Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అధ అష్టాధికశతతమోధ్యాయః

అథ భువనకోశనిరూపణమ్‌

అగ్నిరువాచ :

జమ్బూప్లక్షాహ్వ¸° ద్వీపౌ శాల్మలిశ్చాపరో మహాన్‌ | కుశఃక్రౌఞ్చస్తథాశాకః పుష్కరశ్చేతి సప్తమః. 1

ఏతే ద్వీపాః సముద్రైస్తు సప్త సప్తభిరావృతాః | లవణక్షుసురాసర్పిర్దధిదుగ్ధజలైః సమమ్‌. 2

జమ్బూద్వీపో ద్వీపమధ్యే తన్మధ్యే మేరురుచ్ఛ్రితః | చతురశీతి సాహస్రో భూయిష్ఠః షోడశ్రాదిరాట్‌. 3

ద్వాత్రింశన్మూర్ధ్ని విస్తారత్షోడశాధఃసహస్రవాన్‌ | భూయస్తస్యాస్య శైలోసౌ కర్ణికాకారసంస్థితః. 4

హిమవాన్‌ హేమకూటశ్చ నిషధశ్చాస్య దక్షిణ | నీలః శ్వేతశ్చ శృఙ్గీ చవ ఉత్తరే వర్షపర్వతాః. 5

లక్షప్రమాణౌ ద్వౌ మధ్యే దశ హీనస్తథాపరే | సహస్రద్వితయోచ్ఛ్రా యాస్తావద్విస్తారిణశ్చ తే. 6

భారతం ప్రథమం వర్షం తతః కింపురుషం స్మృతమ్‌ | హరివర్షం తథైవాన్యన్మేరోర్దక్షిణతో ద్విజ. 7

రమ్యకం చోత్తరే వర్షం తథై వాన్యద్దిరణ్యకమ్‌ | ఉత్తరాః కురవశ్చైవ యథా వై భారతం తథా. 8

నవసాహస్రమేకైకమతేషాం మునిసత్తమ | ఇలావృతం చ తన్మధ్యే సౌవర్ణో మేరురుచ్ఛ్రితః. 9

మేరోశ్చతుర్దిశం తత్ర నవసాహస్రవిస్తృతమ్‌ | ఇలావృతం మహాభాగ చత్వారశ్చాత్ర పర్వతాః. 10

విష్కమ్భారచితా మేరోరార్యజనాయుతవి స్తృతాః | పూర్వేణ మన్దరో నామ దక్షిణ గన్ధమాదనః. 11

విపులః పశ్చిమే పార్శ్వే సుపార్శ్వశ్చోత్తరే స్మృతః | కదమ్బస్తేషు జమ్బూశ్చ పిప్పలో వట ఏవ చ. 12

ఏకాదశ శతాయామాః పాదఎ్జా గిరికేతవః | జమ్బూద్వీపేతి సంజ్ఞాస్యాత్ఫలం జమ్బ్వా గజోపమమ్‌. 13

జమ్భూనదీరసేనాస్యాస్తిదం జామ్బూనదం పరమ్‌ | సుపార్శ్వః పూర్వతోమేరోః కేతుమాలస్తు పఞ్చమే.

వనం చైత్రరథం పూర్వే దక్షిణ గన్దమాదనః | వైభ్రాజం పశ్చిమే సౌమ్యే నన్దనం చ సరాంస్యథ. 15

అరుణోదం మహాభద్రం శీతోదం మానసం తధా | సితామ్భశ్చక్రముఞ్జాద్యాః పూర్వతః కేశరాచలాః. 16

దక్షిణ7ద్రేస్త్రికూటాద్యాః శిశివాసముఖా జలే | శఙ్ఖకూటాదయః సౌమ్యే మేరౌ చ బ్రహ్మణః పురీ. 17

అగ్ని దేవుడు పలికెను. వసిష్ఠా! జంబూ-ప్లక్ష-శాల్మలి-కుశ-క్రౌంచ-శాక-పుష్కరములనెడు ఏడు ద్వీపములు నలుమూలల లవణ జల-ఇక్షురస-మద్య-ఘృత-దధి-క్షీర-మధుర జలములు గల ఏడు సముద్రములచే చుట్టబడి యున్నవి. జంబూ ద్వీపము అన్ని ద్వీపముల మధ్యనున్నది. దాని మధ్య ఎత్తైన మేరు పర్వత మున్నది. దీని విస్తారము ఎనుబది నాల్గువేల యోజనములు. ఈ పర్వతరాజము పదహారు వేల యోజనములు భూమిలోదిగి యున్నది. పై భాగమునందు దీని విస్తారము ముప్పదిరెండు వేల యోజనములు. క్రింద దీని విస్తారము పదునారువేల యోజనములు, ఇట్లు ఈ పర్వతము ఈ పృథ్వీరూపకమలమునకు కర్ణిక వలె నున్నది. దీని దక్షిణమున హిమవత్‌-హేమకూట-నిషధ పర్వతములును, ఉత్తరమున నీల-శ్వేత-శృంగి పర్వతములును వర్ష పర్వతములుగా నున్నవి. మధ్య నున్న రెండు పర్వతములు (నిషధ-నీలములు) ఒక్కొక లక్ష యోజనముల వరకు వ్యాపించియున్నవి. ఇతర పర్వతములు వాటికంటె పదేసి యోజనములు తక్కువ. అవి అన్నియు రెండేసి వేల యోజనములు ఉన్నతములు. అంతియే వెడల్పు, ద్విజశ్రేష్ఠా! దక్షిణవర్షములలో మొదటిది భారతవర్షము, రెండవది కింపురుషవర్షము. మూడవది హరివర్షము, ఉత్తరము వైపు రమ్యక-హిరణ్మయ-ఉత్తర కురువర్షము లున్నవి. అవి భారతవర్షముతో సమానములు మునివరా! వీటిలో ఒక్కొక్క దాని విస్తారము తొమ్మిదేసి వేల యోజనములు. వీటి అన్నింటి మధ్య ఇలావృతవర్షమున్నది. దాని యందు మేరు పర్వతము నిలచి యున్నది. ఇలావృతవర్షము సుమేరు పర్వతమునకు నలువైపుల తొమ్మిదేసివేల యోజనములు వరకును విస్తరించియున్నది. దీని నాలుగు వైపుల నాలుగు పర్వతము లున్నవి. ఇవి సుమేరు పర్వతమును నిలబెట్టుటకై ఈశ్వరుడేర్పరచిన ఆధారస్తంభములా అన్నట్లు ఉన్నవి. వీటిలో మందరాచలము తూర్పునను, గంధమాదనము దక్షిణమునను, విపులము పశ్చిమ పార్శ్వమునందును, సుపార్శ్వము ఉత్తరమునందును ఉన్నవి. ఈ పర్వతముల విస్తారము పదేసి వేల యోజనములు, ఈ పర్వతములపై నున్న పదకొండేసి యోజములు విస్తారముగల కదంబ-జంబూ-అశ్వత్థ-వటవృక్షములు ధ్వజములవలె ప్రకాశించుచున్నవి. వీటిలో జంబూవృక్షము జంఊద్వీపమను పేరునకు కారణము. దీని పండ్లు ఏనుగంత ప్రమాణములో నుండును. వీటి రసము జంబూనదిగా ప్రవహించుచున్నది. దీని నుండియే చాల ఉత్తమమైన జంబూనదము (బంగారము) ఉత్పన్నమగుచున్నది. మేరువునకు తూర్పున భద్రాశ్వవర్షము పశ్చిమమున, కేతు మాలము ఉన్నది. దానికి తూర్పున చైత్రరథము దక్షిణమున గంధమాదనము, పశ్చిమమున వైభ్రాజము, ఉత్తరమున నందనము అను వనములు ఉన్నవి. అట్లే దానికి పూర్వాది దిక్కులందు అరుణోదయ-మహాభద్ర-శీతోదమానసములను సరస్సు లున్నవి. సితాంభస్సు, చక్రముంజము మొదలగునవి (భూపద్మ కర్ణికయగు) మేరువుయొక్క పూర్వదిశయందున్న కేసరములవంటి పర్వతములు, దక్షిణము త్రికూటాదులు, పశ్చిమమున శిఖివాసాదులు ఉత్తరమున శంఖ కూటాదులను కేసరపర్వతములు. సుమేరువు బ్రహ్మపురి యున్నది.

చతుర్దశసహస్రాణి యోజనానాం చ దిక్షు చ | ఇన్ద్రాదిలోకపాలానాం సమన్తాద్ర్బహ్మణః. పురః. 18

విష్ణుపాదాత్ల్పావయిత్వా చన్ద్రం స్వర్గాత్పతన్త్యపి, | పూర్వేణ శీతా భద్రాశ్వాచ్ఛైలాచ్ఛైలాద్గతార్ణవమ్‌. 19

తథైవాలకనన్దాపి దక్షిణనైవ భారతమ్‌ | ప్రయాతి సాగరం కృత్వా సప్తభేదాథ పశ్చిమమ్‌. 20

అబ్దిం చ వక్షుః సౌమ్యాబ్దిం భద్రోత్తరకురూనపి | ఆనీలనిషధాయామౌ మాల్యవద్గన్దమాదనౌ. 21

తయోర్మధ్యగతో మేరుః కర్ణికాకారసంస్థితః | భారతాః కేతుమాలాశ్చ భద్రాశ్వాః కురువస్తథా. 22

పత్రాణి లోకపద్మస్య మర్యాదాశైలబాహ్యతః | జఠరో దేవకూటశ్చ మర్యాదాపర్వతావుభౌ. 23

తౌ దక్షిణోత్తరాయామావానీలనిషధాయతౌ | గన్ధమాదన కైలాసౌ పూర్వచ్చాయతావుభౌ. 24

అశీతియోజనాయామా వర్ణవాన్తర్వ్యవస్థితౌ | నిషధః పారియాత్రశ్చ మర్యాదాపర్వతావుభౌ. 25

మేరోః పశ్చిమదిగ్భాగే యథా పూర్వే తథా స్థితౌ | త్రిశృఙ్గో రుధిరశ్చైవ ఉత్తరౌ వర్షపర్వతౌ. 26

పూర్వపశ్చాయతావేతా వర్ణవాన్తర్వ్యవస్థితౌ| జాఠరాద్యాశ్చ మర్యాదాశైలా మేరోశ్చతుర్దిశమ్‌. 27

కేసరాదిషు యా ద్రౌణ్యస్తాసు సన్తి పురాణి హి | లక్ష్మీవిష్ణ్వగ్ని సూర్యాదిదేవానాం మునిసత్తమ. 28

భౌమానాం స్వర్గధర్మాణాం నపాపాస్తత్రయాన్తి చ | భద్రాశ్వే7స్తి హయగ్రీవో వరాహః కేతుమాలకే. 29

భారతే కూర్మరూపీ చ మత్స్య రూపః కురుష్వపి | విశ్వరూపేణ సర్వత్ర పూజ్యతే భగవాన్‌ హరిః. 30

కిమ్పురుషాద్యష్టసుక్షుద్భీతి శోకాదికం న చ | చతుర్వింశతి సాహస్రం ప్రజాజీవన్త్యనామయాః. 31

కృతాదికల్పనా నాస్తి భౌమాన్యమ్భాంసి నామ్ముదాః | సర్వేష్వేతేషు వర్షేషు సప్త సప్త కులాచలాః. 32

నద్యశ్చ శతశ##స్తేభ్యస్తీర్థభూతాః ప్రజజ్ఞిరే | భారతేయాని తీర్థాని తాని తీర్థాని వచ్మి తే. 33

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే భువనకోశనిరూపణం నామాష్టాధిక శతతమో7ధ్యాయః.

దాని విస్తారము పదునాలుగువేల యోజనములు. బ్రహ్మపురికి నాలుగు వైపుల అన్ని దిక్కులందును ఇంద్రాది లోకపాలకుల నగరము లున్నవి. ఈ బ్రహ్మపురినుండియే, విష్ణుపాదోద్గత యగు గంగానది చంద్రమండలమును నడుపుచు స్వర్గమునుండి క్రిందికి దిగుచున్నది. తూర్పున శీతానది భద్రాశ్వపర్వతమునుండి బయల్వెడలి ఒక పర్వతమునుండి మరొక పర్వతమునకు వెళ్లుచు సముద్రములో కలియుచున్నది. ఇట్లే అలకనంద కూడ దక్షిణము వైపు భారతవర్షమునకు వచ్ఛి, ఏడు భాగములలో విభక్త యై సముద్రములో కలిసి పోవుచున్నది. వక్షునది వశ్చిమసముద్రమునందును, భద్ర ఉత్తరకురువర్షమును దాని సముద్రమునందును కలియుచున్నది. మాల్యవత్‌-గంధమాదనపర్వతములు ఉత్తర దక్షిణముల వైపు నీలాచల-నిషధప్రవతముల వరకును విస్తరించి యున్నవి. ఆ రెండింటి మధ్య కర్ణికాకార మైన మేరుపర్వత మున్నది.మర్యాదా పర్వతము బైట నున్న భారత-కేతుమాల-భద్రాశ్వ-ఉత్తరకువర్షములు ఈ లోకపద్మము దళములు, జఠరదేవ కూటములు మర్యాదాపర్వతములు, ఇవి ఉత్తర-దక్షిణముల వైపు నీలనిషధపర్వతముల వరకును వ్యాపించియున్నవి. పూర్వ-పశ్చిమముల వైపు విస్త్రతములైన గంధమాదన-కై లాసములు, ఎనుబదివేల యోజనములు విస్తృత మైనవి. తూర్పునందు వలె పశ్చిమము వైపు గూడ నిషధపారియాత్రము లను రెండు మర్యాదాపర్వతము లున్నవి. వాటి మూలములు సముద్రము లోపల చొచ్చుకొని యున్నవి. ఉత్తరము వైపున త్రిశృంగము, రుధిరము, వర్షపర్వతములు పూర్వపశ్చిమ సముద్రములందు చొచ్చుకొని యున్నవి. ఈ విధముగ జఠరము మొదలగు మర్యాదాపర్వతములు మేరుపర్వతమునకు నలువైపుల ప్రకాశించుచున్నవి. మునిశ్రేష్ఠా! కేసరపర్వతములమధ్య శ్రేణులలో లక్ష్మీ-విష్ణు-అగ్ని-సూర్యాదిదేవతల నగరము లున్నవి. ఇవి భూలోకసంబద్ధములే యైనను స్వర్గముతో సమాన మైనవి. పాపాత్ములు ఈ నగరములలో నివసించజాలరు. శ్రీమహావిష్ణువు భద్రాశ్వవర్షమునందు హయగ్రీవరూపమునను, కేతుమాలవర్షమునందు వరాహరూపమునను, భారతవర్షమునందు కూర్మరూపమును, ఉత్తరకురువర్షమునందు మత్స్యరూపముననునివాసము చేయచున్నాడు. శ్రీమహావిష్ణువు విశ్వరూపముతో సర్వత్ర పూజింపబడుచున్నాడు. కింపురుషాదివర్షములు ఎనిమిదింటియందును ఆకలి భయము శోకము మొదలగునవి ఏమియు ఉండవు. అచటి ప్రజలు ఇరువదినాల్గువేల సంవత్సరముల పాటు రోగశోకాదు లేవియులేకుండ జీవనము గడుపుచుందురు. అచట కృతత్రేతాదికల్పన ఉండదు. వర్షములు కురియవు. కేవలము పార్థివజలమే లభ్యమగును. ఈ అన్నివర్షములందును ఏడేసి కులపర్వతము లున్నవి. వాటినుండి వందలకొలది తీర్థరూపము లగు నదులు ప్రవహించుచున్నవి. ఇపుడు భారతపర్షమునందున్న తీర్థములను గూర్చి చెప్పెదను.

అగ్ని మహాపురాణమునందు భువనకోశనిరూపణ మను నూటఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters