Satyanveshana    Chapters   

బ్రహ్మవిద్యావేత్త బ్రహ్మశ్రీ మండలీక

వెంకటశాస్త్రిగారి ఆమోదము

శ్రీ విన్నకోట మాధవరావు గారు ''సత్యాన్వేషణ'' అనుపేర రచించిన గ్రంధమును స్థాలీపులాక న్యాయమున జూచితిని. దీనిలో వీరు ప్రధమమున దేవుడున్నాడనియు, అట్టి దేవుని ప్రాప్తికి మతము అవసరమనియు, మతస్వరూపమును గూర్చియు, విపులముగ చర్చించిరి. సాకారోపాసన మొదలగు ఈశ్వరోపాసనలను చక్కగ నిరూపించిరి. అవి కాక మోక్షోపయుక్తములగు కర్మభక్తి జ్ఞానయోగములను, సనాతనాశ్రమ ధర్మాదులను, అనేక పౌరాణిక వచనోదాహరణములతో విపులముగ నిరూపించియున్నారు. ఇట్టి అత్యంతోపయుక్త విషయ బోధకమగు నీ గ్రంధమును సులబశైలిలో స్వప్రతిభా విశేషస్ఫురిత యుక్తులతో రచించిన వీరి కౌశలము ప్రశంసనీయము. నేను చూసినంత వరకు వీరు ప్రాచీన సిద్ధాంతముల ననుసరించియె వ్రాసిరని విశ్వసించుచున్నారు. కాన వీరిని వీరి గ్రంధమును భగవంతు డనుగ్రహించుగాత

ఏలూరు

23-11-70 మండలీక వెంకటశాస్త్రీ

Satyanveshana    Chapters