Sri Devi Bagavatham-2    Chapters   

అథఏకో నవింశో7ధ్యాయః.

శ్రీనారాయణః: ప్రథమే వివరే విప్ర అతలాఖ్యే మనోరమే | మయపుక్రో బలో నామ వర్తతే7ఖర్వ గర్వకృత్‌. 1

షణ్ణంవత్యో యేన సృష్టా మాయాః సర్వార్ధసాధికాః | మాయావినో యా శ్చ సద్యో ధారయంతి చ కాశ్చన. 2

జృంభమాణస్య యసై#్యవ బలస్య బలశాలినః | స్త్రీగణా ఉపపద్యం తే త్రయో లోకవిమోహనాః. 3

పుం శ్చ ల్య శ్చై వ కామిన్యఃసై#్వరిణ్య శ్చేతి విశ్రుతాః | యావై బిలాయనం ప్రేష్ఠం ప్రవిష్ఠం పురుషం రహః. 4

రసేన హాటకాఖ్యేన సాధయిత్వా ప్రయత్నతః | స్వవిలాసావలోకానురాగస్మితనిగూహనైః. 5

సంలాప విభ్రమా ద్యైశ్చ రమయం త్యపి చా ః స్త్రియః | యస్మిన్ను వయుక్తే జనో మనుతే బహూథా స్వయమ్‌. 6

ఈశ్వరో7హ మహం సిద్దో నాగాయుతబలో మహాన్‌ | ఆత్మానం మన్యమానం సన్మదాంధ ఇవ కథ్యతే . 7

ఏవం ప్రోక్తా స్థితి శ్చా త్ర అతలస్య చ నారద | ద్వితీయవివరస్యాత్ర వితలస్య నిబోధతః. 8

భూబతలాధస్తలే చైవ వితతే భగవా న్భవః | హాటకేశ్వరనామాయం స్వపార్షదగణౖ ర్వృతః. 9

ప్రజాపతి కృతస్యా పి సర్గ స్య బృంహణాయ చ | భవాన్యా మిథునీ భూయ ఆస్తే దేవాధిపూజితః 10

భవయో హ్విర్యసంభూతా హాటకీ సరి దుత్తమా | సమీ ద్దో మరుతా వహ్ని రోజసా పిభతీ వహి. 11

పందొమ్మిదవ అధ్యాయము

భువనవ్యవస్థ - అతలాదిలోక వర్ణనము

శ్రీనారాయణ డిట్లనెను: ఓ నారదా! మొదటి యతల సుందరలోకమందున పుబలగర్వములు ఖండించునట్టి మయ పుత్రుడగు బలుడనువాడు గలడు. అతడు సర్వార్థములు సాధింపగల తొంబదియారు మాయావిద్య లేర్పఱచెను. వాని నెఱింగినవాడు గొప్ప మాయావి గాగలడు. బలశాలియగు బలు డావులించినంతనే ముజ్జగములను మోహపఱచునట్టి మోహినులు పెక్కురు పుట్టుదురు. ఆస్త్రీలు-పుంశ్చలీ-కామిమీ-సై#్వరిణులు. వారు తమ ప్రియమైన వివరమునందు జొచ్చిన పురుష వర్యు నొంటరిగ చేజిక్కించుకొందురు. వారు ప్రయత్నించి హాటకరసముతో వారిని తమవారిగ వశీకరించుకొందురు. వారు తమ పదునైన కడగంటి చూపులతో వలపుతో కౌగిళ్లతో చిర్ననగవులతో నర్మమర్మ గర్భితమైన పలుకులతో తమిదీఱవారితో రమింతురు. అతడు తన్నొక సిద్దునిగ నాగాయుతబలునిగ నీశ్వరునిగ నోటమి నెఱుగనివానిగ దలచుకొని మదాంధు డగును. ఓనారదా! ఇంతవఱకు నీకతలము సంగతి తేల్పితిని. ఇంక రెండవ వివరమగు వితలము గుఱించి వినుము. ఈ భూమికి క్రింద వితలమను వివరమునందు శివభగవానుడు హాట కేశ్వర నామమున ప్రసిద్దుడై తన పార్షదగణములతో గూడి సేవ లందుకొనుచుండును. అతడచట ప్రజాపతి రచితమైన సృష్టిక్రమమును పెంపొందించుటకు భవానీ సహితముగ విరాజిల్లుచుండును. శివుని మహావీర్యమునుండి హాటకమను నది ప్రవహించును. అగ్ని దానిని తన తేజముతో త్రాగును.

తన్నిఫ్ఠ్యూతం హాటకాఖ్యం సువర్ణం దైత్యవల్లభమ్‌ | దైత్యాంగనాభూషణార్హం సదా తంధారయంతిహి.12

తగ్బిలాధస్తలా త్ర్పోక్తం సుతలాఖ్యంబిలేశ్వరమ్‌ | పుణ్యశ్లోకో బలిర్నామా ఆస్తేవైరోచనిర్మునే. 13

మహేంద్రస్యత దేవస్య చికీర్షుః ప్రియ ముత్తమమ్‌ | త్రివిక్రమో7పి భగవా న్సుతలే బలిమానయత్‌ 14

త్రైలోక్యలక్ష్మీ మాక్షిప్య స్దాపితః కిల దైత్యరాట్‌ | ఇంద్రాదిష్వప్యలబ్థా యా సా శ్రీస్తమనువర్తతే. 15

తమేవ దేవదేవేశ మారాధయతి భక్తితః | వ్యపేతసాధ్వసో7ద్యాపి వర్తతే సుతలాధిపః. 16

భూమిదానఫలం హ్యేత త్పాత్రభూతే7ఖిలేశ్వరే | వర్ణయంతి మహాత్మానో నైతద్యుక్తం చ నారదః17

వాసుదేవే భగవతి పురుషార్థ ప్రదే హరౌ| ఏతద్దాన ఫలం విప్ర సర్వథా నహి యుజ్యతే. 18

యసై#్యవ దేవదేవస్య నామాపి వివశో గృణన్‌ | స్వకీయ కర్మ బంధీయ గుణాన్విధును తే 7ంజసా 19

యత్ల్కేశబంధహానాయ సాంఖ్యయోగాదిసాధనమ్‌ | కుర్వతే యతయో నిత్యం భగవత్యభిలేశ్వరే. 20

న చాయం భగవా నస్మాననుజగ్రాహ నారద | మాయామయం చ భోగానామైశ్వర్యంవ్యతనోత్పరమ్‌. 21

సర్వక్లేశాది హేతుంతదాత్మానుస్మృతి శోషణమ్‌ | యంసాక్షా ద్బగవా న్విష్ణుః సర్వోపాయవిదీశ్వరః 22

అగ్ని వెడలగ్రక్కిన హాటకమను బంగారము దైత్యులకు ప్రియమైనది. దైత్యకాంతలు దానిని సొమ్ములుగ నుపయోగింతురు. వితలము క్రింద సతలమును వివరము గలదు. అందు విరోచనుని కొడుకు పుణ్యశ్లోకుడును నగు బలి వసించును. మహేంద్రునకు ప్రియము గూర్చు తలంపుతో త్రివిక్రమ భగవానుడు బలిని సుతలమునకు గొని వచ్చెను. ఇంద్రాదులకు నలవిగాని ముల్లోకముల సంపద నంతయును బలి తన వశము చేసికొనెను. సుతలపతి భయ ముడిగి భక్తిమీర దేవదేవేశుడగు వామనుని ఆరాధించుచుండును. నారదా! ఇదంతయు నఖిలేశ్వరుడు పాత్రుడు నగు భగవానునకిచ్చిన భూదాన ఫలితమే యని మహాత్ములు వర్ణింతురు. విప్రవర్యా! పురుషార్థుప్రదుడు వాసుదేవ భగవానుడు నకు దేవున కింత గొప్ప దాన మిచ్చుటనవసరము. ఏలయనగా నీ దేవదేవుని యొక్క నామ ముచ్చరించినంత మాత్రమున పలికిన వాని కర్మ బంధములు విషయాలు వెనువెంటనే తునాతునుక లగును. సాంఖ్యు లెల్ల క్లేశబంధములు పాయుటకు నిత్యము నిఖిలేశ్వరు భగవాను నారాదింతురు. భగవానుడు భక్తులపై దయబూని మాయామయములగు భోగభాగ్యములను భవింపజేయును. కావున నాత్మవిస్మరణ మెల్లక్లేశములకు మూలము. సకల మాయోపాయము లెఱిగిన శ్రీవిష్ణు భగవానుడే సర్వము హరించెను.

యాచ్ఞా చ్చలేనాపహృతం సర్వస్వం దేహశోషకమ్‌| ఆప్రాస్తాన్యోపాయ ఈశః పాశైర్వారుణసంభ##వైః. 23

బంధయిత్వా7వముత్యాపి గిరిదర్యామివాబ్రవీత్‌ | అసావింద్రో మహామూఢోయస్య మంత్రీ బృహస్పతిః. 24

ప్రసన్న మిమ మత్యర్థమయాచల్లోకసంపదమ్‌ | త్రైలోక్య మిద మైశ్వర్యం కియదేవాతితుచ్చకమ్‌. 25

ఆశీషాం ప్రభవం ముక్త్వా యో మూఢో లోకసంసది | అస్మత్పితామహః శ్రీమా న్ర్పహ్లాదో భగవత్ర్పియః. 26

దాస్వం వవ్రే విభోస్త స్య సర్వలోకోపకారకః | పిత్ర్య మైశ్వర్య మతులం దీయమానంచవిష్ణునా. 27

పితర్యుపరతే వీరే నై వైచ్చగవత్ప్రియః | తస్యాతులానుభావస్య సర్వలోకోపధీమతః. 28

అస్మ ద్వుధో నాల్ప పక్వేతర దో షో7వ గచ్చతి | ఏవం దైత్యపతిః సో7యం బలిః పరమపూజితః. 29

సుతలే వర్తతే యస్య ద్వార పాలో హరిః స్వయమ్‌ | ఏకదా దగ్విజయే రాజా రావణోలోకరావణః. 30

ప్రవిశ న్సుతలే యేన భక్తాను గ్రహకారిణా | పాదాంగుష్ఠేన ప్రక్షిప్తో యోజనా యుత మత్రహి. 31

ఏవం భూతాను భావో7యం బతిః సర్వసుఖైక భుక్‌ | ఆస్తే సుతలరాజ స్థో దేవ దేవ ప్రసాదతః. 32

ఇతి! శ్రీ దేవీ భాగవతే మహాపురాణ 7ష్టమస్కంధే ఏకోనవింశో 7ధ్యాయః.

హరి యాచించు నెపముతో దేహము తప్ప సర్వస్వము మపహిరించెను. ఇత రోపాయమి లేనందున హరి బలిని వరుణపాశములతో బంధించెను. అట్లు బంధించి హరి బలి నీ గిరిగుహలందు పడవైచెను. అపుడు బలి యిట్లనెను: ''గురుడు మంత్రిగగల యింద్రు డెంతేనియు మూఢుడు. అట్టి యింద్రు నెడ ప్రసన్నుడై విష్ణవు ముల్లోకముల తుచ్చసంపద నంతయు నమ్మని చేయి చాచెను.. మూఢు డెప్పుడైన కల్యాణస్వరూపుడగు భగవంతుని వదలి లోకసంపదలనే కోరుకొనును గదా! నా పితామహుడు ప్రహ్లాదుడు. పరమ భాగవతోత్తముడు. ప్రహ్లాదుడు సకల లోకోపకారకుడు. కనుకనే విష్ణువతని తండ్రి సంపద నంతయు నిత్తునన్నను గ్రహింపక విష్ణుదాస్యమునే కోరుకొనెను. వీరుడగు తన తండ్రి మరణించినప్పుటికిని ప్రహ్లాదు డతని సంపదలు కోరుకొనలేదు. ఈ లోకము లన్నియును భగవానున కూపాధిభూతములు. అతడు సకలలోకహితకరుడు. అట్టి భగవంతుని మహామహిమమును నావంటి యల్పమతిగల దోషయుతు డెన్నటికి నెఱుగజాలడు.'' అని దైత్యపతియు పరమపూజితుడునైన బలి పలికెను. ఆ బలి సుతలమున వసించెను. శ్రీహరి స్వయముగ బలికి ద్వారపాలకుడుగ నుండెను. మున్నొకనాడు లోకరావణుడగు రావణుడు దిగ్విజయమునకు తరలెను. రావణుడు సుతలము చేరినంతనే భక్తానుగ్రహకారి శ్రీహరి తన కాలిబొటనవ్రేలి గోటికొనతో నతనిని పదివేల యోజనములంత దూరమునంతకు జిమ్మి వేసెను. ఈ పగిదిని దేవ దేవుని ప్రసాదమువలన సుతలరాజు భూతభావనుడు నగుబలి యెల్ల సుఖము లనుభవించుచు సుతలమున నుండును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణ మందలి అష్టమస్కంధమందు పందొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters