Naa Ramanasrma Jeevitham    Chapters   

20. అనుగ్రహం

ఈ పాట వ్రాసి ముగించేసరికి 3 గంట లయింది. కాగితం మడిచి ఇంట్లోనే వుంచి భగవాన్‌ సన్నిధికి వెళ్ళాను. దూరాన వుండగానే ''అదుగో నాగమ్మ వచ్చింది'' అంటున్నారు భగవాన్‌ సమీపస్థులతో హాల్లోకి వెళ్ళి నమస్కరించి లేవగానే 'ఇదుగో! ఎవరో ఈ స్తోత్రం వ్రాసి పంపారు'' అని కాగితం చేతి కిచ్చి చిరునవ్వుతో ''చదువు'' అన్నారు భగవాన్‌. నే నది చదివి ముగించిన వెనుక, పదిరోజులనుంచీ సంగతులన్నీ మూటగట్టి వుంచి, అప్పుడే మూట విప్పినట్లు అదనీ, ఇదనీ ఎన్నో కబుర్లు చెపుతూ నాలుగుంబావు వరకూ నాతో మాట్లాడుతూనే వున్నారు భగవాన్‌. అంతా విస్తుబోయినట్లు చూస్తున్నారు. నా గుండె చల్లబడ్డది. అది మొదలు తామే పలుకరించి మాట్లాడే వారు భగవాన్‌. వారి కేదో తెలియదని మర్నాడు ఆ పాట చూపించబోతే నా వెఱ్ఱికి నవ్వుతూ ''తెలుసు తెలుసు. ఉండనీ'' అన్నారు భగవాన్‌. నా అవివేకతకు నాలో నేనే నవ్వుకున్నాను.

Naa Ramanasrma Jeevitham    Chapters