Mahayogama    Chapters   

ఓమ్‌

మహాయోగము

7. ఈశ్వరుడు

- * -

మన విచారణావిషయాల్లో మూడింట రెండు - జగత్తు జీవులు - తత్తద్రూపేణ అయధార్ధాలని నిశ్చయించాము. ఇక ఈశ్వర భావన ఏపాటి సత్యమో పరిశీలింతాం.

విచారణలో యీ భాగంసులువైనది. నిర్ణయంనిస్సంశయమే జగజ్జీవేశ్వర త్రిపుటి ఏకము, అవిభాజ్యము, పూర్ణము, ప్రతియొక్క టామిగత రెండూ సాపేక్షాలు గనుక. వానిలో మొదటిదగు జగత్తు లో ద్వితీయ తృతీయాలు సాపేక్షాలు. జగత్తన్న పదం విలక్షనాలైన యోచనా విషయము లన్నింటినీ సూచిస్తుంది అందు జడములూ చేతనములూ వానియేకైక కారణమూ, సర్వమూ కలసియేయున్నవి. విషయ జగజ్జీవములు కార్యము. వానియందు వ్యాపించి భరించు కారణం లేక అది మనయనుభ వానికి రాదు. ఘటమును, దాని కారణ మోకారణములో వాని స్పృహయే లేక ఊహింపలేము గదా? మన విచారణకా మూడు ఒక్కటే. వానిలో రెంటిని కల్లలని త్రోసివైచి మిగిలినది నిజమని మన్నించుటెట్లు? కడు పురాతన సామ్యం కోడి పెట్టను ఆచార్య శంకరులుదహరించి నారు. పెట్టను రెండుగా ఖండించి ఒక భాగము వంటకానికీ, రెండవది గ్రుడ్లిడుటకూ ప్రత్యేకించినట్లు, అని. ఈ రెండు ప్రయోజనాల్లో ఏదో ఒకటిని వదలుకొని, రెండవ దానితో తృప్తిపడవలె; కోసి వండి తినుటకో, బ్రదికి గ్రుడ్లిడుటకో పెట్టను పూర్ణముగా వినియోగించుకోవలె. సరిగా అదే రీతిగా పై త్రిపుటి నంతటిని, అద్వైత ఆధ్యాత్మంలో, శంకరు లిచ్చినయర్థంలో, మిథ్యయని పరిత్యజించుటో, లోకాయతుల దేవతాధికరణుల యర్థం లో సత్యమని పరిగ్రహించుటో నిశ్చయించుకోవలె. మధ్యమార్గమే లేదు.

ఈశ్వర భావన జగజ్జీవుల నపేక్షిస్తుంది. జడపదార్థమే యైన జగత్తునిశ్చేతనమూ అగతికమూగనుక, నిరవధిక చేతనుడైన ఈశ్వరునికి అది విపరీతం. జీవాత్మ నియమితం; అపరమితుడగు ఈశ్వరునికి అదియు విరుద్ధమే. ఇట్లు ఈశ్వరుడు రెండు ద్వంద్వములలోనూ భాగ స్వామి, ఆ ప్రతికూలములు రెంటికీ ఉనికి అహంకారి మనస్సుంటేనే. కాబట్టి ఈశ్వరుడు వాస్తవిక (Objective) సత్యం కాదు.

మరొక విధంగానూ యోచించవచ్చు. ఉన్నవిధిగా గాక, ఈశ్వరుని త్రిపుటిలో ఒకనిగా భావిస్తే. అతడు యోచనా విషయం కావలె. అప్పుడతడు యోచించువాడు, యోచింపబడునది, యోచన అన్న త్రిపుటిలోనొకడు. అహమిక ధర్మాన త్రిపులుటలన్నీ అజ్ఞాన భూమిక లోనివే. ఆ విధంగానూ ఈవ్వరుడు వాస్తవిక సత్యం కాజాలడు.

దీనినే మహర్షి ఇట్లు విశదం చేశారు : '' ద్వంద్వములు, త్రిపుటులు ఇవి ఎప్పుడునూ ఒక దాని నాశ్రయించి యుండునవి. అదియెది యని వెదకి మనస్సులో జూడగనవి వీడును; చూచిన వారేతత్త్వమును జూచినవారు, కలత నొందని వారు.''1

_________

1. చూ. అనుబంధం, ''క'', శ్లో. 14 : ఉ. న. 9.

ప్రపంచంనుండి యీ ద్వంద్వములనూ త్రిపుటులను ఉపసంహరిస్తే కాలదేశాలు తప్ప మిగిలేదేమీ లేదు. ఈ రెండుగూడ సాపేక్షాలేయని తెలిసి యున్నాము. అహంతానాశ##మైన పిదప మిగిలేది అని భాజ్యమగు ఆత్మ యొక్కటే.

ఈశ్వరుడు ఈశ్వర మాత్రంగా మిథ్యయనుటకిట మరియొక ఉపపత్తి. నాహం స్థితిలో స్వస్వరూపాని కన్యంగా దైవం లేదని ఋషులు. ఈశ్వరతకు అన్యతే ప్రాణాధారం. నిజంగా అన్యతలేకాలోచనే లేదు. దైవం బ్రహ్మముగా ఆలోచనా విషయం కాదు.

తత్త్వతః స్వస్వరూపానికి వేరుగా బ్రహ్మమేలేదు. ఆత్మ, సద్వస్తువు, చైతన్యము - యివన్నీ బ్రహ్మమునకు పేళ్ళు, ఆ రీతిగా బ్రహ్మము, వ్యక్తి కాదు. జడజీవగత్తుతో అతనికే ప్రమేయమూలేదు. బ్రహ్మమునకు ప్రపంచమునకూ ఉన్నదనుకొనే కారణ - కార్య సంబంధం ఏమాత్రం నిజం కాదు. దేనితోనైనా ఎట్లు సంబంధించి యున్నా అది ఋషులు నిర్వచించిన సత్యం కానేరదు.

శంకరుల యుదాహరణలను బట్టి చూస్తే ఉపనిషద్దర్శనాల ఆలంబ విషయం దైవ స్వరూప స్థితుల అభిన్నతను ప్రస్తుతించుటే, ఈ చెప్పుట మాట మాత్రనేగాక, వీలయిన అన్ని విధాల దృఢీకరించుటయునైనది : బోధనొల్లని వారికి దండనలు, అంగీకరించి శ్రద్ధమై దానిని స్వానుభవానికి తెచ్చుకోయత్నించే వారి కనుగ్రహము నాశాసించినవి.

''ఇతర దైవతముల నుపాసించుచు, వాడువేరు నేను వేరని ఎన్ను వాడు ఎఱుగడు. అట్టివాడు దైవ దృష్టిలో పశుసముడే.''2

_______

2. యోన7న్యాం దేవతాముపాస్తే, అన్యో7సావనో7హమస్మీతి, న సవేద | యయా పశురేవం సదేవానామ్‌ || బృహదారణ్య కోపనిషత్‌ I.iv.10,

''అగోచరము, ఉపాధిరహితమూ, అనిర్వచనీయమూ, అనిలయమూ గల బ్రహ్మమునందు సుప్రతిష్ఠితునికి అభయము సిద్ధించును. ఇందు భేదము ఏ లేశముచూపినను వానికి భయముతప్పదు. ఆత్మ సత్యమును యధాన్యాయ మెఱుగని వాని భయమునకు గలతత్వ మిదియే.''3

''ఇచ్చట భేదము పరికించువాడు మృత్యువునుండి మృత్యువునను గమనించుచునే యుండును.''4

ఉన్న రూపుగ దైవమునకు నామరూపములు లేవు; ఎట్టి గుణ ములును లేవు. గుణములున్న సాపేక్షమయి, అందువల్ల మిథ్య¸°నుగదా?

బ్రహ్మము నధికరించి ఋషులు వినిచిన పరమ సత్యమిదియే. ఈ పద్ధతిలో సృష్టి క్రమ వివరణం కష్టమనిపించవచ్చు. దీనిను త్తరించటానికి శంకరులొకమార్గం సూచించారు సత్యమును యధాస్వరూపంగా, అదే సృష్టి కారణముగా కూడ బోధించుటకు వీలయ్యేటట్లు విడమరిచారు. మొదటిది పరబ్రహ్మము, రెండవది అపరబ్రహ్మము, వానినే నిర్బీజ సబీజములని, నిర్గుణ సగుణములని పేర్కొన్నారు. ఆ పిదపటివానిని ఈశ్వరుడని, ఇష్టదైవమని కూడ వ్యవహరిస్తారు.

ఈ రెండు తీరులను, ఒకటిని మరొకటిగా భ్రమించి బ్రహ్మమేయిన్ని రూపులైనాడని కొందరివాదం. వారూ వైదిక ధర్శనాల నుండే తమకనుకూలములుగా నగపడే వాక్యాలనుద్థరిస్తారు. అవే

____________

3. యదాహ్యే వైష ఏతస్మిన్నదృశ్యే7న్నాత్మ్యే7నిరుక్తే7నిలయేనే7భయం ప్రతిష్ఠాం విందతే | అథసో 7 భయం గతో భవతి. యదాహ్యేవైష ఏతస్మిన్నుదర మంతరం కురుతే | అథ తస్య భయం భవతి. తస్యేవ భయం విదుషో7మన్వానస్య ||

- తైత్తిరీయోపనిషత్‌, బ్రహానందవల్లి vii.I.

4. మృత్యోస్స మృత్యు మాప్నోతి య ఇహ నానేవ పశ్యతి | కారకోపనిషత్‌ iv. 10, 11.

గ్రంధాలలోని పూర్వాపర వాక్యాలను సమన్వయ పఱచుకొనక, గ్రంధం యొక్క పరమ తాత్పర్యాన్నొప్పరికించి, వాచ్యార్థమాత్రం తో తృప్తిపడి తమ వాదన సాగిస్తారు. యధాశబ్దంగా అర్థగ్రహణం. కూడదని, వ్యాఖ్యల భాష్యముల హెచ్చరికలు కోకొల్లలు. పై సమస్యను పరిష్కరిస్తూ మహర్షి :

''సాధనయందు ద్వైతమే, సాధ్యమందే అద్వైతము, అనువారల వాదమునూ వాస్తవముగాదు. ఆదరముతో దాను పదియవ వానిని వెదకు కాలమునందును, తనను తాను పొందిన కాలమునందును తాను పదియవవాడేగాక మఱి యెవడు?.5

వాదమునూ అనుటలో పరామర్శించని మరియొక వాదంగూడ తప్పు అనుటైనది. ఇట్లిచ్చట రెండు విలక్షణ సిద్ధాంతాల కండన మున్నది : ఒకటి వాచ్యంగా, రెండవది ధ్వనిగా : ద్వైతం సదా మోక్షపదంలోనూ వర్తిల్లుననుట యొకటి; రెండవది, ద్వైతం ప్రస్తుతానికే, ఏదేని అధ్యాత్మవిధానంవల్ల అద్వైత భావన సిద్ధించిన వరకే అని. ఆ మొదటిది ద్వైత సిద్ధాంతం. ఋషి నం నాహంస్థితి లో పొందిన ఆత్మసాక్షాత్కారం దృష్ట్యా, మహర్షి యన్నట్లు, ద్వైత సిద్ధాంతం నిస్సందేహంగా దోషయుతమే. సత్యాన్ని ఋషులు నిర్వచించిన క్రమంలో, ఆ రెండవ పక్షమూ అపరిగ్రహ్యమే.

ద్వైతం నిర్వచించిన క్రమంలో సత్యమైతే, అది నిత్యమూ కావలె; ఏ విధంగానూ అద్వైతసిద్ధికి అవకాశం లేదు. నాహం స్థితి లోని అద్వైతం విచారం వల్ల గాని మరేమార్గానగాని ప్రయత్న కార్యమని సమ్మతిస్తే, అది అయధార్థం; దాని కాదియుంది, అంతమూ ఉంటుంది. కారణశక్తి ప్రభావమున్నంతకే కార్యం వర్తిస్తుంది.

________

5. చూ. అనుబంధం. 'క'. 42 : ఉ. న. 37.

సావధికమైన కారణం (కర్మ) నిరవధిక ఫల మీజాలదని ఉపనిషత్తులు నిర్థారించే ఉన్నవి. దీనికే నిరూపణమూ అక్కర్లేదు. మనఅనుభవమే సాక్ష్యం. మోక్షస్థితి నెవ్వరూ అనంతం కాదనరు. మోక్షమేదో విశిష్టలోక నివాసమనేవారుగూడా అటనుండి అధోలోకాలకు తిరిగి రాక ననుమతింపరు.

ముక్తిలోనూ వైశిష్ట్యాన్ని ప్రతిపాదించే ద్వైతుల్లో తర్కం లేకపోలేదు. వచ్చిన కష్టమేమంటే వారు తమ సిద్ధాంతంతో ఋషుల ప్రమాణాలను ఓడించలేకపోయారు. అందువల్ల తమ్ము సమర్థించు కొనేందుకై ఆ ప్రమాణాన్ని నిరాకరిస్తారు.

అట్లుగాక ఋషుల అనుభవంతో తమసిద్ధాంత సమన్వయం కోరే ద్వైతులది వికల్పస్థితి. అజ్ఞాన మున్న వరకూ భేద మున్నదంటే మోక్షానికొక ఆరంభాన్ని అంగీకరించవలె; కాని దానివలని తప్పని సరి ఫలితమైన మోక్షాంతం ఒప్పుకో నిష్టపడరు. కాదు, మోక్షమ నాది, అనంతమనేటైతే అద్వైతులవలె వైశిష్ట్యాన్ని భ్రాంతిగా పరిగణించవలె.

దీనికి సరిగాధ యొకటి. గ్రామస్థులు పదిమంది దారిలోని నదిని దాటి అందరూ క్షేమంగా వచ్చామా అని తమ్ములెక్కించుకున్నారు: కాని లెక్కించిన ప్రతివాడూ తన్ను మినహయించాడు. తొమ్మిది మందే తేలేవారు. దశముడు నష్టమైనాడని ఒకే ఏడుపులూ, పెడ బొబ్బలూ, ఆదారినే వచ్చినతడొకడు వారి దుఃఖ కారణమడిగి పరికించి చూస్తే పదిమంది ఉన్నారు. వారిపొరబాటు అతడు గ్రహించి వారికి నమ్మజెప్పటానికి, వారిలో నొక్కొక్కని వీపునా ఒక్కో దెబ్బ వేస్తాను, ఆ దెబ్బలను లెక్కించమని వారిలో నొక్కని కాదేశించాడు. వాడు తొమ్మిది దెబ్బలూ లెక్కించాక, వాని వీపునా ఒకటి వడ్డించాడు. దానితో వారు పదిమందీ ఉన్నట్లు తేలింది. ఆ లెక్క పెట్టినవాడు సరిగా కూడియుంటే ఆ దశముడు తానేయని గుర్తించే ఉండేవాడు. అంతకాలమూ తాను దశముడే, తన ఉపలబ్ధికిమునుపూ వెనుకాకూడా. ఎక్కడనుంచీ ఏ క్రొత్తవాణ్ణీ రావించలేదు. వానిని కనుగొన్న సమయాన దశముడైనతడు అంతకు పూర్వమూ దశముడే. అట్లే స్వభావస్థితి సదా ఏకైక సత్యమే, అజ్ఞాన నాశానికి ముందూ, వెనుకా గూడా

నిజంగా అజ్ఞానం కల్పించిన జగజ్జీవేశ్వరుల అస్తిత్వమెంతో దాని ఉనికీ అంతియే. సద్వస్తువున కజ్ఞాన మెక్కడిది? అది ఊహా మాత్రమే, బోధనవతగతం చేసే సాధనం, అజ్ఞానం అహమి కేయని దానికి నిలకడే లేదని తెలిసయే యున్నాం, కాబట్టి సర్వసృష్టికీ మూలమైన అజ్ఞానం ఇప్పుడూ లేదు. సత్తు ఏకము, అద్వితీయము ఎప్పుడూ యిప్పుడూను. అది నిష్ప్రపంచము. అందుచేత సత్యం నిజంగానే మార్పు చెందిందనీ, ఆ ఒక్కటి నిజంగానే మూడయిందనీ మనమూహింప వలను గాదు. అది వికారానికగ్గమే అయ్యేటైతే మనం తప్పించుకోనెంచే విషమ సంస్కృతి చక్రంనుండి మనలనది ఎట్లు రక్షింపగలదు? సరిగా గౌతమ బుద్ధు లన్నట్లు ''సత్యమవికారమూ, అవికార్యమూ కాకపోతే ఈ సంసారం నుండి మను ముక్తి లేదు.'' వారు ప్రకటించారు; ''ఎప్పుడునూ మారని మార్చ రాని సత్యమొకటున్నది. కావుననే మనము విమోచన మందగలము.'' సత్‌ మార్పులేనిదని ఒప్పుకుంటే అది ఈ ప్రపంచానికి ఉపాదాన నిమిత్తకారణములలో నేదియు కాజాలదని అంగీకరింపవలె.

ఈశ్వరుని యాధార్థ్యమెట్టిది. భక్తులు భావించెడి దైవం సాపేక్ష సత్యం.

ఈశ్వరుని వ్యక్తిగా భావించువాడు తన్నూవ్యక్తిగానే భావిస్తాడు. ఇష్టదైవానికి రూపముండవలె - స్థూలమో సూక్ష్మమో, భౌతికమో మానసికమో

వ్యక్తిత్వమంటే అన్యమెట్టి యపేక్షాలేని స్వయంస్థితి. అట్టి యునికి స్వకీయమనుకోవటానికి అహమిక ఆధారం. అహమిక తనకు చేతన తెలివులూ గలవని ఎఱుగును. ఆ చేతన దానిది గాదు; ఆత్మయగు శుద్ధచైతన్యంలో అల్పాల్పమగు అంశం, అద్దమునందలి రవిబింబకాంతి సూర్యకాంతియం దణీయాంశ##మైనట్లు. మనస్సునకు, లేక, జీవాత్మకు చేతన రూపించుటను వైదిక దర్శనములునూమహర్షి యూ చోరకృత్యంగా వర్ణించినారు. ఈ చౌర్యానికి ప్రతిగా మనస్సును, అందులో ప్రతిఫలించే సత్యానికి అర్పించవలె, సత్యమాత్మ యని ఎఱుగుటే అట్టి అర్పణం. గీతాబోధయందలి తుది చరణంలో ఈ యర్థాన్నే భావింప తగునని పెద్దలన్నారు; - ''సర్వధర్మాన్‌ పరిత్యజ్య, మామేకం శరణం వ్రజ'' - (మీ) ''ధర్మములన్నిటినీ అర్పించి నన్ను, ఏకమును, ఆశ్రయింపుము.'' అని. ఇచట ధర్మమును విస్తృతార్థమున గైకొనవలె. ధర్మమంటే విదులూ నడతలూఏ కావు, 'పదవులూ అళీక ఆరోపిత అభిమానములూ'' అని. జీవాత్మయభిమాన ముల మాట. వానిలో ప్రథమమూ ప్రముఖమూ అయినదివ్యక్తిత్వం. అర్పింపవలసిన దీవ్యక్తిత్వము నన్నారు మహర్షి.

ఈ అర్పణావిధానమే ఆత్మవిచారము.

-*-

Mahayogama    Chapters