Sri Devi Bagavatham-2    Chapters   

అథ షష్టోధ్యాయః

శ్రీ నారాయణః: అరుణోదా నదీయాతు మయా ప్రోక్తా చ నారద| మందరా న్నిపతంతీ సా పూర్వేణలావృతం ప్లవేత్‌. 1

యజ్జోషణా ద్బవాన్యాశ్చాను చరీణాం స్త్రియామపి | యక్షగంధర్వ పత్నీనాం దేహగంధవహోనిలః. 2

వాసయత్యభితో భూమిం దశయోజన సంఖ్యయా | ఏవం జంబూఫలానాం చ తుంగదేశనిపాతనాత్‌. 3

విశీర్యతా మనస్థీనాం కుంజరాంగ ప్రమాణినామ్‌ | రసేన చ నదీ జంబూనామ్మీ మేర్వాఖ్య మంతరాత్‌. 4

పతంతీ భూమిభాగే చ దక్షిణలావృతం గతా | దేవి జంబూఫలాస్వాదతుష్టా జంబ్వాదినీ స్మృతా. 5

తత్రత్యానాం చ లోకానాం దేవనాగర్షిరక్షసామ్‌ | పూజనీయ పదా మాన్యా సర్వభూతదయా కరీ 6

పావనీ పాపినాం రోగనాశినీ స్మరతామపి | కీర్తితా విఘ్న సంహర్త్రీ మాననీయా దివౌకసామ్‌. 7

కోకిలాక్షీ కామకలా కరుణా కామపూజితా | కఠోరవిగ్రహా ధన్యా నాకమాన్యా గభస్తినీ. 8

ఏభిర్నామ పదైః కామం జపనీయాసదా నృణామ్‌ | జంబునదీరోధసోర్యా మృత్తీకాతీరవర్తినీ. 9

జంబూరసేనాను విధ్యామానా వాయ్వర్కయో గతః | విద్యాధరామరస్త్రీణాం భూషణం వివిధం మహత్‌. 10

ఆరవ అధ్యాయము

భువన వ్యవస్థ

శ్రీ నారాయణు డిట్లనెను: ఓ నారదా ! నేను తెల్పిన ''అరుణోదానది'' మందరాద్రినుండి వెల్వడి తూర్పు నిలావృతము జేరుచున్నది. యక్ష-గంధర్వుల భార్యలు భవానీదేవి చెలికత్తెలు. వారా నదీని సేవించుటవలన వారి దేహముల నుండి తీయని నెత్తావులు వెల్వడును. ఈ తావులు నేలపై పది యోజనముల దూరము వ్యాపించును. ఆచట నువ్వెత్తగు చోటి నుండి నేనేడుపండ్లు పడును. అవి యేనుగుగంత లావుండును. ఆ పండ్ల రసాము జంబూనదిగ ప్రవహించుచున్నది. అదిమేరు గిరినుండి వెడలుచున్నది. జంబునది యిలావృతమునకు దక్షిణముగ ప్రవహించుచున్నది. జంబూఫలరసమాస్వాదించుట వలన నచటి దేవిని ''జంబ్వాని'' యందురు. ఆ దేవి యచ్చోట నివంసించుచున్న దేవ-ఋషి-నాగ-రాక్షసుల చేత పూజలందుకొని గౌరవింపబడి యెల్ల భూతములపై దయ చూపును. ఈ దేవి పాపులమను పునీతులను చేయును; తన్ను దలంచినంతనే రోగముల బాపును; సంకీర్తించినంతనే విఘ్నములు హరించును; నిత్యము దేవసన్నుతయై యలరారును. అచట దేవి కోకిలాక్షి-కామపూజిత-కఠోరవిగ్రహ-ధన్య-నాకమన్య-గర్బస్తని-అను నామముల చేత ప్రజలచే నిరంతరము జపింపబడును. జంబూనది తీరమందలి మన్ను శ్రేష్టమైనది. ఈ మన్ను జంబూరసములో తడిసి గాలియెండల తాకుడులవలన విద్యాధరామర స్త్రీలకు సోమ్ముగ నేర్పడును.

జాంబూనదం సువర్ణం చ ప్రోక్తం దేవవినిర్మితమ్‌ | యత్సువర్ణం చ వివిధా యోషిద్బిః కాముకాః సదా. 11

ముకుటం కటి సూత్రం చ కేయూరాదీన్ర్పకుర్వతే | మహాకదంబః సంప్రోక్తః సుపార్శ్వ గిరి సంస్థీతః. 12

తస్య కోటరదేశేభ్యః పంచధారాశ్చయాః స్మృతాః | సుపార్శ్వ గిరి మూర్ద్నీహ పతంత్యేతా భువం గతాః. 13

మధుధారః పంచ తాస్తు పశ్చిమేలావృతం ప్లుతాః | యాశ్చోపభుజ్యమానానాం దేవానాం ముఖగంధభృత్‌. 14

వాయుః సమంతతో గచ్చన్‌ శతయోజనవాసనః | ధారేశ్వరీ మహాదేవీ భక్తానాం కారకారిణీ. 15

దేవపూజ్యా మహోత్సాహా కారరూపా మహాననా | వసతే కర్మఫలదా కాంతారగ్రహణశ్వరీ. 16

కరాలదేహా కాలాంగి కామకోటి ప్రవర్తనీ | ఇత్యే తైర్నామభిః పూజ్యా దేవీ సర్వ సురేశ్వరీ. 17

ఏవం కుముదరూఢో యో నామ్నా శతబలో పటః | తత్స్కంధేభ్యోధోముఖాశ్చ నదాః కుముదమూర్ధతః. 18

పయోదధి మదుఘృత గుడాన్నా ద్యంబరాధిభిః | శయ్యాసనాద్యాభరణౖః సర్వే కామదుఘాశ్చతే. 19

ఉత్తరేణలావృతం తే ప్లావయంతి సమంతతః | మీనాక్షి తత్తలే దేవీ దేవాసురనిషేవితా. 20

కనుక బంగారము దేవనిర్మితమై జాంబూనదమన బరగును. స్త్రీలకు బంగారుమపై సాజముగ మక్కువ యెక్కువ గదా. వారు కిరీటము మొలనూలు చేతి కడయములు మున్నగునవి బంగారముతో చేయించుకొందరు. ఇంక సుపార్శ్వగిరిపై పెద్దకదంబవృక్షములు గలవు. ఈ గిరిశిఖరముల నుండి యైదు సెలయేళ్లు వెల్వడును. అవి సుపార్శ్వ శిఖరములనుండి భూమిపై పడును. ఈ యైదు మధుధార లిలావృతమునకు పడమటగ ప్రవహించును. ఆ మధుధార లనుభవించు దేవతల ముఖములనుండి సువాసనలు గ్రహించి గాలు లల్లెడల నూఱు యోజనము లందాక వ్యాపించును. అచ్చటి దేవి ధారేశ్వరి నా బరగి భక్తుల కోర్కులు దీర్చును. దేవి-దేవపూజ్య-మహోత్సాహ-కాలరూప-మహానన-కర్మఫలద-కాంతార గ్రహణశ్వరి-కరాలదేహ- కాలాంగి- కామకోటి ప్రవర్తిని-యను పేళ్లతో నచటి దేవి నిత్యపూజ లందుకొనును. ఇంక కుముదమను పర్వతముపై''శతబల'' మను వటవృక్షము గలదు. ఆ చెట్టు మొదళ్ల మీదుగ కుముదగిరిపై నుండి నదులు ప్రవహించుచుండును. అవి పాలు-పెరుగు-నెయ్యి-తేనె-బెల్లము-అన్నము-వస్త్రములు-సెజ్జ-ఆసనము-సొమ్ములు-కామ్యములు-నొసంగు చుండును. అవి యిలావృతమునకు నుత్తరముగ ప్రవహించును. అచటి మీనీక్షిదేవి దేవాసురులచేత సేవింపబడుచుండును.

నీలాంబరా రౌద్రముఖీ నీలాలాకయుతా చ సా | నీకినాం దేవసంఘానాం ఫలదావరదా చ సా. 21

అతిమాన్యాతి పూజ్యా చ మత్తమాతంగగామినీ | మదనోన్మాదినీ మానప్రియా మానప్రియాంతరా. 22

మారవేగధరామారపూజితా మారమాదినీ | మయూరవరశోభాఢ్యా శిఖివాహనగర్బభూః. 23

ఏభిర్నామ పదై ర్వంద్యా దేవీ సా మీనలోచనా | జపతాం స్మరతాం మానదాత్రీ చేశ్వరసంగినీ. 24

తేషాం నదానాం పానీయపానానుగత చేతసామ్‌ | ప్రజానం నక దాచిత్స్యా ద్వలీపలితలక్షణమ్‌. 25

క్లమస్వేదాది దౌర్గంధ్యం జరామయమృతి భ్రమాః | శీతోష్ణవాత వైవర్ణ్య ముఖోపప్లవ సంచయాః. 26

నాపదశ్చైవ జాయంతే యావజ్జీవం సుఖం భ##వేత్‌ | నైరంతర్యేణ తత్య్సాద్వై సుఖం నిరతిశాయకమ్‌. 27

తత ఊర్ద్వం వ్రవక్ష్యామి సంనివేశం చ తద్గిరేః | సువర్ణమయనామ్నోవై సుమేరోః పర్వతాః పృథక్‌. 28

గిరయో వింశతి పరాః కర్ణికాయా ఇవేహ తే | కేశరీభూయ సర్వేపి మేరోర్మూల విభాగకే. 29

పరితశ్చోప క్లప్తాస్తే తేషాం నామాని శృణ్వతః | కురంగః కురగశ్చైవ కుశుంభోథో వికంకతః. 30

త్రికూటః శిశిర శ్చైవ పతంగో రుచకస్తథా | నిషధ శ్చ శితీవాసః కపిలః శంఖ ఏవ చ. 31

వైడూర్య శ్చారుధిశ్చైవ హాంసో ఋషభ ఏవచ | నాగః కాలంజరశ్చైవ నాదశ్చేతి వింశతిః. 32

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ ష్టమస్కంధే షష్ఠోధ్యాయః.

నీలాంబర - రౌద్రముఖి -నీలాలకయుత - స్వర్గదేవతలకు ఫలవరము లొసగునది - అతిమాన్య- అతిపూజ్య-మత్తమాంగ గామిని-మదనోన్మాదిని-మానప్రియ-మానప్రియాంతర- మారవేగధర-మారపూజిత-మారమాదిని -మయూరవర శోభాఢ్య- కుమారగర్భభూ-అనెడు దివ్యనామములచేత నచటి మీనలోచనాదేవి నమస్కరింపబడును. ఆ యీశ్వరసంగిని తన్ను జపించి స్మరించువారల గౌరవమర్యాదలు కాపాడుచుండును. అచటి నదులలోని నీరు గ్రోలిన ప్రజల కెన్నడును తలవెండ్రుకులు తెల్ల పబడవు - ఊడిపోవు. శ్రమవలన చెమట-చెడువాసన - జరా రోగములు చావు-జంకు-శీతవాతోష్ణములవలన పాలిపోవుట-మొగము వెలవెలబారుట-మున్నగు ప్రమాదములు బాధలు నచటివారికి గలుగవు. జీవితమంతయును నిరంతరముగ వారికి సుఖశాంతులు గల్గును. ఇక దీని తర్వాతిది చెప్పుచున్నాను. ఆ పర్వతము చెంతనే సువర్ణమయ మనబడు మేరుగిరులు కలవు. ఆ గిరులు మొత్తమిరువది. ఇవన్నియు మేరుగిరికి మొదట కర్ణికచుట్టునున్న కేసరమువలె నొప్పుచున్నవి. ఇవి నలుదెసల వ్యాపించియున్నవి. వీని పేర్లు వినుము. కురంగము-కురగము-శుంభము-వికంకతము-కూటము-శిశిరము-పతంగము-రుచకము-నిషదము-శితీవాసము-కపిలము-శంఖము-వైడూర్యము-చారుధి-హంసము-ఋషభము-నాగము-కాలంజరము-నారదము-ననునిరువది గిరులు ఇవి.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమస్కంధమున షష్ఠాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters