Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకత్రింశోధ్యాయః

శ్రీనారాయణ : శ##క్తే రుత్కీర్తనం శ్రుత్వా సావిత్రీయమ వక్తృతః | సాశ్రునేత్రా సపులకా యమం పునరువాచ సా . 1

సావిత్ర్యువాచ : శ##క్తే రుత్కీర్తనం ధర్మసకలో ధ్దారకారణమ్‌ | శ్రోతౄణాంచైవ వక్తౄణాం జన్మమృత్యు జరాహరమ్‌ . 2

దానవానాం చ సిద్దానాం తపసాం చ పరం పదమ్‌ | యోగానాంచైవ వేదానాం కీర్తనం సేవనం విభోః 3

ముక్తత్వ మమరత్వం చ సర్వసి ద్దిత్వమేవచ | శ్రీశక్తి సేవకసై#్యవ కళాంనార్హంతిషోడశీమ్‌ 4

భజామి కేన విధినా వద వేదవిదాంపర | శుభకర్మవిపాకం చ శ్రుతం నౄణాం మనోహరమ్‌ 5

కర్మాశుభ విపాకం చ తన్మేవ్యాఖ్యాతు మర్హసి | ఇత్యుక్త్వా చ సతీ బ్రహ్మ న్బక్తి నమ్రాత్మ కంధరా 6

తుష్టావ ధర్మరాజం చ వేదోక్తేన స్తవేన చ | సావిత్ర్యువాచ : తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరాః పురా 7

ధర్మం సూర్యః సుతంప్రాప ధర్మరాజం సమామ్యహమ్‌ | సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః 8

అతో యన్నామశమనమితి తం ప్రణమామ్యహమ్‌ | యేనాంత శ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్‌. 9

కామానురూపం కాలేన తం కృతాంతం సమామ్యహమ్‌ | బిభిర్తి దండం దండాయ పాపివాంశుద్ది హేతవే.10

నమామి తం దండధరం యః శాస్తా సర్వజీవినామ్‌ | విశ్వం చ కలయత్యేవ యః సర్వేషు చ సంతతమ్‌. 11

అతీవ దుర్నివార్యం చ తంకాలం చ ప్రణమామ్యహమ్‌ | తపస్వీ బ్రహ్మనిష్ఠో యః సంయమీ సంజితేం ద్రియః 12

జీవానాం కర్మఫలద స్తం యమం ప్రణమామ్యహమ్‌ | స్వాత్మారామ శ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్య కృతాంభ##వేత్‌.

పాపీనాం క్లేశదో యస్తం పుణ్య మిత్రం నమామ్యహమ్‌ | యజ్ఞన్మ బ్రహ్మణో ంశేన జ్వలంతం బ్రహ్మతేజసా.

ముప్పదిఒకటవ అధ్యాయము

సావిత్ర్యుపాఖ్యానము

శ్రీనారాయణు డిట్లనెను: శ్రీదేవీగుణ సంకీర్తనమును యమునినోట వినగనే సావిత్రమేను పులకించెను. కన్నులు చెమర్చెను. ఆమె యమునితో మరల నిట్లనెను. ధర్మదేవా ! శక్తి గుణ మహిమగానము చేయువారికిని వినువారికిని చావు పుట్టువులు ముదిమి యుందువు. శక్తి గుణముల గానమున నన్నియు నుద్దరింపబడును. ఎల్లసిద్ద-దానవ-తాపసులు పొందు సౌఖ్యమును వేదముల యోగముల కీర్తనమును ప్రభువును సేవించుటయును అమరత్వము ముక్తి సర్వసిద్ది లాభమును నివన్నియును కలిసినప్పటికిని శ్రీశక్తిని గొల్చువాని పదారవకళకును సరిగావు. వేదవిదులలో శ్రేష్ఠుడా ! దేవినెట్లు భజింపవలయునో తెలుపుము. మనుజుల శుభకర్మ విపాకమును గుఱించుయును తెలుపుటకు నీవే తగినవాడవు. అని సావిత్రి భక్తి వినయములతో తలవంచి పలికెను. ఆమె వేదోక్తమైన స్తోత్రము చేత ధర్మరాజు నిటుల సంస్తుతించెను. సావిత్రి యిట్లనెను. పూర్వము సూర్యుడు పుష్కరతీర్థమున ధర్మదేవు నారాధించెను. సూర్యుడు ధర్ముని పుత్రునిగ బడసెను. అట్టి ధర్మరాజునకు సమస్కరించుచున్నాను. ఎల్లభూతములందు సమభావమున సాక్షిగ నుండువాడు శమనుడని పిలువబడువాడునగు సమవర్తికి నమస్కరించుచున్నాను. ఎవ్వాడు సకల ప్రాణుల నంతమొందించునో ఎవ్వడు ప్రాణుల కామముల ననుసరించి కాలమునకు బలిచేయునో యట్టి కృతాంతుడు కాలుడు అంతకుడునగు వానికి సమస్కరించు చున్నాను. ఎవడు పాపాత్ములను శుద్ధాత్ములుగ జేయుటకై దండించు దండమును చేతబూనునో అట్టి సర్వజీవులను శాసించు నట్టి దండ ధరుని నమస్కరించుచున్నాను. ఏవాడు నిరంతరముగ విశ్వమును నడుపుచుండునో ఎవడు దుర్నివార్యుడగు కాలస్వరూ పుడో యట్టి కాలుని నమస్కరించుచున్నాను. ఎవడు తపస్వి - బ్రహ్మనిష్ఠుడు - సంయమి - జితేంద్రియుడో - ఎవడు జీవుల కర్మఫలప్రదుడునై తనరునో యట్టి వైవస్వతునకు నమస్కరించుచున్నాను. స్వాత్మారాముడు - సర్వజ్ఞుడు - పుణ్యాత్ములకు మిత్రుడును పాపులకు క్లేశము గల్గించువాడును పుణ్యమిత్రుడగునట్టి పితృపతికి నమస్కరించుచున్నాను. ఎవడు బ్రహ్మాంశ##చే జన్మమందెనో బ్రహ్మతేజముతో విరాజిల్లునో.

యో ధ్యాయతి పరంబ్రహ్మ తమీశం ప్రణమామ్యహమ్‌ | ఇత్యుక్త్వా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే. 15

యమ స్తాం భక్తి భజనం కర్మపాక మువా చ హ | ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌. 16

యమా త్తస్య భయం నాస్తి సర్వ పాపాత్ర్పముచ్చతే | మహాపాపీ యదిపఠే న్నిత్యం భక్తి సమన్వితః 17

యయః కరోతి సంశుద్దం కాయవ్యూహేన నిశ్చితమ్‌. 18

ఇది శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమసస్కంధే ఏక త్రింశో ధ్యాయః

ఎవడు పరంబ్రహ్మమును ధ్యానించుచుండునో యట్టి యీశునకు నమస్కరించు చున్నాను. అని సావిత్రి యమరాజును సంస్తుతించి నమస్కరించెను. అంత యముడామెకు శక్తి భజనము కర్మ విపాకమును గూర్చి వివరించెను. ఈయమాష్టకము నిత్యము ప్రొద్దున మేల్కొంచి జపించువానికి యముని వలని భయము గల్గదు. అతడు సర్వపాపముక్తుడగును. ఎంతటి పాపాత్ముడైనను నిత్యము భక్తితో దీనిని చదివినచో యముడతనిని కాయవ్యూహముతో తప్పక పవిత్రు నొనర్చును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున ముప్పదియొకటవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters