Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షడ్వింశోత్తర శతమో7ధ్యాయః

అథ నక్షత్ర నిర్ణయః

ఈశ్వర ఉవాచ :

వక్ష్యామ్యృక్షాత్మకం పిణ్డం శుభాశుభవివృద్దయే | యస్మినృక్షే భ##వేత్సూర్యస్తదాదౌ త్రీణి మూర్ధని. 1

ఏకం ముఖే ద్వయం నేత్రే హస్తపాదౌ చతుష్టయమ్‌ | హృదిపఞ్చ సుతే జానౌ ఆయుర్వృద్ధిం విచిన్తయేత్‌.

శిరఃస్థే తు భ##వేద్రాజ్యం పిణ్డతోవక్త్రయోగతః | నేత్రయోః కాన్తిసౌభాగ్యం హృదయే ద్రవ్యసంగ్రహః. 3

హస్తే ధృతం తస్కరత్వం గతాసురధ్వగః పదే | కుమ్భాష్టకే భాని లిఖ్య సూర్యకుమ్భ స్తు రిక్తకః. 4

అశుభః సూర్యకుమ్భః స్యాచ్ఛుభః పూర్వాదిసంస్థితః | ఫణిరాహుం ప్రవక్ష్యామి జయాజయ వివేకదమ్‌. 5

అష్టావింశాన్‌ లిఖేద్బిన్దూన్పునర్బాజ్యాస్త్రిభిస్త్రిభిః | అథ ఋక్షాణి చత్వారి రేఖస్తత్రైవ దాపయేత్‌. 6

యస్మిన్‌ ఋక్షే స్థితో రాహుస్తదృక్షం ఫణిమూర్ధని | తదాది విన్యసేద్భాని సప్తవింశక్రమేణ తు. 7

వక్త్రే సప్తగతే ఋక్షే మ్రియతే సర్వ ఆహవే | స్కన్ధే భఙ్గం విజానీయాత్సప్తభేషు చ మధ్యతః. 8

ఉదరస్థేన పూజాం చ జయశ్చైవాత్మనస్తథా | కటిదేశే స్థితే యోధ ఆహవే హరతే పరాన్‌. 9

పుచ్ఛస్థితేన కీర్తిః స్యాద్రాహుదృష్టే చ భే మృతి ః | పునరన్యం ప్రవక్ష్యామి రవి రాహుబలం తవ. 10

రవిః శుక్రో బుధశ్చైవ సోమః సౌరిర్గురుస్తథా | లోహితః సైంహికశ్చైవ హ్యేతే యామార్ధ భాగినః. 11

సౌరిం రవిం చ రాహుం చ కృత్వా యత్నేన పృష్ఠతః |

స జయేత్సైన్యసంఘాతం ద్యూతమధ్వానమాహవమ్‌. 12

పరమేశ్వరుడు పలికెను. ప్రాణుల శుభాశుభఫలజ్ఞానము కొరకు నాక్షత్రిక పిండమును గూర్చి చెప్పెదను. (ఎవరి శుభాశుభఫలములను తెలిసికొనవలెనో ఆ మనుష్యుని బొమ్మ గీసి సూర్యు డున్న నక్షత్రము మొదలు మూడు నక్షత్రములు వాని శిరస్సుపైనను, ఒకటి ముఖముపైనను, రెండు నేత్రములందును,నాలుగు చేతులుకాళ్ళమీదను, ఐదు హృదయము నందును, ఐదు మోకాళ్ళమీదను వ్రాసి ఆయుర్వృద్ధివిచారము చేయవలెను. శిరస్సుపైనున్న నక్షత్రమున యుద్ధము చేసినచో రాజ్యము లభించును. ముఖమునందలి నక్షత్రమున సుఖము, నేత్రమునందలి నక్షత్రమున సుందర సౌభాగ్యము, హృదయమునందలి నక్షత్రమున ద్రవ్యసంగ్రహము, హస్తమునందలి నక్షత్రమున చౌర్యము, పాదమునందలి నక్షత్రములందు మార్గమందే మృత్యువు- ఈ విధముగ ఫలితములు తెలియవలెను. ఎనిమిది కుంభములను పూర్వాదిదిక్కులందు ఎనిమిదింటియందును ఉంచవలెను. ఒక్కొక్క కుంభమునందు మూడేసి చోప్పున ఎనిమిది కుంభములందును ఇరువది నాలుగు నక్షత్రముల నుంచగా నక్షత్రములు మిగిలిపోవును. వీటికి 'సూర్యకుంభములు' అని పేరు. సూర్యకుంభము అశుభము. పూర్వాది దిక్కులం దున్న కుంభముల మీది నక్షత్రములు శుభములు. ఇపుడు యుద్ధమునందు జయపరాజయములు వివేకము నిచ్చు సర్పా కారరాహుచక్రముల గూర్చి చెప్పెదను. ముందుగా ఇరువది ఎనిమిది చుక్కలు పెట్టవలెను. వాటిని మూడు మూడుగా విభజించగా ఎనిమిది విభాగములు వచ్చును. వాటిపై ఇరువదినాలుగు నక్షత్రములు గుర్తించగా నాలుగు నక్షత్రములు మిగిలిపోవును. వాటిపై రేఖ గీయవలెను. సర్పాకారచక్రమేర్పడును. రాహు వున్న నక్షత్రమును పడగపై వ్రాయవలెను. ఆ నక్షత్రముతోడనే ప్రారంభించి క్రమముగా ఇరువదియేడునక్షత్రములు వ్రాయవలెను. ముఖమునందున్న ఏడు నక్షత్రములలో యద్ధము చేసినచో యుద్ధమునందు మరణము కల్గును. స్కంధమునందలి ఏడు నక్షత్రములందు యుద్ధ ము చేసినచో పరాజయము వచ్చును. పొట్టమీద నున్న ఏడు నక్షత్రములలో సమ్మానము. విజయములభించును. కటి యందలి నక్షత్రము లందు శత్రువుల హరణము జరుగును. పుచ్ఛమునందలి నక్షత్రములందు యుద్ధము చేయగా కీర్తి కలుగును. రాహుదృష్ట నక్షత్రమునందు మృత్యువు కలుగును. ఇపుడు సూర్యుడు మొదలు రాహువు వరకును గ్రహముల బలము వర్ణించెదను. రవివారమునందు మొదటిది మొదలు ఎమిదవ అర్ధప్రహరములకు వరుసగ సూర్య-శుక్ర-బుధ-సోమ-శని-గురు-కుజ-రాహువులు అధిపతులు. శని సూర్య -రాహువులను యత్నపూర్వకముగ పృష్ఠగతు లగు నట్లు చేసికొని యుద్ధము చేయువాడు సైన్యసముదాయముసై విజయము సాధించును. ద్యూత-మార్గ-యుద్ధములందు జయము పొందును.

రోహిణీచేతరాస్తిస్రో మృగః పఞ్చ స్థిరాణి హి | అశ్వినీ రేవతీ స్వాతీ ధనిష్ఠా శతతారకా.13

క్షిప్రాణి పఞ్చ భాన్యేవ యాత్రార్థీ చైవ యోజయేత్‌ |

అనురాధా హస్తమూలం మృగః పుష్యం పునర్వసుః. 14

సర్వకార్యేషు చైతాని జ్యేష్ఠా చిత్రావిశాఖయా | పూర్వాస్తిస్రో7గ్నిభరణీ మఘార్ద్రాశ్లేషా దారుణాః. 15

స్థావరేషు స్థిరం హ్యృక్షం యాత్రాయాం క్షిప్రముత్తమమ్‌ |

సౌభాగ్యార్థే మృదూన్యేవ ఉగ్రేషూగ్రం తు కారయేత్‌. 16

దారుణ దారుణం కుర్యాద్వక్ష్యే చాధోముఖాధికమ్‌ | కృత్తికా భరణ్యాశ్లేషా విశిఖా పితృనైరృతమ్‌. 17

పూర్వాత్రయమధోవక్త్రం కర్మ చాధోముఖం చరేత్‌ | ఏషు కూపతడాగాది విద్యాకర్మ భిషక్క్రియా. 18

స్థాపనం నౌకా భూపాది విధానం ఖననం తథా | రేవతీ చాశ్వినీ చిత్రాహస్తః స్వాతీ పునర్వసుః. 19

అనురాధా మృగో జ్యేష్ఠా నవవై పార్శ్వతోముఖాః | ఏషు రాజ్యాభిషేకం చ పట్టబన్ధం గజాశ్వయో. 20

ఆరామగృహప్రాసాదం ప్రాకారం క్షేత్రతోరణమ్‌ | ధ్వజచిహ్నపతాకాశ్చ సర్వానేతాంశ్ఛ కారయేత్‌. 21

ద్వాదశీ సూర్యదగ్దా తు చ న్ద్రేణౖకాదశీ తథా | భౌమేన దశమీ దగ్ధా తృతీయావై బుధేన చ. 22

షష్ఠీ చ గురుణా దగ్ధా ద్వితీయా భృగుణా తథా | సప్తమీ సూర్యపుత్రేణ త్రిపుష్కరమథో వదే. 23

రోహిణి, ఉత్తరాత్రయము, మృగశిర-స్థిరనక్షత్రములు. అశ్విని, రేవతి, స్వాతి, ధనిష్ఠ, శతభిష క్షిప్రనక్షత్రములు, యాత్రార్థి ఈ నక్షత్రములందు యాత్ర చేయవలెను. అనురాధ, హస్త, మూల, మృగశిర, పుష్య, పునర్వసునక్షత్రములు అన్ని కార్యములకు మంచిది. జ్యేష్ఠ, చిత్త, విశాఖ, పూర్వాత్రయము, కృత్తిక, భరణి, మఖ, ఆర్ద్ర, ఆశ్లేష 'దారుణ' నక్షత్రములు. స్థిరకార్యములు స్థిరనక్షత్రములందు చేయవలెను. క్షిప్ర నక్షత్రములందు యాత్ర చేయవలెను. సౌభాగ్యకర్మలను మృదునక్షత్రములందును, ఉగ్రకార్యములను ఉగ్రనక్షత్రములందును చేయవలెను. దారుణ నక్షత్రములు భయంకరకార్యములకు ఉపయోగించును. కృత్తిక,భరణి, ఆశ్లేష, విశాఖ, మఘ, మూల, పూర్వాత్రయము అధోముఖ నక్షత్రములు, వీటిలో అధోముఖ కర్మ చేయవలెను. కూపము, తటాకము, విద్యాకర్మ, చికిత్స, స్థాపనము, నౌకానిర్మాణము, కూపవిధానము, గొయ్యిత్రవ్వుట, మొదలగు పనులు ఈ అధోముఖనక్షత్రములందు చేయవలెను. రేవతి, అశ్విని, చిత్త, హస్త, స్వాతి, పునర్వసు, అనురాధ, మృగశిర, జ్యేష్ఠ తిర్యఙ్ముఖనక్షత్రములు. వీటియందు రాజ్యాభిషేకము, గజాశ్వములకు పట్టబంధనము, తోటవేయుట, గృహ-ప్రాసాదనిర్మాణము, ప్రాకారనిర్మాణము, క్షేత్రము, తోరణ-ధ్వజ-పతాకాది స్థాపనము చేయవలెను. రవివారమున ద్వాదశి,సోమవారమున ఏకాదశి, మంగళవారమున దశమి, బుధవారమున తృతీయ, గురువారమునందు షష్ఠి, శుక్రవారమునందు ద్వితీయ, శనివారమున సప్తమి దగ్ధయోగములు. ఇపుడు త్రిపుష్కరములు చెప్పెదను.

ద్వితీయా ద్వాదశీచైవ సప్తమీ వై తృతీయకా | రవిర్భౌమస్తథా సౌరిః షడేతాస్తు త్రిపుష్కరాః. 24

విశాఖా కృత్తికా చైవ హ్యుత్తరే ద్వే పునర్వసుః | పూర్వాభాద్రపదా చైవ షడేతే తు త్రిపుష్కరాః. 25

లాభో హానిర్జయో వృద్ధిః పుత్రజన్మ తథైవ చ | నష్టం భ్రష్టం వినష్టం వా తత్సర్వం త్రిగుణం భ##వేత్‌.

అశ్వినీ భరణ చైవ హ్యాశ్లేషా పుష్యమేవ చ | స్వాతిశ్చైవ విశాఖా చ శ్రవణం సప్తమం పునః. 27

ఏతాని దృఢచక్షూంషి పశ్యన్తి చ దిశో దశ | యాత్రాసు దూరగస్యాపి హ్యాగమః పుణ్యగోచరే. 28

ఆషాడే రేవతీ చిత్రాకేకరాణి పునర్వసుః | ఏషు పఞ్చసు ఋక్షేషు నిర్గతస్యాగమో భ##వేత్‌. 29

కృత్తికా రోహిణీ సౌమ్యం ఫల్గునీ చ మఘా తథా | మూలం జ్యేష్ఠనురాధా చ ధనిష్ఠా శతతారకా. 30

పూర్వభాద్రపదా చైవ చిపిటాని చ తాని హి | అధ్వానం వ్రజమానస్య పునరేవాగమోభ##వేత్‌. 31

హస్తఉత్తరభాద్రశ్చ ఆర్ద్రాషాఢా తథైవ చ | నష్టార్థాశ్చైవ దృశ్యన్తే సంగ్రామో నైవ విద్యతే. 32

పునర్వక్ష్యామి గణ్డాన్తమృక్షమధ్యే యథాస్తితమ్‌ | రేవత్యన్తే చతుర్నాడీ అశ్యిన్యాదిచతుష్టయమ్‌. 33

ఉభయోర్యామమాత్రం తు వర్జయేత్తత్ప్రయత్నతః | ఆశ్లేషాన్తే మఘాదౌ తు ఘటికానాం చతుష్టయమ్‌. 34

ద్వితీయం గణ్డమాఖ్యాతం తృతీయం భైరవి శృణు | జ్యేష్ఠామూలభయోర్మధ్యే ఉగ్రరూపం తు యామకమ్‌.

న కుర్యాచ్ఛుభకర్మాణి యదీచ్ఛేదాత్మజీవితమ్‌ | దారకే జాతకాలే చ మ్రియేతే పితృమాతరౌ. 36

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే నక్షత్రనిర్ణయో నామ షడ్వింశత్యధికశతతమో7ధ్యాయః.

ద్వితీయ, ద్వాదశి, సప్తములు, రవి మంగళ శనివారములు ఇవి త్రిపుష్కరములు. విశాఖా-కృత్తికా-ఉత్తర ద్వయ-పునర్వసు-పూర్వభాద్రలు కూడ త్రిపుష్కరములు, అనగా పైన చెప్పిన వారములు, తిథులు, నక్షత్రములు కలిపినచో త్రిపుష్కరయోగము. ఈ యోగము నందు లాభము, హాని, విజయము, వృద్ధి, పుత్రజన్మ, వస్తునాశము- ఇవి త్రిగుణము లగును. అశ్విని, భరణి, ఆశ్లేష, పుష్యమి, స్వాతి, విశాఖ, శ్రవణము, పునర్వసు, దృఢనేత్రములు. ఇవి దిక్కులను చూడగలవు. వీటిలో పోయిన వస్తువు, యాత్రకు వెళ్ళిన మనుష్యుడు విశేషపుణ్యోదయముచేతనే తిరిగి వచ్చును. రెండు ఆషాఢలు, రేవతి, చిత్త, పునర్వసు 'కేకర' నక్షత్రములు. వీటిలో పోయిన వస్తువు ఆలస్యముగా దొరకును. కృత్తిక, మృగశిర, పూర్వాఫల్గుని, మఘ, మూల, జ్యేష్ఠ, అనూరాధ, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర చిపిటాక్షములు. వీటిలో పోయిన వస్తువు, యాత్రకై వెళ్ళిన వ్యక్తి కొలది ఆలస్యముగ తిరిగి వచ్చును. హస్త, ఉత్తరాభాద్ర, ఆర్ద్ర, పూర్వషాఢ, అన్ధాక్షములు, వీటిలో పోయిన వస్తువు శీఘ్రముగనే లభించును. యుద్ధమేమియు చేయనవసరముండదు. ఇపుడు నక్షత్రముల గండాంతమును చెప్పెదను. రేవతి చివరి నాలుగు దండములుగండములు, అశ్విని ప్రారంభమునందలి నాలుగు దండములు గండాంతరములు. ఈ నక్షత్రముల ఒక జాము సమయమును శుభకార్యములందు ప్రయత్నపూర్వకముగ త్యజించవలెను. అశ్లేష చివర మఘ ప్రారంభమున నాలుగేసి దండములు రెండవ గండాంతము. భైరవీ! ఇపుడు తృతీయ గండాంతమును వినుము. జ్యేష్ఠా-మూలల మధ్యనున్న ఒక జాము చాల భయంకరమైనది. జీవించనిచ్ఛ గలవాడు ఈ సమయమునందు ఏ శుభకార్యము చేయరాదు. ఈ సమయమున శిశువు పుట్టినచో తలిదండ్రులు మరణింతురు.

అగ్నిమహాపురాణమునందు నక్షత్రనిర్ణయ మను నూటఇరువదియారవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters