Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచదశో7ధ్యాయః.

నారద ఉవాచః నారాయణ ప్రియా సాధ్వీ కధంసాచబభూవహ | తులసీ కుత్ర సంభూతా కావాసాపూర్వజన్మని. 1

కస్య వాసాకులే జాతాకస్య కన్యా కులే సతీ | కేన వాతపసా సాచ సంప్రాప్తా ప్రకృతేః పరమ్‌. 2

నిర్వికారం నిరీహం చ సర్వ విశ్వస్వరూపకమ్‌ | నారాయణం పరంబ్రహ్మ పరమేశ్వర మీశ్వరమ్‌. 3

సర్వారాధ్యంచ సర్వేశం సర్వకారణమ్‌ | సర్వాధారం సర్వరూపం సర్వేశాం పరిపాలకమ్‌. 4

కధ మేతాదృశీ దేవీ వృక్షత్వం సమవావ హ | కథం సాప్యసురగ్రస్తా సంబభూవ తపస్వినీ. 5

సుస్నిగ్ధం మే మనోలోలం ప్రేరయన్మాం ముహూర్ముహుః ఛేత్తు మర్హసిసందేహం సర్వసంహభంజన. 6

నారాయణ ఉవాచః మనుశ్చ దక్షసావర్ణిః పుణ్యవాన్వైష్ణవః శుచిః | యశస్వీ కీర్తిమాం శ్చైవ విష్ణోరం శసముద్బవః శుచిః | 7

తత్పుత్రో బ్రహ్మసావర్ణి ద్ధర్మిష్ఠో వైష్ణవః శుచిః | తత్పుత్రో ధర్మసావర్ణిర్వైష్ణవశ్చ జితేంద్రియః. 8

తత్పుత్రో రుద్రసావర్ణిర్బక్తిమాన్విజితేంద్రియః | తత్పుత్రో దేవసావర్ణి ర్విష్ణువ్రత పరాయణః. 9

తత్పుత్ర ఇంద్రసావర్ణి ర్మహావిష్ణుపరాయణః | వృషధ్వజ శ్చ తత్పుత్రో వృషధ్వజ పరాయణః. 10

యస్యాశ్రమే స్వయం శంభు రాసీ ద్దేవయుగత్రయమ్‌ | పుత్రా దపి పరః స్వేహో నృపేతస్మిన్‌ శివస్య చ. 11

న చ నారాయణం మేనే న లక్ష్మీ న సరస్వతీమ్‌ | పూజాం చ సర్వ దేవానాం దూరీభూతాం చకా రసః. 12

భాద్రేమాసి మహాలక్ష్మీ పూజాం మత్తో బభంజహ | తధామాఘీయ పంచమ్యాం విస్తృతాం స,ర్వదైవతైః. 13

పదునైదవ అధ్యాయము

శక్తి ప్రాదుర్బావము

నారదు డిట్లనెను: ఓ ప్రభూ! తులసీదేవి నారాయణుని భార్య యెట్టు లయ్యెను? ఆమె యెచ్చట బుట్టెను? పూర్వ జన్మమున నామె యెనరు? ఆమె యెవరి కులమున కన్యగ బుట్టెను? ఆమె యెంత ఘోరతపముచేసి ప్రకృతికి పరుని పతిగబడసెను? నిర్వికారుడు నిరీహుడు సర్వవిశ్వరూపుడు పరబ్రహ్మ పరమేశ్వరుడు ఈశ్వరుడు సర్వారాధ్యుడు సర్వేశుడు సర్వజ్ఞుడు సర్వకారణుడు సర్వధారుడు సర్వరూపుడు సర్వపాలకుడు నగు నారాయణుని పతిగ నామె యెట్లు పడయగల్గెను? అంతటి తపస్విని యెట్టుల చెట్టుల మారెను? ఒక్క యసురునిచేత నెట్లు పట్టుకొనబడెను? ఎల్లరు సంశయములు దీర్చువాడా? నా మనస్సు చంచలమైనది. ఈ విషయమెఱుగుటకునా మనస్సు చంచలమై మాటిమాటికి నన్ను పురికొల్పుచున్నది. నాయీ సందియములు పాపుటకు నీవే సమర్థుడవు. నారాయణు డిట్లు పలికెను: పూర్వము దక్షసావర్ణి మనువు చాల పుణ్యవంతుడు పవిత్రుడు వైష్ణవ భక్తుడు యశస్వి విష్ణువంశమున జన్మించినవాడు. అతని కొడుకు బ్రహ్మసావర్ణి; ధర్మిష్ఠుడు వెష్ణవుడు పవిత్రుడు అతని కొమనుడు ధర్మసావర్ణి జితేంద్రియుడు పరమ వెష్ణవుడు. అతని కుమారుడు రుద్రసావర్ణి; భక్తిమంతుడు జితేంద్రియుడు. అతని సుతు డింద్రసావర్ణి; మహావిష్ణుభక్తుడు అతని పుత్రుడే శివపరాయణుడు వృశధ్వజుడు. అతని యాశ్రమమందు శివుడు మూడు దేవయుగములు వసించెను. అతనిని శివుడు తన కన్న మిన్నగ చూచుకొనెను. అతడు శివుని దప్ప లక్ష్మీనారాయణులనుగాని సరస్వతినిగాని యితర దేవతలనుగాని పూజింపకుండెను. అతడు శివపరుడై భద్రపదమున మహాలక్ష్మీపూజగాని యెల్ల సురలకు ప్రియమైన మాఘ పంచమీ వ్రతముగాని చేయలేదు.

పాపః సరస్వతీ పూజాం దూరీభూతాం చకార సః | యజ్ఞణ చ విష్ణుపూజాం చ నిందంతం తంది వాకరః. 14

చుకొప దేవో భూపేంద్రం శశాప శివకారణాత్‌ | భ్రష్ట శ్రీస్త్వంచ భ##వేతి తం శశావ దివాకరః. 15

శూలం గృహీత్వాతం సూర్యమధావచ్ఛంకరః స్వయమ్‌ | పిత్రాసార్ధం దినేశశ్చ బ్రహ్మాణం శరణంయ¸°. 16

శివ స్త్రిశూలహ స్తశ్చ బ్రహ్మలోకం య¸° క్రుధా | బ్రహ్మా సూర్యం పురస్కృత్య వైకుంఠంచ య¸°భియా. 17

బ్రహ్మకశ్యపమార్తండాః సంత్రస్తాః శుశ్క తాలుకాః | నారాయణం చ సర్వేశం తే యయుః శరణం భియా. 18

మూర్ధ్నా ప్రణముస్తే గత్వాతుష్టువుశ్చ పునః పునః దదౌ | సర్వం నివేదనం చక్రుర్బయస్యకారణం హరౌ. 19

నారాయణశ్చ కృపయాతేభ్యశ్చ హ్యభయం దదౌ | స్థిరా భవత హే భీతా భయం కిం చ మయిస్థితే. 20

స్మరంతియే యత్ర యత్రమాం విపత్తౌ భయాన్వితాః | తాం స్తత్రగత్వారక్షామి చక్రహస్త స్త్వరాన్వితః. 21

పాతా7హం జగతాం దేవాః కర్తా చ సతతం సదా | స్రష్టా చ బ్రహ్మరూపేణ సంహర్తా శివరూపతః. 22

శివోహం త్వ మహంచాపి సూర్యో7హంత్రి గుణాత్మకః | విధాయ నానా రూపం చ కరోమిసృష్టి పారనమ్‌. 23

యూయం గచ్ఛత భద్రం వో భవిష్యతి భయం కుతః | అధ్యప్రభృతి మద్వరేణ భయంవో నాస్తిశంకరాత్‌. 24

సర్వేశోవై సభగవాన్‌ శంకర శ్చ సతచాంపతిః | భక్తాధీన శ్చ భక్తానాం భక్తాత్మా భక్తవత్సలః. 25

సుదర్శనః శివశ్చైవ మమ ప్రాణాధి కః ప్రియః | బ్రహ్మాండేషు న తేజస్వీ హే బ్రహ్మన్ననయోః పరః. 26

అతడు సరస్వతి నొక్కసారియైన పూజింపలేదు. ఇట్టులతడు యజ్ఞములను విష్ణుపూజలను నిందించు పాపి. అతనిపై కోపించి సూర్యు డతని నిట్లు శపించెను. 'నీవు శివుని చూచుకొని ఇతర దేవతలను పూజించుట లేదు కాన నీ సిరి సంపదలు కొలగి పోవుగాక' ని సూర్యుడు శపించెను. అపుడు శివుడు స్వయముగ శూలము చేత బట్టుకొని సూర్యనిమీదకి పరుగెత్తగ నతడు తన తండ్రి యగు కశ్యపుని వెంట నిడుక్‌ని బ్రహ్మను శరణుచొచ్చెను. అపుడు రుద్రుడు శూలపాణియై రౌద్రాకారముతో బ్రహ్మలోక మేగెను. బ్రహ్మయును భయపడి సూర్యని మున్నిడుకొని విష్ణులోక మేగెను. ఆ విధముగ బ్రహ్మ కశ్యపుడు రవి యును మొగములు వెలవెల బోగ భయముతో వణకుచు సర్వేశుడగు నారాయణుని శరణుచొచ్చిరి. వారు తలలు వంచి చేతులెత్తి మ్రొక్కిరి. మాటి మాటికి కొనియాడిరి. హరితొ తమ భయ కారణము తెల్పుకొనిరి. అంత నారాయణుడు దయతో వారి కభయ మిచ్చి యిట్లు పలికెను. ఇంక మీదట మీరు నిశ్చింతగ నుండుడు. నే నుండగ మీరు భయపడనేల? ఎవ్వరెవ్వరెచ్చటెచ్చట నేయే యాపద లందు జిక్కుకోని యార్తితో నన్నే స్మరింతురో నే నచ్చటచ్చట వారి నా యా యాపదల నుండి చక్కము చేత బూని ప్రోతును. ఓ సురలార! ఈ యెల్ల లోకములకు పాలకుడను నేనే. బ్రహ్మ రూపమున సృష్టి కర్తను రుద్ర రూపమున సంహారకుడను నేనే. నేనే శివుడను. నేనే సూర్యుడను నేనే మీరు. ఇట్లు నే నొక్క డనయ్యు పెక్కు రూపులు దాల్చి విశ్వపాలన గావింతును. ఇంక మీరు వెళ్ళుడు. మేలగుత! నేటి నుండి నా వరము మీకు శంకరుని వలన భయము గలుగదు. శంకర భగవానుడు భూతపతి. సర్వేశుడు భక్త పరాధీనుడు; భక్తాత్ముడు భక్తవత్సలుడు. శివుడు సూర్యుడు నిర్వురును నాకు ప్రాణము కన్న ప్రియులు. ఈ బ్రహ్మాండము లందు వీరిని మించిన తేజో మూర్తులు లేనే లేరు.

శక్తః స్రష్టం మహాదేవః సూర్యకోటిం చ లీలయా | కోటించ బ్రహ్మణామేవం నాసాధ్యం శూలినః ప్రభో. 27

బ్రహ్మజ్ఞానం నైవ కించి ద్ధ్యాయతే మాం దివానిశమ్‌ | మన్మంత్రాన్మ ద్గుణాన్బక్త్యా పంచవక్త్రేణ గాయతి. 28

అహమేవం చింతయామి తత్కల్యాణం దివా నిశమ్‌ | యథా చ మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌. 29

శివస్వరూపో భగవాన్‌ శివాధిష్ఠాతృ దేవతా | శివం భవతి తస్మాచ్చ శివం తేన విరుర్బుధాః. 30

ఏతస్మిన్నంతరే తత్ర జగామ శంకరః స్థితః | శూలహ స్తో వృషారూఢో రక్త పంకజలో చనః.31

అవరుహ్య వృషాత్తూర్ణం భక్తినమ్రాత్మ కంధరః | ననామ భక్త్యా తంశాంతం లక్ష్మీకాంతం పరాత్పరమ్‌. 32

రత్న సింహాసనస్థం చ రత్నాలంకార భూషితమ్‌ | కిరీటినం కుండలినం చక్రిణం వనమాలినమ్‌. 33

నవీన నీరదశ్యామ సుందరం చ చతుర్బుజమ్‌ | చతుర్బుజైః సేవితం చ శ్వేతచామర వాయునా. 34

చందనోక్షిత సర్వాంగాం భూషితం పీతవాససమ్‌ | లక్ష్మీ ప్రదత్త తాంబూలం భుక్తవంతం చ నారద. 35

విద్యాధరీనృత్యగీతం పశ్యంతం సస్మితం సదా | ఈశ్వరం పరమాత్మానాం భక్తానుగ్రహ విగ్రహమ్‌. 36

తం ననామ మహాదేవో బ్రహ్మణా నమితశ్చసః | ననామ సూర్యో భక్త్యాచ సంత్రస్త శ్చంద్రశేఖరమ్‌. 37

కశ్యపశ్చ మహాభక్త్యా తుష్టావ చ ననామ చ | శివః సంస్తూయ సర్వేశం సమువాస సుఖాసనే. 38

సుఖాసనే సుఖాసీనం విశ్రాంతం చంద్రశేఖరమ్‌ | శ్వేతచామరవాతేన సేవితం విష్ణుపార్షదైః. 39

మహా దేవున కాసధ్యమైన దేదియును లేదు. అతడు లీలగ కోటి సూర్యులను కోటి బ్రహ్మాండములను సృజింప గల దక్షుడు. అతడు పైకి జ్ఞానము లేనివాని వలె నున్నను హృదయమున భక్తి భావముతో నైదు ముఖములతో నన్నే ధ్యానిం చుచుండును. నేనేను రాత్రింబగళ్ళు శివుని యోగక్షేమములు చూచుచుందును. నన్నెవడెట్లు భజించునో నేనును వాని నట్లే ప్రోతును. శివుడు మంగళమూర్తి. మోక్షమున కధిష్ఠాన దేవత. అతని వలననే ముక్తి లభించును. కాన పండితులతనిని శివుడందురు. ఇట్లను చున్నంతలో నచటి కెద్దునెక్కి శూలము బూని కన్ను నిప్పులు రాల రుద్రు డేతెంచెను. శివుడు వెంటనే యెద్దు నుండి దిగి భక్తి వినయములతో తలవంచి హరికి నమస్కరించెను. లక్ష్మీకాంతుడు పరాత్పరుడు శాంతుడు రత్న సింహాసనస్థుడు రత్నాలంకారభూషితుడు కిరీటము చక్రము కుండలములు వనమాల గలవాడు చతుర్బుజుడు క్రొత్త మేఘముల వలె శ్యామలాంగుడు సుందరుడు నలువైపుల వింజామరల చేత వీవబడువాడును, మేనినిండ చందనములందు కొన్నవాడును పీతాంబరుడును లక్ష్మి యందిచ్చు తాంబూలము సేవించువాడును విద్యాధర కన్యల నృత్య గీతములు గాంచి నవ్వువాడును భక్తానుగ్రహ విగ్రహుడును పరాత్పరుడు ఈశుడు అగుహరికి మహాదేవుడు నమస్కారము చేసెను. బ్రహ్మయును శివునకు వందన మొనరించెను. సూర్యుడును భయపడుచునే శివునకు భక్తితో నమస్కారము చేసెను. కశ్యపు డును పరమ భక్తితో శివతరుడైన శివుని స్తుతించి నమస్కరించెను. శంకరుడును హరిని సంస్తుతించి సుఖాసన మందు గూర్చుండెను. ఆ పగిది సుఖాసన మందు గూరుచున్న మహాదేవునికి విష్ణు పార్శ్వచరులు వింజామరలు వీచిరి.

పీయూషతుల్య మధురం వచనం సుమనోహరమ్‌ | విష్ణురువాచ : ఆగతోసిథంచాత్ర వదకోపస్య కారణమ్‌. 40

మహాదేవ ఉవాచ : వృషధ్వజం చ మద్బక్తం మమప్రాణాధికం ప్రియమ్‌ | సూర్యః శశాపఇతి మే ప్రకోపస్యతు కారణమ్‌. 41

పుత్రవత్సలశోకేన సూర్యంహంతుం సముద్యతః | స బ్రహ్మాణం ప్రసన్నశ్చ సూర్యశ్చ స విధి స్త్వయి. 42

త్వయి యేశరణాపన్నా ధ్యానేన వచసా7పివా | నిరాపదో విశంకాస్తేజరామృత్యుశ్చతైర్జితః. 43

ప్రత్యక్షం శరణాపన్నా స్తత్పలం కిం వాదిమిభోః | హరిస్మృతిశ్చాభయదా సర్వమంగళదా సదా. 44

కిం మే భక్తస్య భవితా తన్మే బ్రూహిజగత్పృభో | శ్రీహతస్యాస్య మూఢస్య సూర్యశాపేనహేతునా. 45

విష్ణురువాచ : కాలో7తియాతోదైవేన యుగానామేక వింశతిః | వైకుంఠే ఘటికార్ధేన శీఘ్రంగచ్ఛ త్వమాలయమ్‌. 46

వృషధ్వజో మృతఃకాలా ద్దుర్నివారాత్సుదారుణాత్‌ | రథధ్వజశ్చ తత్పుత్రో మృతః సో పిశ్రియా హతః. 47

తత్పుత్రౌ చ మహాభాగౌ ధర్మధ్వజ కుశద్వజౌ | హృతశ్రి¸° సూర్యశాపాత్స్మృతౌ పరమవైష్ణవౌ. 48

రాజ్యభ్రష్టౌ శ్రియాభ్రష్టౌ కమలాతపసా రతౌ | తయోశ్చ భార్యయో ర్లక్ష్మీః కలయాచ భవిష్యతి. 49

సంపద్యుక్తౌ తదాతౌ చ నృపశ్రేష్ఠౌ భవిష్యతః | మృతస్తే సేవకః శంభో గచ్ఛయూయం చ గచ్ఛత. 50

ఇత్యుక్త్వా చ సలక్ష్మీకః సభాతో7భ్యంతరం గతః | దేవా జగ్ముః సంప్రహృష్టాః స్వాశ్రమం పరమం ముదా. 51

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే నారాయణనారద సంవాదేశక్తి ప్రాదుర్బావే పంచదశో7ధ్యాయః

అత్తఱి శ్రీవిష్ణువు సుమనోహరములై యమృతమధురములైన వచనములతో నిట్లు పలికెను. విష్ణువిట్లనెను : ఓ శంకరా ! నీ రాకకు కారణమేమి ? నీ కోపమునకు కారణమేమి ? మహాదేవుడిట్లనెను : వృషధ్వజుడు నా పరమభక్తుడు; ప్రాణ ములకన్న ప్రియుడు ; అతనిని సూర్యుడు శపించెను. అందుచే నాకు కొపమువచ్చెను. నేను పుత్రవాత్సల్యముతో నా భక్తుని శపించిన సూర్యుని చంపదలంచితిని. అపుడు సూర్యుడు బ్రహ్మను నిన్ను శరణువేడెను. ఎవ్వరు మాటలతోగాని మనస్సుతోగాని నీవే దిక్కని నిన్నే శరణువేడుదురో వారికే యాపదయు గల్గదు. వారికి శంకగాని చావుగాని ముదిమిగాని యుండదు. ఇంత ప్రత్యక్షముగ శరణాగతులైనవారికిగల్గు ఫలిమింతింతనరాదు. తన్ను స్మరించువారికి హరి శుభము అభయము నొసంగును. ప్రభూ ! సూర్యశాపమున సిరిబాసి మూఢుడైన నా భక్తుని కేదిగతియో తెలుపుము. విష్ణువిట్లనియె: ఇపుడు వైకుంఠమున నరగడియ గడిచెను. ఇంతకామున భూమిపై నిరువదొక్క యుగములు గడచెను. కనుక నీవు వెంటనే యిపుడు నీ చోటి కరుగుము. వృషధ్వజుడు దాటరాని దారుణమైన కాలయోగమున చనిపోయెను. అతని కొడుకు రథధ్వజుడును సిరికోల్పోయి మరణించెను. అతని కొడుకులు ధర్మధ్వజ కుశధ్వజులు ; వీరును సూర్యశాపమున సిరిగోల్పో యిరి-ఐనను పరమవైష్ణవులైరి. వారు శ్రీహీనులు-రాజ్యభ్రష్టులు నగుటవలన మహాలక్ష్మినారాధించుటకు బూనుకొనిరి. వారి యిర్వురి భార్యలకు లక్ష్మి తన కళాంశతో జన్మించగలదు. అపు డా రాజులు శ్రీమంతులగుదురు. శంభూ ! ఇపుడు నీ భక్తుడు మరణించెను. నీవునిపుడు నీచోటి కేగుము. అని విష్ణువు సభనువదిలి లక్ష్మినిగూడి యంతిపుర మేగెను. సురలెల్ల రును ప్రమోదముతో తమతమ నెలవులకరిగిరి. శివుడును పూర్ణతపమొనరింపనరిగెను.

ఇది శ్రీదేవీభాగవత మహాపురాణ మందలి నవమ స్కంధముననరనారాయణ నారద సంవాదమున శక్తి ప్రాదుర్బావమున పదునైదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters