Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టాదశోత్తర శతతమోధ్యాయః

అథ భారతవర్ష వర్ణనమ్‌

అగ్నిరువాచ :

ఉత్తరం యత్సముద్రస్య హిమద్రేశ్చైవ దక్షిణమ్‌ | వర్షం తద్భారతం నామ నవసాహస్ర విస్తృతమ్‌. 1

కర్మభూమిరియం స్వర్గమపవర్గం చ గచ్ఛతామ్‌ | మహేన్ద్రో మలయః సహ్యః శుక్తిమాన్‌ హేమపర్వతః. 2

విన్ధ్యశ్చ పారియాత్రశ్చ సప్తాత్ర కులపర్వతాః | ఇన్ద్రద్వీపః కసేరుశ్చ తామ్రవర్ణో గభ స్తిమాన్‌. 3

నాగద్వీపస్తథా సౌమ్యోగాన్దర్వస్త్వథ వారుణః | అయం తు నవమస్తేషాం ద్వీపః సాగర సంవృతః. 4

యోజనానాం సహస్రాణి ద్వీపో7యం దక్షిణోత్తరాత్‌ | నవ భేదా భారతస్య మధ్యభేదే7థ పూర్వతః. 5

కిరాతా యవనాశ్చాపి బ్రాహ్మణాద్యాశ్ఛ మధ్యతః | వేదస్మృతిముఖా నద్యః పారియాత్రోద్భవాస్తథా. 6

విన్ద్యాచ్చ నర్మదాద్యాః స్యుః సహ్యాత్తాపీ పయోష్ణికా | గోదావరీ భీమరథీ కృష్ణవేణాదికా స్తథా. 7

మలయాత్కృతమాలాద్యాస్త్రిసామాద్యా మహేన్ద్రజాః | కుమారాద్యః శుక్తిమతో హిమాద్రేశ్చన్ద్రభాగకా. 8

పశ్చిమే కురుషాఞ్తాల మధ్యదేశాదయః స్థితాః.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే భారతవర్షవర్ణనం నామాష్టాదశాధిక శతతమో7ధ్యాయః

అగ్నిదేవుడు పలికెను : సముద్రమునకు ఉత్తరమునను, హిమాలయమునకు దక్షిణమునను ఉన్న వర్షము ''భారతవర్షము''. దాని విస్తారము తొమ్మిది వేల యోజనములు. స్వర్గాపవర్గములు పొంద గోరువారికి ఇది కర్మభూమి. మహేంద్ర-మలయ-సహ్య-శుక్తిమత్‌ - హిమాలయ- వింధ్య-పారియాత్రములు ఈ వర్షమునందు సప్తకులపర్వతములు. ఇంద్రద్వీప-కసేరు-తామ్రవర్ణ-గభస్తిమత్‌-నాగద్వీప-సౌమ్య-గాంధర్వ-వారుణములు ఎనిమిది ద్వీపములు. సముద్రముచే చుట్టబడి యున్న భారతవర్షము తొమ్మిదవ ద్వీపము. భారతద్వీపము ఉత్తరము నుండి దక్షిణమునకు వేలకొలది యోజనములు పొడవైనది. భారతమునందు పైన చెప్పిన తొమ్మిది భాగములున్నవి. భారతము మధ్యమునం దున్నది. దానికి తూర్పున కిరాతులు, పశ్చిమమున యవనులు ఉందురు. మధ్యభాగమున బ్రాహ్మణాదివర్ణములవా రుందురు. వేద-న్మృత్యాది నదులు పారియాత్రమునుండియు, నర్మదాదులు వింధ్యాచలమునుండియు, తపీ-పయోష్ణీ-గోదావరీ-భీమరథీ- కృష్మవేణీనదాదులు సహ్యాద్రినుండియు, కృతమాలాదులు మలయమునుండియు, త్రిసామాదులు మహేంద్రపర్వతము నుండియు, కుమార్యాదినదులు శుక్తిమత్పర్వతమునుండియు, చంద్రభాగాదులు హిమాలయమునుండియు ఆవిర్భవించినవి. భారతమునకు పశ్చిమమున కురు-పాంచాల-మధ్యదేశాదు లున్నవి.

అగ్నిమహాపురాణమునందు భారతవర్షవర్ణనమను నూట పదునెనిమిదివ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters