Mahayogama    Chapters   

ఓమ్‌

మహాయోగము

0 మహర్షి

-*-

మన యీ చర్చల్లో చాల గహనమైన అంశం మహర్షియే. బాహ్యానికి సాపేక్ష స్థితిలో నున్నట్లు కనబడినా వారు దానికవ్వలిస్థితి లోను సమకాలంలోనే ఉన్నారు. ఆరెండు స్థితులూ పరస్పర విరుద్ధాలు, అన్యాపేక్ష, స్వయంస్థితి ఒకటొకటిని కాదంటాయి. ఈవిషయంలో శిష్యులకు కలిగే భ్రమాక్లేశాలకు మూలమదియే.

గ్రంధాలు ముక్తినివ రెండు విధాల పేర్కొనన్నాయి. అందు ఋషి బ్రదికి యున్నప్పదికి ఒకటి. రెండవ దానిలో అతని దొక తనువు గతిస్తే వేరొక ఉపాధి ఉంటుంది. మొదటిది జీవన్ముక్తి; అది గల ఋషి జీనన్ముక్తుడు. రెండవస్థితి విదేహముక్తి (అశరీరముక్తి), కాని మహర్షికి ముక్తి ఒకే ఒకటి అని శ్రీరమణుల నిర్ణయం , అది అహంతా అభావము. అహమిక లేక జగమే లేనందున, ఋషి యెట్ల గపించినా, నిజంగా ఆయనకు దేహమెక్కడిది? తను మనములు కల్ల లని తెలియనేరక ఋషి కవి యున్నవనే వారు మూలాజ్ఞానమైన కారణశరీరం మహర్షికి మఱిగి పోయింని తెలియలేరా? అందువల్ల కేవలం సద్వస్తువే అయిన మహర్షికి, తెలియని వారూహించేట్లు, సూక్ష్మదేహాలతో ఎట్టి సంబంధమూలేదు. ఋషికి తనకన్యమేది లేదు దేహము, మనస్సు, జగత్తు, ఇతరవ్యక్తులూ, ఎవ్వరూలేరు. మహర్షి ప్రసక్తికి రెండు దృష్టికోణాలవసరం- అరగొఱ తెలిసిన శిష్యునిదీ, మహర్షిదీని, తనవరకూ యే సమస్యా లేదని, పూర్వాపరాల సమన్వయం మాటే లేదని మహర్షియే పలుమారులు నొక్కి చెప్పినారు. వారిదృష్టికి మూడు శరీరాలు లేవు; వాని ఉనికిని ఎన్నడు అంగీకరించరు. గ్రంధాలు వానిని విశ్లేషిస్తే అది తెలిసీ తెలియని సాధకునికై చెప్పినదే, మోక్షవిషయం గా పరమార్థం, రూపరహితం నిష్ప్రపంచమూ, మోక్షస్థితిలో కేవలసత్యమే భాసిస్తుంది.

ఆ విధంగా జీవన్ముక్తుడు వ్యక్తికాడు, కాని ఆయనివి అన్న రెండు భూమికల దృష్ట్యా , ఆయనొక వ్యక్తిత్వ మాపాదించవలసి వచ్చింది. ఉపనిషత్తులు దీనీ నాదరించి, జీవన్ముక్తిని దేహం, అది కలంతకాలం, కార్యకారణవశ##మే అన్నవి, ఆ రీత్య పూర్వకర్మఫలాలు, అవి ప్రియాలో అప్రియాలో, దేహమనుభవింపవలె. ఈ కర్మలు మూడు తెగలవి. కొన్ని, మహర్షికీ తనువు గూర్చినట్టివి పుట్టుకతోనే ఫలితానికి వచ్చి, తనువు రాలిపోయిన వరకూ జీవితాన్ని అనుశాసిస్తాయి. కర్మఫలప్రారంభాన్నూహించి వీనిన ప్రారబ్ధమన్నారు. మరోక తెగని ఆగామి కర్మలు యిటుపై రాబోయేవి: ఇతరములు సంచితాలు , కాలాంతరాన ఫలించేవి. వీనికి సంఖ్యాబలం హెచ్చు అటుపూర్వ ఎన్నిజన్మలు గడచినవో, ప్రారబ్ధకర్మలు శక్తివంతములనీ, వ్యక్తిత్వం నశించి ఋషిత్వం రాగానే సంచితాగాములు తుడుచుకొని పోతవనీ అంటారు. ఋషికి పునఃజన్మలు లేవు: వారు వేరు లోకాలకూ పోరు. వారు ప్రారబ్ధవర్తమాన ఫలాలనిప్పుడే యనుభవిస్తారని ప్రాచీన గ్రంధాలు కొన్నయెడల తెల్పుతున్నవి. ఇది పూర్తిగా యధార్థంగాదని తరువాత కనుగొంటాము.

మహర్షి సదాసహజసమాధిలో నుంటారని తెలుసుకొన్నాము. ఇది యోగుల కేవల నిర్వకల్పసమాధిగాదు: అది విరళం, మహర్షి కారోపించేస్వయం ప్రేరితాలైన శారీరక క్రియాలకూ సహజస్థితికీ వైరు ధ్యమేమీలేదు. ఒక పక్షంగా, సద్వస్తువు, జగత్తుకూడా మహర్షి ఎఱుకలోనివే ఇతరులలాగే ఆయన అశన శయనాదులాచరిస్తున్నట్లు చూస్తాము. సహజంలో ఉంటారు గనుక ప్రశ్నలను విని సమాధానాలీయనూగలరు. జాగ్రత్‌ సమాధులకు మాటిమాటికీ మారుతుండే యోగితత్త్వబోధకుతగడు: తానే అజ్ఞానీ బద్ధుడూ గదా, సహజ స్థితియే లేకపోతే ప్రత్యక్షమూ పూర్ణమూనైన ఆత్మానుభూతి గల్గి నాతడు ఆక్షణమే అతనుడై అదృశ్యడు కావలె. ఆస్థితిలో సప్రమాణంగా ఆత్మబోధగావించి, దాన్ని సాధించే మార్గం సూచించేందుకు ఎవ్వరు ఎన్నడూ దొరకడు. కాని సహజస్థితి ఉండనూ ఉన్నది. అరుదుగానైననా, దాన్ని అప్పుడప్పుడు సిద్ధింపజేసుకుంటున్నవారు ఉన్నారు. అందువల్ల వైదిక దర్శనాల బోధను స్థిరీకరించటము, సరిదిద్దడము, అవసరమైనచోట దానికి సంయోనమూ, యోగ్యశిష్యావగాహనకై అనూస్యూతంగా ఋషులు చేస్తూనే ఉన్నారు. చరిత్ర కందినంతలో బుద్ధుడూ శంకరులు ఉన్నారు. ఇంకెందరున్నారు. మనకు తెలియదు. ఇప్పుడు ఆ పదవీ స్థితులు మహర్షి రమణులు.

సహజస్థితి స్వరూపం వినకనో అర్థంగాకనో కేవలనిర్వికల్పం వలెనే అదీ శారీరక్రియలకు శత్రువుగాదని తెలియవారొకసంశయం వెలిబుచ్చారు. దాని పరిష్కారం అందరికీ అంత సులువుగా అవగతం కాదు. మహర్షి శిష్యుల్లోనే కొందరాకోవలో నున్నారు. వారు ప్రపంచం ఆరూపున్నే సత్యమన్న సూత్రాన్ని పాటిస్తారు. అదే ప్రాతిపదికయైన విశ్వాసం క్లిష్టమైనా దానిచేత సమ్మోహితులై సహజస్థితి ని గూర్చిన పై అభిప్రాయాన్ని వారు ఒప్పరు. వారి ఊహకు ప్రత్యక్షవిరుద్ధమైనది, జగత్తు తద్రూపేణ మిధ్యయనేదేక కుదురైన మహర్షిసిద్ధాతం. దాన్ని వారు నిరాకరిస్తే చిత్రమేమీ లేదు. నిజానికి వారు ద్వైతులు; అద్వైత సిద్ధాంతమంటే వారికి ద్వేషం.

భక్తుల బలహీనతల యెడ మహర్షిచూపే కరుణా సహనము లెంత మెత్తనో ఈ సందర్భంలో స్మరించవలె. ఎవరి విశ్వాసాన్నీ, విచలితం జేయరాదన్న గీత ప్రతిపాదనను మహర్షి. జనదాటక అనుష్టిస్తారు. తమ మాటల్లో వారు చాల జాగ్రత్త వహిస్తారు. తీవ్రద్వైతులు సన్నిధిలో ఉంటే వారి ఎదుట అద్వైతాన్ని నిరాఘాటంగా చాటరు. కాని వారటు వెళ్ళగనే అచటి అద్వైతులతో ఏదో దోషాన్ని ఒప్పుకొనే రీతిగా, ద్వైతుల మనస్సు నొవ్వనట్లు తమ బోధను మలచాలనని విశదీకరిస్తారు. అంటే ద్వైతులు వివరమెఱుగనివారు: అద్వైతులు అర్హవయస్కులు. ద్వైతుల్లాంటి వారి యెడల కొన్ని సళ్ళింపు లవసరమంటే, ఆపాటి అర్థం చేసుకొనగలరిని మహర్షి భావం. అదెట్లన్నా, కేవల మద్వైతమే పరమ సిద్దాంతమును టలో వారెట్టి సంశయానికి తావీయరు.*

మహర్షినిగూర్చి రెండు విధాల అభిప్రాయాలున్నవి. వారి భక్తుల్లో కొందరు వారిపాద సన్నిధి నెఱగరు, కాని తాము ప్రకటంగా అద్వైతుల మనేవారు. వారి శిష్యుల్లోనే మరికొందరు వారి చరణసేవ చేసుకుంటూనే మహార్షి అద్వైత బోధకు తీవ్ర వ్యతిరేకులు.

ప్రధముల యూహలో ''రమణ మహర్షి పేరిటి వ్యక్తి యీ జగతిలో అందరిలాగే జీవిస్తున్నాడు. భేదమేమీలేదు - భోజనం, శయనం, భాషణం, వర్తనం, అన్ని పనులూ చేస్తూనే ఉన్నాడు. గతాన్ని జ్ఞప్తి యుంచుకొని ప్రశ్నలకు ఉత్తరాలిస్తాడు. మనలాగే ఆయానా 'నేను' నీవు' వాడు' అని వాడతాడు. కాబట్టి ఆయన జీవన్ముక్తుడు కాడు. ఆయన్ను మహాత్ముడనండి ఒప్పుకోవడాని కభ్యంతరం

_____________

*మహర్షి పలుమార్లు దీన్ని దన్ని దృఢపఱిచారు. ఒకరొకపుస్తకం రచించారు. అందొక చోట - తన భిన్నరూపు లన్నిటితోను యీ ప్రపంచం, తద్రూపేణ, నిజమైతేనే సత్యం పూర్ణసత్యం కాగల్గేది, మరో విధంగా కాదు' అని ఉంది దాన్ని 'మహాయేగ' రచయిత పైకి చదువుతుంటే మహర్షి అధిక్షేపించారు; '' అవునవును; మరోవిధంగా నైతే సత్యం వికృత మౌనేమో!''

లేదు,'' ఇట్టి వీరితో మనకేపేచీలేదు. వారిదృష్టిలో పరమస్థితి కేవల నిర్వకల్పమనేది స్పష్టమే. అందరితో మెదలుతూనే మహర్షిసత్యాత్మగా భాసించగలడని వారు గ్రహింపలేరు. స్వస్వరూపంలో నిక్కమైన భక్తి యుంటేనే మహర్షిని గుర్తించనౌతుంది. భక్తిలో సంస్కారయుత సద్భావము, వినయశీల మాది సుగుణ సంపత్తి సూచితమే, అట్టివానికే నిజంగా మహర్షి యంటే తఱుగని, అనుకర్హ, ఇతరులు, వారిలోను, వేదనిష్ణాతులున్నా, సంస్కృతివ బంధాన్ని హృదయానికి హత్తుకొనే వారు, వారు మహర్షియెడ నెట్టి యాకర్షణా చూడరు, ఇహజీవనంలో సిరిసంపత్తులలో తాము సుఖంగా ఉన్నా మనుకొనే వాళ్ళు, మహర్షి యొద్దకు వెళ్ళితే బహుశః తమ లౌకిక దృష్టిమార్తురేమో, దాని ఫలితాలెట్లుండనో అన్న భయమూ వారికుండవచ్చు. ఆ భీతివల్లనే వారు మహర్షి దరిదాపులకు పోక దూరంగా 'భద్రంగా' ఉంటారు.

సమర్ధుడగు గురునికై తపించి మహర్షిచే ఆ కృష్టులైనవారు రమణులను అపూర్వమూర్తిగా పరిగణిస్తారు. రమణులు ఋషియని గ్రహించడానికి వారికి కొంతకాలం పట్టవచ్చు. ఋషి యెవరో, వారి నెన్నడూపాయని లక్షణాలెట్టివో వారెఱుగరు. అట్టి లక్షణాల్లో ముఖ్యమైనది అభేదదృష్ఠి లేక సమదృష్టి.

మహర్షి శిష్యగణంలో ఆ రెండవ తెగవారు. వారు మతశాఖవేరు, వారి దృష్ట్యా రమణులు ఋషియేగాని, వారు వ్యక్తిత్వాన్ని నిల్పుకొనే యున్నారు. వారు ఉత్తమ పురుషులు , ఈ శిష్యులగణనంలో వ్యక్తిత్వము సత్యం. మోక్షసిద్దితో అహమిక నశించినా, ఆ స్థితి లోనూ వ్యక్తిత్వం మిగిలే ఉంటుంది. మహర్షికి మనస్సున్నది కాబట్టి విశిష్టమైన జీవనమూ ఉంది. ముక్త పదవిలో మనస్సు అద్భుతంగా మారి దివ్యసిద్ధులలవరుచుకొంటుంది.'' ఈ శక్తులకు వారుపరమ ప్రాముఖ్యమిస్తారు. ఈ శక్తులే ఋషిని నిరూపించేయని వారి భావనగా తోస్తుంది.

ఈశ్వరచర్చాప్రకరణంలో గుర్తించినట్లు మహర్షి బోధసారం ఆత్మ'' స్థితియే'' గాని ఆత్మ ''అగుట'' కాదు. అని వాస్తవంగా సత్యం త్రిమూర్తులు కాలేదు. అవి తానే మిధ్యయైన అహంత కల్పించినవి. ఇదంతయు మాయయే యన్న శంకరులతో మహర్షి ఏకిభవిస్తారు. వారు వివరించేట్లు, మోక్షమంటే సదాశూన్యాన్ని శూన్యం కానీయడమే, త్రిధాదృశ్యమానం ఇప్పుడూ మిధ్యయే కాని అజ్ఞానం వల్ల సత్యంగా ప్రతీయమానమవుతున్నది ఆదృశ్యం ఒకప్పుడు గోచరమై, పిదప అగోచరమైన దనరాని యట్లుగా మఱిగిపోతుంది. దీనిని వారు గుర్వనుగ్రహంవల్ల ప్రాప్యాన్ని వర్ణించుపట్ల స్పష్టం జేశారు. ''అసత్తును అసత్తునే గావిస్తూ సత్యాత్మను వెలిగింపజేస్తూ గురువు మృషయగు జీవాత్మను నిరవశేషం జేస్తాడు''. ఆబోధలతో పై విమతుల యభిప్రాయాలను సమస్వయం జేయ వీలుగాదు.

యోగుల దృష్టిలో సిద్ధులు అత్యంత ప్రకర్షగలవి. కానియవి నిజంగా కల్లలు; అవి బంధమూలమైన మిధ్యాజగత్తులో భాగం మహర్షి వచించేట్లు, ఒక ఋషి మహనీయతను వారి సన్నిధిని వ్యక్తములనుకొనే సిద్ధులు నిరూపించునని భావించుటం నవ్వుచేటు2.

'అభవితా'3 యధార్థ్యాన్ని నిరాకరించనందున్నే ఈ శిష్యుల అగ్రహణమూ, విపరీత గ్రహణమూ అందులో నొకటిని మహర్షి యే

--------------------------------

1. చూ. అనుబంధం'చ' శ్లో.132

2. మానసికంగా ఎట్టి తుల్య నిరూపణగాని పై ఆక్షేపాని కగ్గమయ్యేదే.కొందరు విమర్శకులు అతిశయంగా భావించే బుద్ధి. జగన్మిధ్యాత్వంలో భాగమైన సిద్ధులు సాటిదే. అసలు తుల్యనిరూపణబుద్ధి సాపేక్షము; అగుట అది శుద్ధాద్వైతానికి ప్రత్యక్ష విరుద్ధము.

3. 'అభవితా' పదాన్ని 'అగుటలేమి' అన్నదానికి పర్యాయంగా వాడినాను---- అను.

సరిదిద్దారు: '' తెలియనివారంటారు, మీ మహర్షి భేదం చూస్తారు. కాని వానిలో అభేదాన్ని ఆమోదిస్తారు' అని ''4

భేదాన్ని చూడమి రెండు విధాలు. తనకు ఒరులకూ , ఒరుల్లో వారలో వారికి , మొదటిది మహర్షి తుల్యనిందాస్తుతి వ్యక్తం చేస్తుంది. రెండవదానిని''సమదృష్టి'' యంటారు. ఈ పదం గీతాశ్లోకంలో వాడి యున్నారు. పండితులన్నిటా సమదర్శులని, ఈశ్లోక విషయంలో ప్రబలిన అనభిజ్ఞత అంతాయింతా కాదు.

తుల్యనిందాస్తుతి ఋషుల విశిష్ట లక్షణం. పొగడినా తెగడినా సర్వధా నిరహంకారి యొకనికే అచలిత నుండసాధ్యం. మొదటిప్రకరణంలోని తృణతులితాఖిల జగతాం (అఖిల లోకములను తృణతుల్యముగ దలచినవారు) ఇదే సూచిస్తుంది. ఈ సందర్బంగా ఇటీవలి యొక ఋషిని గూర్చిన ఉపాఖ్యానమున్నది. ఇదివారు ఋషిత్వం సాధించక పూర్వమునుకోవలె. వారు చిన్నవాడే సంపారము త్యజించి మోక్షార్థియై యడవుల బట్టిపోతూ సమాధి నభ్యసిస్తూ ఉండినారు. ఒకమారెక్కడో ఆయన సహాధ్యాయి ఒకరతన్ని కలుసుకొవటం తటస్థించింది. అతని దీక్షసాధనలజూచి ఆ మిత్రుడా యన్ను సమ్ముఖాననే ఎంతో శ్లాఘించాడు ఆయన ప్రకటంగానే ఎంతో ఉబ్బిపోయాడు. అదిచూచి ఆమిత్రుని కాశ్చర్యమైంది, ఇంతమహాత్ముడేమి, యీ పాటిపొగడ్తకింత తబ్బిబ్బులేమి, యని అతడేమీదాచక ఆయన మొహాన్ని అడిగివేశాడు. అప్పుడా ఋషిపల్కినదే ఆశ్లోకం.6 అహంత యేలేశం మిగిలియున్నా స్తుతినందల కయత్నంగానే మోద

-----------------------------------

4.చూ.అనుబంధం, 'చ' శ్లో.338

5. విద్యావినయసంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని

శునిచైవశ్వపాకేచపండితాః సమదర్శినః||

6. చూ.అనుబంధం'క' శ్లో.83; సూక్తిసుధ,37

శోకాలు కలుగుతవి. దీని కపవాదం ఋషి యొక్కడే. మహర్షి యన్నారు. తాను లేని వారెవ్వరు గలరు? తన్నెవ్వరేది చెప్చిన నేమి? తన్నుదానే పొగడు కొనినను, దిట్టుకొనినను ఏమియున్నది? తాను, ఇతరులు, అని చూడక తనస్థితినివీడక, తానెప్పుడుతనయందే యుండవలయును''7

అట్లే పరుల్లో భేదం చూడకుండటం, ఋషుల వైశిష్ట్యం దానినే సమదృష్టియంటారు. భిన్నతప్రాకృతికమైనా, మానవాకృతమైనా, ఋషిపరికించరు. దాని గూర్చిన మహర్షి వచనము: ''కనబడు సర్వమందు నూచిత్‌స్వరూపమగు ఆత్మయొక్కటన్న విజ్ఞానమే ముక్త పురుషుని సమదృష్టి, అదే వేరుమాటల్లో నిరహంత అంటారు. ఆ గీతాశ్లోకతాత్పర్యమూయిదే. ఈ సమదృష్టి అహంకారయుతులకుగాదు. అంతటనూ వారు తమ్ముజూడలేరు. సమదృష్టియంటే మానవమాత్రులందరూ సమాలనిగాదు.ఆబోధ యూహించేది సమానతనుగాదు, ఏకతను అది అహంతానాశ##మైతేగాని కలిగేది కాదు. ఈ సంబంధంలో అద్వైతం ఆచరణలోకారాదని జ్ఞప్తి యుంచుకోవలె.

మహర్షి సమదృష్టిని కొందరు భేదంలో అభేదాన్ని పాటించుటగా గణిస్తారు. అది పొరబాటు ఈ వర్ణన విమత శిష్యులది. జీవన్మక్తుడు భేదమును చూచుచున్నా అందలి అభేదమును అనుభవిస్తాడు. అని ఈ చిత్రీకరణము చూడ ముచ్చటగానున్న పై వివరించిన అభవితా సూత్రానికిది విరుద్ధం వారిని గూర్తిచే మహర్షి యున్నది: అది అజ్ఞుల అసదుక్తి ముక్తడు ఎందునూ భేదము చూడడు'.

-------------------------------------------------

7. చూ. అనుబంధం'క' శ్లో.84: సూక్తి సుధ,38

8. చూ.అనుబంధం, చ.శ్లో.341

9. చూ.అనుబంధం 'చ' శ్లో.388

పై అభిప్రాయాల్లో ప్రధానభేదమెక్కడంటే, కర్తకు విషయానికి కలభేదము అద్వైత లేక నాహం స్థితిలో మిగిలి యుండదు. ఆ స్థితిలో విషయజ్ఞానమే యుండదు. కావున 'మహర్షి అభేదాన్ని చూచు' ననటం అను పన్నం: అంతకన్నా 'మహర్షి భేదాన్ని చూడ' ననటం అను పన్నం: అంతకన్నా 'మహర్షి భేదాన్ని చూడ' రనటం యుక్తం భేదమును తెలిసీ మూలంలో వాని ఐఖ్యమును మహర్షి గుర్తిస్తారిని బహుశః యీవిమర్శకుల యభిప్రాయంకావచ్చు. అయితే యీ 'ఏకతావిజ్ఞాన,' అనుభూతమా , అనుమితమా? భేదము చూచినంతవరకు, అనగా అహంత మిగిలి యున్నంతకాలం, ఏకతా జ్ఞానం అనుమితమూ పరోక్షమూ కాగలదేగాని అనుభూతము కాజాలదని శ్రుతులు విశదం చేసియున్నవి. వారి దృష్ట్యామహర్షికి ఏకత లేక అభేదజ్ఞానం అనుభూతం కాదన్నమాట. అది హాస్యాస్పదం.

ఈ విమతుల వాదం మరియొటి, ఋషికీ ఋషికీ మధ్యవైశిష్ట్యం పాలించేందుకేదో ఆధారం ఉండవలెనని. అంటే అట్టివైలక్షణ్యం ఉందనీ, దాన్ని నిరూపిస్తూ ప్రతిఋషికీ వేర్వేరు సూక్ష్మదేహం కల దనిన్నీ. కాని సూక్ష్మదేహం అహమిక భిన్నమని మనంచూచాము. అవి రెండు పరస్పర విరుద్ధాలను - ఆత్మదేహాలను కలిపే లంకే మాత్రమే . మరి ఋషికీ ఋషికీ బేధమెక్కడిది? ఋషి ఆత్మను తెలుసుకొనుటాలేదు. అనుభవించుటాలేదు. అతడాత్మయే దీనిపై మహర్షి వాక్యమిట్లు: '' ఈ మహాత్ముని చూచితిని; ఆ మహాత్ముని గూడ చూచెదను అని పలికేవాడు అజ్ఞాని, అనుభవమూలముగా లోనున్న మహాత్ముని ఎఱుగగల్గితే, ఋషులందరూ ఏకమని తెలియగలము.

అనవచ్చు మనం మహర్షి తనువునూ చూస్తాం , ప్రవృత్తమైన వారి మనస్సునూ చూస్తామని. కాని అలాగే యితరుల తను మన మనస్సులనూ చూస్తున్నాము. తత్త్వమని మిధ్యలంటున్నది, నిజంగా చూస్తే మహర్షికి మనోదేహాలు కల్పిస్తున్నది మన మనస్సు అది అలాగే జగత్తునూ ఈశ్వరుణ్ణి సైతం సృష్టిస్తున్నది. అజ్ఞాననిద్రలోని సాపేక్ష స్వప్నంలో మహర్షిని ఒక వ్యక్తిగా చూస్తున్నాము. 'గురురమణ వచనమాల'లో ఉన్నట్లు మహర్షివిగా గోచరించే మనోదేహములు, నిజంగా గగనమువలె స్పర్శకందనివి, కేవలము చూచువాని మనోదేహ ప్రతిబింబములు. అవి సత్యములు కావు''11 ఒరులమాట యెటున్నా మహర్షి శిష్యగణానికి వారిని దేమధారిగా భావించటం తగవుకాదు. ఆ గ్రంధంలోనే మరోకచోట;''పూర్ణుడునూ, చిత్‌ స్వరూపుడు నూ ఆత్ముడును, నరునివలె గోచిరంచువాడును అగు గురువును శరీరమాత్రమని తలచువానిని , పాపిష్టినిగ దురాశయునిగ ఎన్ననగును.'

శిష్యులలో అసక్వ బుద్ధులగు వారు పైదెల్పిన తప్పిదం చేయటం అసంభం గాదు. కరిగిపోయినది కారణ శరీరం, ఇతరుములు రెండూ మిగిలేయున్న వని వారు వాదించవచ్చును. వారు తాత్కాలానికుపయుక్తమైన యీ ఆప్రాజ్ఞదశను దాటి యెదుగవలె. దేహ రహిత చిద్రూపునిగ గురునే మన్నించని తాను ఆస్థితినెన్నడేని చేర నాసించ గలడా?

అసలు స్థితి అది. అందరివలె తానూ లోవ్యవహారలల్లో పాల్గొనేట్లున్నా యదార్థంగా మహర్షి శుద్ధ చిద్రూపులని గ్రహించవలె. ఆ స్థితిని మనోదేహ ప్రవృత్తులకు సాక్షిమాత్రంగానే అననూవీలులేదు. మహర్షి లోక దృష్టిఅందరకీ ఉన్నట్టిదేనా? అని యడిగితే వారన్నారు:'' కేవలం అజ్ఞలకేగాని మహర్షుల విషయంలో ఆ ప్రశ్నకు తావేలేదు. అహమిక వాని నిట్లడగిస్తున్నది. వానికి నా

-------------------------------

11.చూ.అనుబంధం 'చ' 130

12. చూ అనుబంధం ''చ'' శ్లో. 128

సమాధానమిట్లు:- 'ఆ ప్రశ్న కలిగిందెవరికో వానిమూలం తెలుసుకో ఇతరుల లాగే మహర్షీ చేష్టించడం చూస్తావు. నిజానికి ప్రపంచాన్ని యితరులవలె మహర్షి చూడరు. సినీమా ఉదాహరణం తీసుకొ, తెరమీద చిత్రాలు కదలుతాయి. దగ్గరకిపోయి వానిని పట్టుకోమను వాడు పట్టేది తేరనే, చిత్రాలు అదృశ్యాలు కాగా మిగిలేది తెరయే, మహర్షి అట్లే ఆప్రశ్నకే మహర్షిదే మరోక ఉత్తరమిట్లు - '' తెలియయని వారికిని తెలిసిన వారికిని జగత్తు సత్యమగును. జ్ఞానహీనులకు లోకము మాత్రమే సత్యము. జ్ఞానులకుసత్యము లోకమును కాధారమై అరూపమైనిండి యుండును. ఇదియే వీరలకు గల వ్యత్యాసము'' బాహ్యానికీ జ్ఞానీ అజ్ఞానీ ఒకలాగే ఉంటారు. ఇద్దరు ప్రపంచం సత్యమేనంటారు. కాని ఆ పదముల అన్వయంలో యిర్వురికీచాల వ్యత్యాసముంది. అజ్ఞానికి నానా నామరూపబేధాల తోడి యీ ప్రపంచం ఉన్నరూపుగానే నిజం. నికి నగలలో బంగావారంవలె , భిన్నాకృతుల కాధారమైన వాస్తవిక సత్యభావన లేదు. మహర్షి మిధ్యాజగత్తును వదలి, దాని కాస్తరమైన శుద్ధాతన్మచైతన్యాన్ని సత్యంగాగ్రహిస్తారు. ''ఆత్మసత్యము, జగత్తుకాదు ఏకాత్మ, పూతశుద్ధ చైతన్యస్థితిలో నిష్ప్రపంచంగా నిలుస్తుంది, ఆత్మలేక ప్రపంచాని కస్తిత్వమే లేదు.'' అని మహర్షి అంటారు.

దీనిసారాంశం - ప్రపంచంలో మహర్షి ఎటూపాల్గొనరు. ఏపాత్రా వహించరు. ఆయనివిగా అగపడే క్రియకలాపం నిజంగా ఆయన చేయటం లేదు అహమికా మనస్సులేని ఆయనకు చేష్టించే సంకల్పమే సున్న. జీవులందరి వ్యవహారాలను ప్రోత్సహించి నిర్వహించే ఆశక్తియే మహర్షినీ నడుపుతున్నది. కాని భేదమిది, అజ్ఞులు కర్తృత్వాన్ని తమకారోపించుకొంటారు. మహర్షి అట్లు భావించడు.

--------------------------------------------

13. చూ. అనుబంధము'క' శ్లో?23 ఉ.సి.18

తల్లి తినిపింపగా భుజించే నిద్రిత శిశువులాగా మహర్షి నిస్సంకల్పంగా వ్యవహరిస్తారు. కర్తృత్వం ఎవరికైనా ఆపాదించవలనేవలసి వస్తే అది మహర్షికి గాక దైవానికే కావటం మెఱుగు. ఒక విధంగా దైవమీప్రపంచవిధాతయైతే, మహర్షి కి ప్రపంచంతో ఏతగులమూ లేదు. వస్తుతః నాహంస్థితిలో వారిర్వురు కారు. ఒకరే వారిర్వురులో కరణ మెవ్వరూకారు, ఎవ్వరూ ఆత్మకువేరుకారు, ఆత్మ ఏకమే.

ఆత్మ కరణము(Agent) కాదు. తెలియక కణీకము నాత్మ కారోపించరు. మహర్షి శుద్ధసత్త్వమగు ఆత్మ; శబలితం కాని (Unibariegated) చిత్స్వరూపం. కాబట్టి ఆయనకూ కారకత్వమేమి? ఇదే వారి వచనల్లో "మనము కర్తకర్మలమనిన కర్మఫలభోక్తల మును కాగలము. కర్తయెవ్వడని యడిగి తన్నెఱుగగా కర్తృత్వము పోయి కర్మలు మూడూనూ వీడును. ఇదియే నిత్యముక్తిపదము''.

అను ప్రసక్తంగా మనకు మోక్షం శుద్ధమూ, పరమమూ, నిర్గణమూ అని తెలుస్తుంది. ఇట్లే కొన్ని ఉపనిషత్తులు పల్కినవి. ఋషిత్వం సమకూడి నతనికి కర్మావశేషం కొంత ఉంటుందని, అదే ప్రారబ్ధమని, అతడు తనువు వీగినపుడే అది నిశ్శేషమవుతుందనీ ఉపనిషత్తులే అన్నవి. ఈకర్మఫలభోగం పైకి కనిపించటమేగాని విధాయకం గాదు.మహర్షిదీన్నే నొక్కిపలికారు: జ్ఞానికి సంచితాగామ్యములు కలుగవు; ప్రారబ్ధము మిగులుననుట పరుల ప్రశ్నకు బలుకుమాట; భర్తపోయినతర్వాత వైధవ్యము బొందని భార్య మిగులుకున్నట్లు కర్త పోయిన గర్మత్రయము మిగులదని కనుము.

మహర్షి స్వభావస్థితిలో మనస్సులేదని, వారి బాహ్యవర్తనం వారు సంకల్పించి కాదనీ తెలిపే ఘటన యొకటి :- మహర్షి ఒకమారు

------------------------------------------

14.చూ.అనుబంధం 'క' శ్లో.43: ఉ.న.38

15. చూ, అనుబంధం 'క' శ్లో.79: సూక్తిసుధ,33

అరుణాద్రి పై నెచ్చటికో వెడుతున్నారు. దారిలో దట్టమైన పొద మాటున ఒక జుంజురీగల తుటుముంది. అదిచూడక వారాపొదను కదపటం జరిగింది. కోపంతో రేగిన ఆయీగలు అపరాధి వారికాలిపై ముసరి కుట్టసాగాయి. వానికోపంఆరి అవివాళ్ళిందాకా మహర్షి నిశ్చలంగా నిలిచి కాలితో, 'చేసిందానికి ఫలమనుభవించు'' అన్నారు. ఈ వృత్తాంతం మహర్షియే శిష్యుల్లో పలువురికి చెప్పినందువల్ల అందరికి తెలిసింది. ఆ తర్వాత చాలకాలానికి ఒక భక్తుడాయన్నడిగాడు: ఆ ఈగలతుటుమును కదపటం మహర్షి సంకల్పించిగాదు. దానికి అను తాపమూ, నిష్కృతీ ఎందుకు? దానికి మహర్షి యన్నారు: "ఆయను తాపమూ, నిష్కృతీ అతని ఆచరణలు కాకుంటే , వానిమనోనైజం నిజంగా ఎట్లుండవలెఝ'' ఇక్కడప్రశ్నకు బదులు ఎదురు ప్రశ్న, అడిగినతనికి గురువు మహర్షియని తెలుసు కాని ఆ ప్రశ్న సమయానికి మహర్షి నాహంస్థితి నిష్ఠుడనీ, అందువల్ల మనోరహితుడనీ, అతడెఱుగడు. అందువల్ల అది మహర్షి కృతంగానే భావించి, అభావన ఆధారంగా అట్లు ప్రశ్నిచాడు. వానిని కరుణించి మహర్షి అతని యూహనిరాధారమని రూపిస్తూ మనస్సని మహర్షి కారోపించేది నిజంగా శుద్ధచైతన్యమని తెలియజెప్పినారు. దీనిని రూఢిగా ఆయన పలుమార్లు ఉపదేశించారు. మహర్షి మనస్సు మనస్సుకాదు; పరసత్యమదే.

మహర్షికి మనస్సులేదు. కనుక ఆయనకుప్రపంచంతో దాని వ్యవహారాలతో ఏజోలీలేదు. ముక్తికి పరమార్థమదే. ఆయన విధిగా చేయవలసిన కృత్యాలూ లేవు. చేయరానివీ లేవు ఆయన ఏదిచేసినా అది అయత్నంగా యాదృచ్ఛికంగా, సంకల్పిరహితంగా నష్టమానసుని చేష్టితాలవలెనే. వేదశాస్త్రాలన్నట్లు వారి నేపశ్చాత్తాపాలు కలం

---------------------------------------------------------

16. మహర్షి సమధానికి యీక్రింది సంస్కృతీకరణం :-

"భృంగ దంశ సహనం బభూవయత్‌ భృంగనీదని చయే ఖిలీకృతే

తత్కృతం న తదిత స్థితే కీదృశ్యం భవతి తన్మనో పిద||

చవు, ''నేను తప్పుచేశానే, ఒప్పుచేయనైతినే'' అన్న అనుతాపాలు అలజడిపెట్టవు. ఈ యదార్థ్యమే వారివాక్కుల్లో- ''తన్ను మ్రింగి యుప్పొంగిన తన్మయానందునికి జేయవలసిన పనియేమికలదు? వాడు తనకన్న నన్యమేమియు నెఱుగనివాడు. వానిస్థితి యిదియని మనము తలంచుట యెటులు?" మహర్షి విషయంలో 'విధి' 'ధర్మం' అనే పదాల కర్థం లేదు.

పక్వబుద్ధులగు ముముక్షువులను బోధించి యుద్ధరించడం మహర్షి దివ్యప్రయోజనం అందుచేతవారు నిష్క్రియులుగా ఉండవీలుగాదు. కాని ఆ చేష్టితాలు వారుకోరిచేసేవిగావు. నిరహంస్థితిలో జరిగినవి. కామితములే అయ్యుంటే అంత నిపుణాలుగ, కార్యసాధకాలుగనుండేవి కావేమో, వైదిక గ్రంధాలు మహర్షి, వచించి నట్లు ఋషి, ఏకకాలంలోనే సర్వకర్తా, ఆకర్తాగూడా, దీనిలో విపరీతమేమీ లేదు. చూచేందుకు ఆయన బహుకార్యవ్యాపృతుడే, కాని నిజంగా ఋషియొదునా కర్తగాదు. కర్తయేఅయితే ఆత్మేతరవ్యక్తి పరిజ్ఞానం ఆయనకుండవలె. అట్లు లేదని విసృష్టమే. ఇచ్ఛలేక సంకల్పముండదు. ఆయనకే కోర్కెలూలేవు. ఆయన ఆత్మారాముడు , ఆప్తకాముడు.

ప్రజలందరికీ సత్యాన్ని బోధించి తరింపజేయటం ఆయన విధ్యుక్తధర్మం కాదాయని కొందరి ఆశంక.'' కలగని లేచి ఎవరైనా నేనుకలలోచూచిన వ్యక్తులూ మేల్కొన్నారాయని ఎన్నడైనా అడుగుదురా? అలాగా మహర్షికిగూడా ,ప్రపంచంలోని వ్యక్తుల విషయంగా ఏచింతా ఉండదు''. అని మహర్షి జవాబు. ప్రపంచం అంతా దాస్యంలో మ్రగ్గుతూఉంటే ఒక్క తనకై మోక్షం సాధించడం స్వార్థమంటూ ఒక దంబం-యిటీవల పరిపాటియైంది.వారికి మహర్షి

-------------------

17 చూ,అనుబంధము , 'క' శ్లో.36 : ఉ.న,31

''ఇదికలగంటున్నవాడు 'నాకలలోని వీళ్ళందరూ మేల్కొన్నదాకా నేనూ మేల్కొనను' అన్నరీతి యంటారు.

గూఢార్థంగా మహర్షియున్నారు : ''అహంతా భావస్థితి అలసతగాదు, అత్యంత కార్యప్రవృత్తి.'' కాని సరిగ్గా దీన్ని కాదన్న ట్లుగా , మహర్షియే నిరహస్థితి "ఆనంద (రూప) సుప్తి'' యని వర్ణించారు. మరొకచో దానినే వారు 'జాగ్రత్‌సుప్తి' యనడం గమనించాం.కాబట్టి యీ నిర్వచనాలలో వైరుధ్యం లేదు. అన్నిటి అర్థం ఒకటే. నిద్రాంశం జగత్తుకు చెందింది. జగద్విషయంగా మహర్షి కన్నువిప్పరువారంటారు.:'' దేహములో నిదురించునాత్మజ్ఞానియొక్క వ్యవహర సమాధి నిద్రలు బండిలో నిదురించువానికి బండిపొవుట, నిలుచుట, విప్పియుండుటకు సమానమే.'' ఇచ్చట మహర్షికీ బండిలో నిద్రించునతనికీ చెప్పిన సామ్యం గుర్తించవలె. దేహం బండివలె. ఇంద్రియాలు గుఱ్ఱాలవలె, అట్లు జాగ్రత్‌లోని చర్యలు బండికదలికలు. సమాధి నిద్రలు విశ్రామదశలు. కాని సమాధిసామ్యమగు బండినిలవటం. గుఱ్ఱములు పూన్చియండగనే, సమాధిలో ఇంద్రియాలు అనాసక్తాలుగవు. అందువల్లనే మహర్షి చెప్పినట్లు సమాధిలో తలవ్రాలక నిలువుగానే ఉంటుంది. నిద్రలో యింద్రియాలు అనాసక్తాలు:అందుకే నిద్రించేవాడు కూర్చొనిఉంటే తలవ్రాలుతుంది, ఈ రీతిగా బాహ్యంగా భేదాలున్నా అంతఃభేదము లేదు. బండిలోని నిద్రితునితో ఉపమదేహస్థితిలోనూ, లోకంలోనూ కలిగే మార్పులు ఋషినేవిధంగానే బాధించవని తెల్పుటకే. నిద్రలోవలె మహర్షి ఆచేతనుడనుకోరాదు. ఈసత్యాన్ని ఉద్ఘాటించేదే అజ్ఞానికీ జ్ఞానికీ గల భేదం తెల్పుతూన్న గీతాశ్లోకం:- 'యానిశా సర్వభూతానాం'' అన్నది అస్థితినిగూర్చి నిగూఢంగా మహర్షి పలికిన '' అలసతగాదు,

------------------------------------------------

13. చూ. అనుబంధం, '' శ్లో. 77 : సూక్తిసుధ, 31,

అత్యంత కార్యప్రవృత్తి'' అర్థం యిపుడు బోధపడవచ్చు. చిత్‌స్వరూపమగు ఆత్మలో, ఆత్మగా మహర్షి మెలకువగానే ఉన్నారు. చిత్‌ ఆచేతన ఎన్నడూగాదు. కావున మహర్షి యెన్నడూ నిద్రించుటలేదు. ఆయన చేష్టఅదే, ఉండగల్గిన ఒకే యొక చేష్టా అదే. ఇతరమంతా మాయయే. తనువు నిద్రించినా మహర్షి నిద్రింపరు: అందుకే మనం మహర్షిని సదా జాగరూకునిగ, ఏచేతకేని సదాసన్నద్ధునిగ కనుగొంటాము. కారణం, యోగులసమాధికి ఆజ్ఞుల అలసతకూ విశిష్టమైన వారి సహజస్థితి.

ఋషియే సద్గురువు కాగల్గునని తెలుసుకొన్నాము. ఆయనయే బాహ్యాంతరాల్లో రెంటా చేష్టించ సమర్థుడు. సద్గురువు శిష్యుని మనస్సును వెలినుండి లోనికి జొనిపి, లోనుండి గుహమధ్యానికి లాగుకొనగలడు. అపుడే శిష్యుడు స్వస్వరూపానుభూతి కల్గి ముక్తుడౌతాడు. ఇట్టి అనుగ్రహమర్థించియే గురువు నీశ్వరునిగ భక్తితో శుశ్రూషించవలె. "సర్వాత్ముడూ, సర్వశుభుడూ అమనస్కతహృత్‌స్థితుడూనైన మహర్షి సత్‌స్వరూపాన్ని ఎదలో సదా ధ్యానించునతనికి ఆత్మ సద్విద్యలభింపగలదు.''

-*-

-------------------

19. చూ. అనుబంథరి, '', శ్లో. 347.

Mahayogama    Chapters