Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్వింశో7ధ్యాయః.

నారదః : ధర్మశ్చ కీదృశస్తాత దేవ్యారాధనలక్షణః | కథ మారాధితా దేవీ సా దదాతి వరం పదమ్‌. 1

ఆరాధనవిధిః కోవా కథమారాదితా కదా | కేనసా దుర్గనరకాద్దుర్గా త్రాణ ప్రదా భ##వేత్‌. 2

శ్రీనారాయణః: దేవర్షే శృణు చిత్తై కాగ్ర్యేణ మే విదుషాంవర|

యథా ప్రసీదతే దేవీ ధర్మారాధనతం స్వయమ్‌. 3

స్వధర్మో యాదృశః ప్రోక్తస్తం చమృ ణునారద| అనాదా విహసంసారే దేవీ సంపూజితా స్వయమ్‌. 4

పరిపాలయతే ఘోర సంకటా దిషు సా మునే | సా దేవీ పూజ్యతే లోకైర్యథా వత్తద్విధిం శృణు. 5

ప్రతిపత్తి థి మాసాద్య దేవీ మాజ్యేన పూజయేత్‌ | ఘృతం దద్యా ద్బ్రా హ్మణాయ రోగహీనో భ##వేత్సదా. 6

ద్వితీయాయాం శర్కరయా పూజయే జ్జగదం బికామ్‌ | శర్కరాం ప్రదదే ద్వి ప్రే దీర్ఘా యు ర్జాయతే నరః. 7

తృతీయా దివసే దేవ్యై దుగ్ధం పూజన కర్మణి| క్షీరం దత్త్వా ద్విజా గ్ర్యాయ సర్వదుఃఖాతిగో భ##వేత్‌. 8

చతుర్థ్యాం పూజనే7పూపా దేయా దేవ్యై ద్విజాయ చ అపూపా ఏవ దాతవ్యా న విఘ్నై రభిభూయతే. 9

పంచమ్యాం కదలీజాతం ఫలం దేవ్యై నివేదయేత్‌ | తదేవ బ్రాహ్మణ దేయం మేధా వాన్పురుషో భ##వేత్‌. 10

షష్ఠీ తిథౌ మధు ప్రోక్తం దేవీపూజన కర్మణి| బ్రాహ్మణాయ ప్రదాతవ్యం మదుకాంతిర్యతో భ##వేత్‌. 11

సప్త మ్యాం గుడనై వేద్యం దేవ్యై దత్త్వా ద్విజాయ చ| గుడం దత్త్వా శోకహీనో జాయతే ద్విజ సత్తమ. 12

నారికేల మధా ష్ట మ్యాం దేవ్యై నైవేద్య మర్ప యేత్‌| బ్రాహ్మణాయ ప్రదాతవ్యం తాపహీనో భ##వేన్నరః. 13

నవమ్యాం లాజ మంబాయై చార్పయిత్వా ద్విజాయ చ| దత్త్వా సుఖాధికో భూయా దిహలోకే పరత్ర చ. 14

ఇరువదినాలుగవ అధ్యాయము

దేవ్యారాధన తత్పల స్వరూపములు

ƒyLRiµR…V²T…ÈýÁ®ƒsƒ«sV: ˳ÏÁgRiªyƒ«sV²y! $ ®µ…[ªyùLSµ³R…ƒ«s xmsLRiª«sVgRiV µ³R…LRiø®ªsVÉíÓÁµj…? $ ®µ…[„s ®ƒs[ „sµ³R…ª«sVVgRi ƒyLSµ³j…LiÀÁƒ«s A®ªsV »R½ƒ«s xmsLRiª«sVxmsµR…ª«sVV úxmsryµj…LixmsgRiÌÁµR…V? A »R½ÖýÁ¬s }qs„sLi¿RÁV „sµ³yƒ«s®ªsVÉíÓÁµj…? ®µ…[„s ®µ…[¬s¿Á[ ƒyLSµ³j…Lixms‡Á²R…Vƒ«sV. ®µ…[„s úFyßáVÌÁƒ«sV Õ³dÁNRPLRiƒ«sLRiNRP NRPWxmsª«sVVÌÁ ƒ«sVLi²T… ¹¸…[V Lki¼½gRi gSFy²R…gRiÌÁµR…V? ®µ…[„sNTP úzms¸R…V\®ªsVƒ«s xmsµyLóRiª«sVV ÛÍÁ„s*? ƒyLS¸R…VßáV ²T…ÈýÁ®ƒsƒ«sV : ®µ…[ª«s‡ÁVV{tsQ! „súxmsª«sLSù! xmsLi²T…»][»R½òª«sW! G µ³R…LSøLSµ³R…ƒ«s ª«sÌÁƒ«s ®µ…[„s xqsVúxmsxqsƒ«sõ¸R…VgRiVƒ¯[ ¾»½ÌÁVöµR…Vƒ«sV; ryª«sµ³yƒ«s ÀÁ»R½òª«sVVƒ«s ƒyÌÁNTPLixmsoª«sVV. ƒyLRiµy! xqs*µ³R…LRiøª«sV¬s ®µ…[¬s ƒ«sLiµR…VL][ ¾»½ÌÁVöµR…Vƒ«sV „sƒ«sVª«sVV. C |mnsWLRi ª«sVX»R½Vù xqsLiryLRiª«sVV ®ªsVVµR…ÌÁV ÛÍÁ[¬sµj…: NSƒ«s ®µ…[„s¬s }qs„sLi¿RÁª«sÌÁ¸R…VVƒ«sV. @ÈýÁV g]ÖÁ胫s¿][ ®µ…[„s |mnsWLRi xqsLiNRPÈÁª«sVVÌÁ ƒ«sVLi²T… NSFy²R…gRiÌÁµR…V. $xmsLS ˳ÏÁÉíØLjiNRP®µ…[„s úxmsÇÁÌÁ¿Á[»R½ ®ƒsÈýÁV xmspÑÁLixms‡Á²R…Vƒ¯[ „sƒ«sVª«sVV. Fy²R…ù„sVƒy²R…V $®µ…[„sNTP ®ƒs[LiVV \®ƒs®ªs[µR…ù®ªsVVxqsgji úËØx¤¦¦¦øßáVƒ«sNRPV µyƒ«s„sVÀÁ胫sªy ²yL][gRiùª«sLi»R½V²R…gRiVƒ«sV. „sµj…¸R…Vƒy²R…V xmsLi¿RÁµyLRi»][ ®µ…[„s¬s xmspÑÁLiÀÁ „súxmsoƒ«sNRPV xmsLi¿RÁµyLRi µyƒ«s „sVÀÁ胫sªy²R…V |msZNP[äLi²ýR…V ú‡ÁµR…VNRPVƒ«sV. »R½µj…¸R…Vƒy²R…V $®µ…[„sNTP FyÌÁV \®ƒs®ªs[µR…ù „sVÀÁè „súxmsª«sLRiVùƒ«sNRPV FyÌÁV µyƒ«sª«sVV ¿Á[zqsƒ«sªy²R…V xqsLRi*µR…VMÅÁª«sVVÌÁƒ«sVLi²T… „sª«sVVNRPVò²R…gRiVƒ«sV. ¿RÁ„s¼½ƒy ²R…xmspxmsª«sVVÌÁV $®µ…[„s NRPLjiöLiÀÁ úËØx¤¦¦¦øßáVƒ«s NRPxmspxms µyƒ«s „sVÀÁ胫sªy¬s ZNPÉíÓÁ „sxmnsVõª«sVVÌÁV ÇÁLRiVgRiª«so. xmsLi¿RÁ„sVƒy²R…V ®µ…[„s NRPLRiÉÓÁxmsLi²ýR…V µyƒ«s ®ªsVVxqsLigjiƒ«s ªy¬sNTP ÇìØxmsNRPaRPNTPò ¹¸…VNRPV䪫s ¸R…VgRiVƒ«sV. xtsQztîsQƒy²R…V $®µ…[„sNTP NRPª«sVø¬sÇÁÙLiÉÓÁ¾»½[¬s¸R…VÌÁV xqsª«sVLjiöLiÀÁ „súxmsoƒ«sNRPV ¾»½[®ƒsµyƒ«sª«sVV ¿Á[zqsƒ«sªy²R…V ª«sVµR…ƒ«sxqsVLiµR…LRiV²R…gRiVƒ«sV. xqsxmsò„sVƒy²R…V $®µ…[„sNTP gRiV²R… \®ƒs®ªs[µR…ù „sVÀÁè µj…*ÇÁÙƒ«sNRPV gRiV²R…µyƒ«sª«sVV ¿Á[zqsƒ«sªy²R…V a][NRPLRiz¤¦¦¦»R½V ²R…gRiVƒ«sV. @xtísQ„sVƒy²R…V $xmsLSaRPNTPòNTP N]‡Á÷LjiNS¸R…V ¬s®ªs[µR…ƒ«s ®ªsVVƒ«sLjiè „súxmsoƒ«sNRPV ÛÉÁLiNS¸R…V µyƒ«s „sVÀÁ胫s ªy¬sNTP »yxmsú»R½¸R…Vª«sVV ÌÁVLi²R…ª«so. ƒ«sª«s„sVƒy²R…V $ÇÁgRiµyLi‡ÁNRPV }msÍØÌÁV ¬s®ªs[µj…LiÀÁ „súxmsoƒ«sNRPV }msÍØÌÁV µyƒ«sª«sVV ¿Á[zqsƒ«s ªy¬sNRP \|ms ÍÜ[NRPª«sVVÌÁV r¢ÅÁùª«sVVÌÁV gRiÌæÁVƒ«sV.

దశమ్యా మర్ప యిత్వా తు దేవ్యై కృష్ణతిరా న్మునే|

బ్రాహ్మణాయ ప్రదత్త్వా తు యమలో కాద్బ యం నహి. 15

ఏకా దశ్యాం దధి తథా దేవ్యై చార్ప యతే తు యః | దదాతి బ్రాహ్మణాయై త ద్దేవీ ప్రియతమో భ##వేత్‌. 16

ద్వాదశ్యాం పృథుకా న్దే వ్యై దత్త్వా77చార్యాయ యోదదేత్‌|

తానేవ చ ముశ్రేష్ఠ స దేవీప్రియతాం వ్రజేత్‌. 17

త్రయో దశ్యాం చ దుర్గాయై చణకా న్ర్ప దదాతి చ | తానేవ దత్త్వా విప్రాయ ప్రజాసంతతి మాన్బవేత్‌. 18

చతుర్దశ్యాం చ దేవర్షే దేవ్యై సక్తూ న్ర్ప య చ్చతి | తానేవ దద్యా ద్వి ప్రాయ శివస్యదయితో భ##వేత్‌. 19

పాయసం పూర్ణిమా తిథ్యా మపర్ణాయై ప్రయచ్చతి | దదాతి చ ద్వి జాగ్ర్యాయ పితౄ నుద్దరతే7ఖిలాన్‌. 20

తత్తి థౌ హవనం ప్రోక్తం దేవీ ప్రీత్యై మహామునే | తత్తత్తి థ్యుక్త వస్తూనా మశేషా రిష్టనాశనమ్‌. 21

రవివారే పాయసం చ నై వేద్యం పరి కీర్తితమ్‌ | సోమవారే పయః ప్రోక్తం భౌమేచ కదలీఫలమ్‌. 22

బుధవారే చ సంప్రోక్తం నవనీతం నవం ద్విజ | గురువారే శర్కరాం చ సితాం భార్గవ వాసరే. 23

శనివారే ఘృతం గవ్యం నైవేద్యం పరికీర్తితమ్‌ | సప్త వింశతినక్షత్ర నైవేద్యం శ్రూయతాం మునే. 24

ఘృతం తిలం శర్కరాం చ దధి దుగ్ధం కిలాటకమ్‌| దధి కూర్చీం మోదకంచ ఫేణికాం ఘృత మండకమ్‌. 25

కంసారం వటపత్రం చ ఘృతపూర మతః పరమ్‌ | వటకం కోకరస కం పూరణం మధు సూరణమ్‌. 26

గుడం పృథుక ద్రాక్షేచ ఖర్జూరం చైవ చారకమ్‌| అపూపం నవనీతం చ ముద్గం మోదక ఏవచ. 27

మాతులింగ మితి ప్రోక్తం భ##నైవేద్యం చనారద | విష్కంభా దిషు యోగేషు ప్రవక్ష్యామి నివేదనమ్‌. 28

దశమినాడు నల్లనువ్వులు దేవి కర్పించి బ్రాహ్మణునకు తిల దానము చేయుట వలన యమలోక భయములు గల్గవు. ఏకాదశి దినమున శ్రీదేవి ప్రీతికి పెరుగర్పించి బ్రాహ్మణునకు పెరుగు దానము చేయుట వలన దేవి ప్రసన్నురాలగును. ఓ మునిప్రవరా! ద్వాదశినాడు శ్రీదేవికి మఱి విప్రునకు నటుకు లర్పించుట వలన దేవికి ప్రియభక్తుడగును. త్రయోదశి నాడు దుర్గకు మంచి శనగలు నైవేద్య మొసంగి మంచి బ్రాహ్మణునకు మంచి శనగలు దాన మిచ్చిన వానికి తప్పక ప్రజా సంతతి గల్గి తీరును. చతుర్దశినాడు దేవికి పేలపిండి నివేదించి బ్రాహ్మణునకు పాయసదానము చేసిన వాని పితృ దేవతలు తరింతురు. శ్రీదేవీ ప్రీతికొఱ కా యాతిథులందు చెప్పబడిన యాయా వస్తువులను హోమము చేసినవాని సకల దోషములను తొలగిపోవును. ఇంక దేవీప్రీతికి రవివారమున పాయసము నైవేద్య మీయవలయున. సోమవారమున పాలును మంగళవారమందు నరటిపండ్లును బుధవారమున వెన్నయును గురువారమున శుక్రవారమున పంచదార నైవేద్యము పెట్టవలయును. శనివారమం దావునేయి నైవేద్య మీయవలయు నందురు. మునీశా! ఇక నిరువదేడు నక్షత్రములందు చేయదగునైవేద్యములు గూర్చి వినుము. నేయి నువ్వులు పంచదార పెరుగు పాలు మీగడ దధికూర్చి లడ్డు ఫేణిక ఘృతమండక మును కంసారము వటపత్రము (అప్పడాలు) ఘృతపూరము వటకము (వడియాలు) ఖర్జూరరసము బెల్లముతో చేసిన శనగపిండి తేనె సూరణము(కందగడ్డ) బెల్లము అటుకులు ద్రాక్ష ఖర్జూరము చారకము అపూపము వెన్న పెసరలడ్డులు మాతు లుంగము(మాదీఫలము) అను పదార్థము లశ్విని మున్నగు నక్షత్రముల కిచ్చు నైవేద్యములు. ఇపుడు విష్కంభాదులం దొసగదగిన నైవేద్యములు గూర్చి వినుము.

పదార్థానాం కృతేష్వేషు ప్రీణాతి జగదంబికా| గుడం మధు ఘృతం దుగ్ధం దధి తక్రం త్వపూపకమ్‌. 29

నవనీతం కర్కటీం చ కూష్మాండం చాపి మోదకమ్‌| పనసం కదలం జంబు ఫలమా మ్రఫలం తిలమ్‌. 30

నారంగం దాడిమం చైవ బదరీ ఫల మేవ చ| ధాత్రీ ఫలం పాయసంచ పృథుకం చణకం తథా. 31

నారికేలం జంభఫలం కసేరుం సూరణం తథా| ఏతాని క్రమశో విప్రనైవేద్యాని శుభానిచ. 32

విష్కంభాదిషు యోగేషు నిర్ణీతాని మనీషిభిః| అథనై వేద్య మాఖ్యాస్యే కారణానాం పృథజ్మునే. 33

కంసారం మండకం ఫేణీ మోదకం వట పత్రకమ్‌ | లడ్డుకం ఘృతపూరం చ తిలం దధి ఘృతం మధు. 34

కరణానా మిదం ప్రోక్తం దేవీ నైవేద్య మాదరాత్‌| అథా న్యత్సం ప్రవక్ష్యామి దేవీ ప్రీతికరం పరమ్‌. 35

విధానం నారదమునే శృణు తత్స ర్య మాదృతః | చైత్ర శుద్ధతృతీయాయాం నరో మధుకవృక్షకమ్‌.36

పూజయే త్పంచ ఖాద్యం చ నైవేద్య ముపకల్పయేత్‌ | ఏవం ద్వాదశమాసేషు తృతీయాతిథుషు క్రమాత్‌. 37

శుక్లపక్షే విధానేన నైవేద్య మభి దధ్మహే | వైశాఖమాసే నైవేద్యం గుడ ముక్తం చ నారద. 38

జ్యేష్ఠమాసే మధు ప్రోక్తం దేవీ ప్రీత్యర్థ మేవ తు | ఆషాడే నవనీతం చ మధుకస్య నివేదనమ్‌. 39

శ్రావణ దధి నైవేద్యం భాద్రమాసే చ శర్కరా | ఆశ్వినే పాయసం ప్రోక్తం కార్తికే పయ ఉత్తమమ్‌. 40

మార్గే ఫేణ్యుత్తమా ప్రోక్తా పౌషే చ దధికుర్చికా | మాఘే మాసి చ నైవేద్యం ఘృతం గవ్యం సమాహరేత్‌. 41

నారికేలం చ నైవేద్యం ఫాల్గునే పరికీర్తితమ్‌| ఏవం ద్వాదశ##నైవే ద్యై ర్మాసే చక్రమతో ర్చయేత్‌. 42

ఈ పదార్థము లిచ్చుటవలన దేవి ప్రసన్న యగును. బెల్లము తేనె నేయి పాలు పెరుగు మజ్జిగ అపూపము వెన్న కర్కటి గుమ్మడికాయ లడ్డు పనస అరటిపండు జామపండు మామిడిపండు నూగులు నారింజ దానిమ్మ రేగు ఉసిరికపండు పాయసము అటుకులు శనగలు కొబ్బరికాయ నేరేడు కసేరు సూరణమునను నవి మంచి నైవేద్యములు. ఇవి విష్కంబాది యోగములకు వరుసగ నీయదగిన పదార్థములు నివేదనములు. కంసారము మండకము ఫేణి లడ్డు వటపత్రము లడ్డుకము ఘృతపూరకము నువ్వులు పెరుగు నేయి తేనె ఇవి క్రమముగ బబాది కరణములందు దేవికీయదగు పదార్థములు. ఈ నైవేద్య ములుకాక ఇంక దేవి కత్యంతము ప్రియకరమగు విషయమయిన శ్రీదేవీపూజాదిక విధాన మంతయును ప్రీతితో నాలకింపుము. మానవుడు చైత్రశుద్ధ తదియనాడు మధూక(ఇప్ప)వృక్షమును పూజింపవలయును. అటు లా వృక్షమును పూజించి యైదు విధములుగ భోజ్య పదార్థములతో నైవేద్యము సమర్పించవలయును. ఈ విధముగ పండ్రెండు నెల లందలి శుక్లపక్ష తదియలందు దేవిని పూజింపవలయును. ఆ దినములందు దేవికి యథావిధిగ నైవేద్య మొసంగవలయును. వైశాఖ మాసమున బెల్లము నైవేద్య మీయవలయును. శ్రీదేవి ప్రీతికి జ్యేష్ఠమాసమందు తేనె నైవేద్య మొసంగవలయును. ఆషాడమునందు వెన్న మధూకము నివేదనము పెట్టవలయును. శ్రావణమున పెరుగు భాధ్రపదమందు పంచదార అశ్వినమున పాయసమును కార్తికమున మంచి పాలును దేవికి నివేదించవలయును. మార్గశిరమున ఫేణి పుష్యమున దధికూర్చిక మాఘమాసమున మంచి యావు నేయి నైవేద్యము సమర్పించవలయును. ఫాల్గుణమున నారికేళ నైవేద్యము సమర్పించవలయును. ఈ విధముగ పండ్రెండు నెలలందు నాయా నైవేద్యములు దేవీ ప్రీతికి సమర్పించి దేవి నర్చింపవలయును.

మంగలా వైష్ణవీ మాయా కాలారత్రి ర్దురత్యయా| మహామాయా మతంగీ చ కాలీ కమలవాసినీ. 43

శివా సహస్ర చరణా సర్వమంగలపూరిణీ | ఏభిర్నామ పదైర్దేవీం మధూకే పరిపూజయేత్‌. 44

తతః స్తువీత దేవేశీం మధూకస్థాం మహేశ్వరీమ్‌| సర్వకామ సమృద్ధ్యర్థం వ్రతపూర్ణత్వ సిద్ధయే. 45

నమః పుష్కరనేత్రాయై జగద్దాత్ర్యై నమో స్తుతే| మాహేశ్వర్యై మహాదేవ్యై మహామంగలమూర్తయే. 46

పరమా పాపహంత్రీ చ పరమార్గ ప్రదాయినీ | పరమేశ్వరీ ప్రజో త్పత్తిః పరబ్రహ్మ స్వరూపిణీ. 47

మదదాత్రీ మదోన్మత్తా మానగమ్యా మహోన్నతా| మనస్వినీ మునిధ్యేయా మార్తాండ సహచారిణీ. 48

జయలోకేశ్వరి ప్రాజ్ఞే ప్రలయాంబుదసన్నిభే| మహామోహవినాశార్థం పూజితా7సి సురాసురైః. 49

యమలోకా భావ కర్త్రీ యమపూజ్యా యమాగ్రజా| యమనిగ్రహ రూపాచ యజనీయే నమోనమః. 50

సమస్వభావా సర్వేశీ సర్వసంగవివర్జితా| సంగనాశకరీ కామ్మరూపా కారుణ్య విగ్రహా. 51

కంకాల క్రూరా కామాక్షీ మీనాక్షీ మర్మభేదినీ | మాధుర్యరూపశీలా చ మధురస్వరపూజితా. 52

మహా మంత్రవతీ మంత్రగమ్యా మంత్ర ప్రియంకరీ | మనుష్యమానసగమా మన్మథారి ప్రియంకరీ. 53

అశ్వత్థవటనింబామ్ర కపిత్త బదరీగతే| పనసార్క కరీరాది క్షీరవృక్ష స్వరూపిణి. 54

దుగ్ధవల్లీ నివాసార్హే దయనీయే దయాధికే| దాక్షిణ్య కరుణా రూపే జయ సర్వజ్ఞవల్లభే. 55

ఏవం స్తవేన దేవేశీం పూజనాంతే స్తువీత తామ్‌| వ్రతస్య సకలం పుణ్యం లభ##తే సర్వదా నరః. 56

శ్రీమంగల వైష్ణవి మాయా కాళరాత్రి దురత్యయ మహామాయ మాతంగి కాళి కమలవాసిని శివ సహస్రచరణ సర్వమంగళరూపిణి యను పేర్లతో మధూక వృక్షమును పూజింపవలయును. అటుపిమ్మట మధూక వృక్షమందు వెలయుచున్న దేవేశ్వరియగు మహేశ్వరిని సకల కామసమృద్ధికిని వ్రత పరిపూర్ణత్వసిద్ధికి నీ ప్రకారముగ సంస్తుతించవలయును. శ్రీపుష్కరనయన జగన్మాత మహేశ్వరి మహాదేవి యగు మహామంగళమూర్తికి చేతులెత్తి మ్రెక్కుదును. పరమ పాపనాశని పరమార్థప్రదాయిని పరమేశ్వరి ప్రజోత్పత్తికారణ పరబ్రహ్మ స్వరూపిణి మదదాత్రిమదోన్మత్త మానగమ్య మహోన్నత మనస్విని మునిధ్యేయ మార్తాండ సహచారిణి లోకేశ్వరియగునీకు జయమగు గావుత జననీ! ప్రాజ్ఞ ప్రళయాంబుద సమాన సురాసురు లెల్లరును తమ మహమోహము నశింపజేయుమని నిన్నే పూజింతురు. యమయాతనలు మాపుదానవు యమపూజ్యవు యమునకు ముందున్నదానవు యముని శాసించుదానవు యజనయోగ్యవు నగు నీకు నమస్కారము లమ్మా! సర్వేశి సమస్వభావమయి సర్వసంగవిరహిత సంగనాశని కామ్యరూప కారుణ్యమూర్తి కంకాలక్రూర కామాక్షి మీనాక్షి మర్మ భేదిని మాధుర్య రూపశీల మధురస్వరపూజిత శ్రీమహా మంత్రాత్మిక మంత్రగమ్య హ్రీం మంత్రప్రియంకరి మానవమనో గత మూర్తి శివప్రియంకరి రావి మఱ్ఱి వేప మామిడి వెలగ రేగు వృక్షములందు వసించు దేవి; పన సార్క కరీరాది క్షీర వృక్ష స్వరూపిణి క్షీరలతాలవాల దయానిలయ భూరిదయామయి దాక్షిణ్య కారుణ్యమూర్తి శ్రీశివల్లభ అగు నీకు జయమంగళమగుత తల్లీ! అని యీ విధముగ మధూకపూజ చేసిన పిమ్మట దేవేశ్వరిని సంస్తుతింపవలయును. దానివలన నరు నకు సంపూర్ణవ్రత పుణ్య ఫలము లభించి తీరును.

నిత్యం యః పఠతే స్తోత్రం దేవీప్రీతికరం నరః| ఆధివ్యాధిభయం నాస్తి రిపుభీతి ర్నతస్య హి. 57

అర్థార్థీ చార్థ మా ప్నోతి దర్మార్థీ ధర్మమాప్నుయాత్‌|

కామా నవా ప్ను యా త్కామీ మోక్షార్థీ మోక్షమాప్నుయాత్‌. 58

బ్రాహ్మణో వేదసంపన్నో విజయీ క్షత్రి యో భ##వేత్‌| వైశ్యశ్చ ధనధన్యాఢ్యో భ##వేచ్చూద్రః సుఖాధిపః.

స్తోత్రమేత చ్చ్రాద్ద కాలే యః పఠే త్ర్ప యతో నరః| పితౄణా మక్షయా తృప్తి ర్జాయతే కల్పవర్తినీ. 60

ఏవ మారాధనం దేవ్యాః సముక్తం సురపూజితమ్‌| యః కరోతి నరో భక్త్యా స దేవీలోకభా గ్బవేత్‌. 61

దేవీపూజనతో విప్ర సర్వే కామా భవంతి హి| సర్వపాపహతిఃశుద్ధా మతిరంతే ప్రజాయతే. 62

యత్ర యత్ర భ##వేత్పూజ్యో మాన్యో మానధనేషుచ| జాయతే జగదంబాయాః ప్రసాదేన విరించిజ. 63

నరకాణాం న తస్యా7స్తి భయం స్వప్నే7పి కుత్రచిత్‌| మహామాయా ప్రసాదేన పుత్రపౌ త్రాదివర్ధనః. 64

దేవీభక్తో భవత్యేవ నా7త్ర కార్యా విచారణా| ఇత్యేవం తే మహాఖ్యాతం నరకోద్ధా రలక్షణమ్‌. 65

పూజనం హి మహాదేవ్యాః సర్వమంగల కారకమ్‌| మధూక పూజనం తద్వ న్మాసానాం క్రమతో మునే. 66

సర్వం సమాచరే ద్యస్తు పూజనం మధుకాహ్వయమ్‌| న తస్య రోగబాధాది భయముద్బతే7నఘ. 67

అథా న్య దపి వక్ష్యామి ప్రకృతేః పంచకం పరమ్‌| నా మ్నా రూపేణ చోత్పత్త్యా జగదానందదాయకమ్‌. 68

సాఖ్యానం చ సమాహాత్మ్యం ప్రకృతేః పంచకం మునే| కుతూ హల కరం చైవ శృణు ముక్తి విధాయకమ్‌. 69

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ7ష్టాదశసాహస్ర్యాం సంహితాయాం వై యాసిక్యాం శ్రీదేవీ సమారాధన

విధానే7ష్టమస్కంద్ధే దేవీపూజననిరూపణంనామ చతుర్వింశో7ధ్యాయః. స్కంధశ్చాయం సమాప్తః.

(నందాగ్ని వసుభి 839 పద్యై ర్ద్వైపాయన ముఖచ్యుతైః! దేవీభాగవతస్యా స్యాష్టమస్కంధ ఉదీరితః.)

ఎవ్వడు ప్రతినిత్యమును శ్రీదేవీ ప్రీతికరమగు నీ దివ్యస్తోత్రము పఠించునో వాని కాధివ్యాధిబాధలును శత్రు భయము నుండవు. దీనివలన నర్థార్థి యర్థమును ధర్మార్థి ధర్మమును కామార్థి కామమును మముక్షువు మోక్షమును తప్పక బడయగలడు. దీనిని చదివిన బ్రాహ్మణుడు వేదసంపన్నుడగును; క్షత్రియుడు విజేత యగును; వైశ్యుడు దనధాన్య సంపన్నుడగును; శూద్రుడు సుఖవంతు డగును. ఎవ్వడు నియతాత్ముడై శ్రాద్ధకాలమందీస్తోత్రము పఠించునో యవ్వాని పితృదేవతలు కల్పమువఱ కక్షయతృప్తి గాంతురు. ఇట్లు సురపూజితమగు దేవ్యారాధనము చెప్పబడినది. ఎవ్వ డీ దేవ్యా రాధనము పరభక్తితో జేయునో వాడు శ్రీదేవీ సాలోక్యభాగ్య మొందును. నారదా! శ్రీదేవి పూజ వలన నెల్లకోర్కు లీడేరును; పాపరాసులు సమసిపోవును; నిర్మల చిత్తశుద్ధి యేర్పడును. అట్టివాడగు భక్తుడుజగదంబ దయవలన నెల్లెడల మాన ధనులలో మాన్యతముడును పూజ్యతముడు నగును. అట్టివానికి నరకభయము కలలోసైతము గలుగదు. ఆ మహామాయాదేవి కృప వలన పుత్రపౌత్రాభివృద్ధి యగును. అట్టివాడు తప్పక శ్రీదేవి భక్తడు కాగలడు.ఇటుల నీకు నరకోద్ధరణ విధానము తెల్పబడెను. మునీశా! ఇట్లు మహాదేవిని పూజించిన సకల శుభములు చేకూరును. ఏ నెలకు తగిన విధముగ నా నెలలో దేవిపూజ యును శ్రీమధూకపూజయు చక్కగ చేసిన వానికి రోగబాధలు భయములు గలుగవు. దీని తర్వాత మహాదేవియొక్క ప్రకృతి పంచకము గుఱిచి తెల్పుదును. ప్రకృతి నామ రూపములును నవతారములును జగదానందకరములు. క్షభక్తమునీ! ఆ ప్రకృతి పంచకము యొక్క కథలు మహిమలు నెంతగ గ్రోలినను తనివి తీరదు. ఇది విన్నవానికి మోక్షము కరతలామలక ముగ నుండును. కనుక శ్రద్ధగ వినుము.

ఇది శ్రీ వ్యాస రచిత శ్రీదేవీ భాగవత మహా పురాణమందలి పదెనెనిమిదివ స్కంధమందు

శ్రీదేవీ పూజన విధాన నిరూపణమును నిరువది నాల్గవ యధ్యాయము.

ఇది యెనిమిదివందల ముప్పదితొమ్మిది శ్లోకములతో శ్రీ వ్యాస మహర్షి ముఖ కమలము నుండి వెలువడిన

శ్రీదేవీ భాగవత మహా పురాణమున నెనిమిదవ స్కంధము సంపూర్ణము.

ఓం తత్సత్‌.

Sri Devi Bagavatham-2    Chapters