Naa Ramanasrma Jeevitham    Chapters   

64. రమణ సదన నిర్మాణం

కొలనుకొండ మకాం పెట్టిన కొద్ది రోజులకే నాకు రక్తపుపోటు ప్రారంభ##మైంది, అక్కడ డాక్టరు లేక, మందు దొరకక ఇబ్బందిగా వుండేది. అప్పుడప్పుడది బాగా బాధించేది. విజయవాడకు కబురు వెళ్ళటం, అక్కడినుంచి ఎవరో ఒకరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళటం, కొంచెం తగ్గగానే నేను బంధు సంఘంలో వుండకుండా కొలనుకొండ రావటం జరిగేది. అల్లా నాల్గయిదేండ్లు గడిచినవెనుక ఇక నేను తమ వద్ద వుండనన్న నిశ్చయం వాల్ళకు కలిగింది. భగవా& దయ వల్ల మా చిన్నన్న డి. యస్‌. శాస్త్రిగారికి విజయవాడ మారుతీనగరం, గోగినేనివారి వీధిలో తనుకున్న ఖాళీ స్థళంలో చిన్న డాబాయిల్లు కట్టించి న్నక్కడ వుంచాలన్న సదుద్దేశం కలిగింది. అక్కడవుంటే వైద్యసహాయం వుంటుంది. ఊళ్ళో పెద్దన్న శేషాద్రిశాస్త్రిగారు కుటుంబంతో వున్నారు గనుక అవసరాన్ననుసరించి మనుష్య సహాయమూ వుంటుందని వారి వూహ. భగవా& అనుగ్రహమే ఇందుకు మూలమని నా నమ్మకం.

మా పెద్దన్న గారు కొంత, చిన్నన్న గారి అల్లుడు సూరి రామకృష్ణశాస్త్రి కొంత శ్రమించి కట్టించిన ఆ కుటీరం భగవదనుగ్రహంవల్ల 1959 మార్చినాటికి లైట్లతోసహా తయారైంది. ముందు భగవాన్‌ చిత్రపటమూ, వెనుక నేనూ ఆ యింట్లో ప్రవేశించాం. భక్తులు కొందరు యోచించి ''రమణ సదనమ్‌'' అని గేటుకు బోర్డు కట్టారు. నిత్యం ఉదయాన రమణ అష్టోత్తరం, రమణ చత్వారింశత్‌ పారాయణ, సాయంత్రం ఉపదేశసారం, భగవాన్‌ స్తుతి పాటలు, శక్త్యనుసారం భగవాన్‌ బోధనలు, తదితరమైన వేదాంత గ్రంథపఠనము ఇత్యాదులన్నీ జరుపుటకు ఆరంభించాం. కొన్నాళ్ళు భగవా& జన్మనక్షత్రమైన పునర్వసుకు ప్రతినెలా, పూజా, ఉపనిషత్పారాయణాదులున్నూ జరిగినవి. మా చిన్నన్నగారు ఈ చిన్న పటమేమిటమ్మా అని మద్రాసునుంచి భగవా& చిత్రపట మొకటి పెద్దది స్టాండుతోసహా పంపారు. ఆ చిత్రపట సన్నిధినే సద్గ్రంథపఠన, పారాయణ ధ్యానాదులన్నీ ఆశ్రమంలో వలెనే నడుపుకుంటూ వున్నాను. చుట్టూ చిన్న తోట నిర్మించుకొనుటవల్ల ప్రశాంతంగానూ వున్నది. ప్రతి శుక్ర వారం సాయంసమయమందు స్త్రీలున్నూ ప్రతి ఆదివారం సాయంకాలమున స్త్రీ పురుషులున్నూ కొందరు సమావేశ##మై ఆధ్యాత్మిక చింతనలో గడుపుతూవుంటారు. లేఖలు చదివిన రమణ భక్తులు కొందరు పొరుగూళ్ళ నుంచిన్నీ అప్పుడప్పుడు వచ్చి చూచి వెడుతూవుంటారు. అందువల్ల ఆంధ్ర దేశంలోవున్న రమణ భక్తులకు ఇదొక చిన్న రమణ కేంద్రంగా పరిణమించినదనిన్నీ చెప్పవచ్చును.

కొందరు ఆశ్రమ పుస్తకాలు కావలెనని కోరుటవల్ల రమణసదానికి ఎదుటియింట్లో వుండే బి. శేషగిరిరావనే ఒక భక్తుడు ఆశ్రమ పుస్తకాలు తెప్పించి విక్రయించుట కారం భించాడు. ఈ విధంగా శ్రీరమణుని బోధల ప్రచారం జరిగింది. ఏటేటా జయంతికి, ఆరాధనకూ రెండుసార్లు ఆశ్రమానికి వెళ్ళే ఓపికతగ్గి, అయిదారు సంవత్సరాలుగ విజయవాడ, మారుతీనగరం, రమణసదనం, ఆవరణలోనే జయంతి జరుపుకొని, ఆరాధనకుమాత్రమే ఆశ్రమానికి వెళ్ళి ఒకటి రెండు నెలలు వుండివస్తూ వున్నాను. ఏటేటా అరుణాచలదీపోత్సవమున్నూ యథాశక్తిగ రమణసదనమ్‌ ఆవరణలోనే జరుపు కుంటూ వున్నాము.

Naa Ramanasrma Jeevitham    Chapters