Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తవింశోధ్యాయః.

శ్రీనారాయణః : స్తుత్వా నేన సో శ్వపతిః సంపూజ్య విధిపూర్వకమ్‌ | దదర్శ తత్ర తాం దేవీం సహస్కార్క సమ ప్రభామ్‌. 1

ఉవాచ సా చ రాజానం ప్రసన్నా సస్మితా సతీ | యథా మాతా స్వ పుత్రం చ ద్యోతయంతీ దిశస్త్విషా. 2

సావిత్ర్యువాచ : జానా మ్యహం మహారాజ యత్తే మనసి వాంఛితమ్‌ |

వాంఛితంతవ పత్న్యా శ్చ సర్వం దాస్యామి నిశ్చితమ్‌. 3

సాధ్వీకన్యాభి లాషం చ కరోతి తవ కామినీ | త్వం ప్రార్థయసి పుత్రం చ భవిష్యతి క్రమేణ చ. 4

ఇత్యుక్త్వా సా తదా దేవీ బ్రహ్మలోకం జగామహ | రాజా జగామ స్వగృహం తత్కన్యా೭೭దౌ బభూవహ. 5

ఆరాధనా చ్చ సావిత్ర్యా బభూవ కమలా పరా | సావిత్రీతి చ తన్నామ చకారాశ్వ పతిర్నృపః. 6

కాలేనసా వర్దమానా బభూవ చ దినే దినే | రూప¸°వన సంపన్నా శుక్లే చంద్రకళా యథా. 7

సా వరం పరయామాస ద్యుమత్సేనాత్మ జంసదా | సత్యవంతం సత్యశీలం నానాగుణసమన్వితమ్‌. 8

రాజాతసై#్మ దదౌ తాం చ రత్న భూషణభూషితామ్‌ | సోపి సార్దం కౌతుకేన తాం గృహీత్వా గృహం య¸°. 9

స చ సంవత్సరేతీతే సత్యవా న్సత్యవిక్రమః | జగామ ఫలకాష్ఠార్థం ప్రహర్షం పితురాజ్ఞయా. 10

జగామ సాధ్వీ తత్పశ్చా త్సావిత్రీ దైవయోగతః | నిపత్య సాక్షాద్దైవేన ప్రాణాం స్తత్యాజ సత్యవాన్‌. 11

యమస్తం పురుషం దృష్ట్వా బద్ద్వాం గుష్ఠసమం మునే | గృహీత్వా గమనం చక్రే తత్ప శ్చా త్ర్పయ¸°సతీ. 12

పశ్చాత్తాం సుదతీం దృష్ట్వా యమః సంయమనీ పతిః | ఉవాచ మధురం సాధ్వీం సాధూనాం ప్రవరోమహాన్‌. 13

ఇరువదిఏడవ అధ్యాయము

సావిత్ర్యుపాఖ్యానము

శ్రీనారాయణు డిట్లనెను : అశ్వపతి యీ ప్రకారముగ సావిత్రిని సంస్తుతించి పూజింపగ సూర్యకోటికాంతులు గల సావిత్రి యతనికి దర్శనభాగ్య మొసంగెను. తన నెమ్మేని మెఱుంగ కాంతులు దిక్కుల రాజిల్లగ తల్లికొడుకుతో బలుకు నట్లుగ సావిత్రీదేవి రాజుతో నిటలు పలికెను. రాజా ! నీ మనసులోని కోర్కియు నీ భార్య మదిలోని కోరికయు నాకు తెలుయును. మీ రెండు కోరికలను గూడ తీర్చగలను. నీ భార్య కన్య గావలయుననియు నీవు పుత్రుడు జన్మింప వలయుననియు గోరుచున్నారు. క్రమముగ రెండును నెవవేరగలవు. అని సావిత్రీదేవి బ్రహ్మలోకమునకు జనెను. రాజును తన యింటి కేగెను. వారికి మొదట కన్యయే యుద్బవించెను. కన్యకయును సావిత్రి నారాధించిన ఫలముగ రెండవ లక్ష్మి యన ప్రకాశించుచుండెను. అశ్వపతి తన కూతునకు సావిత్రి యను పేరు పెట్టెను. ఆ కన్నియ శుక్లపక్షమందలి చందురుని చందమున దినదినము పెరిగి పెద్దదగుచు నందాల యివతిగ నయ్యెను. ఆమె సకల గుణముల గని. ఆమె ద్యుమత్సేనుని కుమారుడగు సత్యవంతుని పతిగ వరించెను. సత్యవంతుడు-సత్యశీలి. అశ్వపతి సాలంకృతయగు కన్యను సత్యవంతున కీయగా నతడు ప్రమోదభరితుడై సావిత్రిని గొనిపోయెను. ఒక్క యేడాది గడచిన పిదప సత్యవిక్రముడగు సత్యవంతుడొకనాడు తన తండ్రి యానతి ప్రకారముగ పండ్లు కట్టెలు తెచ్చుట కడవికి వెళ్ళెను. ఆనాడు దైవయోగమున సావిత్రియు నతని వెంట వెళ్ళెను. అతడు హఠాత్తుగ నొక చెట్టునుండి పడి యసువుల వాసెను. యముడు స్వయముగా నేతెంచి యంగుష్ఠ మాత్రపురుషుడగు నతనిని తీసుకొని పోబోవుచుండగ సావిత్రియు నతనిని వెంబడించెను. తన్ను వెన్నంటి వచ్చు చున్న పరమ సాధ్వినిగాంచి సాధుపుంగవుడు సంయమినీ పతి యగు యముడు తియ్యని మాటలతో నామెతో నిట్లు పలికెను.

అహో క్వాయాసి సావిత్రి: గృహీత్వామాను షీంతనుమ్‌ | యది యాస్యసి కాంతేన సార్దం దేహం తదాత్యజ. 14

గంతుం మర్త్యో న శక్నోతి గృహీత్వాపాంచభౌతికమ్‌ | దేహం చ మమలోకంచ నశ్వరం నశ్వరః సదా. 15

భర్తుస్తే పూర్ణకాలోవై బభూవ భారతే సతి | స్వ కర్మ ఫలబోగార్థం సత్యవాన్యాతి మద్గృహమ్‌. 16

కర్మణా జాయతే జంతుః కర్మణౖ వప్రలీయతే | సుఖం దుఃఖం భయంశోకః కర్మణౖవ ప్రణీయతే. 17

కర్మణంద్రో భ##వేజీవో బ్రహ్మపుత్రః స్వకర్మణా | స్వకర్మణా హరేర్దాసో జన్మాది రహితోభ##వేత్‌. 18

స్వకర్మణా సర్వసిద్ధి మమరత్వం లభే ద్ద్రువమ్‌ | లభే త్స్వ కర్మణా విష్ణోః సాలోక్యా ది చతుష్టయమ్‌. 19

సురత్వం చ మనుత్వం చ రాజేంద్రత్వం లభేన్నరః | కర్మణా చ శివత్వం చ గణశత్వం తథైవ చ. 20

కర్మణా చ మునీంద్రత్వం తపస్వి త్వం స్వకర్మణా | స్వకర్మణా క్షత్రియ త్వం వైశ్యత్వం చ స్వకర్మణా. 21

కర్మణౖవ చ వ్లుెచ్చత్వం లభేతే నాత్ర సంశయః | స్వ కర్మణా జంగమత్వం శైలత్వం చ స్వ కర్మణా. 22

కర్మణా రాక్షసత్వం చ కిన్నరత్వం స్వకర్మణా | కర్మణౖనాధిపత్యం చ వృక్షత్వం చ స్వకర్మణా. 23

కర్మణౖవ పశుత్వం చ వనజీవీ స్వకర్మణా | కర్మణా క్షుద్రజంతుత్వం కృమిత్వం చ స్వకర్మణా. 24

దైతేయత్వం దానవత్వమ సురత్వం స్వ కర్మణా | ఇత్యేతం దుక్త్వాసావిత్రీ విరరామ సవైయమః. 25

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే సప్త వింశోధ్యాయః.

ఓహో సావిత్రీ! ఈ మానవ శరీరముతో నెచటికి వచ్చుచున్నావు? నీ కాంతునితో నేగదలచినచో నీ మానవ శరీరము వదలి రమ్ము. ఈ నశ్వరమైన పాంచ భౌతికమైన దేహముతో నరుడు నా లోకమునకు రాజాలడు. ఈ భారత భూమిపై నీ పతి కాయువు నిండినది. సత్యవంతుడు తన కర్మఫలము లనుభవించుటకు నా యింటికి వెళ్ళుచున్నాడు. సకల జంతువులు కర్మవలననే పుట్టి కర్మములోనే లయించును. సుఖదుఃఖములును శోకమోహములును కర్మమువలననే కల్గుచుండును. ఈ కర్మమువలననే యొక డింద్రు డగును. మఱి యొకడు బ్రహ్మపుత్రు డగును. ఒకడు హరిదాసుడగును. ఇంకొకడు జన్మ రహితుడగును. నరుడు తన చేసికొన్న కర్మఫలితముగ సర్వసిద్ధులు న మరత్వమును బడియ గలడు. శ్రీవిష్ణుసాలోక్యాదులను బడయగలడు. మానవుడు తన చేసికొన్న కర్మఫలముగ నరత్వము దేవత్వము రాజత్వము గణపతిత్వము శివత్వమును బడయగలడు. నరుడు తన చేసికొనిన కర్మఫలముగ మునీంద్రత్వము తపస్విత్వము క్షత్రియత్వము వైశ్యత్వము బడయగలడు. నరుడు తన కర్మమువలననే మేచ్చడుగ జంగమముగశైలముగనగును. నరుడు తన కర్మమువలననే రాక్షసత్వము కిన్నరత్వము పక్షత్వము నాధిపత్యమును బడయగలడు. నరుడు తన కర్మము కారణముగ పశుత్వము వన్య జీవనము క్షుద్ర జన్మము కీటక జన్మమును బడయగలడు. నరుడు తన కర్మము మూలముగ ససురత్వము దానవత్వము దైతేయత్వము బడయగలడు అని సావిత్రితో బలికి యముడు విరమించెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నిరువదియేడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters