Naa Ramanasrma Jeevitham    Chapters   

41. తాండవ దర్శనం

పుండునుండి రక్తంకారటం అంతకంతకు అధికం కావటంవల్ల ఉభయ పక్షముల వారున్నూ ''ఈవిధంగా వదిలితే ఎట్లా? ఏదో ఒక వైద్యం చేయా''లని గోలకెత్తితే మూసు, లక్ష్మీపతి ఇత్యాది పెద్ద వైద్యులెవరిని రప్పిస్తామన్నా ''వారందరికీ తొందర కలిగించటమూ. అందుకుగాను ధనవ్యయమూ, అదంతా ఎందు''కని భగవాన్‌ నిరాకరించి, కడకు కానీ ఖర్చులేకుండా వచ్చే వళ్ళువాయ& తాతచేత పచ్చాకు పసరులతో కట్టు కట్టించుకునేందుకు సమ్మతించారు భగవాన్‌. 5-7-49 నుంచే కట్టు కట్టుట కారంభ##మైంది.

ఈ తాత ఇక్కడికి సమీపంలో వళ్ళువాయి అనే గ్రామంలో నివసించే సాధారణ కుటుంబంలోని ఒక కాపు. భగవాన్‌ కంటే వయస్సులో పెద్ద. సాధుజీవి. నారలు తొలగినా చెదరినా వచ్చి ఆకురసాలతోనూ కొన్ని కొన్ని మూలికలతోనూ కట్లుకట్టి నయం చేస్తూవుంటాడు. 1943 లో తమిళ్‌ సంవత్సరాదినాటి ఉదయాన భగవాన్‌ కొండదిగి వస్తూ ఆసుపత్రి ప్రక్కనే వున్న మెట్లవద్దపడితే కుడిభుజం పైనవుండే చిన్న నరం తొలిగింది. అప్పుడు ఈ తాత కట్టు కట్టాడు. మూడు కట్లతోనే ఆ నరం కుదుటపడ్డది. అప్పుడు ఈ తాతకు భగవాన్‌ దగ్గర బాగా స్వతంత్రం ఏర్పడ్డది. అందువల్ల ఈసారి వచ్చి యథాప్రకారం గోశాల వెనుకనే భగవాన్ను చూచి నమస్కరించి కట్టువిప్పి రక్తం కారుతూ, భీకరంగా వున్న పుండును చూడగానే పట్టరాని దుఃఖం వచ్చిందట తాతకు. కళ్ళనీళ్ళు కారుస్తూ గద్గదస్వరంతో ''అయ్యో! భగవానే, ఎంత ఘోరంగా వున్న దిది. పుట్టపుండు స్వామీ. దీ న్నసలు కదల్చనే రాదు. ఆపరేషన్‌ ఎందుకు చేయించుకున్నారు స్వామీ! ఆరంభంలోనే నాకు తెలిసివుంటే ఆకులు వేసి కట్టేవాణ్ణి. సులభంగా అణిగిపోయేది గదా. ఈ స్థితికి వచ్చేదాకా వూరుకాన్నారే? కాకిచేత కబురంపితే వచ్చి తమ పాదాలవద్ద వ్రాలకపోయానా? ఎంత ముదిరిపోయింది స్వామీ'' అంటూ వలవల ఏడ్చాడు.

భగవాన్‌ అనునయంగా ''నే నసలు మొదటనే బాధ ఏమీ లేదాయె. ఆపరేష& ఎందుకయ్యా వద్దు అన్నాను. 'భగవాన్‌ అన్నీ వద్దనే అంటారు. ఇట్లా వదలితే కష్టం' అని కోశారు. అంతకన్న పెద్దదిగా ఎదిగింది. మళ్ళీ ఆపరేషన్‌ అంటే భయపడి నాగమ్మ 'అత్తిపాలో, పచ్చాకులో వేస్తే పోదా' అన్నది. వేసి చూద్దామఱ్ఱా అంటే ఆగక మళ్ళీ కోశారు. మీ పని ఇట్లాగున్నదా అని బాగా ఎదుక్కొని వచ్చిది. చెయ్యి తీసివేస్తామంటే ఏం వద్దులెండి. అదే పోతుంది పొమ్మన్నాను. రేడియం సూదులువేసి కట్టారు. కొన్నాళ్ళుకాస్తఅణగినట్లేవుండి బుస్సున పైకిలేచింది తాతా. విషం కక్కినట్లు నెత్తురు కక్కుతొంది. వాళ్ళకూ దీనికీ ఒకటే యుద్ధం. చెయ్యి తీసివేస్తామని ఈ మధ్య మళ్ళీ వారంతా వచ్చారు. ఇదివరకు చేసిందే చాలును. దాని జోలికి పోకండయ్యా అన్నాను. నెత్తురులేదని ఎవరెవరి రక్తమో తెచ్చి ఒంట్లోకి ఎక్కించారు. అంతకు పదిరెట్లు బయటికి వస్తోంది. చెయ్యి తీసివేసి ఏదో రబ్బరు చెయ్యి పెడతారట. అదొక అలంకారం. మంచివేళ. ఇక్కడి వారెవ్వరూ సమ్మతించలేదు గనుక సరిపోయింది గాని లేకుంటే ఆ ఆభరణం గూడా వచ్చేదే తాతా'' అని సెలవిచ్చారుట. ఆనాటి నుండీ తాత కట్టుకట్టటానికి ఆరంభించాడు. నిత్యం ''ఆయాకు మంచిగి గదా. ఈ పసరు బాగా పనిచేస్తుంది గదా?'' అని భగవాన్‌ సలహాలు చెప్పేవారట. అందువల్ల ఈ తాత కట్టొక నెపంగా పచ్చకామెర్లనాటిలెనే భగవాన్‌ నయం చేసుకుంటారేమోనని అంతా ఆశించాం. ఆ తాత గూడ డాక్టర్లందరివలెనే నిత్యం ''భగవానే! నేను నిమిత్త మాత్రం నాదేమీ లేదు. తామే అనుగ్రహించి నయం చేసుకోవాలి'' అని ప్రార్థిస్తూ కట్టుకట్టేవాడు.

10-7-49 తేదీకి రక్తం కారటం తగ్గిందన్నారు. ఎంతో సంతోషించాం. 14వ తేదీ సాయంకాలం నాలుగూ ముప్పావుకు భగవాన్‌ బయటికి వెళ్ళి వస్తూ వుంటే శరీరం వణుకుతూ తూలసాగింది. జ్వరం వచ్చింది కాబోలును. ఎట్లాగో వచ్చి సోఫాలో కూలబడ్డారు. అందరం భయకంపితులమై విచారిస్తూ దూరంగా వున్నాం. శాంతమ్మగారు పెద్దది గదా. దుఃఖం ఆపుకోలేక కళ్ళనీళ్ళు కారుస్తూ భగవాన్‌ సోఫా చుట్టూ పెట్టిన కఱ్ఱ కటకటాల నానుకొని శ్రీవారి నుద్దేశించి ''అయ్యో! శరీరం'' అని అన్నదో లేదో భగవాన్‌ అందుకొని ''ఓహో! శరీరమా? ఏమి. ఏమయింది. మణుకుతున్నది. వణికితే యేమి? ఈ శరీరంలో ప్రాణం గదా వుండాలి మీకు. ప్రాణం వున్నది. సరేనా?'' అంటూ ఆ వణుకంతా అణుచుకొని నవ్వుతూ పక్కనున్న సేవకులతో ''అది నటరాజ తాండవమయ్యా. భయమెందుకు? నిత్యం అచల దర్శనమైతే ఇవాళ తాండవదర్శనం. దీనికంత గాభరా యెందుకు?'' అని సెలవిచ్చి గంభీరంగా కూర్చున్నారు భగవాన్‌. యథాప్రకారం వేదపారాయణాదులు జరిగిని వెనుక అంతా కుటీరాలకు చేరుకున్నాం.

Naa Ramanasrma Jeevitham    Chapters