Paramacharya pavanagadhalu    Chapters   

74. సురుటిపల్లి స్పూర్తి

కాశీలో కామకోటీశ్వరాలయాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది. కంచి స్వామికి. ఆయన సంకల్పానుసారం పని ప్రారంభ##మై చురుకుగా జరుగుతోంది. స్వామి వారు మాత్రం ఆ స్థలాన్ని దర్శించలేదు.

ఈ లోగా ఒక రోజు గణపతి స్థపతి స్వాముల వారి దర్శనానికి వెళ్లాడు. 'సురుటిపల్లి వెళ్లావా?' - అనడిగారు స్వామి.

సురుటిపల్లి చిత్తూరు జిల్లాలో వుంది. అక్కడ విలక్షణమైన శివుని మూర్తి వుంది. హాలాహలాన్ని సేవించిన తర్వాత విశ్రమించిన పరమశివుని విగ్రహం అది. 'అటువంటి మూర్తి కాశీలోని కామకోటీశ్వరాలయంలో నిర్మించు. వెనుకవైపు కోష్ఠంలో రావాలది', అని స్వాముల వారాదేశించారు. స్థలం చూడకుండానే తాను కోరిన విలక్షణమైన మూర్తిని ప్రతిష్ఠించడానికి అనువైన స్థలాన్ని ఎలా ఎన్నిక చేయగలిగారు? స్వామి సర్వజ్ఞతకు అది నిదర్శనం. స్వామి సంకల్పం మేరకు అలాటి మూర్తినే అక్కడ నిర్మించి ప్రతిష్ఠించడం జరిగింది. వెనుక వైపు కోష్ఠంలో జాగా అందుకు సరిగ్గా సరిపోయింది!

ఆ దేవాలయ కుంభాభిషేక సమయంలో 'శిల్పకళానిధి' అన్న బిరుదునూ, నవరత్నమాలికనూ స్థపతికి స్వామి ఆదేశంపై బహూకరించారు.

ఒక రోజు స్థపతి కంచి వెళ్లినప్పుడు, ఆయన తన బసలో వుండగా స్వాముల వారు రమ్మన్నారని పిలుపు వచ్చింది. అర్థరాత్రి ఆయనకు హరిద్వారంలో హరి-కీ-పేడీలో ఒక స్థంభం నిర్మించాలి. దానిపై గంగాష్టకంలోని ఈ శ్లోకం చెక్కించు' అని చెప్పి ఒక శ్లోకం చెప్పారు.

ఆ శ్లోకం యిది:

'తరళ తర తరంగే

దేవి గంగే ప్రసీద

శంభోర్జటా విభూషణ మణిః

జహ్నూర్మహర్షేరియం

కన్యాకల్మషనాశినీ

భగవతీ భాగీరథీ పాతుమాం'

Paramacharya pavanagadhalu    Chapters