Sri Devi Bagavatham-2    Chapters   

అథ అష్టాదశో7ధ్యాయః

శ్రీనారాయణ ఉవాచ: తులసీ పరితుష్టా చ సుష్వాప హృష్టమానసా| నవ¸°వన సంపన్నా వృషధ్వజ వరాంగనా. 1

చిక్షేప పంచబాణశ్చ పంచబాణాంశ్చ తాం ప్రతి | పుష్పాయుధేనసా దగ్ధా పుష్పచందన చర్చితా. 2

పులకాంచిత సర్వాంగీ కంపితా రక్తలోచనా | క్షణం సా శుష్కతాం ప్రాప క్షణం మూర్చామవాపహ. 3

క్షణ ముద్విగ్నతాం ప్రాప క్షణంతంద్రాం సుఖావహామ్‌ | క్షణంచదహనం ప్రాప క్షణం ప్రాప ప్రసన్నతామ్‌. 4

క్షణంసా చేతానంప్రాప క్షణం ప్రాపవిషణ్ణతామ్‌ | తత్తిష్ఠంతీ క్షణం తల్పాద్గచ్చంతీనికటేఓణమ్‌. 5

భ్రమంతీ క్షణముద్వేగా న్నివసంతీక్షణం పునః | క్షణమేవ సముద్వేగా త్సుష్వాప పునరేవసా. 6

పుష్పచందన తల్పంచ చ తద్బభూవాతికంటకమ్‌ | విషమారి సుఖం దివ్యం సుందరం చ ఫలం జలమ్‌. 7

నిలయం చ బిలాకారం సూక్ష్మవస్త్రం హుతాశనః | సిందూరపత్రకంచైవ వ్రణతుల్యంచ దుఃఖదమ్‌. 8

క్షణం దదర్శ తం ద్రాయాం సువేషం పురుషం సతీ | సుందరం చ యువానం చ సస్మితం రసికేశ్వరమ్‌. 9

చందోక్షితసర్వాంగం రత్నభూసణ భూషితమ్‌ | ఆగచ్చంతం మాల్యవంతం పిబంతం తన్ముకాంబుజమ్‌. 10

కథ యంతం రతికథాం బ్రువంతం మధురం ముహుః మ | సంభుక్తవంతం తల్పే చ సమాశ్లిష్యంత మీప్సితమ్‌. 11

పునరేవ తు గచ్ఛంతం మాగచ్చంతం చ సన్నిధౌ| యాంతం క్వ యాసి ప్రాణశ తిష్ఠేత్యేవమువాచ సా. 12

పునశ్చ చేతనాం ప్రాప్య విలలాప పునః పునః | ఏవం సా ¸°వనం ప్రాప్య తస్థౌ తత్రైవ నారద. 13

శంఖచూడో మహాయోగీ జైగీ షవ్యాన్మనోహరమ్‌ | కృష్ణ మంత్రం చ సంప్రాప్యకృత్వా సిద్ధంతు పుష్కరే. 14

పదునెనిమిదవ అధ్యాయము - తులస్యుపాఖ్యానము

నారాయణుడిడ్లనెను: ఆ ప్రకారముగ తులసి మదిలో సంతసించి నిదురించెను. వృషధ్వజుని కూతురగు తులసి మిమిసలాడు పరువముతో రుసరుస లాడుచుండెను. అంతలోనే చెఱకు విల్కాడు పుష్ప చందనములలందుకొని యున్న తులసి యెదలో పూల ముల్కులు గాటముగ నాటగనే యామెలో వలపు సెగలు రగిలెను. ఆమెకు పరవము తొల్కరించగనే యెద పుల్కరించెను. మేను చెమర్చెను. కనుగొలంకు లెఱ్ఱవారెను. అంతలోనే యెందుకోమఱి యామె యలసిపోవును; తూలును సొమ్మసిలును. ఒక్క క్షణములో నామె విచ్చలవిడి పేర్చును; మరు క్షణమున కమ్మగ వెచ్చనూర్చును; వెన్నెల వేడిమికి నలుగును. లోలోన ముదమందును. అదె గుర్గురాగ నామెతొలివొందును; అంతలో వెగడొందును; సెజ్జనుండి లేచును; చింతతో గూర్చొనును; శయ్యనుండి లేచి వెళ్ళున. అంతలోనేనెవ్వగల గులుకును; సందడి చేయును;పరిభ్రమించును; నిల్చి తలంచును; నిదురించినటులుండును. ఆమెకుమంచి గంధపు వాసనలు గుబాళించు పూల పాన్పు ముళ్చ పాన్పుగ నుండెను. తియ్యని పండ్లు నీరును విషమువలెనుండును. ఆమెకు తన నిలయము గుహ వలెను వస్త్ర మగ్ని వలెను సిందూర పత్రకము వ్రణము వలె దుఃఖప్రదముగ నుండెను. అంతలో నామె మూర్చలో నుండియే యొక్క సుందరాగుని గాంచెను. అతడు యువకుడు మంచి వేషము గలవాడు; చిరునవ్వుల వాడు రసికేశ్వరుడు. చందనమ లందుకొన్న మేనివాడు; రత్నభూషణ భూసితుడు; పూలమాలలు దాల్చినవాడు. అతడు వచ్చి యామె మోము తమ్మిరసము గ్రోలుచుండును. అతడామెతో తియ్యగపల్మారుల రతి కథలు ముచ్చటించును మెల్లమెల్లగసెజ్జూపై జేరుచు నామె పొత్తు సంధిల్ల ముద్దులగుమ్మను పెనవేసికొనెను. అతడంతలో లేచిపోబోవును. మరల వచ్చి యేమేమో శృంగార క్రీడలు కమ్మగ సాగించును. అతడు లేచి పోబోవ నాగు మాగుమనియామె యనును. అంతలో నామె మేల్కొని జరిగిన దంతయునుకలగనెంచి పల్మారు వలపించెను. నారదా! ఈ చందముగ నెల జవ్వనముతో తులసి యచ్చోట వసించెను. ఇక శంక చూడుడను మహాయోగ జైగీషవ్య ముని వలన మనో హరమైన కృష్ణ మంత్రము బడసి పుష్కర తీర్థమున మంత్రసిద్ధి బడసెను.

కవచం సగలే బద్ధ్వా సర్వమంగళ మంగళమ్‌| బ్రాహ్మణ శ్చ వరం ప్రాప్య యత్తే మనసి వాంఛితమ్‌. 15

అజ్ఞాయా బ్రహ్మణః సో పి బదరీ చ సమాయ¸° | ఆగచ్ఛంతం శంఖచూడం దదర్శ తులసీ మునే. 16

నవ¸°వనసంపన్నం కామదేవసమప్రభమ్‌ | శ్వేత చంపకవర్ణాభం రత్న భూషణభూషితమ్‌. 17

శరత్పార్వణ చంద్రాస్యం శరత్పంకజ లోచనమ్‌ | రత్నసార వినిర్మాణ విమానస్థం మనోహరమ్‌. 18

రత్నకుండల యుగ్మేన గండస్థల విరాజితమ్‌ | పారిజాత ప్రసూనానాం మాలావంతం చ సుస్మితమ్‌. 19

కస్తూరీ కుంకుమాయుక్తసుగంధి చందనాన్వితమ్‌ | సా దృష్ట్వా సన్నిధా వేనం ముఖమాచ్చాద్యవాససా. 20

సస్మితాం తం నిరీక్షంతీ సకటాక్షం పునఃపునః | బభూవాతి నమ్రముఖీ నవసంగమలజ్జితా. 21

శరదిందు వినింద్యైక స్వముఖేందువిరాజితా | అమూల్యరత్ననిర్మాణ ¸°వనావళి సంయుతా. 22

మణీంద్రసారనిర్మాణ క్వణస్మంజీరరంజితా | దధతీ కబరీభారం మాలీతీ మాల్య సంయుతమ్‌. 23

అమూల్యరత్న నిర్మాణ మకరాకృతి కుండలా | చిత్రకుండల యుగ్మేన గండస్థల విరాజితా. 24

రత్నేంద్రసారహారేణ స్తనమధ్యస్థలోజ్జ్వలా | రత్నకంకణకేయూర శంఖభూషణభూషితా. 25

రత్నాంగుళీయకైర్దివ్యై రంగుళ్యావళిరాజితా | దృష్ట్వా తాం లలితాం రమ్మాం సుశీలాంసుందరీంసతీమ్‌. 26

ఉవాస తత్సమీపే మధురం తామువాచసః |

శంఖచూడ ఉవాచ: కాత్వం కస్య చ కన్యా చ ధన్యామాన్యా చ యోషితామ్‌. 27

కా త్వం మానిని కల్యాణి సర్వకల్యాణదాయినే | మౌనీభూతేం కిం కరేమాం సంభాషాం కురు సుందరి. 28

అతడు గళమున సరవమంగళకరమగు కవచము ధరించెను. మఱియు నతడు బ్రహ్మవలన కోరిన వరములు బడసెను. బ్రహ్మ యనుమతివలన నతడును బదరికావనమందు వసించెను. ఓ మునీ! అట్లు వచ్చుచున్న శంఖచూడుని తులసి బాగుగ చూచెను. అతడు నవ¸°వనవంతుడు. అందాలలో నవమన్మథుడు. రత్నభూషణభూషితుడు; తెల్లని చంపకవర్ణముగలాడు. శారద పున్నమినాటి చంద్రునిబోలు ముఖమువాడు; శారద కమలలోచనుడు; రత్ననిర్మితమైన విమాన మందున్నవాడు. అతని చెక్కిళ్లపై రత్నకుండలములు కాంతు లీనుచున్నవి. పారిజాత సుమముల దండలు దాల్చినవాడు చిర్నగవులు చిందించువాడు. కస్తూరి కుంకుమ చందనమలు గంధమ లందిన మేనివాడు; ఆ యువకుడు తన చెంతకు రాగ తులసి తన మొగమును వస్త్రముతో నోరగ కప్పుకొని కడగంట జూచెను. ఆమెచిర్నగవుతో కటాక్షములతో చూచుచు తలవంచుకొని తన తొలి తొలి పొందు కోరికను వెల్లడించెను. ఆమె ముఖము శారద చంద్రుని కాంఉతలను తిరస్క రించునట్లున్నది. ఆమె యాభరణములు వెలలేని రత్నములతో నిర్మంచబడినవి. ఆమె మంజీరములు విలువైన మణులతో చేయబడి నినదించుచున్నవి. ఆమెకొప్పు మాలతి పూలదండలచే సువాసనలు వెదజల్లుచున్నవి.ఆమె వెలగల రతనా లమకరాకృతిగల కుండలములు గలది; ఆ యమె చెక్కిళ్ళపై చిత్రకుండలములు కాంతు లీనుచున్నవి. ఆమె కుచముల మధ్యలో వ్రేలాడు రతనాల హారముతో రత్నకంకణ కేయూరములు శంఖభూషలుగల బాహులతో శోభిల్లుచున్నది. ఆమె చేతివ్రేళ్ళు రతనాలు పొదిగిన బంగరు టుంగరములతో వెల్గులు జిమ్ముచున్నవి. అట్టి సొగసైన చిన్నదానిని సుశీలను లలిత లావణ్యను సతిని శంఖచూడుడు గాంచెను. అత డామె చెంతకు చేరి నెయ్యము తియ్యము దోప నామె కిట్లనెను. నీవెవతవు? నీవెవరి కన్నియవు? స్త్రీలలో నీవు దన్యవు; మాన్యవు; మానినీ! కల్యాణీ! సర్వ కల్యాణ దాయినీ! సుందరీ! నీవెవరవు. మూగవోయిన నీ యీ దాసు నెడ దయబూని మాటాడుము.

ఇత్యేవం వచనం శ్రుత్వా సకామావామలోచనా! సస్మితా నమ్రవదనా సకామంతమువాచసా. 29

తులస్యువాచ: ధర్మధ్వజసుతా7హం చ తపస్యాయాంతపోవనే | తపస్విన్యహంతిష్ఠామి కస్త్వంగచ్ఛ యథాసుఖమ్‌.

కామినీం కులజాతాం చ రహస్యేకా కినీం సతీమ్‌ | నపృచ్చతి కులే జాత ఇత్యేవం మేశ్రుతౌ శ్రుతమ్‌. 31

లంపటో7సత్కులే జాతో ధర్మశాస్త్రార్థవర్జితః | యేనాశ్రుతః శ్రుతేరర్థః సకామీచ్ఛతి కామినీమ్‌. 32

అపాత మధురాం మత్తా మంతేతాం పురుషస్యతామ్‌ | విషకుంభాకార రూపా మమృతాస్యాం చ సంతతమ్‌? 33

హృదయే క్షురధారాభాం శశ్వన్మధురభాషిణీమ్‌ | స్వ కార్య పరినిష్పత్త్యై తత్పరాం సతతం చ తామ్‌. 34

కార్యార్థే స్వామివశగామస్య థైవావశాం సదా | స్వాంతే మలిన రూపాంచ ప్రసన్నవదనేక్షణామ్‌. 35

శ్రుతౌ పురాణ యాసాం చ చరిత్ర మతి దూషితమ్‌ | తాసుకో విశ్వసేత్ర్పాజ్ఞః ప్రజ్ఞావాంశ్చ దురాశయః. 36

తాసాం కోవా రిపుర్మిత్రం ప్రార్థయంతి నవంనవమ్‌ | దృష్ట్వా సువేషం పురుష మిచ్ఛంతి హృదయే సదా. 37

బాహ్యే స్వార్థం సతీత్వం చ జ్ఞాపయంతీ ప్రయత్నతః | శశ్వత్కామాచరామా చ కామాధారా మనోహరా. 38

బాహ్యే ఛలాత్ఖే దయంతీ స్వాం తర్మైథువ మానసా | కాంతం హసంతీ రహసి బాహ్యే తీవ సులజ్జితా. 39

మానినీ మైథునాభావేకోపనా కలహాంకురా | సుప్రీతా భూరి సంభోగా త్స్వల్పమైథున దుఃఖితా. 40

సుమిష్టాన్నాచ్చీ తతోయాదా కాంక్షంతీ చ మానసే | సుందరం రసికం కాంతం యువానం గుణినం సదా. 41

సుతాత్పరమభిస్నేహం కుర్వంతీ రసికోపరి | ప్రాణాధికం ప్రియతమం సంభోగకుశలం ప్రియమ్‌. 42

అను మాటలువిని వామలోచన సకామ మందహాసిని వినయముఖియగు తులసి యతని కిట్లనెను. నేను దర్మధ్వజుని కూతురను. ఈ తపోవనమున తపస్సు చేసికొనుచున్నాను. నీవెవరవు? నీ చోటికి నీవు సుఖముగ నరుగుము. ఒక యున్నత కులమున బుట్టిన సతి యొంటరిగ నిట్లుండగా కులీనుడైనవా డిట్లు విచల్చవిడిగ తెగించి మాటాడరాదని వేదములందు వింటిని. ఒక విషయలంపటుడు నీచకులమున బుట్టినవాడు ధర్మశాస్త్రము లెఱుంగనివాడు వేద సార మెఱుగనివాడు నగు కాముకుడే యొక యువతితో మాటాడును. స్త్రీపైకి తియ్యగ మాటాడును. లోన పురుషుని చావు గోరును. ఆమె లోన విషకుంభము ముఖమమృతమయముగ నుండును. ఆమె తన ముద్దుమురిపములు దీరునందాక కమ్మని కవ్వింపులతో పల్కరించును. కాని యామె యడద కత్తికోతవలె నుండును. తన కామము దీర్చుకొనునంతవఱ కామె స్వామికెంతయో వినయము నటించును. ఆ కామము తృప్తముకాగానే యిక మగవానితోస్వేచ్ఛగ వ్యవహరించును. వేదపురాణము లందు స్త్రీ చంత మతి దూషిత మని చెప్పబడినది. అట్టి స్త్రీని ప్రాజ్ఞుడు విజ్ఞాని సదాశయుడగువాడు నమ్మడు. స్త్రీలు వీడు మిత్రుడు; వీడు శత్రుడునని చూడరు. కొంచెము క్రొత్త క్రొత్తగ పనిలో నేర్పరిగ కనబడి నచ్చిన పురుషుని గాంచి లోలోన కామించుచుందురు. వారు పైకి తామెంతో పతివ్రతలమని చాటుకొందురు. కాని వారు కామపరవశలు; తమ లోని కామము దీర్చుకొనుట కితరుల నాకర్షింతురు. పైకి తమ నాయకు ననరాని మాటలతో తూలనాడుదురు. లోన తన కోర్కి దీర్చుకొనుట కెప్పుడును స్త్రీ వెనుకంజవేయదు. తన ప్రియు డొంటిగ నుండగ సిగ్గిడి నవ్వును. నల్గురిలోనెంతోసిగ్గు నటించును. తనను తృప్తిపఱచని పురుషుని చీదరించుకొని గర్వముతో వికటముగ రక్కసివలె వ్యవహరించును. తన తృప్తి తీరునందాక పురుషు డామెతో రమింపగల్గినచో వాని నెంతో మెచ్చుకొనును. అల్పరతిగలవానిని చూచి లోన దుఃఖించుచుండును. తనకు నచ్చిన మిసమిసలాడు జవ్వనము గుణరూపములు రసికతగల యందగానినే స్త్రీ కామించును. తనయెడ పరవశిల్లునట్లు తన్ను రమించు రసికశేఖరుడగు ప్రియతముని తన కన్నకొడుకు కన్న తన ప్రాణముకన్న మిన్నగ చూచుకొనును.

పశ్యంతి రిపుతుల్యం చ వృద్ధం వామైధునాక్షమమ్‌ | కలహం కుర్వతీ శశ్వత్తేన సార్ధం సుకోపనా. 43

వాచయా భక్షయంతీతం సర్పమాఖుమివోల్బణమ్‌ | దుఃసాహస స్వరూపా చ సర్వదోషాశ్రయా సదా. 44

బ్రహ్మ విష్ణుశివాదీనాం దుఃసాధ్యామోహరూపిణీ | తపోమార్గార్గలా శశ్వన్మోక్షద్వారకపాటికా. 45

హరేర్బక్తి వ్యవహితా సర్వమాయాకరం డికా | సంసారకారాగారే చ శశ్వ న్నిగడరూపిణీ. 46

ఇంద్రజాలస్వరూపా చ మిథ్యా చ స్వప్నరూపిణీ | భిభ్రతీబాహ్యసౌందర్య మధో7ంగ మతి కుత్సితమ్‌. 47

నానావిణ్మూత్రపూయానా మాధారం మల సంయుతమ్‌ | దుర్గంధి దోషసంయుక్తం రక్తారక్త మసంస్కృతమ్‌. 48

మాయారూపా మాయినాంచ విధినా నిర్మతావురా | విషరూపా ముముక్షూణా మదృశ్యా7ప్యభివాంఛతామ్‌. 49

ఇత్యుక్త్వా తులసీ తం చ విరరామ చ నారద | సస్మితః శంఖచూడశ్చ ప్రవక్తుముపచక్రమే. 50

శంఖచూడ ఉవాచ: త్వయా యత్కథితం దేవి న చ సర్వ మలీకకమ్‌ |

కిం చి త్సత్య మలీకం చ కించిన్మత్తో నిశామయ. 51

నిర్మితం ద్వివిధం ధాత్రా స్త్రీ రూపం సర్వమోహనమ్‌ | కృత్వా రూపం వాస్తవం చ ప్రశస్యం చా ప్రశంసితమ్‌?

లక్ష్మీః సరస్వతీ దుర్గా సావిత్రీ రాధికాదికా | సృష్టి సూత్ర స్వరూపా చ అద్యాసృష్టి వినిర్మితా. 53

ఏతాసా మంశ రూపం చ స్త్రీ రూపం వాస్తవం స్మృతమ్‌ | తత్పృశస్యం యశోరూపం సర్వమంగళకారకమ్‌. 54

శతరూపా దేవహూతీ స్వధాస్వాహా చ దక్షిణా | ఛాయావతీ రోహిణీ చ వరుణానీ శచీ తథా. 55

కుబేరస్య చపత్నీ యా7ప్యాదితశ్చ దితిస్తథా | లోపాముద్రా7న సూయాచ కోటిభీ తులసీ తథా. 56

వాడెంతమాత్ర మేని ముదిసిన నవసిన పట్టుదప్పిన వానిని శత్రువనుకొని కోపించి కలహించును. ఎలుకను పాము పట్టునట్లు వాని ననరాని మాటలతో పట్టి పల్చార్చును. స్త్రీ యెల్ల దోషములు కాటపట్టు. ఎంతటి దుస్సాహసమునకైన నొడిగట్టకలదు. బ్రహ్మ విష్ణు శివాదులనే మోహపెట్టునది. వారికే సాధ్యము కానిది. తపోమార్గమున కడ్డుగోడ వంటిది. ముక్తి ద్వారమునకు మూసిన తలుపుల వంటిది. హరిభక్తికి స్త్రీకి నెంతో దూరము. మాయలమారిది. సంసార మనెడు చెఱలో సంకెళ్ళవలె బంధించునది ఆమె యింద్రజాలమువలె వ్యవహరించును. సరిగ తెలియగ నంతయు వట్టిదే యగును. కలయేయని తోచును. పైకి మెఱమెచ్చులకు సింగారించుకొనును. లోనపైని నంతట కంపుగొట్టును. స్త్రీల మలమూత్రముల కొంప; దుర్గంధమున కాలవాలము; దుర్వాసన రక్తదోషములతో హేయమైనది; అపవిత్రురాలు. ఇట్టి స్త్రీని మాయికులకు మాయారూపిణిగను ముముక్షులకు విషరూపముగను కాముకుల కదృశ్యురాలుగను బ్రహ్మ మున్ను నిర్మించెను. ఓ నారదా! తులసి యీ ప్రకారముగ స్త్రీ స్వభావాదులు పలికి విరమించెను. అపుడు శంఖచూడుడు నవ్వి మాటాడుటకు పూనుకొనెను. శంఖచూడు డిట్లు పలికెను; ఓ దేవీ! నీవు పలికిన దంతయును నిజముకాదు. అందు కొంత నిజము కొంత యబద్ధము గలదు. ఇంక నామాటలును కొంచెము వినుము. సర్వమోహనకరమగు స్త్రీ రూపమును బ్రహ్మ రెండు విధములుగ నిర్మించెను. అందొకటి ప్రశంసనీయము. రెండవది ప్రశంసింపదగనిది. లక్ష్మిసరస్వతి దుర్గ సావిత్రి రాధిక మున్నగువారలు సృష్టికి మూలకారిణులు; ఆ మొట్టమొదటివారు వీరును తొలి సృష్టివారు. వీరి యంశములచే గల్గిన స్త్రీ రూపము లన్నియును నిక్కముగ ప్రశంసింపదగినవే. యశోరూపములే. శుభకరములే శతరూప దేవహూతి స్వాహా స్వధా దక్షిణ ఛాయాపతి రోహిణి వరుణాని శచి కుబేరపత్ని అదితి దితి లోపాముద్ర అనసూయ కోటిభి తులసి.

అహల్యారుంధతీ మేనా తారామందోదరీ తథా | దమయంతీ వేదవతీ గంగా చ మనసా తథా. 57

పుష్టి స్తుష్టిః స్మృతిర్మేధా కాలికాచ వసుంధరా | షష్ఠీ మంగళచండీ చ మూర్తి శ్చ ధర్మకామినీ. 58

స్వస్తిః శ్రద్ధా చ శాంతిశ్చ కాంతిః క్షాంతిస్తథాపరా | నిద్రాక్షుత్పిపాసా చ సంధ్యారాత్రి దినాని చ. 59

సంపత్తి ర్ధృతికీర్తీ చ క్రియాశోభాప్రభాశివా | యత్‌ స్త్రీరూపంచ సంభూత ముత్తమం చ యుగే యుగే. 60

కళా కళాంశరూపంచ స్వర్వేశ్యాదిక మేవ చ | తదప్రశస్యం వివ్వేషు పుంశ్చ లీరూపమేవచ. 61

సత్త్వ ప్రధానం యద్రూపం యద్యుక్తంచ ప్రభావతః | తదుత్తమం చ విశ్వేషు సాధ్వీరూపంచ శంసితమ్‌? 62

తద్వాస్తవం చ విజ్ఞేయా ప్రవదంతి మనీషిణః | రజోరూపం తమోరూపం కళాసు వివిధం స్మృతమ్‌. 63

మధ్యమారజసశ్చాం శా స్తా స్తు భోగేషులోలుపాః | సుఖసంభోగ వశ్యాశ్చ స్వకార్యేనిరతాః సదా. 64

కపటా మోహకారిణ్యో ధర్మార్థ విముఖాః సదా | రజోరూపస్య సాధ్వీత్వమతోనైవోపజాయతే. 65

ఇదం మధ్యమ రూపం చ ప్రవదంతి మనీషిణః | తమోరూపం దుర్నివార్య మధమం తద్విదుర్భుధాః. 66

న పృచ్ఛతి కులేజాతః పండితశ్చ పరస్త్రియమ్‌ | నిర్జనే నిర్జలేవా7పి రహస్య పి పరస్త్రియమ్‌? 67

ఆ గచ్చామి త్వత్సమీవ మాజ్ఞాయా బ్రహ్మణో7ధునా | గాంధర్వేణ వివాహేన త్వాం గ్రహీస్యాహి శోభ##నే 68

అహమేవ శంఖచూడో దేవవిద్రావకారకః | దనువంశ్యో విశేషేణ సుదామా7హం హరేః పురా. 69

అహమష్టమ గోపేషు గోపో7పిపార్‌షదేషు చ | అథునా దానవేంద్రో7హం రాధికాయాశ్చ శాపతః, 70

అహల్య అరుంధీ మేనకు తార మందోదరి దమయంతి వేదవతి గంగ మనస పుష్టి తుష్ఠి స్మృతి మేధా కాళిక వసుంధర షష్ఠి మంగళ చండికమూర్తి ధర్మకామిని స్వస్తి శ్రద్ధ శాంతి కాంతి క్షాంతి నిద్ర క్షుత్తు పిపాస సంధ్య రాత్రి దినములు సంపత్తి ధృతి కీర్తి క్రియ శోభ ప్రభ శివ మున్నగు స్త్రీ రూపము లన్నియును యుగ యుగమున శ్రేష్ఠములే యగును. వీరుత్తమ స్త్రీలు. జగదంబ కళాంశతో బుట్టిన స్వర్గ మందలి యచ్చరలు ప్రశంసింప బడదగినవారుకారు. వారు పడుపుకత్తెలు. సత్త్వ ప్రధానమైన సాధ్వీరూపమే జగమున నుత్తమమైనది తగినది ప్రభాసంపన్నమైనది. అట్టి సత్వ రూపమును పండితులు ప్రశంసింతురు. ఇక రజో రూపములు తమోరూపములును భిన్న భిన్నములైన కళలు గలవు. రజోంశమున బుట్టిన స్త్రీలు మద్యమలు. వారు బోగలాలసలు. సుఖ సంభోగముల మరగి వీరు తమ కార్యము నెఱవేర్చుకొనజూతురు. వీరు కపటము మోసము మోహము గలవారలు. ధర్మార్థములకు విముఖులు రజోగుణ ప్రధాన స్త్రీలు దోషభూయిష్ఠలు. అట్టివారిని పండితులు మధ్యమలనుగా జెప్పుదురు. తమోంశమున బుట్టిన వరిని బుధులధమలందురు. మంచి సంస్కారము గల కుటుంబ మునబుట్టిన పండితుడు నిర్జన స్థలమున రహస్యము నొంటిగ పర స్త్రీ తోడ మాటాడడు. ఓ శోభనాంగీ! నేనిపుడు బ్రహ్మ యానతిచే వచ్చుచున్నాను. గాంధర్వ వివాహమున నిన్ను చేపట్టుదును. నన్ను శంఖచూడు డందురు; దేవతలను గడగడ లాడించువాడను; దనుజుడను; మున్ను హరి చెంత సుదాముడన బరగిన వాడను. అపుడు నేను హరి కనుచరుడనై యుంటిని. ఎనిమిది మంది గోపకులలో ముఖ్యుడను. ఇపుడు రాధికా శాపమున దానవేంద్రుడ నైతిని.

జాతిస్మరో7హం జానామి కృష్ణమంత్ర ప్రభావతః | జాతిస్మరా త్వం తులసీ సంభుక్తా హరిణా పురా. 71

త్వమేవ రాధికాకోపా జ్ఞాతాసి భారతే భువి | త్వాం సంభోక్తు ముత్సుకో7హం నాలంరాధాభయాత్తతః. 72

ఇత్యేవముక్త్వా స పుమా న్విరరామ మహామునే | సస్మితం తులసీ తుష్టా ప్రవక్తు ముపచక్రకమే. 73

తులస్యువాచ: ఏవం విధో బుధోనిత్యం విశ్వేషు చ ప్రశంసితః | కాంతమేవం విధంకాంతా శశ్వదిచ్చతికామతః. 74

త్వయా7హ మధునా సత్యం విచారేణ పరాజితా | సనిందితశ్చాప్య శుచిర్యః పుమాంశ్చ స్త్రీయోజితః. 75

నిందంతి పితరో దేవా బాంధవాః స్త్రీజితం నరమ్‌ | స్త్రీజితం మనసా మాతా పితాభ్రాతా చ నిందతి. 76

శుద్దో విప్రో దశాహేన జాతకేమృతకే యథా | భూమిపో ద్వాదశాహేన వైశ్యః పంచదశాహతః. 77

శూద్రో మాసేన వేదేషు మాతృవద్ధీన సంకరః | అశుచిః స్త్రీజితః శుద్ధ్యేచ్చితా దహనకాలతః. 78

న గృహ్ణన్తీ చ్చయా తస్య పితరః పిండ తర్పణమ్‌ | నగృహ్ణన్త్యేవ దేవాశ్చ తస్య పుష్పజలా దికమ్‌. 79

కిం వా జ్ఞానేన తపసా జపహోమవ్రపూజనైః | కిం విద్యయా చ యశసా స్త్రీ భిర్యస్య మనోహృతమ్‌. 80

విద్యాప్రభావ జ్ఞానార్ధం మయాత్వం చపరీక్షితః | కృత్వా పరీక్షాం తాంతస్య వృణోతి కామినీ పరమ్‌. 81

వరాయ గుణహీనాయ వృద్ధాయాజ్ఞానినే తథా| దరిద్రాయ చ మూర్ఖాయ రోగిణ కుత్సితాయ చ. 82

అత్యంత కోపయుక్తాయ వా7త్యంత దుర్మఖాయ చ | పంగవే చాంగ హీనాయ చాంధాయ బధిరాయ చ. 83

జడాయచైవ మూకాయ క్లీబతుల్యాయ పాపినే | బ్రహ్మహత్యాం లభేత్సో7పి స్వకన్యాం ప్రదదాతియః. 84

శాంతాయ గుణినేచైవ యూనేచ విదుషే7పి చ | సాధనే చ సుతాం దత్త్వా దశయజ్ఞ ఫలం లభేత్‌. 85

నాకు పూర్వజ్ఞాపకము గలదు. నీమెకు పుర్వస్మృతి గలదు. నీవు తులసివి. నిన్ను మున్ను కృష్ణుడనుభవించెను. నీవును రాధికాకోపమున భారతమున జన్మించితివి. ఆనాడు నేను నిన్ననుభవింపదలచితిని. కాని రాధాభయమున మన సంగమ మపుడు జరుగలేదు. అని శంఖచూడుడు విరమింపగనే తులసి నవ్వి సంతసిల్లి అతనితో నిట్లు పలుకసాగెను. ప్రపంచమున నీవంటి సత్పురుషుడే ప్రశంసనీయుడు. నీవంటి కాంతుని నిత్యమును ప్రతికాంత కామించును. ఇపుడు నేనునిజముగ నీ భావములకోడిపోతిని. ఒక స్త్రీ చేతిలో నోడిన పురుషుని సమాజము నిందించును. ఒక స్త్రీ చేతిలో నోడినవానిని దేవతలు పితరులు బందుగులు నిందింతురు. తుదకు తల్లితండ్రులు సోదరులును మదిలో నతని నీసడింతురు. జాతాశౌచామృతా శౌచములందు విప్రుడు పదిదినములకును క్షత్రియుడు పండ్రెండు నాళ్లకును వైశ్యుడు పదునైదు దినములకును శూద్రుడు మాసమునకును శుద్ధి జెందునని వేదములందు గలదు. స్త్రీ చేతిలో నోడినవాడు చితిలో కాలిననేకిన శుద్ధి చెందడు. అట్టివా డిచ్చునట్టి పిండ తర్పణముల నతని పితరులు గ్రహింపరు. దేవతలు నతడొసంగు పుష్పపూజములు స్వీకరింపరు. ఎవని చిత్తము స్త్రీలంయందే చిక్కుకొనునో యట్టివాని జ్ఞానము విద్య జపహోమములు పూజలు కీరితి యన్నియు వ్యర్థములే. నీ విద్యాప్రభావమును జ్ఞానమును పరీక్షింతిని. కామిని తనకు గాబోవు వరుని పరీక్షించి వరించుట యుక్తము. గుణహీనుడు వృద్ధుడు అజ్ఞాని మూర్ఖుడు నిఱుపేద రోగి కుచ్చితుడు ముక్కోపి దుర్ముఖుడు కుంటి చెవిటి గ్రుడ్డి వికలాంగుడు జడుడు మూగ మగసిరిలేనివాడు పాపి యగు వరునకు కన్యాదానము చేయువాడు బ్రహ్మపత్యాపాతకు డగును. శాంతుడు గుణి పండితుడు సాధువు నవయువకుడు నగు పురుషునకు కన్య నిచ్చినవాడు పది అశ్వమేధయాగముల ఫలము బొందును.

యః కన్యాపాలనం కృత్వా కరోతి యది విక్రయమ్‌ | విక్రేతా ధనలోభేన కుంభీపాకం స గచ్ఛతి. 86

కన్యామూత్రం పురీషం చ తత్ర భక్షతి పాతకీ | కృమిభిర్దశితః కాకై ర్యాపదింద్రా శ్చ తుర్దశ. 87

తదంతే వ్యాధి సంయుక్తః సలభే జ్జన్మ నిశ్చితమ్‌ | విక్రీణాతి మాంస భారం వహత్యేవ దివానిశమ్‌. 88

ఇత్యేవ ముక్త్వా తులసీ విరరామ తపోనిధే | బ్రహ్మోవాచ: కిం కరోషి శంఖ చూడ సంవాదమనయా సహ. 89

గాంధర్వేణ వివాహేన త్వం చా స్యా గ్రహణం కురు | పురుషేష్వపి రత్నం త్వం స్త్రీషు రత్నం త్వియంసతీ.

విదగ్ధాయ విదగ్ధేన సంగమో గుణవాన్బవేత్‌ | నిర్విరోధ సుఖం రాజ న్కోవాత్యజతి దుర్లభమ్‌. 91

యో7వరోధ సుఖత్యాగీ సపశుర్నాత్ర సంశయః | కిం పరీక్షసి త్వం కాంత మీదృ శంగుణినం సతి. 92

దేవానా మసురాణాం చ దానవానాం విమర్దకమ్‌ | యథా లక్ష్మీశ్చ లక్ష్మీ శే యథా కృష్ణే చ రాధికా. 93

యథా మయిచ సావిత్రీ భవానీ చ భ##వేయథా | యథా ధరా వరాహే చ దక్షిణా చ యథా7ద్వరే. 94

యథా7త్రా వనసూయా చ దమయంతీ యథానలే | రోహిణీ చ యథాచంద్రే యథాకామేరతిః సతీ. 95

యథా దితిః కశ్యపే చ వసిష్ఠే7రుంధతీ సతీ | యథ7హల్యా గౌతమే చ దేవహూతిశ్చకర్దమే. 96

యథా బృహస్పతౌ తారశతరూపా మనౌయథా | యథా చ దక్షిణా యజ్ఞే యథాస్వాహా హుతాశ##నే. 97

యథా శచీ మహేంద్రే చ యథా పుష్టి ర్గణశ్వరే | దేవసేనా యథాస్కందే దర్మే మూర్తిర్యథా సతీ. 98

సౌభాగ్యా సుప్రియా త్వంచ శంఖచూడే తథాభవ | అనేనసార్ధం సుచిరం సుందరేణచ సుందరి. 99

స్థానే స్థానే విహారంచ యథేచ్ఛంకురు సంతతమ్‌ | పశ్చాత్ర్పాప్స్యసిగోలోకే శ్రీ కృష్ణం పునరేవచ. 100

చతుర్బుంచ వైకుంఠే శంఖచూడే మృతేసతి.

ఇది శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధేష్టాదశో7ధ్యాయః.

ఎవడైన కన్నియను పెంచి పెద్ద చేసి దానిని ధనాశ##చే నమ్మినచో వాడు కుంభీపాక నరకమున గూలును. వాడు నరకములో కన్య మల మూత్రములు కుడుచును. పదునలుగు రింద్రులంత కాలము పురుగులచే కాకులచే తినబడుచుండును. తర్వాత వాడు మనుజుడై పుట్టి వ్యాధిగ్రస్తుడగును. మాంస మమ్ముచు మోయుచు బ్రదుకును. అని తులసి విరమించెను. అంత బ్రహ్మ ప్రత్యక్షమై యిట్లనెను. ఓ శంఖచూడా! నీవిచట ఏమి చేయుచున్నావు? ఈమెతో సంవాద మెందులకు? గాంధర్వ విధిచే నీ వీమెను పెండ్లి చేసికొనుము. నీవు పురుష రత్నమవు. ఈమె స్త్రీ రత్నము. ఒక రసికునికి రసికురాలితోసంగమము శ్రేష్ఠతమ మగును. రాజా! అనాయసముగ లభించిన దుర్లభ##మైన సుఖము నెవడు కాల దన్నుకొనును. వలచి వచ్చిన సుఖసంపదను బోగొట్టుకొనువాడు పశువే కాని యితరుడు గాడు. తులసీ! నీవు నిట్టి గుణశాలి యగు కాంతు నేల పరీక్షింతువు. ఇతడు దేవ దానవులచే యణచ గలవాడు. నారాయణునందు లక్ష్మి కృష్ణునందు రాధిక నా యందు సావిత్రి శివునందు భవాని వరాహు నందు భూదేవి యజ్ఞ పురుషునందు దక్షిణ అత్రి యం దనసూయ నలు నందు రోహిణి మదను నందు రతి కశ్యపునందు దితి వసిష్ఠునం దరుంధతి గౌతమునం దహల్య కర్ధము నందు దేవహూతి బృహ స్పతి యందు తార మనువు నందు శతరూప యజ్ఞు నందు దక్షిణ యగ్ని యందు స్వాహా ఇంద్రు నందు శచి గణపతి యందు పుష్టి కుమారు నందు షష్ఠి ధర్మునందు మూర్తివలెనీవును శంఖచూడు నందు తగిన ప్రియురాలవై సౌభాగ్యపతివి కమ్ము.సుందరీ! ఈ సుందరునితో నీవు చిరాకలము హరించుము. నీ వితనితో నెల్ల చోట్ల నిత్యమును స్వేచ్ఛగ కామ విహారము చేయుము. తర్వాత గోలోకము చేరి శ్రీకృష్ణుని చేరుకొనగలవు. శంఖ చూడుడు మరణించిన పిమ్మట వైకుంఠమున చతుర్బుజుని గూడి పరమానం దమందగలవు.

ఇది శ్రీదేవీ భాగవత మహా పురాణ మందలి నవమ స్కంధమున పదునెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters