Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తధశో7ధ్యాయః

శ్రీనారాయణః : అథర్షిమండలాదూర్ధ్వం యోజనానాం ప్రమాణతః | లక్షై స్త్రయోదశమితైః పరమం వైష్ణవం పదమ్‌. 1

మహాభాగవతః శ్రీమా స్వర్తతే లోకవందితః | ఔత్తానపాది రింద్రేణ వహ్నినా కశ్యపేన చ. 2

ధర్మేణ సహ చైవాస్తే సమకాలయుజా ధ్రువః | బహుమానం దక్షిణతః కుర్వుద్బిః ప్రేక్షకైః సదా. 3

ఆజీవ్యః కల్పజీవినా ముపాస్తే భగవత్పదమ్‌ | జ్యోతిర్గణానాం సర్వేషాం గ్రహనక్షత్ర భాదినమ్‌. 4

కాలేనానిమిషేణాయం భ్రామ్యతాం వక్తరంహసా | అవష్టంభః సాణురివ విహిత శ్చేశ్వరేణ సః. 5

భాసతే భాసయ న్బా సా స్వాయయా దేవపూజితః | మేఢి స్తంభే యథా యుక్తాః పశవః కర్షణార్థకాః. 6

మండలాని చరంతీమే సవన త్రి తయేన చ | ఏవం గ్రహాదయః సర్వే భగణాద్యా యథా క్రమమ్‌. 7

అంతర్బ హి ర్వి భాగేన కాలచక్రే నియోజితాః | ధ్రువ మే వా7వ లంబ్యాశు వాయునో దీరితా శ్చ రన్‌. 8

ఆకల్పాంతం చక్రమంతి ఖే శ్యేనాద్యాః ఖగా ఇవ | కర్మ సారథయోవాయువశగాః సర్వ ఏవ తే. 9

ఏవం జ్యోతిర్గణాః సర్వే ప్రకృతేః పురుషస్య చ | సంయోగా ను గృహీ తాస్తే భూమౌ న నిపతంతి చ. 10

పదునేడవ అధ్యాయము

భువనవ్యవస్థ - జ్యోతిర్వ్యవస్ధ

నారాయణు డిట్లనెను: సప్తర్షి మండలమునకు పదుమూడు లక్షల యోజనములపైని పరమ వైష్ణవ పదము తేజరిల్లు చుండును. ఆపరమధామమునందు పరమ భాదవతోత్తముడు లోకవందితుడునైన యుత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు ప్రకాశించుచుండును, అత డింద్రాగ్ని కశ్యపులను గూడియుండును. నక్షత్రములను చూచువారు ముఖ్యముగ నెక్కువగ ధ్రువుని గౌరవింతురు. కల్పజీవులగువారు భగవంతు నుపాసించుచుందురు. జ్యోతిశ్చక్రములోని గ్రహనక్షత్రాదుల నన్నిటిని భగవానుడు త్రిప్పుచుండును. ఇటు లవ్యక్తగతితో గ్రహాదులను ద్రిప్పుచు నీశ్వరుడు ధ్రువుని మాత్రము స్థాణువువలె కదల కుండునట్టు లుంచెను. ఈ విధముగ పరమేశ్వరుడు నిజతేజముతో నెల్లరిని ప్రకాశింపచేయుచు దేవపూజితుడై యొప్పును. పశువులు మేఢిస్తంభమునకు బంధింపబడి దానిచుట్టు తిరుగును. ఇట్లు గ్రహాదులు లోనబైట నను విభాగముతో కాలచక్రము నందు గూర్చబడి ధ్రువు నాధారము చేసికోని వాయుప్రేరణచే తిరుగును. గ్రహాదులు కల్పాంతము వఱకు నిట్లు పరిభ్రమిం చును. వాయువు కర్మసారథి-చోదకుడు. డేగ మున్నగు పక్షులు నింగిపై వాయువశమున నెగురునేకాని క్రింద పడవు. అదే తీరున నక్షత్రగ్రహాదు లన్నియును ప్రకృతి పురుషుల సంయోగమున ననుగ్రహింపబడి వాయువశమున నేలపై పడక తిరుగుచుండును.

జ్యోతి శ్చ క్రం దేత చ్ఛిం శుమార స్వరూపకమ్‌ | సోపయోగం భగవతో యోగధారణ కర్మణి. 11

యస్యార్వాక్‌ శిరసః కుండలీభూత వపుషోమునే | పుచ్చా గ్రే కల్పితో యో7యం ధ్రువ ఉత్తాన పాదజః. 12

లాంగూలే7స్య చ సంప్రోక్తః ప్రజాపతి రకల్మషః | అగ్ని రింద్ర శ్చ ధర్మశ్చతిష్ఠంతే సురపూజి తాః. 13

ధాతా విధాతా పుచ్ఛాంతే కట్యాం సప్తర్షయ స్తతః | దక్షిణా వర్త భోగేన కుండలాకార మీయు షః. 14

ఉత్తరా యణ భానీ దక్ష పార్శ్వే7ర్పితాని చ | దక్షిణాయన భానీహ సవ్యే పార్శ్వే ర్పితాని చ. 15

కుండలాభోగ వేశ స్య పార్శ్వయో రుభయో రపి | సమసంఖ్యా శ్చా వయవా భవంతి కజనందన. 16

అజవీ థీ వృష్ఠభాగే ఆకాశ సరిదౌదరే | పున ర్వసు శ్చ శ్రోణ్యౌ దక్షిణవామయోః. 17

ఆర్ద్రా శ్లేషే పశ్చిమయోః పాదయోర్దక్షవామయోః | అభిజి చ్ఛోత్త రాషాడా నాసయోర్దక్షవామయోః. 18

యథా సంఖ్యంచ దేవర్షే శ్రుతి శ్చ జలభం తథా | కల్పితే కల్పనా విద్బి ర్నే త్రయో ర్దక్షవామయోః. 19

ధనిష్ఠా చైన మూలం చ కర్ణయో ర్దక్షవామయోః | మఘా దీ న్యష్ట భానీహ దక్షిణాయనగాని చ. 20

కొంద ఱీ జ్యోతిశ్చ క్రమును భగవానుని యోగధారణ కుపయోగపడు శింశుమార స్వరూపముగ భావింతురు. ఓ మునీశా! ఈ కుండలీభూత శరీరుని తల క్రిందివై పుండును. దాని తోకచివర నుత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు నెలకొని యుండును. తోక భాగమునందు పాపరహితులగు ప్రజాపతి ధర్ముడు ఇంద్రాగ్నులును దేవపూజితులై ప్రకాశించుచుందురు. దాని తోక కొట్టకొన ధాతృవిధాతలును నెన్నడుమునందు సప్తర్షులును వెలుగుచుందురు. ఈ శింశుమారము దక్షిణమునకు తిరిగిన పడగతో చుట్టలు చుట్టుకొని వెల్గుచుండును. దానికి కుడివైపున నుత్తరాయణ నక్షత్రములు (అభిజిత్తునుండి పునర్వసు వఱకు 14 తారలు) తనరును. ఎడమవైపున దక్షిణాయన నక్షత్రములు కుండల రూపమననున్న శరీరమున కిరుప్రక్కలనున్న యవయవములు సమానముగ నుండును. దాని వీపు భాగమున 'అజవీథి' గలదు. ఉదరమున నాకాశగంగ గలదు. పునర్వసు పుష్యములు కుడియెడమప్రక్కల గలవు. ఆర్ద్రాదీశ్లేలు దానివెనుక కాళ్లకు కుడియెడమ వైపుల గలవు. అభిజిత్తు ఉత్త రాషాఢయు దాని కుడియెడమప్ర ముక్కుల నొప్పును. ఓయి నారదా! శ్రవణము పూర్వాషాఢయును దాని కుడుయెడమ నేత్ర ములం దనరారును. దాని కుడియెడమ చెవులందు వరుసగ ధనిష్ఠామూలా నక్షత్రములును మఘాదిగ నెనిమిది నక్షత్రములు దక్షిణ భాగమున ప్రకాశించును.

యుంజీత వామ పార్శ్వీయ వంక్రిషు క్రమతోమునే | తథైవ మృగశీర్షా దీ న్యుదగ్బాని చ యాని హి. 21

దక్షపార్శ్వే వంక్రికేషు ప్రాతిలోమ్యేన యోజయేత్‌ | శతతారా తధా జ్యేష్ఠా స్కంధయోర్దక్షవామయోః. 22

అగస్తి శ్చోత్తరహనావధరాయాం హనౌ యమః | ముఖే ష్వంగారకః ప్రోక్తో మందః ప్రోక్త ఉపస్ధకే. 23

బృహ స్పతిశ్చ కకుది వక్షస్యర్కో గ్రహాధిపః | నారాయణ శ్చ హృదయో చంద్రో మనసి తిష్ఠతి. 24

స్తనయో రశ్వినౌ నాభ్యా ముశనా పరికీర్తితః | బుధ ప్రాణాపానయోశ్చ గలే రాహుశ్చ కేతవః. 25

సర్వాంగేషు తథా రోమకూపే తారాగణాః స్మృతాః | ఏతాద్బగవతో విష్ణోః సర్వదేవమయం వపుః. 26

సంధ్యాయాం ప్రత్యహం ధ్యాయేత్ప్రయతో వాగ్యతోమునిః | నిరీక్షమాణశ్చోత్తిష్ఠన్మంత్రేణానేన ధీశ్వరః. 27

నమో జ్యోతిర్లోకాయకాలాయానిమిషాంపతయే మహాపురుషాయాభి ధీమహీతి. 28

గ్రహర్షతారామయమాధిదైవికం పాపాపహం మంత్రకృతాంత్రికాలమ్‌ | మనస్యతః స్మరతో వాత్రికాలంనశ్యేత తత్కాలజ మాశుపాపమ్‌. 29

ఇతిశ్రీదేవీ భాగవతే మహాపురాణ అష్టమస్కంధే సప్తదశో7ధ్యాయః.

ఇవి యెడమభాగమందలి యెముకలందుండును. మృగశిరాదులు ఇత్తరదిగ్బా భగమున నుండును. ఇవి కుడివైపుననున్న యెముకలందున్నటు లూహింపబడెను. దానికుడి యెడమ భుజములందు శతభిషక్‌ జ్యేష్ఠలను భావింపవలయును. ఆగస్త్యు డుత్తరపుపైదౌడయందును యముడు క్రింది దౌడయందును ఆంగారకుడు ముఖమందును శని యుపస్థ మందును విలసిల్లు చుందురు. దాని మూపున గురుడు ఱొమ్మునందు గ్రహపతియగు సూర్యుడును హృదయకమలమందున శ్రీమన్నారాణుండును మనస్సున చంద్రుడు నుందురు. అశ్వినిదేవతలు దాని స్తనములందును శుక్రుడు నాభియందును బుధుడు ప్రాణాపానములందును రాహుకేతువులు గళమందు నుందురు. దానియెల్ల యంగములందు రోమములందును నిఖిలకారాగణములు ప్రకాశములు విర జిమ్ము చుండును. ఇది అంతయును శ్రీవిష్ణుభగవానుని సర్వదేవ మయమైన దివ్యస్వరూప వర్ణనామృతము ఈ శింశుమార స్తోత్త్రమును ప్రతిసంధ్యయందును మౌనముగ నియతితో ధ్యానింపవలయును. నవనవోన్మేష ప్రజ్ఞాశాలియగు వాడు ప్రొద్దున దీనిని చదువుచు మేల్కాంచ వలయును. శ్రీజ్యోతిః స్వరూపుడు మహాకాలుడు దేవపతి పురుషోత్తముడునగు భగవానుని దోసి లొగ్గి ధ్యానించుచున్నానని సకలగ్రహ నక్షత్రతారా మయుడు పాపనాశకుడు ఆధియజ్ఞుడు నగువానిని త్రికాలములందీ మంత్రము సంస్మరించుచు నమస్కరించువాని పాపరాసులప్పటికప్పుడే పటాపంచలగును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమస్కంధమున సప్తదశాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters