Naa Ramanasrma Jeevitham    Chapters   

31. న కర్మణా

భగవా& సన్నిధిలో సాధారణంగా ఏ సత్కర్మ జరిగినా ముందే (అంటె ఆ కర్మ జరగబోయే ముందు) ఒక పళ్ళెంలో కర్పూరం, టెంకాయలూ, పళ్ళూ మొదలైన మంగళద్రవ్యాలు పెట్టుకొని బ్రాహ్మణులంతా భగవా& సన్నిధికి వచ్చి ''న కర్మణా'' మంత్రం చదివి నమస్కరించి ఆ మంగళద్రవ్యాలు భగవాన్‌ చేత తాకించి తీసుకొనివెళ్ళి ఆ కర్మకాండ ఆరంభించటం మామూలు. అదంతా గమనిస్తూ వున్న భక్తులొకరు 1948 జూలై ప్రాంతంలో ఒకనా డా సంఘటన చూచి, వారు వెళ్ళిన వెనుక భగవాను నుద్దేశించి ''ఇక్కడ ఏ సత్కర్మ జరిగినా ఆ మంగళద్రవ్యాలు భగవాన్‌ చేత తాకించి తీసుకొని వెళ్ళడం తమ అనుగ్రహంవల్ల ఆ పని నిర్వఘ్నంగా నెరవేరాలని గదా వారి భావం. అప్పుడుగూడా 'న కర్మణా' మంత్రం చదువుతా రెందుకు భగవా&. న కర్మణా నప్రజయా, ధనేన, త్యాగేనై కే అమృతత్వమానశుః' అంటే అమృతత్వము, కర్మవల్లను, పుత్రాది ప్రజలవల్లను, ధనము వల్లను లభ్యం కాదనిగదా తాత్పర్యం. ఆ మంత్రం చదివి వెంటనే 'కర్మ చేస్తున్నాం. భగవాన్‌ అనుగ్రహం కావాలి. చేతితో తాకండి' అంటారే? ఏమది? '' అని అడిగారు.

భగవా& చిరునవ్వుతో ''అదా, సరిసరి అసలు చదివే మంత్రానికి అర్థం తెలుసుకుంటే వీటన్నిటితో పనే లేదు. ఆ మంత్రం నిత్యం ఇక్కడ ఎన్నిసార్లు చదవడం లేదు. అర్థం తెలుసుకొని, ఆచరణకు తెచ్చుకొవడానికి యత్నంచేస్తే మంచిదే. కాని ఎవరు ఆ పనిచేసేది? ఏదో కర్మకాండ నడుస్తున్నది. మంచిపనేగదా. మనదేం పోయిందని తాకుతాను. అంతే'' అని సెలవిచ్చారు. అప్పుడు గూడా 'న కర్మణా' మంత్రం చదువుతారే, అసలు పరమహంసలకు (సన్యాసులకు) వందనం చేసేటప్పుడల్లా ఆ విధంగానే చేయాలన్న నియమం వున్నదాయేమి?'' అన్నా రా భక్తులు. ''ఔనౌను'' అన్నారు భగవా&.

ఇంకొక భక్తులందుకొని ''ఆ న కర్మణా మంత్రానికి అర్థం భగవా& సెలవియ్యాలి'' అని వినయంగా అడిగారు. ''సరిపోయింది. లోగడ ఇల్లాగే ఎవరో అడిగి తే విద్యారణ్యుల వారు వ్రాసిన భాష్యం చూపాము. వారి కది సరిగా బోధ పడలేదని అనడంవల్ల నేనే చెప్పవలసి వచ్చింది. అదంతా ఎందుకని అప్పుడే అరవంలో అర్థం వ్రాసి యిచ్చాను. 1938 లో ననుకుంటాను. ఇక్కడి వారు ఆ కాగితానికి అద్దం కట్టించి, డైనింగు హాలులో (భోజనశాలలో) వేసినట్లున్నారు. అది చూడండి తెలుస్తుంది'' అని సెలవిచ్చారు భగవా&.

ఒకరు వెళ్ళి ఆపటం తెస్తే అంతా చూస్తూ చదువుకుంటున్నారు. ''తెలుగులో వ్రాయలేదా? '' అన్నా నేను. ''ఏమో ; ఎవరన్నా వ్రాసి వున్నా రేమో! '' అన్నారు. భగవా& వ్రాసి వున్నారా? '' అన్నాను. ''ఊ-పని లేదు. కావాలంటే అది చూచి మీరు తెలుగులో వ్రాసుకో వచ్చును. అన్నారు భగవా&. ఇక అడిగి లాభంలేదని నేనే ఆ అరవానికి అనువాదం వ్రాశాను. భగవా& అనువాదమూ, మూలమంత్రమూ, నా తెలుగు దిగువన పొందుపరుస్తున్నాను.

Naa Ramanasrma Jeevitham    Chapters