Sri Devi Bagavatham-2    Chapters   

అథ నవమో7ధ్యాయః.

నారదః: దేవ్యానిమేష మాత్రేణ బ్రహ్మణః పాతఏవచ l తస్య పాతః ప్రాకృతికః ప్రళయః పరికీర్తితః. 1

ప్రళ##యే ప్రాకృతే చోక్తతత్రా7దృ ష్టావసుంధరా l జలప్లుతాని విశ్వాని సర్వే లీనా ః పరాత్మని. 2

వసుంధరా తిరోభూతా కుత్రవా సా చ తిష్ఠతి l సృష్టేర్విధాన సమయే సా77విర్బూతా కథం పునః. 3

కథం బభూవ సా ధన్యామాన్యా సర్వాశ్రయాజయా l తస్యాశ్చ జన్మ కథనం వద మంగళ కారణమ్‌. 4

శ్రీనారాయణః: సర్వదీసృష్టౌ సర్వేషాం జన్మదేవ్యా ఇతి శ్రుతిః l ఆవిర్భావస్తిరోభావః సర్వేషు ప్రళ##యేషుచ.

శ్రూయతాం వసుధాజన్మ సర్వ మంగళ కారణమ్‌ l విఘ్నని ఘ్నకరం పాపనాశనం పుణ్యవర్ధనమ్‌. 6

అహో కేచిద్వదం తీతి మధుకైటభ##మేదసా l బభూవ వసుధా ధన్యా తద్విరుద్ధమతః శృణు. 7

ఊచతు స్తౌ పురా విష్ణుం తుష్ణౌ యుద్దేనతేజసా l ఆవాం వధ్యౌ న యత్రోర్వీ పాథసా సంవృతేతిచ. 8

తయోర్జీవన కాలేన ప్రత్యక్షాసా7భవ త్స్నుటమ్‌ తతో బభూవ మేదశ్చ మరణానంతరం తయోః 9

మేదినీతి చ విఖ్యాతే త్యుక్తమేతన్మతం శృణు l జలధౌతా కృతాపూర్వం వర్ధితా మేదసా యతః10

కథయామి తే తజ్జన్మ సార్థకం సర్వమంగళమ్‌ l పురా శ్రుతం యచ్ఛ్రత్యుక్తం ధర్మవక్త్రచ్చ పుష్కరే. 11

మహవిరాట్శరీరస్య జలస్థస్య చిరం స్పుచమ్‌ l మనో బభూవ కాలేన సర్వాంగవ్యాపకం ధ్రవమ్‌. 12

తచ్చ ప్రవిష్టం సర్వేషాం తల్లోమ్నాం వినరేషు చ l కాలేన మహతా పశ్చా ద్భభూవ వసుధా మునే. 13

తొమ్మిదవ అధ్యాయము

ప్రళయాది స్వరూప ప్రతిపాదనము

నారదు డిట్లనెను: శ్రీదేవి కనుఱప్పపాటు కాలములో బ్రహ్మ పతన మగును. అతని పతమునును ప్రాకృతిక ప్రళయ మందురు. ప్రాకృత ప్రళయమున భూమి కనిపించదు. విశ్వము లన్నియును నీటిలొ మునుగును . అన్నియును పంమాత్మలో లీనమగును. ఈ భూమి యదృశ్యమై యెక్కడ నుండును? తిరిగి సృష్టిసమయమున నెట్టు లావిర్బవించును? భూమి మరల ధన్య మాన్య జయ సర్వాశ్రయ యెట్లగును? మంగళప్రదయగు భూమి జన్మ వృత్తాంతము దయచేసి నాకు తేటపఱచుము. శ్రీనారాయణ డిట్లనెను: మొట్టమొదటి సృష్టియందు దేవి దయవలన నన్నియు నావిర్బవించును. అట్లే ప్రళయములందు నన్నియు నశించును అని వద మనును. ఇపుడు మంగళప్రదము విఘ్నహరము పాపనాశనము పుణ్యవర్ధనమ నగు భూమి జన్మ వృత్తాంత మాలకింపుము. మధుకైటభుల మేదస్సువలన నేర్పడుటచే భూమికి మేదిని యను పేరు గల్గెను. ఇట్లు భూమి ధన్యురాలు. దీనికి భిన్నమైన మతమును గలదు వినుము. పూర్వము హరికి మధుదైటభులకు నడుమ పోరు సాగెను. దానికి సంతసించి మదుకైటభు లతో వరము గోరుకొమ్మని హరి యడిగేను. నిరులేని భూమిపై మమ్ము చంపుమని వారు వరము గోరుకొనిరి. దీనివలన వారు బ్రదికి యుండగనే భూమి యున్నదని తెలియుచున్నది. వారు చనిపోయిన తర్వాతవారి నుండి మేదస్సు వెడలెను. వరహావతార మపుడు హరి నీటిలో మునింగిన భూమిని పైకెత్తు నపుడు రాక్షసుల మేదస్సు కలియుటచే దానికి మరియను పేరేర్పడెను. తొలుత పుష్కరతీర్థమందు ధర్మదేవుని నోట సార్థకము సర్వ మంగళకారకమునైన భూమి జన్మ వృత్తాంతము వింటిని. దానిని చెప్పుదును వినుము.

మునీశా! మునుపు జల మందున్న మహావిరాట్టు శరీరమునుండి సర్వవ్యాపకము ధ్రవమునైన భూమి గల్గెను. మునీ! మహావిరాట్టు ర్టోమకూపముల నుండి సృష్టి సమయమున భూమి యావిర్బవించెను.

ప్రత్యేకం ప్రతిలోకమ్నాంచ కూపేషు సంస్థితా సదాl ఆవిర్భూతా తిరోభుతా సజలా చ పునఃపునః. 14

ఆవిర్బూతా సృష్టికాలే తజ్జలో పర్యువస్థితా l ప్రళ యే చ తిరోభూతా జలస్యా7భ్యంతరేస్దితా. 15

ప్రతి విశ్వేషు వసుధా శైలకానన సంయుతా l సప్తసాగర సంయుక్తా సప్త ద్వీపసమన్వితా. 16

హేమాద్రిమేరు సంయుక్తా గ్రహచంద్రార్క సంయుతా l బ్రహ్మవిష్ణు శివాద్యైశ్చ సురైర్లోకై స్తదాజ్ఞయా. 17

పుత్యతీర్థ సమాయుక్తా పుణ్య భారత సంయుతా l కాంచనీ భూమి సంయుక్తా సప్తస్వర్గ సమన్వితా. 18

పాతాళ సప్తం తదధస్తా దూర్ల్వం బ్రహ్మలోకతః l ధ్రువలోక శ్చ తత్రైవ సర్వం విశ్వం చ తత్రవై. 19

ఏవం సర్వాణి విశ్వాని వృథివ్యాం నిర్మితాని చ నశ్వరాణి చ విశ్వాని సర్వాణి కృత్రిమాణివై. 20

ప్రశ##యే ప్రాకృతే చైవ బ్రహ్మణశ్చ నిపాతనే l మహావిరా డాది సృష్టౌ సృష్టః కృష్ణేన చాత్మనా . 21

నిత్యౌ చ స్థితి ప్రళ¸° కాష్ఠాకాలేశ్వరైః సహ l నిత్యా7 ధిష్ఠాతృ దేవీసావారాపే పూజితాసురైః 22

ముని భిర్మనుభిర్విపై#్ర ర్గంధర్వాదిభిరేవచ l విష్ణో ర్వరాహరూపస్య పత్నీసా శ్రుతి సమ్మతా. 23

తత్పూత్రో మంగళో జ్ఞేయో ఘటేశో మంగళాత్మజః l నారదః: పూజితా కేన పూరేజ వారాహే చ సురై ర్మహీ. 24

వారాహే చైవ వారాపీ%ా సర్వైః సర్వాశ్రయా సతీ l ముల ప్రకృతి సంభూత పంచీకరణ మార్గతః. 25

తస్యాః పూజా విధానం చా7ప్యధశ్చోర్ద్వం మనేకశః l మంగళం మంగళ స్యాపి జన్మ వ్యాసం వద ప్రభో. 26

అతని ప్రతి రోమకూపము నుండి యిట్లు భూమి యావర్బవించి మరల లీనమగును. ఇట్లు మాటిమాటికి జరుగుచుండును. సృష్టి సమయమున భూమి నీటపై నావిర్బవించును. ప్రళయమందు మరల నీటీలో మునుంగును ఈ భూమి ప్రతి బ్రహ్మాండమందును గిరి వన దుర్గములతో సప్తసాగరములతో దీవులతో తనరారును. మేరుగిరితో సూర్యచంద్రులతో గ్రహములతో బ్రహ్మ విష్ణుశివాది సురలోకములతో గుడి భూమి విరాజిల్లుచుండును. ఈభూమి పవిత్ర భారతదేశము గల్గి పుణ్యతీర్థక్షేత్రములు బంగారు నేల పైనేడు లోకముగల్గి శోభిల్లును. భూమికి క్రింద నేడు లోకమ లుండును. పైని బ్రహ్మలోకము ధ్రువలోకము నొప్పుచుండును. విశ్వమంతయును భూమిపై చెన్నలరుచుండును. ఇట్లు విశ్వము లన్నియును భూమియందే నిర్మింపబడినవి . ఈ యెల్ల విశ్వములు నశ్వరములు- కల్పితములు. ప్రాకృత ప్రళయమున బ్రహ్మ ప్రతనమైనపుడు కృష్ణుడు సృష్టికాలమన తన యంశ##చే మహావిరాట్టును స్పజించును. సృష్టి ప్రళయములు కాలము కాలపతి యందఱును నిత్యులు. భూమియు నిత్యాదిష్ఠానదేవి. ఈమెను వరాహకల్పమున దేవతలు పూజించిరి భుమి మను ముని విప్రులచే గంధర్వులచే పూజింపబడెను. వరాహరూపుడగు విష్ణునకు భూమి భార్య యని వేదములు ఘోషిల్లును. భూమి కొడుకు మంగళుడు. అతని కొడుకు ఘటేశ్వరుడు. నారదు డిట్లనెను: దేవతలచేత నీ వారాహీదేవి యే విధముగ పూజింపబడెను? వరహకల్పమందు నెల్లర కాశ్రయమైన వారాహిభుమి మూలప్రకృతినుండి యెటుల పంచీకృతమయ్యెను. ప్రభూ! భూవిపై దివిపై భూమి పూజ యెట్లు చేతురు?శుభములకన్న శుభ##మైన భూమి జన్మచరిత్ర వివరముగదెల్పుము.

నారాయణః: వారాహే చ వరహ శ్చ బ్రహ్మణా సంస్తుతఃపురా l ఉద్దధార మహీం హత్వా హిరణ్యాక్షం రసాతలాత్‌. 27

జలే తాం స్థావయామాస పద్మ పత్రం యథా హ్రదే l తత్రైవనిర్మమే బ్రహ్మ విశ్వం సర్వమనోహరమ్‌. 28

దృష్ట్వా తదధిదేవీం చ సకామాం కాముకోహరిః l వరాహరూపీ భగవాన్‌ కోటి సుర్యాసమ ప్రభః. 29

కృత్వా రతికళం సర్వాం మూర్తించ సమనో హరామ్‌ l క్రీడాం చకార రహసి దివ్యవర్ష మహర్నిశమ్‌. 30

సుఖసంభోగ సంస్పర్శా న్మూర్చాం సంప్రాప సుందరీ l విదగ్ధాయా విదగ్ధేన సంగమో7తి సుఖప్రదః. 31

విష్ణు స్త దంగ సంశ్లేషా ద్బుబుధే న దివానిశమ్‌ l వర్షాంతే చేతనాం ప్రాప్య కామీ తత్యాజ కాముకీమ్‌. 32

పూర్వరూపం వరాహం చ దధార స చ లీలయా పూజాం చకార తాం దేవో ధ్యాత్వా చధరణీం స్థలీమ్‌. 33

ధూపైర్దీపైశ్చనై వేద్యైః సిందూరై రనులైపనెః l వస్త్రః పుషై#్పశ్చ బలిభిః సంపూజ్యోవాచ తాం హరిః. 34

సర్వాధార భవ శుఖే సర్వైః సంపూజితా సుఖమ్‌ l మునిభిర్మనుభి ర్దేవైః సిద్దైశ్చ దానవాదిభిః. 35

అంబువాచీత్యాగదినే గృహారంభే ప్రవేశ##నే l వాపీ తటాకారంభే చ గృహే చ కృషికర్మణి. 36

తవపూజం కరిష్యంతి మద్వరేణ సురాదయః l మూఢా యే న కరిష్యంతి యాస్యంతి నరకం చ తే. 37

మసుధోవాచః వహామి సర్వం వారాహరూపేణాహం తవాజ్ఞయా l లీలామాత్రేణ భగవ న్విశ్వంచ సచరాచరమ్‌.

నారాయణు డిట్లనెను: శ్రీవరాహకల్పమునందు బ్రహ్మచేత సుతింపబడిన శ్రీవరాహమూర్తి హిరణ్యాక్షుని చంపి రసాతలమునుండి భూమిని పైకెతైను. కొలని నీటిపై కమలము నుంచినట్లు నీటపై భూమిని వరాహమూర్తి యుంచెను. అపుడు దానిపై బ్రహ్మ మనోహరమైన విశ్వమును నిర్మించెను. అపుడు కోటిసూర్యప్రభులవేల్గు వరాహ భగవానుడు కాముకుడై కామినియగు భూమి కధిష్టానదేవిని మనసార తిలకించెను. చక్కని నవయువకుడై యొక దివ్య వర్షకాలము అతడామెతో శృంగార క్రీడలు సలిపెను. హరియొక్క చిత్రములైన వలపుకూటమికి భూదేవి మూర్చ మునింగెను. మంచి రసికునితోడి రసికురాలి పొందెంతయో సుఖసంతోషములు గల్గింతును. భూదేవి గట్టి-వెచ్చని-కమ్మని-గుబ్బకౌగిళ్ల స ందున జిక్కుకొని హరి రేతిరిపగలు తెలియక మించి రమించెను. ఒక్క దివ్వవర్షము గడచిన మీదట తెలివొంది హది భూదీవిని పట్టువదలెను. పిదప హరి లీలగ తన తొంటియాపమగు వరాహరూపము దాల్చెను. అపుడు హారి భూదేవుని పూజించి ధ్యానించెను. భూసతిని హరిదూపదీప నైవేద్యములతో సింధూరపు పూతలతో వస్త్రపుష్పబలులతో పూజించి యిట్లనెను. ఓ శుఖాంగీ ! నీవు స్వాధారవు. నీ వు నిత్యము ముని మను సిద్ధ దేవ దానవులచేత పూజ లందుకొనుచుందువు. ''అంబువాచి'' నాడు తప్ప నిన్ను నూతన గృహారంభ-గృహప్రవేశ-వాపీతటాకారంభుములందును వ్యవసాయపు పనులందును గృహములందు పూజింతురు. (సూర్యడు ఆర్ద్రానక్షత్ర ప్రథమపాదమందుడు మూడు దినముల ఇరువదిగడియల కాలమును అంబువాచి అనబడును. ఈకాలములో పృథివి రజస్వల ఐయుండును. అసమయములో శుభకార్యము లేవియు చేయురాదని కృత్య తత్త్వము జ్యోతిష గ్రంథమున కలదు. పరిష్కర్త.) నా వరముచే నిన్ను సురలు మున్నగువారును పూజింతురు. నిన్ను పూజించని మూఢులు నరకమున గూలుదురు. వసుధ యిట్లనెను: భగవానుడా! నేను నీ యాజ్ఞాచే లీలామాత్రముగ వరాహరూపముతో చరాచర విశ్వమంతయును మోయుదును.

ముక్తాం శుక్తిం హరే రర్చాం శివలింగం శివాం తథా l శంఖం ప్రదీపం యంత్రం చ మాణీక్యం హీరకంతథా 39

ష్ఠుయజ్ఞ సూత్రం చ పుష్పం చ పుస్తకం తులసీదళమ్‌ l జపమాల పుష్పమాలాం కర్పూరంచ సువర్ణకమ్‌. 40

గోరోచనం చందనం చ శాలగ్రామ జలం తథా l ఏతాన్వోఢు మశక్తా7హం క్లిష్టాచ భగవనో శృణు. 41

శ్రీభగవానువాచః ద్రవ్యాణ్యతాని యే మూఢా అర్పయష్యంతి సుందరి l యాస్యంతి

కాలసూత్రం తే దివ్యం వర్షశతంత్వయి 42

ఇత్యేవ ముక్త్వా భగవా న్విరరామ చ నారద l బభూవ తేన గర్బేణ తేజస్వీ మంఘళ గ్రహః. 43

పూజాం చక్రుః వృథివ్యా శ్చ తే సర్వే చాజ్ఞయా హరే ః l కణ్వశాఖోక్తధ్యానేన తుష్టువుశ్చ స్తవేవన తే. 44

దదుర్మూలేన మంత్రేణ నై వేద్యాదిక మేవచ l సంస్తుతా త్రిషులోకేషు పూజితా సా బభూవహ . 45

నారదః: కింధ్యానం స్తవనం తస్యా మూలమంత్రంచకిం వద l గూఢంసర్వపూరాణషు శ్రోతుం కౌతుహలం మమ. 46

శ్రీనారాయణః: అదౌ చ పృథివీ దేవీ వరాహేణ చ పూజితా l తతో హి బ్రహ్మణః పశ్చా త్పూజితా పృధివీ తదా. 47

తతః సర్వై ర్మూనీం ద్రైశ్చ మనుభిర్మానవాదిభిః l ధ్యానం చ స్తవనం మంత్ర శృణువక్ష్యామి నారద. 48

ఓం హ్రీణ శ్రీం క్లీం వసుధాయైస్వాహేత్యనేన మంత్రేణ విష్ణునా పూజితా పురా l శ్వేతపంకజ వర్ణభాం శరచ్ఛంద్రనిభాననామ్‌ . 49

చందనో క్షితసర్వాంగీంరత్న భూషణ భూషితామ్‌ l రత్నాధారాం రత్న గర్బాం రత్తాకర సమన్వితామ్‌. 50

కానిముత్యియమును ముతైపుచిప్పను విష్ణుప్రతిమను శివలింగమును శ్రీదేవీప్రతిమను శంఖమును ప్రదీపమును యంత్రమును మాణిక్యమును వజ్రమును యజ్ఞోపవీతమును పుష్పమును పుస్తకమును తులసీదళమును జపమాలను పుష్పమాలను కప్పుర మును బంగారమును గోరోచనమును చందనమును సాలగ్రామ తీర్థమును వీనిని మాత్రము నేను భరింపజాను. భగవానుడా! ఇవి నాకు కష్టము అన శ్రీభగవానుడిట్టులనియెను; ఓసుందరీ! ఈ వస్తువులను నీపై (వట్టినేలపై) నుంచు మూఢుడు నూఱు దివ్యవర్షములు కాలసూత్ర నరకమన నుండును. ఓ నారదా! అని భగవానుడు విరమించెను. అంత మహోజ్జ్వల శరీరయగు భూదేవి గర్బము నుండి కాంతులు విరజిమ్ముచున్న మంగళు డుద్బవించెను. అపుడందఱును హరి యానతిచేత కణ్వ శాఖలోని మంత్రములతో భూదేవిని పూజించి స్తోత్రముచే సంస్తుతించిరి. మూలమంత్రముతో భూమాతకు నైవేద్య మర్పించిరి. ఆమె ముల్లోకములందును పూజింపబడి సంస్తుతింపబడెను. నారదు డిట్లనెను: శ్రీభూమిదేవి యొక్క ధ్యానము స్తోత్రము మూల మంత్రము సకల పూరాణములందలి రహస్యమును నాకు తెలుపుము. వినవలయు ననెడు కుతూహలము నాకు మిక్కుటమగు చున్నది . శ్రీనారాయణు డిట్లనెను: మొట్టమొదట వరాహ భగవానుడు స్వయముగ పుడమి దేవివి పూజించెను. తర్వాత దరణిని బ్రహ్మ పూజించెను. ఆ తరువాత భూమిని ముని మను మానవు లెల్లరును పూజించిరి. నారదా! వసుధాదేవియొక్క ధ్యానము స్తవనము మంత్రము చెప్పుచున్నాను వినుము. ''ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహా'' అను మంత్రముతో మొదట విష్ణువు భూమిని పూజించెను. శ్రీవసుంధరాదేవి తెల్లని పద్మమువలెను శరత్కాలమందలి చంద్రునివలెను చల్లని శోభలు వెలార్చునది. ఆమె యంగములనిండ మంచి గంథమలందబడినది; దేవి రత్న భుష్ఠు%ుషణభూషిత; రత్నాధార; రత్నగర్భ; రత్నాకర; సస్యవిశాల శ్యామల.

వహ్ని శుద్థాంశుకాధానాం సస్మితాం వందితాం భ##జే l ధ్యానేనానేన సా దేవీ సర్వైశ్చ పూజితా7భవత్‌. 51

స్తవనం శృణు విప్రేంద్ర కాణ్వ శాఖోక్త మేవచ l జయజయే జలా ధారే జలశీలే జలప్రదే. 52

యజ్ఞ సూకరజాయే త్వం జయందేహి జయావహే l మంగళే మంగళా ధారే మంగళ్వే ప్రదే. 53

మంగళార్ధం మంగళేశే మంగళం దేహి మే భ##వే l సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే. 54

సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భ##వే l పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని. 55

పూణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భ##వే l సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే. 56

సర్వ సస్యహరేకాలే సర్వసస్మాత్మికే భ##వే l భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరారుణ. 57

భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే l ఇదంస్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌. 58

కోటిజన్మసు సభ##వే ద్బలవాన్బూ మిపేశ్వరః l భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః. 59

భూమిదానహరాత్పాపా న్ముచ్యతే నాత్ర సంశయుః l అంబువాచీ భూకరణం పాపాత్సముచ్యతే ధ్రువమ్‌. 60

అన్యకూపే కూప ఖనన పాపాత్యమచ్యతే ధ్రువం l పరభూమి హరా త్పారాన్ముచ్యతే నా త్రసంశయః. 61

భూమౌ వీర్యత్యాగపాపా ద్బూమౌ దీపాదిస్ధాపనాత్‌ l పాపేన ముచ్యతే సో7పి స్తోత్రస్య పఠనా న్మునే. 62

అశ్వమేధశతం పుణ్యం లభ##తే నాత్ర సంశయః l భూమి దేవ్యా మహాస్తోత్రం సర్వకాల్యాణ కారకమ్‌. 63

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నవమో7ధ్యాయః.

అగ్నిపవిత్రమైన వస్త్రము దాల్చినది సుహాసిని వందిత అను ధ్యానముచేత ధరణి మాత యెల్లరచే పూజింపబడును; ఇది ధ్యానము. ఓ విప్రేంద్రా! ఇక కణ్వశాఖలో చెప్పినట్లు భూమి స్తవనము వినుము. శ్రీనారాయణు డిట్లనెను: ఓహోజలాధారా ! జలశీలా! జలప్రదా! నీకు జయము! ఓ యజ్ఞవరాహ సతీ! జయావహా! మంగళాధారా! మంగళా! మంళప్రదా! మాంగల్యా! మాకు శుభమంగళము గలిగించుము తల్లీ! నీవు సర్వధారవు సర్వజ్ఞవు సర్వశక్తిగలదానవు. ఓభవా ! దేవీ! నీవు సర్వకామప్రదాయునివి. మాకోర్కెలు దీర్చుము. సనాతనీ! పుణ్యస్వరూప! పుణ్యముల మూలభీజమా! పుణ్యాశ్రయా! పుణ్యదాయినీ! పుణ్యశీలుర నిలయమా! సస్యశ్యామలా! సస్యాఢ్యా!సస్యదాయినీ! సర్వ సస్మాత్మికా! సస్యహరా! కాలరూపా! భూమీ! రాజుల పాలననే నలరు దేవీ! రాజులకు సుఖము గూర్చుదానా! భూమిదా! మాకు భూమి నిమ్ము. ఈ భూస్తోత్రము పుణ్యము. దీని నుదయమున లేచి చదువవలయును. దీని చదివినవాడుకోటి జన్మములు రాజగును. చదువుటవల భూమిదానపుణ్యము లభించును. భూమి దానమును హరించినందున గల్గు పాపమునుండి విముక్తు డగును. అంబువాచి నాడు భూమిని త్రవ్విని పాపమునుండి విముక్తుడగును. ఇతరుల బావి త్రవ్విన పాపమునుండి విముక్తుడగును. ఇతరుల భూమి హరించిన పాపమునుండి తప్పక ముక్తు డగును. భూమిపై వీర్యపాతము గల్గించు పాపము నుండి భూమిపై దీపాదులుంచు పాపమునుండియు నీ స్తోత్రము చదివినవాడు తప్పకవిముక్తుడగును. దీనివలన తప్పక నూఱశ్వమేధ యాగములపలిత మబ్బును. ఈ భూమి దేవి స్తొత్రము సకల శుభము లొడగూర్చును.

ఇది శ్రీదేవీ బాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున తొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters