Naa Ramanasrma Jeevitham    Chapters   

38. అపాయానికిన్నీ అపరేషన్‌ ఉన్నదా ?

శ్రీ భగవానుని చేతిపుండునుండి రక్తస్రావం ఎక్కువవటంవలన 30-4-49 సాయంకాలం మా అన్నా, సుబ్రహ్మణ్యయ్యరూ, రాఘవాచారీ మొదలైన డాక్టర్లూ పట్నంనుంచి వచ్చారు. ఆ రాత్రికే మాద్రాసునుంచి తెచ్చిన రక్తం శ్రీవారి పునీతశరీరంలోకి ఎక్కించారని వారంతా వెళ్ళినవెనుక విన్నా నేను. అదేగాక 1-5-49 ఉదయా త్పూర్వమే మా అన్న నా కుటీరంలో వున్న సమయంలో రాఘవాచారీ ఇత్యాది డాక్టర్లూ, దొరసామయ్యరూ మొదలైనవారంత, స్నానాలగదిలో భగవానుని దర్శించి ఈ వ్రణం కాన్‌ సరుకు సంబంధించిన పుట్టపుండనీ, చాలా ప్రమాదకరమైనదనీ శ్రీవారితో మనవిచేసి ''ఈ చెయ్యి భుజంవరకూ తీసివేస్తే తగ్గవచ్చును. భగవాన్‌ సమ్మతించ వలసిందని'' ప్రార్థించారనీ, ''తీసివేస్తే ఇక రాదన్న నమ్మకం వున్నదా?'' అని భగవానంటే ''అది చెప్పలేముగాని తగ్గవచ్చునని మా ఆశ'' అని డాక్టర్లన్నారనీ ''ఆ నమ్మకం లేనప్పుడు ఇదెందుకు? అని భగవాన్‌ సెలవిచ్చారనీ'' తీస్తే తగ్గవచ్చునుగాని తీయకుంటే అపాయం. భగవానే మా యందు కరుణించి సమ్మతించవలసిందని'' వారంతా ప్రార్థిస్తే భగవాన్‌ నవ్వుతూ ఓహో! అట్లాగా! అపాయానికి గూడా ఆపరేషను చేయగలరా?" అని భగవాన్‌ అన్నారనీ, ''ఈ విధంగా రక్తం కారుతున్నదే ఎట్లా ''గని డాక్టర్లంటే'' ఆ విషయం చూచుకుందాం. దాని కేమి?" అంటూ భగవా9 బయటికి వచ్చి వేశారనీకూడా విన్నాను.

ఇదంతా జరిగిన వెనుక మా అన్న ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు ఆఫీసులో అంతా సమావేశ##మై, చెయ్యి తీసివేయటానికి సమ్మతించవలసిందని మనమంతా గుంపుగా వెళ్ళి ప్రార్థిస్తే భగవా9 సమ్మతించకపోతారా? వెడదామన్న యోచనలు చేస్తే, అన్నయ్య ఇష్టపడక ''భగవా9 సుముఖంగా మాట్లాడనిది మనమంతా తొందరకలిగించటం ఎందుకని'' చెప్పి గట్టిగా మాట్లాడారనీ. ఇంకా కొందరు భక్తులు అందుకు అనుకూలించారనీ, అందువల్ల ఆ ప్రయత్నం విరమించారనీ, అదేగాక భగవాన్‌ సేవకులనూ ఆశ్రమవాసులనూ అందరినీ వరుసగా పిలిచి ''ఏమోయ్‌, వాళ్ళు చెయ్యి తీసివేస్తామంటున్నారు. నీకూ సమ్మతమేనా?'' అని అడగసాగారనీ, వారెవ్వరూ సమ్మతీంచలేదనిన్నీ విన్నాను.

పై సంగతులన్నీ విని భగవాన్‌ సన్నధికి వెళ్ళేసరికి, ఎనిమిది గంటలయింది. ఒక భక్తుడు చేతిపుండును గుఱించే మాట్లాడుతూ ''అసలు దానిని కదల్చకుండా నేవుంటే బాగుండేదేమో?" అంటున్నాడు. భగవాన్‌ అందుకొని ''అవునవును. ఉన్నదాన్ని ఉన్నట్లు వుండనీయక కదిపారు. అంతకన్న పెద్దదిగా లేచింది, అడుగంట తీసివేస్తామని బాగాకోశారు. మీపని ఇట్లాగున్నదా అని విజృంభించింది. పుట్టలో పామును లేపితే బుసకొట్టదూ? ఇంకా ఏమేమోచేస్తారట'' అన్నారు భగవా9. చెయ్యి తీసివేసేటందుకు సమ్మతించవలసిందని, శ్రీవారిని ఇంకా ప్రార్థింతామని కె.కె. నంబియారు అక్క, మాధవి అమ్మ, ఆ డాక్టర్లందరితో వెళ్ళక ఇక్కడే వుండి పోయింది. భగవాన్‌ సెలవిచ్చిన పై మాటలన్నీ ఆమె విని ''భగవానే! అట్లా సెలవిస్తే ఎట్లా?" అని అంటూవుండగా శ్రీవారందుకొని ''చాలుచాలును. ఏమీ అక్కరలేదు. అదే పోతుంది'' అంటూ ఆ ప్రసంగం మార్చారు. ఇంతలో మురగనార్‌ వచ్చి ఈ వ్యాధి మాన్పుకొని మమ్మందరనూ రక్షించ వలసిందనే భావంగల పద్యమొకటి వ్రాసిన కాగితం భగవాన్‌ కిచ్చారు. భగవాన్‌ చూచి దాని భావం వివరంగా నాతో చెప్పారు. నాకు పట్టరాని దుఃఖంవచ్చి ''ఈసారివస్తే మనం చూచుకుందాంలే అని భగవాన్‌ లోగడ సెలవిచ్చివున్నారు గదా. ఇప్పుడైనా మన వైద్యం చేసుకొని మాన్పుకోరాదా? భగవానుకు తెలియంది ఏమున్నది" అన్నారు. అంతటితో నాకంఠం రుద్ధమై కళ్ళు జల జల నీళ్ళు కార్చినవి. మురగనారున్నూ గద్గదకంఠులైనారు. అక్కడున్న వారంతా చింతా కులమానసులై స్తబ్ధత్వం వహించారు. భగవాన్‌ కరుణాపూర్ణ దృష్టితో ''ఊ-ఊ'' అని తలవూపుతూ వూరుకున్నారు.

ఆ వెనుక 8-5-49 తేదీన ఉదయమే డాక్టరు లక్ష్మీపతిగారితో, మా అన్న రావటం, భగవాన్‌ ముందు వారి వైద్యానికి ఆమోదం చూపినట్లుండటంవల్ల ఇక తామే శ్రద్ధ వహిస్తారేమో నన్న ఆశకలగటం ఆ మధ్యాహ్నానికే ఆపరేషన్‌ లో పాల్గొన్న డాక్టర్లు కొందరు పట్నంనుండి రావటం, వారికీ లక్ష్మిపతిగారికీ వివాదం జరగటం, ఆ వెనుక ఏ కారణం వల్లనో ''రేడియం వైద్యంవల్ల కొంచెం తగ్గివున్నది గదా, ఈ వైద్యం వెనుక చూచుకుందాం'' అని చెప్పి భగవాన్‌ అందరినీ పంపటం జరిగింది.

మొత్తం మీద 1-5-49 నుండీ ''చెయ్యి తీసివేస్తే తగ్గవచ్చును. అందుకు సమ్మతించవలసిందని భగవాన్ను అంతా కలిసి ప్రార్థింతామనే'' వారు కొందరూ, ఆ ఘోరం చూడనే వద్దు. భగవాన్‌ తమ శరీరాన్ని నిలుపదలచుకుంటే ఏ ఆయుర్వేద ఔషధంవల్లనో బాగు కాగలదు. అంతేగాని మే మందుకు అంగీకరించుము'' అని అనేవారు కొందరుగా రెండు కక్షలు ఏర్పడ్డవి.

Naa Ramanasrma Jeevitham    Chapters