Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వీతీయో7ధ్యాయః

నారదః సమాసేన శ్రుతం సర్వం దేవీనాం చరితం ప్రభో | విభోధనాయ భోదస్య వ్యాసేన వక్తు మర్హసి. 1

సృష్టే రాద్యా సృష్టివిధౌ కధ మావిర్బ భూవ హ | కధం వా పంచధా భూతా వద వేదవిదాంపర. 2

భూతా యయాంశ కళయా తయా త్రిగుణయా భవ| వ్యాసేన తాసాం చరితం శ్రోతు

మిచ్చామిసాంప్రతమ్‌. 3

తాసం జన్మానుకధనం పూజాధ్యానవిధిం బుధ| స్తోత్రం కవచమైవ్వర్యం శౌర్యం వర్ణయ మంగళమ్‌. 4

శ్రీనారాయణః: నిత్య ఆత్మా నభోనిత్యం కాలోనిత్యోదిశోయధా | విశ్వానాం గోళకం నిత్యం నిత్యోగోలోకఏవచ. 5

తదేవ దేశో వైకుంఠో నమ్రభాగాను సారకః | తథైవ ప్రకృతిర్నిత్యా బ్రహ్మలీలా సనాతనీ. 6

యధా గ్నౌ దాహికా చంద్రే పద్మేశోభా ప్రభారవౌ | శశ్వద్వుక్తా న భిన్న సా తధా ప్రకృతి రాత్మని. 7

వినా స్వర్ణం స్వర్ణకారః కుండలం కర్తుమక్షమః | వినా మృదం ఘటం కర్తుణ కులాలో హి న హీశ్వరః. 8

సహిక్షమస్తథా77త్మా చ సృష్టిం స్రష్టుంతయావినా | సర్వశక్తి స్వరూపాసా యాయాచశక్తి మాన్సదా. 9

ఐశ్వర్యవ చనః శశ్చక్తిః పరాక్రమ ఏవ చ | తత్స్వరూపా తయోర్ధాత్రీ సా శక్తిః పరికీర్తితా. 10

జ్ఞానం సమృద్ధిః సంపత్తిర్య శ##శ్తైవ బలం భగః తేన శక్తి ర్బగవతీ భగరూపా చ సా సదా. 11

తయా యుక్తః సదా77త్మాచ భగవాంస్తేన కథ్యతే | సచ స్వేచ్ఛామయో దేవః సాకారశ్చ నిరకృతిః. 12

తేజోరూపం నిరాకారం ధ్యాయంతే యోగినః సదా | వదంతి చ పరం బ్రహ్మ పరమానంద మీశ్వరమ్‌. 13

రెండవ అధ్యాయము

ప్రకృతి-తత్స్వరూపము

నారదు డిట్లనెను! ఓ ప్రభూ! ఎల్ల దేవతల చరిత్ర సంక్షేపమున వింటిని వీరినిగూర్చి యింకను విపులముగ తెలుసుకొనుటకు తేటగ విపులీకరించుటకు నీవు సమర్థుడవు. వేదవిదులలో శ్రేష్ఠుడా! సృష్ఠికి ముందున్న ప్రకృతి సృష్టి కాలమున నెట్టు లావిర్భవించెను.? ఆమె యెట్టులైదు విధములుగ నయ్యెను? ఆమె యంశమువలన కళవలన బుట్టిన ప్రాణులు త్రిగుణమయము లెట్టు లయ్యెను? వారి చరిత్ర మంతయును విపులముగ వినదలచుచున్నాను. కనుక వారి జన్మచరిత్రము పూజా ధ్యాన విధానములును స్తోత్రము కవచము ఐశ్వర్యము శౌర్యము శుభమును వర్ణించుము. నారయణు డిట్లనెను: నారదా! ఆత్మ ఆకాశము కాలము దిక్కులు బ్రహ్మండము గోలోకము ఇవన్నియును నిత్యములు. గోలోకమున పల్లములోదాని కొకవైపున వైకుంఠము వెల్గుచుండును. అది వినయ సంపన్నులకే చేరుటకు వీలైనది. వీనివలెనే బ్రహ్మలీల సనాతని యగు మూలప్రకృతియును నిత్యమైనదే. అగ్నిలో వేడిమి చంద్రునిలో కమలములో నందము సూర్యునిలో ప్రభయుండునట్లు పరమాత్మయందు ప్రకృతి విరాజిల్లుచుండును. ప్రకృతియు నిత్య-అభిన్న.

బంగారము లేనిదే స్వర్ణకారుడు కుండలములు చేయజాలడు. అటులే ప్రకృతి లేనిచో పరమాత్మ సృష్టి రచించుటకు శక్తుడు గాజాలడు. ప్రకృతి సర్వశక్తిస్వరూప; అమె తోడ్పాటుతో పరమాత్మ శక్తు డగును. ''శ'' కారమున కైశ్వర్యమనియు ''క్తి''యనగ పరాక్రమమనియు నర్థములు. కనుక శక్తి ఐశ్వర్య పరాక్రమ స్వరూపణి; ఐశ్వర్య విక్రమ దాయినియగు దేవి శక్తి యనబరగును. జ్ఞానము సంపద బలము సమృద్ధి కీర్తి ఐశ్వర్యము ననునారు యోగ్యతలు గల్గినది భగవతి- భగరూప యనబరుగును. అట్టి భగవతితో కూడియుండిన వాని భగవాను డందురు. కనుక భగవానుడు స్వేచ్చామయుడు సాకారుడు నిరాకారుడు దేవుడు నయ్యెను. యోగు లతని నిరాకార తేజము నను ధ్యానింతురు. అతనిని పరబ్రహ్మముగ పరమానందరూపునిగ ఈశ్వరునిగ బలుకుదురు.

ఆదృశ్యం సర్వద్రష్టారం సర్వజ్ఞం సర్వకారణమ్‌ | సర్వదం సర్వరూపం తం వైష్ణవాస్తన్న మన్వతే. 14

వదంతి చైవ తే కస్య తేజస్తే జస్నివనా వినా | తేజోమండలమ ధ్వస్థం బ్రహ్మ తేజస్వినం పరమ్‌. 15

స్వేచ్ఛామయం సర్వరూపం సర్వకారణ కారణమ్‌ | అతీవసుందరం రూపం బిభ్రతం సుమనోహరమ్‌. 16

కిశోరవయసం శాంతం సర్వకాంతం పరాత్పరమ్‌ | నవీననీరదాభాస ధామైకం శ్యామవిగ్రహామ్‌. 17

శరన్మధ్యాహ్న పద్మౌఘ శోభామోచన లోచనమ్‌ | ముక్తాచ్చ వినినింద్యైక దంతపంక్తి మనోరమమ్‌. 18

మ యూరపిచ్ఛ చూడం చ మాలతీ మాల్య మండితమ్‌ | సున సం సుస్మితం కాంతం భక్తాను గ్రహ కారణమ్‌. 19

జ్వల దగ్ని విశుద్ధైక పీతాంశుక సుశోభితమ్‌ | ద్విభుజం మురళీహస్తం రత్న భూషణభూషితమ్‌. 20

సర్వాధారం చ సర్వేశం సర్వశక్తి యుతం విభుమ్‌ | సర్వైశ్వర్యప్రదం సర్వం స్వతంత్రం సర్వ మంగళమ్‌. 21

పరిపూర్ణతమం సిద్ధం సిద్ధేశం సిద్ధికారకమ్‌ | ధ్యా యంతి వైష్ణవాః శశ్వ ద్దేవ దేవం సనాతనమ్‌. 22

జన్మ మృ త్యు జరావ్యాధిశోకభీతి హరం పరమ్‌ | బ్రహ్మణో వయసా యస్య నిమేష ఉపచర్యతే. 23

స చా77త్మా స పరంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే | కృషిస్త ద్బక్తి వచనో నశ్చ తద్దాస్యవా చకః. 24

భక్తి దాస్య ప్రదాతా యః సచకృష్ణః ప్రకీర్తితః | కృషిశ్చ సర్వవచనో న కారో బీజ మేవ చ. 25

స కృష్ణః సర్వస్రష్టా77దౌ సిసృక్ష న్నేక ఎవచ | సృ ష్ట్యు న్ము ఖస్త ధంశేన కాలేన ప్రేరితః ప్రభుః. 26

అత డదృశ్యుడు సర్వము చూచువాడు సర్వజ్ఞుడు సర్వకారణుడు సర్వదుడు సర్వస్వరూపుడు అని వైష్ణవులు తలం తురు. తేజము గల్గువా డోకడు లేక తేజ మెట్ల గల్గును? కనుక తేజోమండల మధ్యమునన్నువాడు- బ్రహ్మతేజస్వి-పరముడు-స్వేచ్ఛామయుడు-సర్వరూపుడు-సర్వకారణకారుణుడు-అతిసుందరుడు-సురూపుడు-సుమనోహరుడు-పరమశాంతుడు-శోరవయస్కుడు-సర్వకాంతుడు-పరాత్పరుడునీలమేఘశరీరుడు-మేఘ సంకాశధాముడు-శరత్కాలమందలి పట్టపగ టింటి పద్మముల శోభతో వెలుగొందు కన్నులు గలవాడు-ముతైములకంటె తెల్లని దంతము లందముగ నున్నవాడును. అతని కీరిటములో నెమలిపింఛము శోభిల్లును. మెడలో మాలతీమాల లందగించును. చక్కని ముక్కు చిర్నగవు లొలుకు ముఖము కలవాడు భక్తుల ననుగ్రహించువాడు. మండుచున్న అగ్నివలె వెలుగొందు పవిత్రమైన పట్టువస్త్రముతోప్రకాశించువాడు. రెండు చేతులు గల్గిమురళిచేతదాల్చి రత్నభూషణభూశితుడైవిలసిల్లువాడును; సర్వాధారుడు-సర్వేశుడు-సర్వశక్తియుతుడు-విభువు-సకలసంపదలిచ్చువాడు-సర్వస్వతంత్రుడు-సర్వమంగళుడు-పరిపూర్ణతముడు-సిద్ధడు-సిద్ధేశుడు-సిద్ధికారకుడు - దేవదేవుడు సనాతనుడు నగు భగవానుని వైష్ణవులు నిత్యము ధ్యానింతురు. అతడు పరుడు-జన్మ-మృత్యు-జరా-వ్యాధ్యి-శోకః భయహరుడు బ్రహ్మదేవుని పూర్ణాయువు పరమాత్ముని కొక నిమేషమాత్ర మని యందురు. అతనిని పరమాత్మ-ఆత్మ-పరంబ్రహ్మ-కృషుడు నని యందురు. ''కృషి'' యనగ భక్తివాచకము; ''న''దాస్యవాచకము; దాస్య భక్తియెవని యందు చూపదగునో నతడు కృష్ణు డనబడును. ''కృషి'' యనగ సర్వమనియు ''న'' అనగబీజమనియు నర్థము. అందుచే కృష్ణుడు సర్వబీజము; సృష్టికర్త; అతడు మొట్టమొదట విశ్వరచన చేయుటకు కాలప్రేరితుడై తన యంశముచే సృష్టి చేసెను.

స్వేచ్ఛా మయః స్వే చ్ఛ యా చ ద్వి ధూరూపో బభూవహ |

స్త్రీ రూపో వామ భాగాంశో దక్షిణాంశః పుమాన్స్మతః. 27

తాం ద దర్శ మహాకామీ కామా ధారం సనాతనః | అతీవ కమనీ యాం చ తారు పంకజ సన్నిభామ్‌. 28

చంద్ర బింబ వినింద్యైక నితంబ యుగళాం పరామ్‌ | సు చారు కదళీస్తంభ నిందితశ్రోణీ సుందరీ. 29

శ్రీయుక్త శ్రీఫలాకారస్తన యుగ్మ మనోరమామ్‌ | పుష్పజుష్టాం సువలితాం మధ్యక్షీణాం మనోరమామ్‌. 30

అతీవ సుందరీం శాంతాం సుస్మితాం వక్ర లోచనామ్‌ | వహ్నిశుద్ధాంశుకాధారాం రత్నభూషణ భూషితామ్‌. 31

శశ్వ చ్చక్షు శ్చకోరాభ్యాం పిబంతీ సతతం ముదా | కృష్ణస్య ముఖచంద్రం చ చంద్రకోటి వినిందితమ్‌. 32

కస్తూరీ బిందునా సార్ధమధశ్చందన బిందునా | సమం సిందూరబిందుం చ ఫాలమధ్యే చ బిభ్రతీమ్‌. 33

వక్రిమం కబరీభారం మాలతీమాల్య భూషితమ్‌ | రత్నేం ద్రసారహీరం చ దధతీం కాంతకాముకీమ్‌. 34

కోటిచంద్ర ప్రభామృష్ట పుష్టశోభాసమన్వితామ్‌ | గమనేన రాజహంస గజగర్వ వినాశినీమ్‌. 35

దృష్ట్వాతాంతు తయాసార్థం రాసేశో రాసమండలే | రాసోల్లాసే సురసికో రాసక్రీడాం చకార హ. 36

నానా ప్రకారశృంగారం శృంగారో మూర్తిమానివ | చకార సుఖసంభోగం యావద్యై బ్రహ్మణో దినమ్‌. 37

తతః స చ పరిశ్రాంత స్తస్యా యోనౌ జగత్పితా | చకార వీర్యాధానం చ నిత్యానందే శుభక్షణ. 38

గాత్రతో యోషిత స్తస్యాః సురతాంతే సువ్రత | నిఃససార శ్రమజలం శ్రాంతాయాస్తేజసా హారేః. 39

మహాక్రమణక్లిష్టాయా నిఃశ్వాసశ్చ బభూవ హ | తదా వవ్రే శ్రమజలం తత్సర్వం విశ్వగోళకమ్‌. 40

స్వేచ్ఛామయుడగు కృష్ణుడు తన సంకల్పమాత్రమున తాను రెండు రూపములుగ నయ్యెను. అతని యెడమ భాగమునస్త్రీ; దక్షిణభాగమునపురుషు డుద్బవించెను. సనాతనుడగు పురుషుడు దివ్యస్వరూపయగు స్త్రీని చూచెను. ఆమె సర్వాంగసుందరి. ఆమె మేనికాంతి విప్పారిన పద్మమువలె నుండెను. ఆమె తొడలు చంద్రబింబము కంటె నందమైనవి. ఆమె పిఱుదు లరటిబోదెలవలె నొప్పుచున్నవి. ఆమె స్తనములు మారేడుపండ్లవలె మనోహరములు. ఆమె మెడనుండి పూలదండలుక్రిందివఱకు వ్రేలాడుచున్నవి. ఆమె నడుము పిడికిట సరిపోవునట్లున్నది. ఆమె యతిలోకసుందరి: శాంతశీల; చిరునగవులు చిందించునది; ప్రక్కచూపులు చూచుచున్నది. రత్న భూషల నందమైనది; అగ్ని శుద్ధమైన వస్త్రము ధరించియున్నది. కృష్ణుని ముఖకాంతి కోటిచంద్రుల కాంతిని మీఱియున్నది. చకోరపక్షలు చంద్రుని కిరణములను గ్రోలునట్టు లామె చూపులుకృష్ణుని ముఖచంద్రునిపై నిలిచియున్నది. దేవి నెన్నుదుట కస్తూరి తిలకమును దానిక్రింద చందనపు చుక్కలును గలవు. నొసటిమధ్య సిందూర తిలకము గలదు. ఆమె తలవెండ్రుకలు వంకరలు తిరిగి యున్నవి. మెడలో మాలతి పూలదండ గుబాళించుచున్నది. జాతిరత్నాల హారమును ధరించి యున్నది. ఆమె మేనికాంతులు కోటిచంద్రుల కాంతులను తిరస్కరించు చున్నవి. ఆమె నడక రాయంచ నడకవలె మదపుటేనగు నడకవలె చెన్నొందుచున్నది. రాసేశ్వరుడు రసహృదయుడు నగు శ్రీకృష్ణు డామెనుగాంచి యామెనుగూడి రాసమండలమునందు రాసక్రీడ జరుపుట కేగెను. రాసక్రీడ ఆరంభమయ్యెను. రాసమండల మంతయును శృంగారము రూపుదాల్చినట్టు లుండెను. బ్రహ్మదేవుని కొక దిన మెంతకాలమో యంతకాలము వారి రాసక్రీడ కొనసాగెను. పెక్కు విధముల మన్మధకీడ్రలు వారి మధ్యసాగెను. పిమ్మట కృష్ణుడు కొంచె మలసటచెందెను. జగత్పతియగు కృష్ణుడు నిత్యానందకరమగు శుభక్షణమున నామె గర్బమున వీర్యాధానము చేసెను. సువ్రతా! సురతమైన పిదప నామె మేనినుండి చెమట నీరు వెల్వడెను. ఆమె మిక్కిలిగ హరితేజమున కలసిపోయెను. సురతక్రీడకునొచ్చుకొనుటచే నామె నిట్టూర్పులు చెలరేగెను. మేని శ్రమజలము విశ్వమంతట నిండిపోయెను.

స చ నిః శ్వాస వాయుశ్చ సర్వాధారోబభూవ హ | నిఃశ్వాసవాయుః సర్వేషా జీవినాంచ భ##వేషు చ. 41

బభూవ మూర్తిమద్వాయోర్వామాంగా త్ప్రాణవల్లభా | తత్పత్నీ సా చ తత్పత్రాః ప్రాణాః పంచ చ జీవినామ్‌. 42

ప్రాణో7పానః సమానశ్చోదానవ్యానౌ చ వాయవః | బభూవు రేవతత్పుత్రా అధః ప్రాణాశ్చ పంచ చ. 43

ధర్మతోయాధిదేవశ్చ బభూవ వరుణో మహాన్‌ | తద్వామాంగా చ్చ తత్పత్నీ వరుణానీ బభూవసా. 44

అధ సా కృష్ణ చి చ్చక్తిః కృష్ణగర్బందధార హ | శకమన్వంతరం యావజ్జ్వలంతీ బ్రహ్మతే జసా. 45

కృష్ణ ప్రాణాధి దేవీసా కృష్ణ ప్రాణాధిక ప్రియా | కృష్ణస్య సంగినీ శ్వ త్కృష్ణవక్షః స్థల స్ధితా. 46

శతమన్వంతరాంతేచ కాలే7తీ తే తు సుందరీ | సుషావ డింభం స్వర్ణాభం విశ్వాధారాలయం పరమ్‌. 47

దృష్ట్వా డింభం చ సా దేవీ హృదయేన వ్యదూయత | ఉత్ససర్జ చ కోపేన బ్రహ్మాండ గోళ##కే జలే. 48

దృష్ట్వా కృష్ణ శ్చ తత్త్యాగం హాహాకారం చ కారహ | శశాప దేవీం దేవేశ స్తత్షణం చయథో చితమ్‌. 49

యతో7పత్యం త్వయా త్యక్తం కోపశీలేచనిష్ఠురే | భవ త్వ మన పత్యా7పీ చాద్య ప్రభృతి నిశ్చితమ్‌. 50

యాయా స్త్వ దంశరూపా శ్చ భవిష్యంతి సురస్త్రియః |

అనపత్యాశ్చతాః సర్వాస్త్వ త్సమా నిత్య¸°వనాః. 51

ఏతస్మి న్నం తరే దేవీ జిహ్వా గ్రా త్సహసాతతః | ఆవిర్బభూవ కన్యైకా శుక్లవర్ణా మనోహరా 52

శ్వేత వస్త్ర పరీధానా వీణా పుస్తక ధారిణీ | రత్న భూషణ భూషాఢ్యా సర్వశాస్త్రాధి దేవతా. 53

అథకాలాంతరే సా చ ద్విధారూపాబభూవ హ | వామార్ధాంగా చ్చ కమలా దక్షిణార్ధాచచ రాదికా. 54

నిట్టూర్పుగాలులు సర్వమునకు నాధారమయ్యెను. ఎల్లప్రాణులకు జీవనాధారమయ్యెను. ఆవాయువు నెడమభాగము నుండి యొక స్త్రీ పుట్టెను. ఆమె వాయువునకు ప్రాణవల్లభ. ఆమె కైదుగురు పుట్టిరి. వారిని ప్రాణము అపానము వ్యానముఉదానము సమానమునని యందురు. ఇవికాక నాగము మున్నగు వాయువులును బుట్టెను. దేవి శ్రమ జలమునకు వరుణుడు అధిష్ఠాత యయ్యెను. అతని యెడమ భాగమునుండి యతని భార్య జన్మించెను. అమెయే వరుణాని. కృష్ణ సంభోగముతోదేవి కృష్ణ గర్బము ధరించెను. అమెనూఱు మన్వంతరము లంత కాలము బ్రహ్మ తేజమున వెల్గు గర్బమును భరించెను. అమె కృష్ణ ప్రాణాధిష్ఠాత్రి; కృష్ణునికి ప్రాణము కంటె ప్రియురాలు; కృష్ణసంగినిః కృష్ణుని ఱొమ్మున నివసించునది. నూఱు మన్వంతరముల కాలము గడచిన మీదట నా సుందరి విశ్వాధారము శ్రేష్ఠమునగు నొక బంగారపు గ్రుడ్డు ప్రసవించెను. ఆయండమును చూడగనే యామె హృదయము దుఃఖ సంతప్తమయ్యెను. ఆమె దానిని కోపముతో బ్రహ్మాండ జలము నడుమ విసరివేసెను. అది చూచి కృష్ణుడు హాహాకరాము చేసెను. దేవేశుడు వెంటనే తగినట్లుగ దేవి నిట్లు శపించెను; ఓ కోపశీలా! నిష్ఠురురాలా! నీవు నీ కన్న సంతానమును వదలిపెట్టితివి. కాన నీవు గొడ్రాల వగుదువుకాక! నీ యంశమువలన నవతరించిన దేవ స్త్రీలును నీ వలెనే నిత్య¸°వనలై సంతానహీనలై యుందురుగాక! అంతలోన దేవి నోటి కొననుండి యొక చక్కని తెల్లవన్నెలు విరియజిమ్ము కన్నియ యుద్బవించెను. ఆమె తెల్లని వస్త్రము తాల్చి వీణా పుస్తకములు చేత దాల్చి రత్న భూషలు ధరించి సకల శాస్త్రముల కధిదేవతయై విరాజిల్లుచుండెను. మఱికొంత కాలమునకు కృష్ణ ప్రియ రెండు రూపములు దాల్చెను. ఆమె యెడమభాగము నుండి లక్ష్మియును కుడిభాగము నుండి రాధికయు నావిర్భవించిరి.

ఏతస్మి న్నంతరే కృష్ణో ద్విధారూపో బభూవ సః | దక్షిణార్ద శ్చ ద్విభుజో వామార్థ శ్చ చతుర్బుజః. 55

ఉవాచ వాణీం కృష్ణ స్తాం త్వ మస్య కామినీ భవ | అత్రైవ మానినీ రాధా తవ భద్రం భవిష్యతి. 56

ఏవం లక్ష్మీం చ ప్రదదౌ తుష్టో నారాయణాయ చ | స జగామ చ వై కుంఠం తాభ్యాం సార్ధంజగత్పతిః. 57

అనపత్యే చ తే ద్వే చ జాతేరాధాంశ సంభ##వే | భూతా నారాయణాంగా చ్చ పార్షదా శ్చ చతుర్బుజాః. 58

తేజసా వయసా రూప గుణాభ్యాం చ సమా హరేః | బభూవుః కమలాంగా చ్చ దాసీ కోట్య శ్చ తత్సమాః. 59

అత్ర గోలోకనా థస్య లోమ్నాం వివరతో మునే | భూతాశ్చాసంఖ్య గోపాశ్చ వయసా తేజసా సమాః. 60

రూపేణ చ గుణనైవ బలేన విక్రమేణ చ | ప్రాణతుల్యప్రియాః సర్వే బభూవుః పార్షదా విభోః. 61

రాధాంగలోమకూపేభ్యో బభూవు ర్గోపకన్యకాః | రాధాతుల్యాశ్చ తాః సర్వా రాధా దాస్యః ప్రియంపదాః. 62

రత్నభూషణభూషాడ్యాః శశ్వత్సుస్థిర¸°ననాః | ఆనపత్యాశ్చ తాః సర్వాః పుంసః శాపేన సంతతమ్‌. 63

ఏతస్మి న్నంతరే విప్ర సహసా కృష్ణదేవతా | ఆవిర్బభూవ దుర్గా సా విష్ణుమాయా సనాతనీ. 64

దేవీ నారాయణీశానా సర్వశక్తి సర్వరూపిణీ | బుద్ద్యధిష్ఠాత్రీ దేవీ సా కృష్ణస్య పరమాత్మనః. 65

దేవీనాం బీజరూపా చ మూలప్రకృతి రీశ్వరీ | పరిపూర్ణతమా తేజఃస్వరూపా త్రిగుణాత్మికా. 66

తప్తకాంచనవర్ణాభా కోటిసూర్యసమప్రభా | ఈషద్ధాస్యప్రసన్నాస్యా సహస్రభుజంయుతా. 67

నానాశస్త్రాస్త్రనికరం బిభ్రతీ సా త్రిలోచనా | వహ్నిశుద్ధాంశుకాధానా రత్న భూషణభూషితా. 68

అదే సమయమున కృష్ణుడును రెండు రూపాలు దాల్చెను. అతని కుడి ఎడమ భాగముల నుండి క్రమముగ రెండు-నాలుగు భూజములు గల వారిరువురుద్బవించిరి. కృష్ణుడు సరస్వతితో నిట్లనేను: నీవు విష్ణుని ప్రియురాలవు గమ్ము. నీకుమేలగుత. రాధ యిచ్చటనే యుండుగాత! అటులే లక్ష్మిని నారాయణున కొసంగెను. విష్ణువు లక్ష్మీ సరస్వతులను వెంటగొని వైకుంఠమేగెను. కృష్ణ శాపము వలన వారు సంతులేనివా రైరి. విష్ణు సంగముల నుండి నాల్గుచేతులు గల పార్షదులెందఱో కలిగిరి. వారు తేజము-వయస్సు-రూపము-గుణములందు విష్ణుసములై యుండిరి. లక్ష్మియంగాలనుండియును దాసీ జనము కోట్ల కొలది యుద్బవించిరి. ఓ మునీ! కృష్ణుని రోమ రంధ్రముల నుండి లెక్కలేనంత మంది గోపకులు వయస్సున తేజమున తనకు సాటియైన వారుద్బవించిరి. వారు రూప-గుణ-బల-విక్రమున కృష్ణసములు ప్రాణతుల్యులు ప్రియులు పరిచారకులు నైరి. అటులే రాధ రోమ కూపరముల నుండి గోప కన్యకలులెక్కకు మిక్కిలిగ రాధవంటీవా రుద్బవించిరి; వారు ప్రియముగ మాటాడువారు; వారు రాధా పరిచారికలైరి. వారును రత్నభూషణ భూషితలు; చిర¸°వనము గలవరు; కృష్ణ శాపమున వారెల్లరును సంతాన హీనలైరి. ఓ బ్రాహ్మణోత్తమా! అదే సమయమున హఠాత్తుగ విష్ణుమాయ సనాతని యగు దూర్గాదేవి యావిర్బవించెను. ఆమెకుకృష్ణు డు పాస్యదేవుడు. ఆమె నారాయణి; సర్వ శక్తి స్వరూపిణి; ఈశాని దేవి కృష్ణ పరమాత్ముని బుద్ధి కధిష్ఠాతృదేవి. ఆమె దేవీమూర్తుల కందఱికి బీజరూపిణి; మూల ప్రకృతి; ఈశ్వరి; పరిపూర్ణతమ; తేజఃస్వరూపిణి త్రిగుణాత్మిక. కరగిన బంగారపు కాంతిగలది. కోటి సూర్యుల కాంతులీను నది; మందహాసిని; వేయి బాహువులు గల దేవి; ఆమె పెక్కు శస్త్రాస్త్రములు ధరించెను; త్రిలోచన; అగ్నిపూతమైన వస్త్రము ధరించినది; రత్న భూషణ భూషిత.

యస్యాశ్చాంశాంశ కలయా బభూవుః సర్వయోషితః | సర్వేవిశ్వ స్ధితా లోకా మోహితాః స్యుశ్చమాయయా. 69

సర్వైశ్వర్య ప్రదాత్రీ చ కామినాం గృహవాసినామ్‌ | కృష్ణ భక్తి ప్రదా యా చ వైష్ణవానాంచ వైష్ణవీ. 70

ముముక్షూణాం మోక్షదాత్రీ సుఖినాం సుఖదాయినీ | స్వర్గేషు స్వర్గలక్ష్మీ శ్చ గృహలక్ష్మీర్గృహేషు చ. 71

తవస్విషు తపస్యా త శ్రీరూపా తు వృపేషు చ | యా వహ్నౌ దాహికారూపా ప్రభారూపాచ భాస్కరే. 72

శోభా రూపా చ చంద్రేత సాపద్మేషు చ శోభనా | సర్వశక్తి స్వరూపా యా శ్రీకృష్ణే పరమాత్మని. 73

యయా చ శక్తి మానాత్మా యయా చ శక్తి మజ్జగత్‌ | యయా వినా జగత్సర్వం జీవస్మృతమివ స్దితమ్‌. 74

యా చ సంసారవృక్షస్య బీజరూపా సనాతనీ | స్థితిరూపా బుద్ధిరూపా ఫలరూపా చ నారద. 75

క్షుత్పిపాసా దయారూపా నిద్రా తంద్రా క్షమా మతిః | శాంతి లజ్జా తుష్టి పుష్టి భ్రాంతి కాంత్యాది రూపిణీ. 76

సా చ సంస్తూయ సర్వేశం తత్పురం సమువాస హ | రత్నసింహాసనం తసై#్య ప్రదదౌ రాధికేశ్వరః. 77

ఏతస్మి న్నంతరే తత్ర సస్త్రీక శ్చ చతుర్ముఖః | పద్మనాభే ర్నాభి పద్మా న్నిస్ససార మహామునే. 78

స్త్రీలందఱు నామె యంశకళలనుండి యుద్బవించిన వారలే. ఆమె తన మాయచేత విశ్వప్రాణులను మోహమున ముంచును. ఆమె సకల సంపద లొసంగునది. గృహస్థుల కోర్కెలు తీర్చుదేవి. కృష్ణభక్తి గల్గించునది; వైష్ణవిగ నామెను గొల్తురు. ముక్తికాముల కీమె మోక్షదాయిని; గృహము లందలి గృహలక్ష్మి;, సఖవంతులకు సఖదాయిని. తాపసులందలి తపమును రాజు లందసౌ శ్రీరూపము నగ్నిలోని దహకశక్తియు సూర్యునందలి ప్రభయు నీమెయే. చంద్రునిలో పద్మములో నున్న శోభారూపిణియు సర్వశక్తి స్వరూపయు నగు, నీమె పరమాత్మ చెంతనే యుండును. ఆత్మ యీమెవలన శక్తిమంతమగును; జగ మీమెవలన శక్తిగల దగును; ఈమె శక్తి లేనిచో జగమంతయును బ్రతికియు చచ్చినదానివలె నుండును. నారదా! ఈమె సంసార వృక్షమునకు బీజము. సనాతని; స్థితిరూప బుద్ధిరూప ఫలరూప ఆకలి దప్పిక దయ నిద్ర అలసట ఓర్పు మతి శాంతి లజ్జ తుష్టి పుష్టి భ్రమ కాంతి యివనినయు నామె రూపములే. దేవి కృష్ణుని సంస్తుతించగ రాధికేశ్వరుడగు సర్వేశు డామెకు రత్వసింహాసన మోసంగెను. మునీ! అంతలోనే నలువ తన రాణితో నచటి కేతెంచెను. బ్రహ్మ పద్మనాభుని బొడ్డుతమ్మినుండి యావిర్బవించెను.

కమండలుధరః శ్రీమాం స్తపస్వీ జ్ఞానినాంవరః | చతుర్ముఖైస్తం తుష్టావ ప్రజ్వల న్బ్రహ్మ తేజసా. 79

సా తదా సుందరీ సృష్టా శత చంద్ర సమప్రభా | వహ్ని శుద్ధాంశుకాధానా రత్న భూషణ భూషణా. 80

రత్న సింహాసనే రమ్యే సంస్తూయ సర్వకారణం | ఉవాస స్వామినా సార్ధం కృష్ణస్య పురతోముదా. 81

ఏతస్మిన్నంతరే కృష్ణో ద్విధారూపో బభూవ సః | వామార్ధాంగో మహాదేవో దక్షిణ గోపికాపతిః. 82

శుద్ధ స్పటికసంకాశః శతకోటి రవి ప్రభః | త్రిశూలపట్టిశ ధరో వ్యాఘ్రచర్మాంబరో హరః. 83

తప్తకాంచనవర్ణాభో జటాభార ధరః పరః | భస్మభూషితగాత్ర శ్చ సస్మిత శ్చంద్రశేఖరః. 84

దిగంబరో నీలకంఠః సర్వభూషణ భూషితః | బిభ్రద్దక్షిణహస్తేన రత్న మాలాం సుసంస్కృతామ్‌. 85

ప్రజవ న్పంచ వక్త్రేణ బ్రహ్మజ్యోతిః సనాతనమ్‌ | సత్యస్వరూపం శ్రీకృష్ణం పరమాత్మాన మీశ్వరమ్‌. 86

కారణం కారణానాం చ సర్వ మంగళ మంగళమ్‌ | జన్మ మృత్యుజరావ్యాధి శోకభీతిహరం పరమ్‌. 87

సంస్తూయ మృత్యోర్మృత్యుం తం యతోమృత్యుం జయాభిధః | రత్న సింహాసనే రమ్యే సమువాస హరేః పురః. 88

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే ద్వితీయో7ధ్యాయః.

బ్రహ్మ కమండలువు దాల్చి తపస్వి శ్రీమంతుడు జ్ఞాని బ్రహ్మతేజస్వియై వచ్చి కృష్ణుని సంస్తుతించెను. అతని భార్యయును కోటిచంద్రుల కాంతులు గలది; అగ్నిపూతవస్త్రము దాల్చినది; రత్నభూషలు దాల్చినది. ఆమె రత్నసింహాసనమున కూర్చుండెను. ఆమెయును సర్వకారణుడగు కృష్ణుని నుతించెను. ఆమెయును తనపతితోగూడి కృష్ణు నెదుట నుండెను. ఆదే సమయమున కృష్ణుడు రెండు రూపాలు దాల్చెను. ఎడమ భాగమునుండి శివు డుద్బవించెను. కుడి భాగము గోపికాపతి గనే యుండును. శివుడు తెల్లనిస్పటికపు వన్నె గల్గి నూఱుకోట్ల సూర్యప్రభలతో వెల్గుచు త్రీశూలము పట్టిశము దాల్చి పులిత తోలుగట్టి ప్రకాశించుచుండెను. అతడు బంగారువర్ణముగల్గిన జటలుదాల్చి భస్మము మేన నలందుకొని నెలతాల్పునై చిర్నగవులు చిందించుచుండెను. అతడు దిగంబరుడు నీలకంఠుడు సర్పభూషణభూషితుడు. కుడిచేత మంచిరత్నమాల దాల్చి యుండెను. అతడు తన యైదు నోళ్లతోబ్రహ్మజ్యోతి సనాతనుడు సత్యరూపుడు పరమాత్మ ఈశ్వరుడు నగు కృష్ణుని నుతించుచుండెను. కృష్ణుడు కారణకారణుడు మంఘళమంగళుడు. జన్న మృత్యు జరా వ్యాధి శోక భీతిహరుడు పరుడు మృత్యుంజయుడగు శివుడు మృత్యుమృత్యువగు కృష్ణుని సంస్తుతించెను. పదప హరు డేదుట నున్నరత్న సింహసనమున నాసీనుడయ్యెను.

ఇది శ్రీదేవీ భాగమత మహాపురాణమున తొమ్మిదవ స్కంధమున రెండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters