Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వితీయోధ్యాయః.

నారాయణః.ఏవణ మీమాంసత స్తస్య పద్మయోనేః పరంతప | మన్వాదిభి ర్మునివరైర్మరీచ్యాద్యైః సమంతతః. 1

ధ్యాయతస్తస్య నాసాగ్రాద్విరించేః సహసానఘ | వరాహపోతో నిరగా దే కాంగుల ప్రమాణతః. 2

తసై#్యవ పశ్యతః స్వస్థః క్షణన కిల నారద | కరీమాత్రం ప్రవవృధే తదద్బుతతమం హ్యభూత్‌. 3

మరీచిముఖ్యై ర్విప్రేంద్రైః సనకాద్యైశ్చ నారద | తద్దృష్ట్వా సౌకరం రూపం తర్క యామాస పద్మభూః. 4

కిమేత త్సౌకరం వ్యాజం దివ్యం సత్త్వ మనస్దితమ్‌ | అత్యాశ్చర్య మిదం జాతం నాసికాయా వినిఃసృతమ్‌. 5

దృష్టోంగుష్ఠశిరోమాత్రః క్షణాచ్చైలేంద్ర సన్నిభః | ఆహోస్వి ద్బగవాన్కింవాయ జ్ఞోమే

ఖేదయన్మనః. 6

ఇతి తర్కయత స్తస్య బ్రహ్మణః పరమాత్మనః | వరాహరూపో భగవాన్‌ జగర్జాచలసన్నిభః. 7

విరించి హర్షయామాస సంహతాంశ్చ ద్విజోత్తమాన్‌ | స్వగర్జా శబ్ద మాత్రేణ దిగ్బ్రాంతి మనునాదయన్‌. 8

తే నిశమ్య స్వఖేదస్య శయిష్ణుం ఘర్ఘురస్వనమ్‌ | జనస్త పస్సత్యలోకవాసినోమరవర్యకాః. 9

చందోమయైః స్తోత్రవరైః ఋక్సామాథ ర్వ సంభ##వైః | వచోభి పురుషంత్వాద్యం ద్విజేంద్రాః వర్యవాకిరన్‌. 10

తేషాంస్తోత్రం నిశమ్యాద్యోభగవాన్హరి రీశ్వరః | కృపావలో కమాత్రేణాను గృహత్వాప ఆవిశత్‌. 11

తస్యాంతర్విశతః క్రూరసటా ఘాత ప్రపీడితః | సముద్రోథ బ్రవీద్దేవ రక్షమాంశరణార్తిహన్‌. 12

ఇత్యాకర్ణ్య సముద్రోక్తం వచనం హరి రీశ్వరః | విదారయన్‌ జలచరాన్‌ జగామాంతర్జలే విభుః 13

రెండవ అధ్యాయము

వరాహమూర్తి భూమిని ఉద్దరించుట.

నారాయణుడిట్లనెను: పరంతాపా! ఈప్రకారమగ బ్రహ్మ మన్వాదులు మునివరులు మరీచ్యాదులు నగు వారిని గూడి యాలోచింపసాగెను. అట్లు ధ్యానించుచున్న బ్రహ్మ ముక్కు కొన నుండి వెంటవే బొటన వ్రేలంతటి వరహపోత ముద్బవించెను. ఓ నారదా! బ్రహ్మ చూచుచుండగనే యొక్క క్షణ మాత్రమున నది లోకాద్బుతముగ పెద్ద యేనుగంతగ పెరెగెను. నారాదా! మరీచి ముఖ్య విప్రులతో సనకాది మునులతో గూడి పుటము నుండి యాత్యాశ్చర్యముగనుద్బవించినదే! ఇది మొదట బొటన వ్రేలంతగ నుండి పిదప క్షణముననే పర్వతమంత మారినది. ఆహా! ఇతడు భగవానుడో! కాక యజ్ఞమూర్తియో! యని నా మదిలో సంశయము గల్గుచున్నది. అని పరమాత్మరూపుడగు బ్రహ్మ సంశయించుచుండగ వరహ భగవానుడు పర్వతమంత రూపము దాల్చి యెలుగెత్తి గర్జించెను. దిక్కలు పిక్కటిల్లు గర్జా ధ్వనితోనే ద్విజవరులకు బ్రహ్మకు భయముడిపి ధైర్యము గలిగించెను. జన స్తపస్సత్య లోకావాసులగు నమరవరులును దుఃఖములు తొలగించునట్టి ఘర్ఘురరావమును వినిరి. అంత విప్రులు బుక్‌-సామ-ఆధర్వణములందలి-ఛంధో మయములగు వచస్సులతో ఆద్యపురుషుని వరాహమును సుంస్తుతించిరి. వారి వేదస్తోత్రము లాలకించి యాద్యుడు భగవానుడు ఈశ్వరుడునగు రాహమూర్తి సంతసించి దయతోడి చూపులతో నీట మునిగెను. అచడు నీచ ప్రవేశించగనే, యతని గట్టి జడల తాకిడికి పీడితుడై ''దేవా! శరణప్రదా! నన్ను గాపాడు మని సాగరుడు మొఱపెట్టకొనెను. సముద్రుడు పల్కిన మాటలు విని యీశ్వరుడగు వరాహవిభుడు జలచరములను చీల్చి చెండాడుచు లోతైన నీటి లోనికి మునింగెను.

ఇతస్తతోభిధావన్స న్విచిన్వన్పృథివీం ధరామ్‌ | ఆఘ్రాయా ఘ్రాయ సర్వేశో ధరామాసాదయ చ్చనైః. 14

అంతర్జలగతాం భూమిం సర్వసత్త్వా శ్రయాం తదా | భూమిం సదేవదేవేశో దంష్ట్ర యోదాజహార తామ్‌. 15

తాం సముద్ధృత్య దంష్ట్రాగ్రే యజ్ఞశోయజ్ఞపూరుషః | శుశుభే దిగ్గజో యద్వ దుద్ధ్రుత్యాథ సుపద్మినీమ్‌. 16

తం దృష్ట్వా దేవదేవేశో విరించిః సమనుః స్వరాట్‌ తుష్టా వవాగ్బి ర్దేవేశం దంష్టోద్ధృతవసుం ధరమ్‌. 17

బ్రహ్మోవాచః జితం తే పుండరీకాక్ష భక్తానా మార్తినాశన | ఖర్వీకృత సురాధార సర్వ కామఫలప్రద. 18

ఇయం ఛ ధరణీ దేవ శోభ##తే వసుధా తవ | పద్మీనీవ సుపత్రాఢ్యా మతంగజకరోద్దృతా. 19

ఇదం చ తే శరీరం వైశోభ##తే భూమి సంగమాత్‌ | ఉద్ధృతాంబుజశుండాగ్ర కరీంద్ర తను సన్నిభమ్‌. 20

నమోనమస్తే దేవేశ సృష్టిసంహార కారక | దానవానాం వినాశాయ కృతనానాకృతే ప్రభో. 21

అగ్రతశ్చ నమస్తేస్తు పృష్ఠతశ్చ నమోనమః | సర్వామరాధారభూత బృహద్దామ న్నమోస్తుతే. 22

త్వయాహం చ ప్రజాసర్గే నియుక్తః శక్కిబృంహితః | త్వదాజ్ఞావశతః సర్గం కరోమి వికరోమి చ 23

త్వత్సహాయేన దేవేశా అమరాశ్చ పురాహరే | సుధాంవిభేజిరే సర్వే యథాకాలం యథాభలమ్‌. 24

ఇంద్రస్త్రలోకీ సామ్రాజ్యం లబ్థవాం స్త్వ న్ని దేశతః | భూనక్తి లక్ష్మీం బహులాం సురసంఘ ప్రపూజితః 25

వహ్నిః పావకతాం లబ్థ్వా జాఠరాగివిభేదతః | దేవాసురమనుష్యాణాం కరోత్యాప్యాయనం తథా. 26

అట్లు వరాహస్వామి నీటిలోన నిటునటు పరుగెత్తుచు మెల్లమెల్లగ భూమిని వెదకి పట్టుకొని పల్మారు మూర్కొనెను. ఎల్ల భూతకోటుల కాశ్రయభూతమై నీట మునిగియున్న భూమిని వరాహ దేవదేవుడు తలకోఱలతో పైకెతైను. యజ్ఞ వరాహ పురుషుడట్లు భూమిని తనకోఱల కోనలతో పైకి లేపెను. అది దిగ్గజము పైకి లేపిన కమలమునట్లు శోభ వహించెను. కొనకోఱలతో పుడమినిపైకి లేపిన వరాహదేవునిగనిబ్రహ్మ-మనువు-స్వరాట్టుమున్నగువారతని నిట్లు సంస్తుతించిరిః బ్రహ్మయిట్లనెను. ఓ పుండరీక్షాక్ష! భక్తార్తిభంజనా! సర్వకామఫలప్రదా! నీకు విజయమగుత! నీవుసత్యలోకమును సైతము ప్రతాపముచే కురుచపరచితివి. దేవా! ఏనుగు తొండముపై నలరారు కమలము చందమున నీ కొనకోఱలపై నీ భూదేవి శోభిల్లు చున్నది. తొండముపై కమలమును దాల్చిన గజరాజు శరీరమువలె కోఱలపై భూమిని దాల్తిన నీ వరహ శరీరము సొబగు వహించుచున్నది. దేవేశా! సృష్టిసంహారకారా! నీకు నా నమోవాకములు. దానవ నాశమునకు పెక్కురూపులు దాల్చు భగవానుడు నీవే కదా. ఎల్ల దేవతలకు నిలయమైన తేజోనిధానమా! నీకు మహాశక్తియుక్తుడువు. నీనే ప్రజాసృష్టికి నీచే నియమింపబడితిని. నీ యానతి చోప్పున విశ్వమును పుట్టించి సమయింప చేతును. దేవేశా! మున్ను తగిన కాలము తగిన బలముతో సురవరులు నీ సాహాయ్య సానుభూతులతో నమృతము బొందిరి. ఇంద్రుడు సైతము నీ యానతి ప్రకార మెల్ల సురలచేతపూజితుడై త్రిలోకి సామ్రాజ్యశ్రీ ననుభవించెను. అగ్ని నీ వలన నాయా ప్రాణుల జఠరములందు నెలకొల్పబడి వైశ్వాసరూపమున దేవ - అసుర-నరులను తృప్తిపఱచుచున్నాడు.

ధర్మరాజోథ పితౄణామధిపః సర్వకర్మదృక్‌ | కర్మణాం ఫలదాతాసౌ త్వన్ని యోగాధీశ్వరః. 27

నైరృతో రక్షసామీశో యక్షో విఘ్న వినాశనః | సర్వేషాం ప్రాణినాం కర్మసాక్షీ త్వత్తః ప్రజాయతే. 28

వరుణో యాదసా మీశో లోకపాలో జలాధిపః | త్వదాజ్ఞా బలమాశ్రిత్య లోకపాలత్వ మాగతః 29

వాయుర్గంధవహః సర్వభూతప్రాణన కారణమ్‌ | జాతస్తవ నిదేశేన లోకపాలో జగద్గురుః. 30

కుబేరః కిన్నరాదీనాం యక్షాణాం జీవనాశ్రయః | త్వదాజ్ఞాంతర్గతః సర్వలోకపేషు చ మాన్యభుః 31

ఈశానః సర్వరూద్రాణా మీశ్వరాంతకరః ప్రభుః | జాతో లోకేశవం ద్యోసౌ సర్వదేవాధిపాలకః 32

నమస్తుభ్యం భగవతే జగదీశాయ కుర్మహే | యస్యాంశభాగాః సర్వే హి జాతా దేవాః సహస్రశః. 33

నారదః ఏవం స్తుతో విశ్వ సృజా భగవానాది పూరుషః లీలావలోకమాత్రేణావ్యను గ్రహ మవాసృజనుత్‌. 34

తత్రైవా భ్యాగతం దైత్యం హిరణ్యాక్షం మహాసురమ్‌ | రుంధాన మధ్వనో భీమం గదయా తాడ యద్దరిః. 35

తద్రక్త పంక దిగ్దాం గో భగవానాది పూరుషః | ఉద్దృత్య ధరణీం దేవో దంష్ట్రయాలీలయాప్సుతామ్‌. 36

నివేశ్యలోకనాథేశో జగామస్దాన మాత్మనః | ఏతద్బగవత శ్చిత్రం ధరణ్యుద్దరణం పరమ్‌. 37

శృణుయాద్యః పుమాన్యశ్చ పఠేచ్చరిత ముత్తమమ్‌ | సర్వపాప వినిర్ముక్తో వైష్ణవీం గతిమాప్నుయాత్‌. 38

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ అష్టమస్కంధే ద్వితీయోధ్యాయః

సమవర్తి సర్వసాక్షి కర్మఫలదాత కర్మసాక్షి పితృపతి ధర్మరాజునగు యముడు నీ నియోగముననే జీవుల కర్మానుసారము ఫలము లొసగు చుండును గాదా! రక్షసాంపతి విఘ్న వినాశకుడు యక్షుడు నగు నైఋతుడు సర్వకర్మ సాక్షియగుట నీ వనలనే కదా! జలాధినాధుడగు వరుణుడును నీ యాజ్ఞ వలననే ప్రాణులకు ప్రాణాధారుడై లోకపాలకుడయ్యెను. గంధవహుడు - జగద్గురువగు వాయువు నీ వలననే సర్వభూతములకు ప్రాణాధారమై లోకపాలకుడయ్యెను. యక్షకిన్నరాదుల కధిపతి యగు కుబేరుడు నీ యానతి మేరకు సకల లోకపాలకులలో గౌరవపాత్రుడయ్యెను. ఇక సర్వరుద్రేశుడు - ఈశానుడు అంతకుడు - సకలలోకవంద్యుడగునగు శివుడుసర్వదేవాధినాయకుడువగు నీ కారణముననే లోకవంద్యుడై విలసిల్లుచున్నాడు. ఇన్ని సర్వ శుభలక్షణములు గల జగదీశ్వరుడవు భగవానుడవునగు నీకు నమోవాకములు. నీ యొక్క యంశము వలన నెల్ల దేవతలు లుద్బవించిరి. అట్లు బ్రహ్మచేత నుతింపబడిన యాది పురుషుడగు భగవానుడు తన విలాస వీక్షణమునులతో బ్రహ్మనము గ్రహించెను. అత్తఱి హిరణ్యాక్షడను ఘోర మహాసురుడు త్రోవకడ్డు నిలువబడగా వరాహదేవుడు భీమమగు గదతో నతనిని చావమోదెను. అది వరాహ పురుషుడగు భగవానుని శరీరము దానవుని నెత్తుట తడిసెను. అట్లు వరాహదేవుడు భూమిని నీటి నుండి లీలగ తన కోఱలతో పైకి లేపెను. లోకనాథుడగు వరాహమూర్తి భూమిని యథాస్థానమున నుంచి తన స్థానమున కేగెను. ఇట్లు భగవంతుడు భూమి నుద్దరించుట చిత్రము. ఈ వరాహ చరిత్ర ముత్తమము. దీనిని చదివిన - వినిన మానవుడుసర్వపాపముక్తుడై వైష్ణవ మార్గము బొందును.

ఇది శ్రీ దేవి భాగవత మహపురాణమందలి యష్టమ స్కంధమున ద్వితీయాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters