Paramacharya pavanagadhalu    Chapters   

106. దలైలామా

దలైలామా టిబెటన్ల మత గురువు. చైనా టిబెట్టును ఆక్రమించుకోక ముందు, ఆయన దాని పరిపాలకుడు కూడ.

ఆయన బౌద్ధ మతానికి చెందిన వాడు. ఆదిశంకరులు బౌద్ధ మతాన్ని దేశం నుండి పారతోలారని అంటారు. ఆ కారణంగా అద్వైత మతానికి చెందిన శంకరాచార్యులకూ, బౌద్ధులయిన దలైలామాకు పరస్పర గౌరవాదరాలుండాల్సిన పని లేదు. అయినా దలైలామా వచ్చి వొకసారి పరమాచార్యను కలుసుకొన్నారు.

తరువాత పత్రికల వారు దలైలామాను కలిసి పరమాచార్య గురించి ఆయన అభిప్రాయం అడిగితే ఆయన యిలా చెప్పారు:

'నేను సన్యాసినే, కాని నా జీవన సరళి వేరు, సన్యాసి అంటే ఎలా ఉండాలో ఆయనను చూసి తెలుసుకోవాలి. నిరాడంబరత్వం ఆయన సొత్తు. భోగలాలసత్వం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. ఆయనను చూసిన తర్వాత నేను కూడ సన్యాసినని చెప్పుకోవాలంటే నాకు బిడియంగా వుంది'.

'జగతః పితరౌ వన్దే

పార్వతీ పరమేశ్వరౌ

- లోకానికి తల్లి దండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను' - అన్నాడు కాళిదాసు.

తల్లి దండ్రులే ప్రథమదైవాలు - అన్నారు అన్వైయార్‌.

మనకు తల్లిగా, తండ్రిగా వున్నవారు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే. వారే మనకు దైవం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters