Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తవింశత్యధికశతతమోధ్యాయః

అథ నానాబలాని.

ఈశ్వర ఉవాచ :

విష్కమ్భే ఘటికాస్తి స్రః శూలే పఞ్చ వివర్జయేత్‌ | షట్‌ షట్‌ గణ్డ7తిగణ్డ చ నవ వ్యాఘాతవజ్రయోః. 1

పరిఘే చ వ్యతీపాతే హ్యుభయోరపి తద్దినమ్‌ | వైధృతౌ తద్దినే చైవ యాత్రా యుద్ధాదికం త్యజేత్‌. 2

(అ) 47

గ్రహైః శుభాశుభం వక్ష్యే దేవి మేషాదిరాశితః | చన్ద్రశుక్రౌ చ జన్మస్థౌ వర్జితౌ శుభదాయకౌ, 3

ద్వితియో మఙ్గలో7థార్కః సౌరిశ్చైవ తు సైంహికః | ద్రవ్యనాశమలాభం చ హ్యాహవే భఙ్గమాదిశేత్‌. 4

సోమో బుధో భృగుర్జీవో ద్వితీయస్థాః శుభావహాః | తృతీయస్థో యదా భానుః శనిర్భౌమో భృగుస్తథా. 5

బుధశ్చై వేన్దురాహుశ్చ సర్వే తే ఫలదా గ్రహాః | బుధశుక్రౌ చతుర్థౌ తు శేషాశ్చైవ

భయావహాః. 6

పఞ్చమస్థో యదా జీవః శుక్రః సౌమ్యశ్చ చన్ద్రమాః | దదేతచేప్సితం లాభం షష్ఠేస్థానే శుభో రవిః. 7

చన్ద్రః సౌరిర్మఙ్గలశ్చ గ్రహా దేవి స్వరాశితః | బుధశ్చ శుభదః షష్ఠే త్యజచేత్షష్ఠే గురుం భృగుమ్‌ . 8

సప్తమోర్కః శనిర్భౌమో రాహుర్హాన్యై సుఖాయ చ | జీవో భృగుశ్చ సౌమ్యశ్చ జ్ఞశుక్రౌ చాష్టమౌ శుభౌ.

శేషా గ్రహాస్తథా హాన్యై జ్ఞభృగూ నవమౌ శుభౌ | శేషా హాన్యై చ లాభాయ దశమౌ భృగుభాస్కరౌ. 10

శనిర్భౌమశ్చ రాహుశ్చ చన్ద్రః సౌమ్యః శుభావహః | శుభాశ్చైకాదశే సర్వే వర్జయేద్దశ##మే గురుమ్‌. 11

బుధశుక్రౌ ద్వాదశస్ఠౌ శేషాన్‌ ద్వాదశగాం స్త్యజేత్‌ | అహోరాత్రే ద్వాదశ సూరాశయస్తాన్వదామ్యహమ్‌. 12

పరమేశ్వరుడు చెప్పెను : విష్కంభయోగమున మూడు ఘడియలు శీలయోగమున ఐదు ఘడియలు గండ-అతిగండ యోగముల ఆరు ఘడియలు, వ్యాఘాత-వజ్రముల తొమ్మిది ఘడియలు అన్ని కార్యములందును త్యాజ్యములు. పరిషు-వ్యతీపాత-వైధృత యోగములందు దిన మంతయు త్యాజ్యమే.ఈ యోగములందు యాత్రాయుద్ధాదికము చేయరాదు. దేవీ! నే నిపుడు మేషాదిరాశుల ఫలములను, గ్రహముల, ద్వారా కలుగు ఫలములను చెప్పెదను. జన్మరాశియందు చంద్రశుక్రులు వర్జితులే యైనను శుభప్రదులు. జన్మరాశినుండియు, లగ్నమునుండియు రెండవ స్థానమున సూర్యుడు గాని శని గాని, రాహువు గాని కుజుడు గాని ఉన్నచో ప్రాప్తద్రవ్యము నశించును. అప్రాప్తము లభించదు; యుద్ధమున పరాజయము కలుగును. చంద్ర-బుధ-గురు-శుక్రులు ద్వితీయమందున్నచో శుభప్రదులు. మూడవ ఇంటిలో నున్న రవి-శని-కుజ-శుక్ర-బుధ-చంద్ర-రాహువులు శుభప్రదులు. నాల్గవ ఇంటిలో బుధ శుక్రులున్నచో శుభులు. ఇతరులు భయప్రదులు. పంచమమునందున్న గురు-శుక్ర-బుధ-చంద్రులు అభీష్టలాభదాయకులు. దేవీ! తన రాశినుండి ఆరవ భావమున రవి-చంద్ర-శని కుజు-బుధు లున్నచో శుభఫలము నిత్తురు. కాని శుక్రగురులు శుభప్రదులు కారు. సప్తమభావమునందు రవి-శుక్ర-శని కుజ రాహువులున్నచో హాని కలుగును. బుధ-గురు-శుక్రులున్నచో సుఖము కలుగును; అష్టమమునందలి బుధ-శుక్రులు శుభులు, ఇతరులు హానికరులు. నవమభావమునందున్న బుధ-శుక్రులు శుభులు, ఇతరులు అశుభులు దశమభావము నందలి శుక్ర-సూర్యులు లాభకరులు. శని-కుజ-రాహు-చంద్ర-బుధులు శుభకారకులు. పదకొండవ భావమునందున్న ఏ గ్రహమైనను శుభము నిచ్చును. దశమ స్థానమునందు బుధ-శుక్రులు- శుభులు. ఇతరగ్రహములు ఆశుభలు. ఒక దివసమునందు పండ్రెండు రాసులును తిరిగివచ్చును. ఇపుడు వాటి ఫలము చెప్పెదను.

మీనో మేషో7థ మిథునం చతస్రో నాడయో వృషః |

షట్‌ కర్మసింహకన్యాశ్చ తులా పఞ్చ చ వృశ్చికః. 14

ధనుర్నక్రో ఘటశ్చైవ సూర్యగోరాశిరాద్యకః | చరస్థిరద్విస్వభావా మేషాద్యాః స్యుర్యథాక్రమమ్‌. 14

కులీరో మకరళ్చైవ తులామేషాదయశ్చరాః | చరకార్య జయం కామమాచరేచ్చ శుభాశుభమ్‌. 15

స్థిరో వృషో హరిః కుమ్భో వృశ్చికః స్థిరకార్యకే | శీఘ్రః సమాగమో నాస్తి రోగార్తో నైవముచ్యతే. 16

మిథునం కన్యకా మీనో ధనుశ్చ ద్విస్వభావకః | ద్విస్వభావాః శుభాశ్చైతే సర్వకార్యేషునిత్యశః. 17

యాత్రావాణిజ్యనంగ్రామే వివాహే రాజధర్శనే | వృద్ధిం జయం తథా లాభం యుద్ధే జయమవాప్నుయాత్‌.

అశ్వినీ వింశతారాశ్చ తురగస్యాకృతిస్తథా | యద్యత్ర కురుతే వృష్టిమేకరాత్రం ప్రవర్షతి. 19

యమభే తు యదా వృష్టిః పక్షమేకం తు వర్షతి |

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే నానాబలనిరూపణం నామ సప్తవింశత్యధిక శతతమో7ధ్యాయః

మీన-మేష-మిథునములకు ఒక్కొక్కదానికి భోగకాలము నాలుగు దండములు. వృషభ-కర్కట-సింహ-కన్యలకు ఆరేసి దండములు, తులావృశ్చికధనుర్మ కరకుంభములకు ఐదేసి దండముల కాలము. సూర్యుడున్న రాశి ఉదయ రాశి, ఆ రాశినుండి ఇతర రాశుల భోగకాలము ప్రారంభ మగును. మేషాదిరాశులకు క్రమముగ చర -స్థిర-ద్విస్వభావము లని పేరు. మేష-కర్కట-తులా-మకరములు చరరాశులు. వీటియందు అస్థిరములైన శుభాశుభకార్యములు చేయవలెను. వృషభ-సింహ-వృశ్చిక-కుంభములు స్థిరరాశులు. వీటిలో స్థిరకార్యములు చేయవలెను. ఈ లగ్నములలో బైటకు వెళ్ళిన వ్యక్తితో శీఘ్రసమాగము జరుగదు. రోగి శీఘ్రముగ రోగవిముక్తుడు కాడు. మిథున-కన్యా-ధనుః-మీనములు ద్విస్వభావ రాశులు. ఈ రాశులు అన్ని కార్యములందును శుభప్రదములు. వీటియందు యాత్ర, వ్యాపారము, సంగ్రామము, వివాహము, రాజదర్శనము, వృద్ధికరము, జయలాభకరములు; యుద్ధమునందు విజయప్రదములు, అశ్వినీనక్షత్రమునందు ఇరువది తారలు ఉండును. దానమి ఆకారము గుర్రము వలె నుండును. ఈ నక్షత్రమునందు వర్షము ప్రారంభించినచో ఒక రాత్రి వరకు గొప్ప వర్షము కలుగును. భరణియందు వర్షము ప్రారంభించినచో పదునైదు దినములవరకును. అవిచ్ఛిన్నముగా నుండును.

అగ్ని మహాపురాణమునందు నానాబలవర్ణన మను నూట ఇరువదియేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters