Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

శ్రీ భగవద్గీతా మథనము

శ్రీ

మహాభాగవత నవనీతము

ద్వితీయ భాగము

9. భాగవతము - భాగవతులు

భాగవతులెవరు?

""˳ÏÁgRiª«sLi»R½ ª«sVµ³j…NRPX»R½ù NRPX»R½Li xmsoLSßáLi ˳ØgRiª«s»R½Li'' ˳ØgRiª«s»R½ª«sVV ˳ÏÁgRiª«s»R½ò»yòQ*LóRi úxms¼½FyµR…NRPª«sVV. ˳ØgRiª«s»R½ª«sVVƒ«s ˳ÏÁgRiª«s»`½ xqsLi‡ÁLiµ³R…ª«sVV \ÛÍÁƒ«s ˳ÏÁNTPò ®ªs[µyLi»R½ „s¿yLRiª«sVVÛÍÁ[NSNRP, ˳ØgRiª«s»R½VÌÁ NRP´R…ÌÁV, A ˳ØgRiª«s»R½VÌÁV FyÉÓÁLi¿RÁV xms´R…ª«sVV „sª«sLjiLixms‡Á²T…ƒ«s„s. ˳ÏÁgRiª«sLi»R½V¬s ¿RÁLji»R½ª«sVV ˳ØgRiª«s»R½VÌÁ NRP´R…ÌÁ»][ ª«sVV²T…xms²T…¸R…VVLi²R…VÈÁ xqsx¤¦¦¦ÇÁ®ªs[V NRPµy!

భాగవతమునందు కుచేలుడు, గజేంద్రుడు, ప్రహ్లాదుడు, రుక్మిణీ దేవి, బలి మొదలగు భాగవతుల కథలు కలవు. ఇవిగాక ధృవ, భరత, అజామీళ, చిత్రకేతు, పురంజన, అంబరీష, రంతిదేవాది ఉపాఖ్యానములు కలవు. వీరు పాటించిన భాగవత మార్గమును గ్రహించిన గాని భాగవత హృదయ మవగతము కాదు.

భాగవతు లెట్టివారు?

సీ|| శృత్యంత విశ్రాంత మత్యను క్రమణీయ

భగవత్ప్రసంగతుల్‌ భాగవతులు

సనకాది ముని యోగి జన సదానందైక

పరమ భాగ్యోదయుల్‌ భాగవతులు

కృష్ణ పదధ్యాన కేవలామృత పాన

పరిణామ యుతులు శ్రీ భాగవతులు

బహుపాతకానీక పరిభవ ప్రక్రియా

పురుషోగ్ర మూర్తులు భాగవతులు

తే|| భాగవత్త్వార్థ వేదులు భాగవతులు

బ్రహ్మవాదాను వాదులు భాగవతులు

సిరులు దనరంగ నెన్నడు జేటులేని

పదవి నొప్పారు వారు వో భాగవతులు.

భాగవతము 6-186

నవవిధ భక్తి మార్గములతో మనో వాక్కాయకర్మలను భగవంతునివైపు మరల్చి శరణు జొచ్చిరవారే భాగవతులు.

శ్లో|| శ్రీ విష్ణోః శ్రవణ పరీక్షిద భవత్‌; వై యాసికః కీర్తనే

ప్రహ్లాదః స్మరణ; తదంఘ్రిభజనే లక్ష్మీః, పృథుః పూజనే

అక్రూరస్త్యభివందనే; కపిపతిః దాస్యేచ, సఖ్యేర్జునః,

సర్వ స్యాత్మనివేదనే బలిరభూత్‌ కృష్ణాప్తి రేషా ఫలమ్‌

శ్రవణముచే పరీక్షిత్తు కీర్తనచే శుక నారదాదులు స్మరణచే ప్రహ్లాదుడు. పాదభజన వలన లక్ష్మీదేవి పూజించుటచే పృథు చక్రవర్తి, నమస్కరించుటచే అక్రూరుడు, ధ్యానముచే ఆంజనేయులు సఖ్యముచే అర్జునుడు, ఆత్మ నివేదనముచే బలి, ఇట్లు నవవిధ భక్తి మార్గములచే తరించిరి.

ప్రాకృత మధ్యమ ఉత్తమ భాగవతులు:

భాగవతులు ప్రాకృతులు మధ్యములు ఉత్తములని భాగవతము విభజించినది.

శ్లో|| అర్చయామేవ హరయే పూజాం యః శ్రద్ధయే హతే

స తద్భక్తేషు చాన్యేషు స భక్తః ప్రాకృత స్మృతః

భాగవతము 11-2-47

ఎవడు విష్ణు వ్రతిమలను మాత్రమే శ్రద్ధతో బూజింప గోరు చున్నాడో, విష్ణు భక్తులను పూజింప గోరడో, ఇతరులను పూజింప గోరడో ఆతడు ప్రారంభకుడు.

శ్లో|| ఈశ్వరే తదధీనేషు బాలిశేషు ద్విషత్యుచ

ప్రేమ మైత్రీ కృపా పేక్షా యః కరోతి స మధ్యమః 11-2-46

ఈశ్వరుని యందును, ఈశ్వరభక్తుల యందును, నీచులందును శత్రువులందును, వరుసగా ఈశ్వరునందు ప్రేమ, తద్భక్తులందు మైత్రి, మూఢులు లేక నీచులందు కృప, శత్రువు లందు పేక్ష జూపువాడు భాగవత మధ్యముడు.

శ్లో|| సర్వభూతేషు యః పశ్యే ద్భగవద్భావ మాత్మనః

భూతాని భగవత్యాత్మ న్యేష భాగవతోత్తమః

భాగవతము 11-2-45

తే|| సర్వభూత మయుండైన సరిసిజాక్షు

డతడె తనయాత్మయందుండు ననెడువాడు

శంఖచక్ర ధరుండంచు జనెడువాడు

భక్తి భావాభిరతుడువో భాగవతుడు --భాగవతము

శ్లో|| యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి

గీత-6-30

ఎవడు సర్వభూతములందు బ్రహ్మభావమును, ఆక్మభావమును చూచునో భగవంతుని యందును ఆత్మ యందును సర్వ భూతములను చూచునో వాడు భాగవత శ్రేష్ఠుడు.

భక్తులస్థాయి:-

భగవంతునకు శరణాగతులైన భాగవతులు వారి స్థాయిని బట్టి మూడు విధములు.

మొదటిస్థాయి:-

ఈ స్ధాయిలో శరణాగతులైన భక్తులు మందాధికారులు, వీరు భగవంతునకు పత్రమో పుష్పమో ఫలమో తోయమో సమర్పించి ప్రతిఫలము నాశింతురు. అట్టివారి కోర్కెలు భగవంతుడు తీర్చు చుండును.

శ్లో|| పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి

తదహం భక్తుపహృతం అశ్నామ ప్రయతాత్మనః

గీత-రాజవిద్యా 9-26

క|| దళ##మైన పుష్పమైనను

ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్‌

గొలిచిన జను లర్పించిన

నెలమిని రుచిరాన్నముగనే ఏను భుజిఁతున్‌

భాగవతము-ఉత్తర-10-1010

రెండవస్థాయి:-

రెండవ స్థాయికి చెందిన శరణాగతులు మధ్యమాధికారులు. వీరు ఇంద్రియముల నీశ్వర పరముజేసి కామమును జయించినవారు. వీరు నిష్కామముగా కర్మల నాచరింతురు. దృఢవ్రతులై ఇంద్రియ నిగ్రహముగలిగి ఉపాసింతురు.

శ్లో|| సతతం కీర్తియంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః

సమస్యంతశ్చ మాంభక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. గీత 9-14

మూడవస్థాయి:-

ఈ స్థాయికి చెందిన శరణాగతులు ఉత్తమాధికారులు. వీరు ఇంద్రియముల నీశ్వరపరము జేయుటయేకాక మనస్సునుకూడ భగవంతునియందు లగ్నము సేయుదురు. వీరికి సర్వము భగవంతుడే. అన్యము లేదు. ''వాసుదేవ స్సర్వమితి'' ''మోక్షము మది గోర నొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై'' అను భాగవత వాక్యము వీరియెడ వర్తించును. వీరు ఆత్యంతిక భక్తులు. ''నిజమనోరథ ఫలదాయకములయ్యును మదీయసేవా విరహితంబులైన కార్యంబుల సేయనొల్లరు''

శ్లో|| మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు

మామేవైష్యసి ముక్తైవ మాత్మానం మత్పరాయణః

గీత-9-34

భాగవతులు పాటించవలసిన అద్వైతములు:-

భాగవతులు భావాద్వైత ద్రవ్యాద్వైత క్రియాద్వైతముల పాటింపవలెనని భాగవతము తెలుపుచున్నది.

శ్లో|| భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తదాత్మనః

వర్తయన్‌ స్వా భూత్యేహ త్రీన్‌ స్వప్నాన్‌ ధునుతేమునిః

శ్లో|| కార్యకారణ వసై#్తక్య దర్శితం పట తంతువత్‌

అవస్తుత్వా ద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే

పటతంతు న్యాయంబున కార్యకారణంబులందు వస్తు వొక్కటియై యుండునని యెఱింగి ఏకత్వాలోచనంబు సేసి వికల్పంబు లేదని భావించుట భావాద్వైతంబు

భాగవతము-7-469

శ్లో|| యద్బ్రహ్మణి పరే సాక్షాత్‌ సర్వకర్మ సమర్పణం

మనోవాక్‌ తనుభిః పార్థ! క్రియాద్వైతం తదుచ్యతే

మనోవాక్కాయ కర్మంబులైన సర్వకర్మంబులును ఫలభేదంబు సేయక పరబ్రహ్మార్పణంబు సేయుట క్రియాద్వైతము.

శ్లో|| ఆత్మజాయా సుతాదీనాం అన్యేషామపి దేహినాం

యత్‌ స్వార్థ కామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే

పుత్ర మిత్ర కళత్రాది సర్వప్రాణులకుం దనకును దేహం బునకుం బంచ భూతాత్మకత్వంబున భోక్త యొక్కండను పరమార్థ త్వంబున అర్థ కామంబుల ఎడ నైకదృష్టిం జేయుట ద్రవ్యాద్వైతంబు.

నేర్పున, నాత్మ తత్వానుభవంబున, నద్వైత త్రయంబును విలోకించి వస్తుభేద బుద్ధియు, గర్మభేద బుద్ధియు, స్వకీయ పరకీయ బుద్ధియు స్వప్నంబులుగా దలంచి మానవలయును.

భాగవత భక్తి మార్గమునందు ప్రమాదముకాని పతనముగాని లేదు. నిమియను రాజునకు కవియను ముని ఆత్మలబ్ధికి భాగవత ధర్మములు చెప్పి కన్నులు మూసుకొని వీనిని భావించినను ప్రమాదమును పతనమును చెందడని తెలిపెను.

శ్లో|| ఏవై భాగవతా ప్రోక్తా ఉపాయా ఆత్మలబ్ధయే

అంజ్యః పుంసాం అవిదుషాం విద్ధి భాగవతాన్‌ హితాన్‌

యా నాస్థాయ నరో రాజన్‌ నప్రమాద్యేత కర్హిచిత్‌

భావన్‌ నిమీల్యవా నేత్రే నస్ఖలేత్‌ తపతే దిహ

భాగవతులు మోక్షము కూడ ఆశింపరు:-

భాగవతమున షష్ఠ స్కంధమున హరిసేవయే కైవల్యమని సింగన వ్రాసెను.

సీ|| హరికి నర్థము బ్రాణ మర్పితంబుగ సేయు

వాని కైవల్య మెవ్వనికి లేదు

వనజలోచను భక్తవరుల సేవించిన

వాని కైవల్య మెవ్వనికి లేదు

వైకుంఠ నిర్మల వ్రతపరుండై నట్టి

వాని కైవల్య మెవ్వనికి లేదు

సరసిజోదరు కథాశ్రవణ లోలుండైన

వాని కైవల్య మోవ్వనికి లేదు

తే|| లేదు తపముల బ్రహ్మచర్యాది నియతి

శమ దమాదుల సత్య శౌచముల దాన

ధర్మ మఖముల సుస్థిర స్థానమైన

వైష్ణవ జ్ఞాన జనిత నిర్వాణ పదము

భాగవతము-6-55

భాగవత భక్తులను స్మరించినను సేవించినను పాపక్షయమగును కదా. భక్తుల హృదయములందే భగవంతు డుండును.

శ్లో|| ప్రహ్లాద నారద పరాశర పుండరీక

వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస!

--కరావలంబస్తోత్రము

విష్ణుమాయను తరించిన భాగవత భక్తులు:-

భాగవత ద్వితీయాశ్వాసమున భక్తిచే కృతార్థులై విష్ణుమాయనుతరించిన భక్తుల నామములు తెలుపబడినవి. సనకాదులు, రుద్రుడు, ప్రహ్లాదుడు, స్వాయంభువ మనువు, శతరూప, ప్రియవ్రతోత్తాన పాదులు, ప్రాచీనబర్హి, ఋభువు, వేనజనకుడగు నంగుడు, ధ్రువుడు మొదలగు వారు.

సీ|| గాధి గయాసు రేక్ష్వాకు దిలీప మాం

ధాతృ భీష్మ శుక యయాతి సగర

రఘు ముచుకుందైళ రంతిదే వోద్ధవ

సారస్వతో దంక భూరిషేణ

శ్రుతదేవ మారుతి శతధస్వ పిప్పల

బలి విభీషణ శిబి పార్థ విదురు

లంబరీష పరాశ రాలర్క మిధిరేశ్వ

రాను సౌభరి దేవ లాభిమన్యు

తే|| లార్షి షేణాదులైన మహాత్ములెలమి

దవిలి యద్దేవు భక్తి జిత్తమున నిలిపి

తత్పరాయణు లౌట దుర్దాంతమైన

విష్ణుమాయ దరింతురు విమలచరిత

భాగవతము-2-204

తిర్యగ్జంతువులు పక్షులు స్త్రీలు శూద్రులు కూడ నారాయణ భక్తి యోగమున తరించిరి.

మ|| అనఘా! వీరల నెన్న నేమిటికి? దిర్యగ్జంతు సంతాన ప

క్షి నిశా టాటవి కాఘ జీవనివహ స్త్రీ శూద్ర హూణాదులై

నను, నారాయణ భక్తియోగ మహితానందాత్ములై రేని వా

రనయంబున్‌ దరియింతు రవ్విభుని మాయావైభవాంభోనిథిన్‌

భాగవతము 2-205

వృక్షములకుగూడ మోక్షము లభించునని, చిదంబర శివాచార్యులు వృక్షమునకు మోక్షము నొసగిరని శివభక్తుల కథలో చెప్పబడినది.

భాగవతులు ఒకజన్మలోనే ముక్తిని గాంతురు:-

భాగవతమున రుద్రుడు భాగవతులు సర్వోత్తములని తెలిపెను. ''స్వధర్మ నిరతుండైన పురుషుం డనేక జన్మాంతరంబుల సుకృత విశేషంబులన్‌ చతుర్ముఖత్వంబు నొంది, తదనంతరంబ బుణ్యాతిరేకంబున నన్నుబొంది యధికారాంతరంబున నేనును దేవతా గణంబులును అప్రాకృతంబైన ఏ హరి పదంబును బొందుదు మట్టి పదంబు భాగవతుండు దనంతనెబొందు''

భాగవతము-4-699

''బహూనాం జన్మనా మంతే జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే'' అను గీతా వాక్యము భాగవతుల ఎడ వర్తింపదేమో ? ఏమి వారి అదృష్టము ? ఒక జన్మలోనే ముక్తిని బొందగలరు.

ఫలితము:-

ఇట్టి భాగవత భక్తు లవలవంబించిన భక్తి మార్గము ననుసరించిన ఫలితమేమి? భక్తిచే ఆత్మనిష్ఠ కలిగినప్పుడు సకల బంధములు తొలగును. ఫలములకెల్ల అవధి యనదగు ఆయాసముల బాయుట తటస్థించును. ఇట్టి ''శ్రీకైవల్య పదంబు జేరుటకునై'' భాగవతులు పాటించిన భక్తి మార్గమును వారి కథల మూలమున పరిశీలింతము.

క|| హరిదాసుల మిత్రత్వము

మురరిపు కథ లెన్నికొనుచు మోదముతోడన్‌

భరితాశ్రు పులకితుండై

పురుషుడు హరిమాయ గెలుచు భూపవరేణ్యా.

భాగవతము 11-45

శ్లో|| ప్రహ్లాద నారద పరాశర పుండరీక

వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్‌

రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్‌

పుణ్యానిమాన్‌ పరమ భాగవతాన్‌ స్మరామి.

అట్టి వారిని క్రమముగ స్మరింతుము.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters