Naa Ramanasrma Jeevitham    Chapters   

59. గంగాభిషేకం

బుద్ధగయలో సిద్ధార్థుడు తపస్సిద్ధిని పొందిన వృక్షరాజం దర్శించి దాని క్రింద రవంత విశ్రమించి అక్కడినుండి గయ వచ్చి సరాసరి కలకత్తా చేరుకొని ఉగ్రరూపిణియగు కలకత్తా కాళినీ, రామకృష్ణపరమహంస సేవించిన ప్రశాంత కాళినీ చూచి, బేలూరులో రామకృష్ణ మఠం చూచి, పూరీజగన్నాథుని సేవించి రాజమండ్రిలో గోదావరితీర్థం గంగలో కలుపుకొని, విజయవాడ, మద్రాసులలో మజిలీచేసి క్రమంగా గంగచెంబుతో సహా భగవాన్‌ జయంతి ఇంకొక నెల రోజులున్నదనగా రమణాశ్రమం చేరుకున్నాను. జబ్బుతో వెళ్ళిన వెనుక తిరిగి అదే రావటం గనుక అందరూ చుట్టుమూగారు. భగవాన్‌ జయంతినాడు నేను తెచ్చిన గంగతో రమణశ్వర లింగానికి అభిషేకం చేశారు. ఆ గంగాతీర్థం భోజన సమయంలో అందరికీ ఇచ్చాను. మద్రాసు నుంచి మా అన్నా ఆయన స్నేహితులూ కుటుంబాలతో వచ్చారు. విజయవాడనుంచి మా పెద్దన్నగారి రెండవ కొమారుడు రాధాకృష్ణమూర్తి భార్యా సమేతంగా వచ్చాడు. ఈ విధంగా భగవాన్‌ తమ జయంతి మహోత్సవంలో మహా వైభవోపేతంగా నా గంగాసమారాధన జరిపించారన్నమాట. భక్త పరతంత్రులుగదా, భగవా9.

Naa Ramanasrma Jeevitham    Chapters