస్త్రములు, ధాన్యము సంగ్రహించవలెను. కార్తికమునందైనచో అన్ని విధముల అన్నమునుకొని ఉంచుకొనవలెను. మార్గశిరపుష్యములం దైనచో కుంకుమము వలనను సుగంధపదార్థముల వలనను లాభము వచ్చును. మాఘమునందైనచో ధాన్యము వలన లాభము కలుగును. ఫాల్గునమునం దైనచో సుగంధపదార్థముల వలన లాభము కలుగును. లాభము వచ్చు అవధి ఆరు-ఎనిమిదిమాసము లని గ్రహించవలెను.

అగ్నిమహాపురాణమునందు అర్ఘకాండ మను నూటఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters