Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచమో7ధ్యాయః

శ్రీనారాయణ ఉవాచ: వాగ్దేవతాయాః స్తవనం శ్రూయతాం సర్వకామదమ్‌|మహాముని ర్యాజ్ఞవల్క్యో యేన తుష్టావ తాం పురా. 1

గురుశాపా చ్చ స మునిర్హత విద్యో బభూవ హ | తదా77జగామ దుఃఖార్తో రవిస్థానం సుపుణ్యదమ్‌. 2

సంప్రా ప్య తపసా సూర్యం లోలార్కే దృష్టిగోచరే | తుష్టావ సూర్యం శోకేన రురోద చ ముహుర్ముహుః. 3

సూర్యస్తం పాఠయామాస వేదం వేదాంగమీ శ్వరః| ఉవాచ-స్తౌ హి వాగ్ధేవీం భక్త్యా చ స్మృతిహేతవే. 4

త మిత్యుక్త్వా దీననా థో7 ప్యంతర్ధానం చకార సః| మునః స్నాత్వా చ తుష్టావ భక్తినమ్రాత్మ కంధరః. 5

యాజ్ఞవల్క్యః కృపాం కురు జగన్మాత ర్మామేవం హతతేజసమ్‌ |

గురుశాపా త్స్మృతి భ్రష్టం విద్యాహీనం చ దుఃఖితమ్‌. 6

జ్ఞానం దేహి స్మృతి విద్యాం శక్తిం శిష్య ప్రబోధినీమ్‌|

గ్రంథకర్తృత్వ శక్తిం చ సుశిష్యం సుప్రతిష్ఠితమ్‌. 7

ప్రతిభాం సత్సభాయాం చ విచారక్షమతాం శుభామ్‌| లుప్తం సర్వం దైవ యోగా న్నవీభూతం పునః కురు. 8

యథా7ంకురం భస్మని చ కరోతి దేవతా పునః| బ్రహ్మస్వరూపా పరమా జ్యోతీరూపా సనాతనీ. 9

సర్వవిద్యాధిదేవీ యా తస్త్యె వాణ్యౖ నమో నమః| విసర్గ బిందుమాత్రాసు యదధిష్ఠానమేవచ. 10

తదధిష్ఠా త్రీ యా దేవీ తస్త్యె నీత్త్యె నమో నమః | వ్యాఖ్యాస్వరూపా సా సా దేవీ వ్యాఖ్యాధిష్ఠాతృరూపిణీ. 11

ఐదవ అధ్యాయము

సరస్వతీ స్తుతి

శ్రీనారాయణు డిట్లనెను : ఇక సరస్వతియొక్క సర్వకామదమైన స్తోత్రము వినుము. మున్ను యాజ్ఞవల్క్య మహాముని యీ స్తోత్రముచే సరస్వతిని సంస్తుతించెను. ఆ ముని గురుశాపమున నెల్ల విద్యలు మఱచిపోయి దుఃఖార్తుడై పుణ్యప్రదమగు సూర్యస్థానము చేరెను. అచట సూర్యునిగూర్చి తపము చేయగా సూర్యుడు ప్రత్యక్షమయ్యెను. అపుడు ముని మాటి మాటి కేడ్చుచు సూర్యునిట్లు పొగడ దొడగెను. సూర్యుడు ప్రీతుడై యతనిచే వేదవేదాంగమవులు చదివించెను. జ్ఞాపకశక్తికి సరస్వతీ స్తోత్రము భక్తితో నిరంతరము పఠనము చేయుమనియు చెప్పెను. దీననాధుడగు సూర్యుడటుల చెప్పి యంతర్థాన మొందెను. అంత యాజ్ఞవల్క్యుడు స్నానముచేసి భక్తి వినయములతో తలవంచి సరస్వతి నీ రీతి సంస్తుతించెను.

ఓ జగన్మాతా! నేను గురుశాపమున విద్యాహీనుడను; స్మృతి గోల్పోయినవాడను; తోజోహీనుడను; దుఃఖితుడను; నన్ను దయజూడుము. నాకు జ్ఞానము స్మరణశక్తి విద్య శిష్యులకు బోధించు శక్తి గ్రంథరచనాశక్తి ప్రతిభగల శిష్యులను ప్రసాదించుము. సత్సభలందు మంచి విచారణాశక్తిని ప్రతిభను ప్ర సాదించుము. నా నష్టమైన విద్య యంతయును మరల దైవయోగమున క్రొత్తదై నన్ను చేరువుగాత. భస్మములోని బీజాంకురమును తిరిగి మొలకెత్తగ జేసినటుల చేయుము. నీవు పరబ్రహ్మస్వరూపిణివి. సనాతన సర్వ విద్యాధిదేవియగు నో వాణీ| నీకు నమస్కారములు తల్లీ! విసర్గబిందు మాత్ర లేవర్ణము నాశ్రయించునో నీ వా వర్ణమున కధిష్ఠానదేవివి. నిత్యస్వరూపిణివి; వ్యాఖ్యానస్వరూపిణివి; వ్యాఖ్యాధిష్ఠాతృరూపిణివి నీకు నమస్కరాములమ్మా!

యయా వినాప్ర సంఖ్యావా న్సంఖ్యా కర్తుం న శక్యతే| కాలసంఖ్యా స్వరూపా యాత సై#్య ధేవ్యై నమోనమః. 12

భ్రమసిద్ధాంతరూపా యా తసై#్య దేవ్యై నమో నమః| స్మృతి శక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి స్వరూపిణీ. 13

ప్రతిభాకల్పనాశక్తి ర్యా చతసై#్య నమోనమః | సనత్కుమారో బ్రహ్మాణం జ్ఞానం పప్రచ్చ యత్ర వై. 14

బభూవ మూకవ త్సో7పి సిద్ధాంతం కర్తు మక్షమః | తదా77జగామ భగవా నాత్మా శ్రీకృష్ణీ ఈశ్వరః. 15

ఉవాచ స చ తాం స్తౌహి వాణీ మిష్టాం ప్రజాపతే | స చ తుష్టావ తాం బ్రహ్మా చాజ్ఞయా పరమాత్మనః. 16

చకార తత్పృ సాదేన తదా సిద్ధాంత ముత్తమమ్‌ | యదాప్యనంతం పప్రచ్చ జ్ఞానమేకం వసుంధరా. 17

బభూవ ముకవత్సో7పి సిద్ధాంతం కర్తు మక్షమ| తదా తాం చ స తుష్టావ సంత్రస్తః కవ్య పాజ్ఞయా. 18

తత శ్చ కార సిద్ధాంతం నిర్మలం భ్రమ భంజనమ్‌| వ్యాసః పురాణసూత్రం చ పప్ర చ్చ వాల్మికిం యదా. 19

మౌనీభూత శ్చ సస్మార తామేవ జగదంబికామ్‌ | తదా చకార సిద్ధాంతం తద్వరేణ మునీశ్వరః. 20

సంప్రాప్య నిర్మల జ్ఞానం భ్రమాంధ్య ధ్వంసదీపకమ్‌|

పురాణసూత్రం శ్రుత్వా చ వ్యాసః కృష్ణకులోద్బవః. 21

తాం శివాం వేద దధ్యౌ చ శతవర్షం చ పుష్కరే | తదా త్వత్తో వరం ప్రాప్య సత్కవీంద్రో బభూవ హ. 22

నీ దయలేనిచో గణితశాస్త్రజ్ఞుడు గణితము చేయలేడు. నీవు కాల సంఖ్యస్వరూపిణివి. నీకు నమస్కారము తల్లిరో! మనుజులలోని యెల్ల మాయాభ్రాంతులను దొంగలించు సిద్ధాంతరూపిణివి. నీవు స్మృతి బుద్ధి విద్యాశక్తిస్వరూపిణివి.

అట్టి నీకునమస్కారములు తల్లీ! ప్రతిభాకల్పనాశక్తి స్వరూపిణివి రసాలంకారరూపమగు నీకు నమస్కారములు తల్లీ! పూర్వము సనత్కుమారుడు బ్రహ్మను జ్ఞానము గూర్చి యడిగెను. అపుడు బ్రహ్మ జ్ఞానచర్చ- సిద్ధాంతము చేయ జాలక పోయెను. అంతలో నీశ్వరుడు భగవానుడునగు కృష్ణపరమాత్మ యేతెంచెను. కృష్ణునాదేశము ప్రకారము బ్రహ్మవాణిని సంస్తుంతించి బ్రహ్మజ్ఞానము నందుకొనెను. అపుడు వాణి దయవలన బ్రహ్మసిద్ధాంతము చేయగలిగెను. మున్ను భూదేవియు ననంతుని జ్ఞానమునుప దేశింపుమనెను. అనంతుడును తెల్పుటకు సమర్థుడు గాకుండెను. అపు డతడు కశ్యపు నాజ్ఞచే పలుకుల తల్లిని సన్నుతించెను.

ఆ పిదప భ్రమ తొలగించు నిర్మలమైన జ్ఞానముగూర్చి సిద్ధాంతీకరింప గల్గెను. తొలి వ్యాసుడు పురాణసూత్రములగూర్చి వాల్మీకి నడిగెను. అపుడు వాల్మీకి మౌనముబూని జగదంబను స్మరించెను. పిదప చదువుల తల్లి దయచే వాల్మీకి ముని సిద్ధాంతముచేసి చెప్పెను. కృష్ణాంశ##చే నుద్భవించిన వ్యాసుడను మున్ను కటికి చీకట్లను దీపము తొలగించు నట్లు భ్రమలు పావు నిర్మలజ్ఞానమును దేవి దయను బొందు పురాణ సూత్రములు వినెను. వ్యాసుడు నూఱండ్లు పుష్కర తీర్థమున మునుపు నిన్ను గూర్చి తపించి ధ్యానించి పరమొంది సత్కవీంద్రు డయ్యెను.

తదా వేదవిభాగం చ పురాణం చ చకారసః | యదా మహేంద్రః పప్రచ్చ తత్త్వ జ్ఞానం సదాశివమ్‌. 23

క్షణం తామేవ సంచింత్య తసై#్మ జ్ఞానం దదౌ విభుః | పప్రచ్చ శబ్దశాస్త్రం చ మహేంద్ర శ్చ బృహస్పతిమ్‌. 24

దివ్యం వర్ష సహస్రం చ స త్వాం దధ్యౌ చ పుష్కరే | తదా త్వత్తో వరం ప్రాప్య దివ్యవర్షసహస్రకమ్‌. 25

ఉవాచ శబ్ద శాస్త్రం చ తదర్థం చ సురేశ్వరమ్‌ | అధ్యాపితా శ్చ యే శిష్యా యైరధీతం మునీశ్వరైః. 26

తే చ తాం పరి సంచిత్య ప్రవర్తంతే సురేశ్వరీమ్‌ | త్వం సంస్తుతా పూజితా చ మునీంద్రై ర్మను మానవైః. 27

దైత్యేం ద్రై శ్చ సురై శ్చా పి బ్రహ్మ విష్ణుశివాదిభిః | జడీభూతః సహస్రాస్యః పంచవక్తృ శ్చతుర్ముఖః. 28

యాం స్తోతుం కి మహం స్తౌమి తామేకాస్యేన మానవః | ఇత్యుక్త్వా యాజ్ఞవల్క్యశ్చ భక్తినమ్రాత్మ కంధరః. 29

ప్రణనామ నిరాహారో రురోద చ ముహుర్ముహుః | జ్యోతీరూపా మహామాయా తేన దృష్టా7వ్యువాచ తమ్‌. 30

సుకవీంద్రో భ##వేత్యుక్త్వా వైకుంఠం చ జగామ హ | యాజ్ఞవల్క్య కృతం వాణీస్తోత్ర మేతత్తు యః పఠేత్‌. 31

స కవీంద్రో మహావాగ్మీ బృహస్పతి సమో భ##వేత్‌ | మహామూర్ఖశ్చ దుర్బుద్ధి ర్వర్షమేకం యదా పఠేత్‌. 32

అపుడు వ్యాసుడు వేదవిభాగమును పురాణ రచనమును చేసెను. మునుపు మహేంద్రుడు తనకు తత్త్వజ్ఞానము నుపదేశింపుమని శివు నడిగెను. అపుడు శివు డొక్కక్షణమాగి దివ్యవాణిని దలంచి యతనికి జ్ఞానము బోధించెను. మహేంద్రుడొకసారి బృహస్పతితో విపుల శబ్దశాస్త్రము గూర్చి ప్రశ్నించెను. అపుడు బృహస్పతి పుష్కరక్షేత్రమందు వేయి దివ్య వర్షములు నిన్ను ధ్యానించి నీ వరము బొందెను. బృహస్పతి సురపతి కపుడు శబ్దశాస్త్రము బోధించెను శిష్యులందఱును దేవిని ధ్యానించియే విద్యాసిద్ధి బడసిరి. ఓ చదువుల తల్లీ!

వారెల్లరును నిన్నే సంస్మరించి విద్యావంతు లగుదురు దేవీ! ఇట్లు నీవు ముని మను మానవులచేత పూజింపబడి సంస్తుతింపబడుదువు. దైత్యపతులచే సురలచే బ్రహ్మ విష్ణు శివుల చేతను నుతవై పూజితవైతివి. వేయినోళ్ళతో విష్ణువును ఐదు ముఖముల శివుడును నలుమోముల నలువయును నిన్ను నుతింప జాలరు. వారు నుతింపలేని దేవిని నే నొక్క నోటితో నెట్లు స్తుతింపగలను?

అని యాజ్ఞవల్క్యుడు భక్తి వినయముతో తలవంచి సరస్వతిని సంస్తుతించెను. అతడు పలుసారు లేడ్చుచు నిరాహారుడై బ్రాహ్మికి నమస్కరించెను. మహామాయ భాషాజ్యోతిర్మయి కళారసహృదయయగు సరస్వతి సంతోషించి యతనికిట్టు లనియెను. ''నీవు సుకవివి గమ్ము'' అని వరమిచ్చి వాజ్మయీదేవి వైకుంఠ మేగును.

ఈ యాజ్ఞవల్క్యుడు చెప్పిన శ్రీవాణి స్తవము నెవడు చదువునో అతడు మహాకవి మహావక్త బృహస్పతి సముడు గాగలడు. దుర్మతి మహామూర్ఖుడు సైతము దీని నొకయేడు చదువవలయును. వాడు తప్పక పండితుడు కవీంద్రుడు మేధావి గాగలడు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున పంచమాధ్యాయము.

సం పండితశ్చ మేధావీ సుకవీంద్రో భ##వే ద్ధ్రు వమ్‌|

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమ స్కంధే పంచమో ధ్యాయః.

Sri Devi Bagavatham-2    Chapters