Sri Devi Bagavatham-2    Chapters   

అష్టమస్కంధః

అథ ప్రధమోధ్యాయః

జనమేజయః: సూర్యచంద్రాన్వయోత్దానాం నృపాణాం స్తఖథా శితమ్‌| చరితం భవతా ప్రోక్తం శ్రుతం తదమృతాస్పదమ్‌. 1

అధునా శ్రోతుమిచ్చామి సా దేవీ జగదంబికా | మన్వంతరేషు సర్వేషు యద్యద్రూపేణ పూజ్యతే. 2

యస్మి న్య స్మిం శ్చవైస్దానే యేన చ కర్మణా | ''శరీరేణ చ దేవేశీ పూజానీయా ఫలప్రదా

యేనైవ మంత్రబీజేన యత్ర యత్ర చ పూజ్యతే'' | దేవ్యా విరాట్స్వరూపస్య వర్ణనం చ యథాతథమ్‌. 3

యోన ధ్యానేన తత్సూ, క్ష్మే స్వరూపే స్యాన్మతే ర్గతిః | తత్సర్వం వద విప్రర్షే యేన శ్రేయోహమాప్నుయామ్‌

వ్యాసః: శృణురాజన్ప్రవక్ష్యామి దేవ్యారాధన ముత్తమమ్‌ | యత్కృతేన శ్రుతేనాపి నరః శ్రేయోత్ర విందతే. 5

ఏవ మేతన్నారదేన పృష్టో నారాయణఃపురా | తసై#్మ యదుక్తవా న్దేవో యోగచర్యా ప్రవర్తకః. 6

ఏకదా నారదః శ్రీ న్పర్యట న్పృథివీ మిమామ్‌ | నారాయణాశ్రమంప్రాప్తో గత ఖేదశ్చ తస్థివాన్‌. 7

తసై#్మ యోగాత్మనే సత్వా బ్రహ్మదేవతనూద్బవః | పర్య పృచ్చదిమం చార్దం యత్పృష్టో భవతానఘ. 8

నారదః దేవదేవ మహాదేవ పురాణపురుషోత్తమ | జగదాధార సర్వజ్ఞ శ్లాఘనీయోరు సద్గుణ. 9

జగతస్తత్త్వ మాప్తుం యత్తన్మే పదయధేప్సితమ్‌ | జాయతే కుత ఏవేదం కుత్రచేదం ప్రతిష్ఠితమ్‌. 10

కుతోన్తం ప్రాప్ను యాత్కాలో కుత్ర సర్వఫలోదయః | కేన జ్ఞాతేన మాయైషా మోహభూర్నాశమాప్నుయాత్‌.

కయార్చయా కింజపేన కింధ్యానేనాత్మహృత్కంజే | ప్రకాశో జాయతే దేవ తమస్యర్కోదయో యథా. 12

ప్రధమాధ్యాయము

భువనకోశము

జనమేజయు డిట్లనెను: ఓ విప్రఋషీ! అమృతమునకు తావలమైన సూర్యచంద్రనవంశజులగు రాజుల సచ్చరిత్ర మును నీనోటచెవులారవింటిని. ఇపుడెల్ల మన్వంతరములందును శ్రీదేవి యేయే రూపములు దాల్చిపూజలందుకొనును? ఏయే స్థానములందేయే కర్మములచే నేయే శరీరములు దాల్చి యారాధింపబడి దేవిఫలము లొసగును. ఏ యే మంత్రబీజములచే జపింపబడును? ఆదేవి విరాట్స్యరూపవర్ణన యెట్టిది? ఎట్టిధ్యానమువలను బుద్ది సూత్రాత్మలో లీనమగును? అంతయును నాకు విపులముగ తేటతెల్ల మొనరింపుము. దానివలన నాకు శుభము గలుగుత. వ్యాసు డిట్లనెను: రాజా! అత్యుత్తమమైన శ్రీదేవ్యారానము గుఱించి చెప్పుచున్నాను. వినుము. అట్టియారాధనముచేసిన-విన్న-కన్నంత-మాత్రన నరుడు సకల శుభములుపడయగలడు. ఇదేవిషయమును గూర్చి మునుపు నారదుడు నారయణునడిగెను. అపుడు యోగవిద్యాప్రవర్తకుడగు విష్ణు వతనికి చెప్పినవి నీకును చెప్పుదును వినుము. పూర్వ మొకప్పుడు నారదుడు యోగాత్మకుడగు పురుషోత్తమునితో నీ వడిగివన విషయము లడిగెను. ఓ దేవదేవా! మహాదేవా! పురాణపురుషోత్తమా!జగదాధారా! సర్వజ్ఞా! పోగడ దగిన సద్గుణముల రాశీ! ఈ ప్రపంచముయొక్క మూలతత్త్వ మెఱిగింపుము. ఈజగమంతయు నెచటినుండి పుట్టును? ఎచట ప్రతిష్ఠింబడి యున్నది? ఇది తుదకెచటలయ మొందును? ఎల్ల కర్మఫలము లెచటినుండి గల్గను? దీని నెఱింగినందువలన మోహకారమగు మాయ నశించగలదు? ఎవరి నర్చించిన నెవరిని జపించిన నెవరిని ధ్యానించిన చీకటి యండు సూర్యోదయమునలె స్వాత్మప్రకాశమగు జ్ఞానము గల్గను?

ఏతత్ప్రశ్నోత్తరం దేవబ్రూహి సర్వ మశేషతః యథాలోక స్తరేద ధతమసం త్వంజసైవ హి. 13

వ్యాస: ఏవం దేవర్షిణా పృష్టః ప్రాచీనో మునిసత్తమః | నారాయణో మహాయోగీ ప్రతీనంద్య వచోబ్రవీత్‌. 14

శృణు దేవర్షివర్యాత్ర జగత స్తత్త్వముత్తమమ్‌ | యేన జ్ఞాతేన మర్త్యోహి జాయతే న జగద్బ్రమే. 15

జగత స్తత్త్వ మిత్యేవ దేవీ ప్రోక్తా మయాపిహి | బుషిభిర్దేవ గంధర్వై రన్యైశ్చాపి మనీషిభిః. 16

సా జగత్సృజతే దేవీ తయా చ ప్రతిపాల్యతే | తయా చ నాశ్యతే సర్వమితి ప్రోక్తం గుణత్రయాత్‌. 17

తస్యాః స్వరూపం పక్ష్యామి దేవ్యాః సిద్దర్షి పూజితమ్‌ | స్మరతాం సర్వపాపఘ్నం కామదం మోక్షదం తథా. 18

మనుః స్వాయంభువ స్త్వాద్యః పద్మపుత్రః ప్రతాపవాన్‌ | శతరూపావతిః శ్రీమాన్సర్వ మన్వంతరాధిపః. 19

స మనుః పితరం దేవం ప్రజాపతి మకల్మషమ్‌ | భక్తా పర్యచత్పూర్వం తమువాచాత్మభూః సుతమ్‌. 20

పుత్త్ర పుత్త్ర త్వయా కార్యం దేవ్యారాధన ముత్తమమ్‌ | తత్ప్రాసాదేన తే తాత ప్రజాసర్గః ప్రసిద్ద్యతి. 21

ఏవముక్తః ప్రజాస్రష్టా మనుః స్వాయంభువో విరాట్‌ | జగద్యోనిం తదా దేవీం తపసాతర్పయ ద్విభుః. 22

తుష్టావ దేవీం దేవేశీం సమాహితమతిః కిల | అద్యాం మాయాం సర్వశక్తిం సర్వకారణకారణామ్‌. 23

మనురువాచ: నమోనమస్తే దేవేశి జగత్కారణకారణ | శంఖ చక్రగదహస్తే నారాయణ హృదాశ్రితే. 24

దేవా! నా యీ ప్రశ్నముల కన్నిటికి పూర్తిగ సమాధానము లిమ్ము. వానివలన వేగముగ లోకములన్నియు నజ్ఞాన తమస్సునుండి విడిపడును. అని దేవర్షి ప్రశ్నింపగా పురాణమునిసత్తముడు మహాయేగియగు నారయణుడానందభరితుడై యతని కిట్లు పలికెను: ఓయి దేవఋషీ! ఈ జగముయొక్క మూలతత్త్వము వినుము. దాని నెఱుంగుటవలన మానవుడు తిరిగి జగద్బ్రాంతిలో పడడు. ఈ జగత్తు మూలతత్త్వముగూర్చి నాతో దేవియే స్వయముగ మున్ను చెప్పినది. దేవ-ఋషి-గంధర్వ-మనీషులును నాతో చెప్పిరి. ఈజగమును దేవియే త్రిగుణము లాధారముగ చేసికొని పుట్టించును. పెంచును. తుద కామెయే సర్వము నశింపజేయును. దేవి దివ్వస్వరూపమును మహర్షులు-సిద్దులు వర్ణించి పూజించి చెప్పిరి. ఆస్వరూపమును స్మరించినంతనే పాపములు తొలగును. కామమోక్షములు గలుగును మొట్టమొదటి బ్రహ్మపుత్రుడు స్వాయంభువ మనువు. ఆతడు ప్రతాపవంతుడు. మన్వంతరాధిపతి-శతరూపాపతి-శ్రీమంతుడు. మనువు కల్మషరహితుడు ప్రజాపతియుగు తన పితృదేవుని భక్తితో సేవింపగ బ్రహ్మ తన కుమారున కిట్లనెను: ఓయి వత్సా! నీవు పవిత్రయు-సర్వోత్తమయునగు దేవి నారాధించుము. ఆమె దయవలన నీకు ప్రజాసృష్టి గల్గించు శక్తి గల్గును. అని బ్రహ్మపలుకగ స్వాయం భువ విభుడు జగత్కారణురాలగు జగదంబను గూర్చి తపముచేసి యామెను సంతోషపఱచెను. అతడు నిశ్చలమతితో సర్వ కారణకారణ-సర్వశక్తి-సమష్టిబ్రహ్మశక్తి-అద్య-దేవేశియగుదేవి నిట్లు నుతించెను. ఓ జగత్కారణకారణదేవీ! దేవేశ్వరీ! శంఖచక్రగదాహస్తా! నారాయణహృదయ కమలవాసినీ! నీకు తకోటి నమస్సులు.

వేదమూర్తే జగన్మాతః కారణస్థానరూపిణి | వేదత్రయ ప్రమాణజ్ఞే సర్వదేవనుతే శివే. 25

మహేశ్వరి మహాభాగే మహామాయే మహోదయే | మహాదేవ ప్రియావాసే మహాదేవ ప్రియంకరి. 26

గోపేంద్రస్య ప్రిరియే జ్యేష్ఠే మహానందే మహోత్సవే | మహామారీభయహరే నమోదేవాది పూజితే. 27

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్దసాధికే | శరణ్య త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే. 28

యతశ్చేదం యయావిశ్వ మోతంప్రోతం చ సర్వదా | చైతన్య మేవ మాద్యంతరహితం తేజసాం నిధిమ్‌. 29

బ్రహ్మా యదీక్షణా త్సర్వం కరోతిచహరిఃసదా | పాలయత్యపి విశ్వేశః సంహర్తా యదను గ్రహాత్‌. 30

మధుకైటభ సంభూత భయార్తః పద్మసంభవః | యస్యాఃస్తవేన ముముచే ఘోరదైత్యభవాంబుధేః. 31

త్వం హ్రీః కీర్తిః స్మృతిః కాంతిః కమలా గిరిజా సతీ | దాక్షాయణీ వేదగర్బా బుద్దిదాత్రీ సదాభయా 32

స్తోష్యే త్వాం చ నమస్యామి పూజయామి జపామి చ | ధ్యాయామి భవయే వీక్షే శ్రోష్యేదేవి ప్రసీద మే. 33

బ్రహ్మ వేదనిధిః కృష్టో లక్ష్మ్యావాసః పురందరః | త్రిలోకాధిపతిః పాశీ యాదసాంపతి రుత్తమః. 34

కుబేరో నిధినాథో భూద్యమోజాతః పరేతరాట్‌ | నెఋతో రక్షసాం నాథః సోమో జాతో హ్యపోమయః. 35

త్రిలోకవంద్యోలోకేశి మహామాంగల్యరూపిణి | నమస్తేస్తు పునర్బూయోజగన్మాతర్న మోనమః. 36

ఓ జగన్మాతా! కారణ స్దాన రూపిణి! శివా! సర్వ దేవ సన్నుతా! వేదత్రయ ప్రమాణజ్ఞా! వేదమూర్తీ! నీకు శతకోటినమస్సులు. మాహేశ్వరీ! మాహాభాగా! మహామాయా! మహోదయా! మహాదేవ ప్రియంకరీ! మహాదేవప్రేయసీ! నీకు శతకోటి నమస్సులు. గోపేంద్రప్రియా! జ్యేష్టాదేవీ! మహానందా! మహోత్సవా! మహామాయా! భయహరీ! దేవాదిపూజితా! నీకు శతకోటి నమస్సులు. సర్వమంగల మాంగల్యా శివా! సర్వార్థసాధికా! శరణ్యా! త్య్రంకదేవీ! గౌరీ! నారాయణీ! నీకు శతకోటి నమస్సులు. ఈ విశ్వమంతయు నెవరి వలన నుత్పన్నమై ఎవరితో పడుగు పేకలతో వలె నిత్యము నిండియుండునో ఏది దివ్య చైతన్యపుంజమో యెద్ది తేజో విధానమో యెద్ది యాద్యంతరహితమో ఏ దేవీ కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగము లన్నిటిని పుట్టించునో హరి పాలించునో రుద్రడు సంహరించునో పద్మసంభవుడును మధుకైటభ భయపడితుడునగు బ్రహ్మ యే దేవిని సన్నుతించి ఘోర దానవ భయము పాసెనో అట్టి దేవిని హ్రీ-కీర్తి-స్మృతి-కాంతి-కమల-గిరిజ-సతి-దాక్షాయణి-వేదగర్బ-బుద్థిదాత్రి-అభయవు నీవే! ఓశ్రీమాతా! నీకు శతకోటి నమస్సులు. నేను నిన్నే పూజించి -జపించి-ధ్యానించి-భావించి వీక్షించి-విని-సుతింతును. దేవీ! నాయెడల ప్రసన్ను రాలవు గమ్ము బ్రహ్మవేదములకు నిధి; విష్ణువు లక్ష్మీ నిలయుడు; ఇంద్రుడు త్రిలోకపతి; వరుణుడు జలాధినేత; కుబేరుడు నిధులకునాధుడు; యముడు ప్రేతపతి; నైఋతుడు రక్షోదక్షుడు; సోముడు జలమయుడు; వీరెల్లరు నీ వలన నున్నత పదవులందిరి. జగన్మాతా! నీవు త్రిలోకవంద్యపు; లోకేశ్వరివి; మహా మాంగల్యస్వరూపిణివి; నీకు శతకోటి నమస్సులు తల్లీ!

నారాయణః ఏవం స్తుతా భగవతీ దుర్గానారాయణీ పరా | ప్రసన్నా ప్రాహ దేవర్షే బ్రహ్మపుత్రమిదం వచః. 37

వరం వరయు రాజేంద్ర బ్రహ్మపుత్ర యదిచ్చసి | ప్రసన్నాహం స్తవేనాత్ర భక్త్యా చారాధనేన చ. 38

మనురువాచ: యదిదేవిప్రసన్నాసి భక్త్యా కారుణికోత్తమే | తదానిర్విఘ్న తః సృష్టిఃప్రజాయాఃస్యాత్తవాజ్ఞయా. 39

శ్రీదేవ్యువాచః ప్రజాసర్గః ప్రభవతు మమానుగ్రహతః కిల | తదానిర్విఘ్నేన చ రాజేంద్ర వృద్దిశ్చా వ్యుత్తరోత్తరమ్‌. 40

యఃకశ్చి త్పఠతే స్తోత్రం మద్బక్త్యా త్వత్కృతం సదా | తేషాం విద్యా ప్రజాసిద్దిః కీర్తిః కాంత్యుదయః ఖలు. 41

జాయంతే ధనదాన్యాని శక్తిరప్రహతా నృణామ్‌ | సర్వత్ర విజయో రాజ న్సుఖం శత్రు పరిక్షయః. 42

నారాయణః: ఏవం దత్వా వరాన్దేవీమనవే శ్రీబ్రహ్మసూనవే | అంతార్థానం గతా చాసీత్పశ్యత స్యధీమతః. 43

అథ లబ్థవరో రాజా బ్రహ్మపుత్రః ప్రతావవాన్‌ | బ్రహ్మాణ మబ్రవీత్తాతస్దానం మేదీయతాం రహః .44

యత్రాహం సమధిష్ఠాయ ప్రజాః స్రక్ష్యామి పుష్కలాః | యక్ష్యామి యజ్ఞైర్దేవేశం తత్సమాదిశమాచిరమ్‌ 45

ఇతిపుత్త్రవచః శ్రుత్వా ప్రజాపతి పతిర్విభుః | చింతయామాస సుచిరం కథం కార్యం భ##వేదిదమ్‌. 46

సృజతోమే గతః కాలోవిపులోనంత సంఖ్యకః | ధరావార్బిః ప్లుతామగ్నారసంయాతాఖిలాశ్రయః.47

ఇదం మచ్చింతితం కార్యం భగవానాది పూరుషః | కరిష్యతి సహాయోమే యదాదేశేహ మాశ్రితః. 48

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ అష్టమస్కంధే భువనకోశోనామప్రథమోధ్యాయః.

నారాయణు డిట్లనెను: నారదా! అని యిట్లు దుర్గ-భగవతి-నారాయణి దేవిని సన్నుతింతగ దేవిని ప్రసన్నరాలై మనువున కిట్లు పలికెను. బ్రహ్మపుత్రా! రాజేంద్రా! నీ సంస్తవమునకు ప్రసన్నురాలనైతిని. ఏదేని వరమడుగుము. మను విట్లనెను: దయామయా! దేవీ! నా భక్తికి ప్రసన్నవైనచో నీ యానతి వలన నేయడ్డంకులు లేక ప్రజాసృష్టి కొనసాగవలయును. శ్రీదేవి యిట్లనెను: రాజేంద్రా! నాయనుగ్రహము వలన ప్రజాసృష్టి నిర్విఘ్నముగ నుత్తరోత్తరముగ నభివృద్ధి జెందుగాత! నా మీది భక్తితో నీవు స్తుతించిన యీ స్తోత్రము నెవడు పఠించునో యతనికి తప్పక విద్య సంతతి కీర్తి కాంతి గల్గను; రాజా! ఎవరు దేవి దయకు పాత్రులో వారికి ధన ధాన్యములు గల్గను; ఎల్లెడల వారికి విజయము సుఖము గల్గను; శత్రువులు నశింతురు. నారాయణు డిట్లనెను: ఈ విధముగ బ్రహ్మపుత్రుడగు మనువునకు వరము లొసంగి యాధీశాలి చూచుచుండగ దేవి యంతర్దాన మొందెను. రాజా! ఇట్లు బ్రహ్మపుత్రుడగు ప్రతాపి యగు మనువు వరములు బడసి తనకోక ప్రత్యేక సాధన మిమ్మని బ్రహ్మనడిగెను. నే నచ్చటి నుండి పుష్కలముగ ప్రజలను సృజింపగలను; యజ్ఞములతో దేవేశిని గూర్తి వెల్తును; త్వరగ నాకు చోటు చూపుము; ఆజ్ఞాపింపుము. ఆను కూమారుని పలుకులు విని ప్రజాపతియు విభుడునగు బ్రహ్మ యీ పని యెట్లు నెఱవేరునాయని దీరఘముగ నాలోచించెను. ఈ యనంతమైన సృష్టి చేసి నా కనంతకాలము గడచిపోయెను. భూమి నీట మునిగెను; అన్నిటికి జలము సదా ధారమయ్యెను, ఈ నా తలంచిన కార్యము నాది పూరుషుడగు భగవానుడే చేయగలడు. ఎవని యాదేశమున నే నిచట నుంటినో యతడే నాకీ పనిచో తోడుపగలడు.

ఇది శ్రీదేవీభాగవత మహాపురాణ మందలి అష్టమ స్కంధమున భువన కోశమున ప్రధమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters