Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతురు త్తర శతతమో7ధ్యాయః.

అథ ప్రాసాదలక్షణమ్‌.

ఈశ్వర ఉవాచ :

వక్ష్యే ప్రాసాదసామాన్యలక్షణం తే శిఖిధ్వజ | చతుర్భాగే కృతే క్షేత్రే భిత్తేర్భాగేన విస్తరాత్‌. 1

అద్రిభాగేన గర్భః స్యాత్పిణ్డికా పాదవిస్తరాత్‌ | పఞ్చభాగీకృతే క్షేత్రే హ్యన్తర్భాగే తు పిణ్డికా. 2

సుషిరం భాగవిస్తీర్ణం భిత్తయో భాగవిస్తరాత్‌ | భాగౌ ద్వౌ మధ్యమే గర్బే జ్యేష్ఠభాగద్వయేన తు. 3

త్రిభిస్తు కలశీ గర్భః శేషో భిత్తిరితి క్వచిత్‌ | షోడా భ##క్తే7థవా క్షేత్రే భిత్తిర్భాగైకవిస్తరాత్‌. 4

గర్భో భాగేన విస్తీర్ణో భాగద్వయేన పిణ్డికా | విస్తారాద్ద్విగుణో వాపి సపాదద్విగుణో7పి వా. 5

అర్ధార్ధద్విగుణో వాపి త్రిగుణః క్వచిదుచ్ఛ్రయః | జగతీవిస్తరార్దేన త్రిభాగేన క్వచిద్భవేత్‌. 6

నేమిః పాదోనవిస్తీర్ణా ప్రాసాదస్య సమనత్తః | పరిధిస్త్ర్యంశకో మధ్యే రథకాంస్తత్ర కారయేత్‌. 7

చాముణ్డం భైరవం తేషు నాట్యేశం చ నివేశ##యేత్‌ | ప్రాసాదాద్యేన దేవానమష్టౌ వా చతురో7పి వా. 8

ప్రదక్షిణావహాః కుర్యాత్ప్రాసాదాదిషు వా సవా | ఆదిత్యాః పూర్వతః స్థాప్యాః స్కన్దో7గ్నిర్వాయుగోచరే.

ఏవం యమాదయో న్యస్యాః స్వస్యాం స్వస్యాం దిశి స్థితాః | చతుర్థా శిఖరం కృత్వా శుకనాసా ద్విభాగికా.

తృతీయో వేదికా త్వగ్నేః స కణ్ఠోమలసారకః | వైరాజః పుష్పకశ్చాన్యః కైలాసో మణికస్తథా. 11

త్రివిష్టపం చ పఞ్చైవ మేరుమూర్ధని సంస్థితాః | చతురస్రస్తు తత్రాద్యో ద్వితీయో7పి #9; తదాయతః. 12

వృత్తో వృత్తాయతశ్చాన్యో హ్యష్టాస్రశ్చాపి పఞ్చమః | ఏకైకో నవధా భేదైశ్చత్వారింశచ్చ పఞ్చ చ. 13

పరమేశ్వరుడు పలికెను : మయూరధ్వజా! ఇపుడు ప్రాసాదమాన్యలక్షణము చెప్పెదను. చతురశ్రక్షేత్రమును నాలుగు భాగములు చేయగా, గోడల విస్తారము ఒక భాగ ముండవలెను. మధ్యభాగము గర్భము. ఒక భాగమున పిండిక ఉండవలెను. ఐదు భాగముల క్షేత్రము లోపలి భాగమున పిండిక ఉండవలెను. ఒక భాగము విస్తారము కాళీగా ఉండవలెను. ఒక భాగము విస్తారము గోడలకొరకు ఉపయోగించవలెను. మధ్యమగర్భమునందు రెండు భాగములు, జ్యేష్ఠగర్భమునందు కూడ రెండు భాగములు ఉండవలెను. కాని-మూడుభాగములలో కనిష్ఠగర్భము, మిగిలిన ఎనిమిదవ భాగము గోడలు అను పద్ధతి కూడ ఉన్నది. క్షేత్రమును ఆరు భాగములుగ విభజించినపుడు ఒక భాగము విస్తారము గర్భము కొరకును, రెండు భాగములు పిండికొరకును వినియోగింపబడును. గోడల ఎత్తు వెడల్పుకంటె రెట్టింపు గాని, రెండును పావును అధికము గాని, రెండున్నర రెట్లుగాని, మూడు రెట్లు గాని ఉండు పద్ధతి కూడ కనపడు చున్నది. కొన్నిచోట్ల ప్రాసాదముచుట్టు గోడల సగము లేదా మూడు వంతుల వైశాల్యము గల జగతి నాల్గవ వంతు విస్తారము గల నేమి కానపచ్చు చున్నది. మధ్యయందు మూడవ వంతు పరిధి ఉండును. అచట రథము నిర్మించి దానిపై చాముండభైరవుని, నాట్యేశుని స్థాపించవలెను. ప్రాసాదము సగము విస్తారములో నాల్గు వైపులందును, వెలుపల, దేవతల కొరకై, ఎనిమిది లేదా నాలుగు పరిక్రమలు ఏర్పరుపవలెను. ప్రాసాదాదులందు వీటి నిర్మాణము ఇచ్ఛాధీనము. పూర్వదిక్కునందు ఆదిత్యులను, వాయవ్యమున స్కంద-అగ్నులను, యమాదిదేవతలను వారి వారి దిక్కులందును స్థాపించవలెను. శిఖరమును నాలుగు భాగములుగ చేయగా క్రింది రెండు భాగములకు 'శుకనాసిక' అనిపేరు. మూడవ భాగమున వేది ప్రతిష్ఠ. దాని ముందుభాగము 'అమలసారము' అని ప్రసిద్ధ మైన కంఠము. మేరుశిఖరముపై వైరాజము, పుష్పకము, కైలాసము, మణికము, త్రివిష్టపము అను ఐదు ప్రాసాదములు మాత్రమే ఉన్నవి. వీటిలో మొదటి దైన వైరాజము చతురస్రము. పుష్పకము చతురస్రాయతము. కైలాసము వృత్తాకారము. మణికము వృత్తాయతము. త్రివిష్టపము అష్టకోణాకారము. వీటిలో ఒక్కొక్క దానికి తొమ్మిదేసి భేదము లుండుటచే మొత్తము నలుబదియైదు భేదము లగును.

ప్రాసాదః ప్రథమో మేరుర్ద్వితీయో మన్దరస్తథా | విమానం చ తథా భద్రః సర్వతోభద్ర ఏవ చ. 14

చరుకో నన్దికో నన్దిర్వర్దమానస్తథాపరః | శ్రీవత్స శ్చేతి వై రాజాన్వవాయే చ సముత్థితాః. 15

వలభీగృహరాజశ్చ శాలాగృహం చ మన్దిరమ్‌ | విశాలాశ్చ సమో బ్రహ్మమన్దిరం భువనం తథా. 16

ప్రభవః శిబికా వేశ్మ నవైతే పుష్పకోద్భవాః | వలయో దున్దుభిః పద్మో మహాపద్మక ఏవ చ. 17

వర్ధనీ వాన్య ఉష్ణీషః శఙ్ఖశ్చ కలశస్తథా | ఖవృక్షశ్చ తథాప్యేతే వృత్తాః కైలాససంభవాః. 18

గజో7థ వృషభో హంసో గరుత్మానృక్షనాయకః | భూషణో భూధరశ్చాన్యే శ్రీజయః పృథివీధరః. 19

వృత్తాయతాత్సముద్భూతా నవైతే మణికాహ్వయాత్‌ | వజ్రం చక్రం తథా చాన్యత్స్వస్తికం వజ్రస్వస్తికమ్‌. 20

చిత్రం స్వస్తకఖడ్గం చ గదా శ్రీకణ్ఠ ఏవ చ | విజయో నామతశ్చైతే త్రివిష్టపసముద్భవాః. 21

నగరాణామిమాః సంజ్ఞా లాటాదీనామిమాస్తథా | గ్రీవార్ధేనోన్నతం చూలం పృథులం చ విభాగతః. 22

అ (39)

దశధా వేదికాం కృత్వా పఞ్చభిః స్కన్దవిస్తరః | త్రిభిః కణ్ఠం తు కర్తవ్యం చతుర్భిస్తు ప్రచణ్డకమ్‌. 23

దిక్షు ద్వారాణి కార్యాణి న విదిక్షు కదాచన | పిణ్డికా కోణవి స్తీర్ణా మధ్యమాన్తా హ్యుదాహృతా. 24

మేరువు, మందరము, విమానము, భద్రము, సర్వతోభద్రము, రుచకము, నందకము, వర్ధమానము, నంది, శ్రీవత్సము అను తొమ్మిది ప్రాసాదములు వైరాజకులమునకు సంబంధించినవి. వలభి, గృహరాజము, శాలాగృహము, మందిరము, విశాలచమసము, బ్రహ్మమందిరము, భువనము, ప్రభవము, శివికావేశ్మ అను తొమ్మిది ప్రాసాదములు పుష్పకకులమునకు సంబంధించినవి. వలయము, దుందుభి, పద్మము, మహాపద్మము, వర్ధని, ఉష్ణీషము, శంఖము, కలశము, ఖవృక్షము అను తొమ్మిది వృత్తాకారప్రాసాదములు కైలాసకులమునందుత్పన్న మైనవి. గజము, వృషభము, హంసము, గరుత్మంతము, ఋక్షనాయకము, భూషణము, భూధరము, శ్రీజయము, పృథీధరము అను తొమ్మిది వృత్తాయతప్రాసాదములు ''మణిక'' ము నుండి ఆవిర్భవించినవి. వజ్రము, చక్రము, స్వస్తికము, వజ్రస్వస్తికము, చిత్రము, స్వస్తికఖడ్గము, గద, శ్రీకంఠము, విజయము అను తొమ్మిది ప్రాసాదములు ''త్రివిష్టప'' ము నుండి ఆవిర్భవించినవి. నగరములకు కూడ ఇవే పేర్లు. లాటాదులకు కూడ ఈ సంజ్ఞలే. చూలము శిఖరకంఠప్రమాణములో సగ ముండవలెను. దాని లావు కంఠము లావులో మూడవ వంతు ఉండవలెను. వేదిని పది భాగములు చేసి ఐదు భాగములతో స్కంధవిస్తారమును, మూడు భాగములతో కంఠమును, నాలుగు భాగములతో దాని అండమును నిర్మించవలెను. ద్వారములు పూర్వాదిదిక్కులందు ఉంచవలెను గాని విదిశలయం దుంచరాదు. పిండికా విస్తారము కోణమువరకును వెళ్ళవలెను. మధ్యభాగము దగ్గర దాని సమాప్తి కావలెను.

క్వచిత్పఞ్చమభాగేన మహతాం గర్భపాదతః | ఉచ్ఛ్రాయా ద్విగుణాస్తేషామన్యథా వా నిగద్యతే. 15

షష్ట్యధికాత్సమారభ్య అఙ్గులానాం శతాదిహ | ఉత్తమాన్యపి చత్వారి ద్వారాణి దశహానితః. 16

త్రీణ్యవ మధ్యమాని స్యుస్త్రీణ్యవ కనీయాంస్యధః | ఉచ్ఛ్రాయార్ధేన విస్తారో హ్యుచ్ఛ్రాయో7భ్యధిక స్త్రిధా.

చతుర్భిరష్టభిర్వాపి దశభిరఙ్గలైస్తతః | ఉచ్ఛ్రాయాత్పాదవిస్తీర్ణాం విశాఖాస్తదుదుమ్బరే. 28

విస్తరార్ధేన బాహుల్యం సర్వేషామేవ కీర్తితమ్‌ | ద్విపఞ్చసప్తనవభిః శాఖాభిర్ద్వారమిష్టదమ్‌. 29

అధఃశాఖాచతుర్థాంశే ప్రతీహారౌ నివేశ##యేత్‌ | మిథునైః పాదవర్ణాభిః శాఖాశేషం విభూషయేత్‌. 30

స్తమ్బవిద్ధే భృత్యతా స్యాద్వృక్షవిద్ధే త్వభూతితా |కూపవిద్దే భయం ద్వారే క్షేత్రవిద్ధే ధనక్షయః. 31

ప్రాసాదగృహశాలాదిమార్గవిద్ధేషు బన్ధనమ్‌ | సభావిద్ధేన దారిద్ర్యం వర్ణవిద్ధే నిరాకృతిః. 32

ఉలూఖలేన దారిద్ర్యం శిలావిద్ధేన శత్రుతా | ఛాయవిద్ధేన దారిద్య్రం వేధదోషో న జాయతే. 33

భేదాదుత్పాటనాద్వాపి తథా ప్రాకారలక్షణాత్‌ | సీమాయా ద్విగుణత్యాగాద్వేధదోషోన జాయతే. 34

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సామాన్యప్రాసాదలక్షణం నామ చతురధికశతతమో7

ధ్యాయః.

కొన్నింట ద్వారముల ఎత్తు గర్భము నాల్గవ భాగముకంటె గాని, ఐదవ భాగముకంటె గాని రెట్టింపు ఉండు నట్లు ఉంచవలెను. లేదా మరొకవిధముగ కూడ చేయవచ్చును. నూట అరవై అంగుళముల ఎత్తునుండి పదేసి అంగుళములు తగ్గించుచు నిర్మించిన నాలుగు ద్వారములు ఉత్తమము లని చెప్పబడినవి. నూట ఇరువది, నూటపది, నూరు అంగుళముల ఎత్తు ద్వారములు మధ్యమములు. తొంబది, ఎనుబది, డెబ్బది అంగుళముల ఎత్తు ద్వారములు కనిష్ఠములు. ద్వారము వెడల్పు పొడవులో సగ ముండవలెను. ఎత్తు చెప్పినదానికంటె, మూడు, నాలుగు, ఎనిమిది లేదా పది అంగుళములు కూడ ఉన్నను శుభప్రదమే. విస్తారము ఎత్తులో నాల్గవ వంతు ఉండవలెను. ద్వారశాఖల (ప్రక్కకమ్ముల) వెడల్పు లేదా మొత్తము అన్ని కమ్ముల వెడల్పు ద్వారము వెడల్పులో నాల్గవవంతు ఉండవలెను. మూడు, ఐదు, లేదా తొమ్మిది శాఖలతో నిర్మించిన ద్వారము అభీష్టఫలముల నిచ్చును. క్రింది శాఖ నాల్గవభాగముపై ద్వారపాలులను స్థాపించవలెను. మిగిలిన శాఖలను స్త్రీపురుషమిథునముల ఆకారములతో అలంకరించవలెను. ద్వారమునకు ఎదురుగా స్తంభము వచ్చినచో స్తంభ##వేధదోషము. దానివలన గృహస్వామి దాసు డగును. వృక్షముచే వేధ యైనచో ఐశ్వర్యనాశనము. కూపవేధ వలన భయప్రాప్తి. క్షేత్రవేధచే ధనహాని కలుగును. ప్రాసాద-గృహ-శాలాదుల మార్గముచే ద్వారవేధ కలిగినచో బంధనము, సభ##చేవేధ ఏర్పడినచో దారిద్య్రము, వర్ణవేధచే తిరస్కారము, ఉలూఖలవేధచే దారిద్య్రము, శిలావేధచే శత్రుత్వము, ఛాయవేధచే నిర్ధనత ప్రాప్తించును. వీటి నన్నింటిని ఖండించివేసినను, పెకలించినను వేధదోష ముండదు. వీటిమధ్య ప్రాకారము కట్టించినను దోషముండదు. ఈ వస్తువులు సరిహద్దునుండి రెట్టింపు దూరమునం దున్నను వేధదోష ముండదు.

అగ్ని మహాపురాణమునందు సామాన్యప్రాసాదలక్షణవర్ణనమను నూటనాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters