Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తత్రింశోధ్యాయః

హిమాలయః : స్వీయాం భక్తింవదస్వాంబ యేన జ్ఞానం సుఖేన హి | జాయేత మనుజస్యాస్య మధ్యమస్యా విరాగిణః. 1

దేవ్యువాచ: మార్గాస్త్రయో మే విఖ్యాతా మోక్షప్రాప్తౌనగాధిప | కర్మయోగో జ్ఞానయోగా భక్తియోగశ్చ సత్తమ. 2

త్రయాణా మప్యయం యోగ్యః కర్తుంశక్యోయోస్తి సర్వథా | సులభత్వా న్మానసత్వాత్కాయ చిత్తాద్యపీడనాత్‌. 3

గుణభేదా న్మనుష్యాణాం సా భక్తి స్త్రీవిధామతా | పరపీడాం సముద్దిశ్య దంభం కృత్వాపురఃసరమ్‌. 4

మాత్సర్య క్రోధయుక్తో యస్తత్య భక్తిస్తు తామసీ | పరపీడాదిరహితః స్వకల్యాణార్థ మేవచ. 5

నిత్యం సకామో హృదయం యశోర్థీ భోగలోలుపః |తత్తత్పలసమావాపై#్త్య మాముపాస్తేతి భక్తితః. 6

భేదబుద్ధ్యాతు మాం స్వస్మాదన్యాం జానాతి పామర | సత్యభక్తిః సమాఖ్యాతా నగాధిప తు రాజసీ. 7

పరమేశర్పణం కర్మ పాపసంక్షాళనాయ చ |వేదోక్త త్వా దవశ్యం తత్కర్తవ్యంతుమయానిశమ్‌.8

ఇతి నిశ్చిత బుద్ధి స్తు భేదబుద్ధి ముపాశ్రితః | కరోతి ప్రీతయే కర్మ భక్తిః సా నగ సాత్వికీ. 9

పరభ##క్తేః ప్రాపికేయం భేదబుద్ద్యవలంబనాత్‌ | పూర్వం ప్రోక్తే హ్యుభే భక్తీ న పరప్రాపికే మతే. 10

అధుమా పరభక్తింతు ప్రోచ్యమానాం నిబోధమే | మద్గుణ శ్రవణం నిత్యం మమ నామాను కీర్తనమ్‌. 11

కల్యాణ గుణరత్నానా మాకరాయాం మయి స్థిరమ్‌ | చేతసో వర్తనం చైవ తైలధారా సమంసదా. 12

హేతు స్తు తత్ర కో వాపిన కదాచిద్బవేదపి | సామీప్య సార్షి సాయుజ్య సాలోక్యానాం నచైషణా. 13

మత్సే వాతోధికం కించి న్నైవ జానాతి కర్హిచిత్‌ | సేవ్య సేవకతా భావాత్తత్ర మోక్షం న వాంఛతి. 14

పరానురక్త్యా మామేవ చింతయేద్యో హ్య తంద్రితః | స్వాభే దేనైవ మాం నిత్యం జానాతి న విభేదతః. 15

ముప్పదిఏడవ అధ్యాయము

శ్రీదేవి గీతలు

హిమాలయుడిట్లనెను: అమ్మా ! తీవ్రవైరాగ్యములేని మధ్యమపురుషునకు తేలికగ జ్ఞానము గల్గునట్టి భక్తియోగముగుఱిచి తెలుపుము. దేవి యిట్లనెను. నగరాజా! మోక్షప్రాప్తికి జ్ఞాన-భక్తి-కర్మ యోగములను మూడు మార్గములు ప్రసిద్ధిగాంచినవి.ఈమూటిలోకాయక్లేశము లేక సులభముగ లభించుటచే భక్తి యోగమే సుసాధమైనది. మనుజుల గుణభేదములను బట్టి భక్తి మూడు విధములుగనుండును. దంభాచారముతోపరులకు బాధగల్గించునది తామసభక్తి. ఈ తామసభక్తి మచ్చరముకోపముగల్గి మండిపడుచుండును. ఇక పరపీడలేకున్నను స్వార్థము చూచుకొనట లక్ష్యముగకలది రాజసభక్తి. ఈ భక్తిగలవారు భోగభాగ్యములకు కీర్తికి నాయాఫలప్రాప్తికి నన్ను సకామముగ నుపాసింతురు. నగేశా ! ఇట్లు నన్ను తన కన్యురాలిగ భావించు పామరుని భక్తి రాజసభక్తి యనబడును. కనుక నరుడు తనతొంటి జన్మకోటుల పాపరాసులు పటాపంచలగుటకు వేదసమ్మత ముగ కర్మములును తత్పలితములును కర్తవ్యాతామతితో పరమేశ్వరార్పణ మొసరించవలయును. ఓ నగసత్తమా! ఇంక నన్ను తనకు భిన్ననుగ దలించినను నిశ్చితమతితో నా ప్రీతికై చేయుభక్తి సాత్వికభక్తియగును. ఇందు బేధముండుటనతనది పరాభక్తి కాదు. కానియాసాత్వికభక్తివలన క్రమముగపరాభక్తిసాధ్యయమగును. తామసరాజభక్తులు మాత్రముపరాభక్తిని గల్గింపజాలవు. ఇపుడు పరా నిశ్చల భక్తిని గూర్చి తెల్పుదును. వినుము. నాదివ్య గుణమహిమలు వినుట నాదివ్యనామ సంకీర్తన సల్పుట గుణరత్నములకు నిధినగు నాయుందు చిత్తము నిలిపి తైలధారవలె నన్నే నిత్యము మననము చేయుట నా సామీప్య-సార్షి-సాలోక్య- సాయుజ్యముక్తులందుగాని మఱి ఫలకారణమున గాని ఫలమందుగాని కాంక్షలేకుండట నాదివ్య సేవలుతక్క నితరము గోరుకుండుట సేవ్యసావకభావము వదలి మోక్షమునుసైతము గోరుకుండుట పరానురాగమున నప్రమత్తతతో జితేంద్రియుడై నన్నే చింతించుట నన్ను తన కభిన్నముగ సచ్చిదానంద స్వరూపముగనెఱుంగుట సార్షిటత-

మద్రూ వత్యేన జీవానాం చింతనం కురుతే తు యః | యథా స్వస్యాత్మని ప్రీతిస్తథైవ చ పరాత్మని. 16

చైతన్యస్య సమానత్వా న్న భేదం కురుతే తుయః | సర్వత్ర వర్తమానానాం స్వరూపాణాంచ సర్వదా. 17

నమతే యజతే చైవా ప్యాచాండా లాంత మీశ్వర | న కుత్రాపి ద్రోహబుద్ధిం కురుతే భేదవర్జనాత్‌. 18

మత్థ్సాన దర్శనే శ్రద్దా మద్బక్త దర్శనే తథా | మచ్చాస్త్ర శ్రవణ శ్రద్దా మంత్ర తంత్రాదిషు ప్రభో. 19

మయి ప్రేమాకులమతీ రోమాంచితతనుఃసదా |! ప్రేమశ్రుజల పూర్ణాక్షః కంఠగద్గద నిస్వనః 20

అనన్యేనైవ భావేన పూజయేద్యో నగధిప | మానీవ్వరీం జగద్యోనిం సర్వకారణ కారణమ్‌ 21

వ్రతాని మమ దివ్యాన నిత్యనైమిత్తి కాన్యసి | నిత్యంయుః కురతే భక్త్యా విత్త శాఠ్య వివర్జితః. 22

మదుత్సవ దిదృక్షా చ మదుత్సవకృతి స్తథా | జాయతే యస్య నియతం స్వభావా దేవ భూధర. 23

ఉచ్చైర్గాయం శ్చ నా మాని మమైన ఖలు నృత్యతి | అహంకారాదిరహితో దేహతాదాత్మ్య వర్జితః. 24

ప్రారబ్ధేన యథా యచ్చక్రియతే తత్తథా భ##వేత్‌ | నమే చింతాస్తి తత్రాపి దేహసంరక్షణా దిషు. 25

ఇతి భక్తిస్తు యా ప్రోక్తా పరభక్తి స్తు సాస్మృతా | యస్యాం దేవ్యతిరిక్తం తు న కించిదపి భావ్యతే. 26

ఇత్థం జాతా పరాభక్తి ర్యస్య భూధర తత్త్వతః | తదైవ తస్య చిన్మాత్రే మద్రూపే విలయోభ##వేత్‌. 27

భ##క్తే స్తు యా పరాకాష్ఠా సైవ జ్ఞానం ప్రకీర్తతమ్‌ | వైరాగ్య స్య చ సీమాసా జ్ఞానే తదుభయం యతః. 28

భక్తౌ కృతాయాం యస్యాపి ప్రారబ్ద వశతో నగ | న జాయతే మమ జ్ఞానం మణిద్వీపం స గచ్చతి. 29

తత్ర గత్వాఖిలా న్బో గా నని చ్చ న్న పి చ ర్బతి | తదం తే మమ చిద్రూ పజ్ఞానం సమ్యగ్బవేన్నగ. 30

ఎల్ల జీవులందును నా స్వరూపము చింతంతచుట- తన యాత్మ మీదనున్న ప్రేమ మితరుల యాత్మయందుంచుట ప్రాణులందఱిలో నొకే జీవచైతన్యముండుట వలన నన్నిరూపములను నా కభిన్నముగ చూచుట - ఎవనియందును భేదబుద్ధి ద్రోహబుద్ధి నుంచక చండాలుడు మొదలీశ్వరునివఱ కందఱిని నమస్కరించి గౌరవించుటం నా దివ్య - పుణ్య- తీర్థ క్షేత్రములను భక్తులను దర్శించి సేవించుట యందును నా మంత్రతంత్రములందును నా శాస్త్రశ్రవణము లందును భక్తి శ్రద్దలు- వినయము గల్గియుండుట నా ప్రేమ భక్తిలో వ్యాకులతజెందుట నా నిత్య ప్రేమవలన కన్నులానంద బాష్పములు కురియగ నన్ను తలంచినంతనే యానంద పులకిత చిత్తముతో డగ్గుత్తికతో మాటాడుట - అనన్యభావమున సర్వకారణ-జగత్కారణ- జగదీశ్వరినగునన్నే పూజించుట డబ్బునకు వెనుకముందు లాడక నిత్యమైకాంతిక భక్తితో నిత్యనైమిత్తికమలు నా వ్రతములు సేయుచుండుట నా దివ్య మహాత్సవములు సహజసిద్ధముగ జరుపుటయందు చూచుటయందును కోరిక గల్గియుండుట - అహం కారము మాని దేహాభిమానము పోద్రోలి యొలుగెత్తి నా దివ్య నామములు సంకీర్తించుట నా దేవీ కథా నృత్యములు సేయుట నా ప్రారబ్దమెట్లున్న నట్లే జరుగును. ఈ శరీర పోషణ కింతగ చింతింపగనేల యని తలంచుట ఆత్మ-దేవీ-విచారము దక్క నితర మాలోచింపకుండుట- అనున వన్నియును గల్గియున్న భక్తి పరాభక్తియని పేర్కోనబడును.ఇట్టి నిశ్చలపరాభక్తి యెపుడెవనియందు గలుగునో యపుడదతడు చిన్నాత్రనగునా రూపమందు లీనుడైపోవును. ఇట్టి భక్తికి వైరాగ్యమునకు పరాకాష్ఠ(చివరిదశ)ను జ్ఞానమందురు. ఇట్టి పరాభక్తి గల్గినప్పటికిని ప్రారబ్దవశమున నెవనికి జ్ఞానముగల్గదో యతడు నామణిద్వీపముచేరగలడు. ఓనగోత్తమా ! అతడచట తన కిష్టమున్నను లేకున్నను తేన ముక్తః సదైవ స్యాత్‌ జ్ఞానాన్ముక్తి ర్న చాన్యథా|

ఇహైవ యస్య జ్ఞానం స్యాత్‌ హృద్గత ప్రత్య గాత్మనః. 31

మమ సంవిత్పరతనో స్తస్య ప్రాణా వ్రజంతి న | బ్రహ్మైవ సంస్తదా ప్నోతి బ్రహ్మైవ బ్రహ్మవేద యః 32

కంఠచామీకర సమ మజ్జానాత్తు తిరోహితమ్‌ | జ్ఞానా దజ్ఞాననాశేన లబ్ద మేవ హి లభ్యతే. 33

విదితా విదితా దన్యన్న గోత్తమ వపుర్మమ | యథా೭೭దర్శే తథా೭೭త్మని యథా జలేతథా పితృలోకే. 34

ఛాయాతపౌ యథా స్వచ్చౌ వివిక్తౌ తద్వదేవ హి | మమలోకే భ##వేత్‌ జ్ఞానం ద్వైతభావ వివర్చితమ్‌. 35

యస్తు వైరాగ్యవానేవ జ్ఞాన హీనో మ్రియేత చేత్‌ | బ్రహ్మలోకే వసేన్నిత్యం యావత్కల్పం తతః పరమ్‌. 36

శుచీనాం శ్రీమతాంగేహే భ##వేత్తస్య జనిః పునః | కరోతి సాధనం పశ్చాత్తతో జ్ఞానం హి జాయతే. 37

అనేక జన్మభీ రాజన్‌ జ్ఞానం స్యాన్నైక జన్మనా | తతః సర్వ ప్రయత్నేన జ్ఞానార్థం యత్నమాశ్రయేత్‌. 38

నోచేన్మహా న్వినాశః స్వా జ్జన్మైతదుర్లభం పునః | తత్రాపి ప్రథమే వర్ణే వేదప్రాప్తిశ్చ దుర్లభా. 39

శమాదిషట్క సంపత్తిర్యోగసిద్ది స్తథైవ చ | తథోత్తమ గురు ప్రాప్తిః సర్వమేవాత్ర దుర్లభమ్‌. 40

తథేం ద్రియాణాం పటుతా సంస్కృతత్వం మనోస్తథా | అనేక జన్మపుణ్యౖస్తు మోక్షేచ్ఛా జాయతే తతః. 41

సాధనే సఫలేప్యేవం జాయమానేపి యో నరః | జ్ఞానార్థం నైవ యతతే తస్య జన్మ నిరర్థకమ్‌. 42

తస్మా ద్రాజ న్యథాశక్త్యా జ్ఞానార్థం యత్న మాశ్రయేత్‌ | పదే పదేశ్వమేధస్య ఫలమాప్నోతి నిశ్చితమ్‌. 43

ఘృత మివ పయసినిగూఢం భూతేభూతే చవసతి విజ్ఞానమ్‌ | సతతం మన్థయితవ్యం మనసా మంథా నభూతేన. 44

జ్ఞానం లబ్ద్వా కృతార్థంః స్వాదితి వేదాంతడిండిమః | సర్వముక్తం సమాసేన కిం భూయః శ్రోతుమిచ్చసి. 45

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే దేవీగితాయాం సప్తత్రింశోధ్యాయః.

అపుడే యతడు ముక్తుడగును. జ్ఞానమువలననే కాని మరిదేనివలనను ముక్తిగల్గదు. హృదయమందలి ప్రత్యగాత్మ జ్ఞానము గలవాని ప్రాణములు లేచిపోవు. అటులే నా దివ్యజ్ఞాన స్వరూప మెఱిగినవాని ప్రాణములను లేచిపోవు. అవి వాని శరీరమందే లయమొందును. అతడు బ్రహ్మవిదుడు కనుక బ్రహ్మమే యగును. నరుడు భ్రమవలన తన మెడలోని హారమును తానే మఱిచిపోవును కాని జ్ఞానము గల్గిన పిమ్మట భ్రాంతి తొలగి యది తన మెడలోనే యున్నదని తెలిసికొనును. ఓ గిరీశా ! కంటికి కనంబడు వస్తువుల కంటెను కనబడని మాయ కంటెనూ నా స్వరూపము వేరైనది. అతీతమైనది. అద్ధమందున జలము నందున ప్రతిబింబము దోచు రీతిగ పితృలోక మందున సైతమాత్మ తేజము ప్రతిభాసించును. వెలుగు నీడల రూపము లెటుల కంటికి తేటగ కనింపిచునో యటులే ద్వైతములేని నా దివ్యలోకమున జ్ఞానజ్యోతి ప్రకాశించును. వైరాగ్యము గల్గినప్పటికిని జ్ఞానము లేనివాడు చచ్చిప్రళయము వఱకు బ్రహ్మలోక మందు వసించును. ఈ పిదప శ్రీ మంతులు పుణ్యవంతులునగు వారి యిండ్లలో పుట్టి సాధన చేసి చేసి బ్రహ్మజ్ఞానము బడయగలడు. ఓ గిరిరాజా! వేయేల ! ఎన్నో జన్మ కోటులకు గాని జ్ఞానము గలుగదు. జ్ఞానమొకే జన్మలో వచ్చి ఒడిలో పడునది గాదు. కనుక సాధకుడు తన కోపినంతవఱకు ప్రయత్నించి జ్ఞాన మొందువలయును. కానిచో గొప్ప యనర్థము చుట్టుకొనును. ఎందులకనగా నీ మానవ జన్మము వచ్చుట కడుంగడు దుర్లభము. అందును బ్రహ్మణత్వము మఱి వేద ప్రాప్తియును దర్లభతరములు. శమాది షట్క సంపద - యోగసంసిద్ధి-ఉత్తమ గురుప్రాప్తి ఇవన్నియును దుర్లభతమములు. ఇంద్రియ నిగ్రహము- చిత్తసంస్కారము మిక్కిలి దుర్లభములు. అటు పిమ్మట నెన్నో పూర్వ జన్మల పుణ్యఫలమున గాని మోక్షేచ్చ గలుగదు. ఈ శరీర మున్నపుడే సాధన చేసిన ఫలము లభించును. కానియింతటి శరీరము గల్గియునుజ్ఞానమునకు ప్రయత్నించని వాని జన్మము వ్యర్థము. కనుక ఓ శీతనగేశా ! యథాశక్తి జ్ఞాన సంపాదనమునకు ప్రయత్నింపవలయును. అట్టివానికి ప్రతియడుగున తప్పక అశ్వమేధఫలము చేకూరును. పాలయందు నేయి యున్నట్లు ప్రతి పాణి యందును విజ్ఞానపువెల్గుగలదు. దానిని మనస్సెనెడు కవ్వముతో నాత్మ విచారముతో మథించవలయును. కేవల మొక జ్ఞానము వలననే జన్మ తరించి ధన్యత గాంచునని వేదాంతభేరి మ్రోగు చున్నది. ఇటుల నీ కంతయును సంక్షేపముగ తెలిపితిని. ఇంకేమి వినవలతువో తెలుపుము.

ఇది శ్రీదేవీభాగవత మహాపురాణ మందలి సప్తమ స్కంధమున దేవీగిత యందు ముప్పదేడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters