Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకత్రింశోధ్యాయః

జనమేజయః ధరాధరాధీశ మౌలా వావిరాసీ త్పర్‌ మహః | యదుక్తం భవతా పూర్వం విస్తరాత్తద్వదస్వమే. 1

కో విరజ్యేత మతిమాన్పిబన్‌ శక్తికథా మృతమ్‌ | సుధాంతు పిబతాం మృత్యుః సనైతచ్ఛృణ్వతో భ##వేత్‌. 2

వ్యాసః : ధన్యోసి కృతకృత్యో సి శిక్షితో7సి మహాత్మభిః | భాగ్యవానసి యద్దేవ్యాం నిర్వ్యాజాభక్తి రస్తితే. 3

శృణు రాజ న్పురా వృత్తం సతీదేహేగ్ని భర్జితే | భ్రాంతః | శివస్తు బభ్రామ క్వచిద్దేశే స్థిరోభవత్‌. 4

ప్రపంచభాన రహితః సమాధిగత మానసః | ధ్యాయ న్దేవీస్వరూపం తు కాలం నిన్యే స ఆత్మవాన్‌.5

సౌభాగ్య రహితం జాతం త్రైలోక్యం సచరాచరమ్‌ | శక్తిహీనం జగత్సర్వం సాబ్దిద్వీపం సపర్వతమ్‌. 6

ఆనందః శుష్కతాం యాతః సర్వేషాం హృదయాంతరే | ఉదాసీనాః సర్వలోకా శ్చింతాజర్జర చేతసః 7

సదాదుఃఖో దధౌ మగ్నా రోగగ్రస్తా స్తదాభవన్‌ | గ్రహాణాం దేవతానాంచ వైపరీత్యేన వర్తనమ్‌ 8

అధిభూతాధి దేవానాం సత్యభావా న్నృపాభవన్‌ | అథాస్మిన్నేవ కాలే తు తారకాఖ్యో మహాసురః 9

బ్రహ్మదత్తవరో దైత్యో భవత్రైలోక్యనాయకః | శివౌరస స్తు యః పుత్రః సతే హంతా భవిష్యతి. 10

ఇతి కల్పితమృత్యుః స దేవదేవై ర్మహాసురః | శివౌరససుతాభావాజ్జగర్జ చ ననంద చ. 11

తేన చోపద్రుతాః సర్వే స్వస్థానా త్ర్పచ్యుతాః సురాః | శివౌరససుతాభావాచ్చింతా మాపు ర్దురత్యయామ్‌. 12

నాంగనా శంకరస్యాస్తి కథం తత్సుతసంభవః | అస్మాకం భాగ్యహీనానాం కథం కార్యంభవిష్యతి. 13

ముప్పది ఒకటవ అధ్యాయము - శ్రీ దేవీ గీతలు

జనమేజయ డిట్లనెను : ఓ మునివరా| పరమ మహస్సగు శ్రీదేవి హిమగిరి శిఖరముపై నవతరించెనని మున్ను నీవు తెలిపితివి. దానిని విశదముగ తెలియపలుకుము. అమృతము త్రాగువానికి చావు వచ్చును. కాని శ్రీదేవీ దివ్యశక్తి కథారసామృతముగ్రోలు ధీశాలికి చావులేదు. అతని కెంత గ్రోలినను తృప్తి గల్గదు. వ్యాసు డిట్లనియెను.ః రాజా! నీవు ధన్యతముడవు-పుణ్యశాలివి. పెద్దనివలన బుద్ధి నేర్చినవాడవు. కనుకనే నీకు శ్రీదేవీ పదపద్మములందు నిశ్చలభక్తి కుదిరినది. రాజా ! అవధరింపుము. మున్నటుల నగ్నిలో సతీదేవి దగ్ధకాగా శివుడు వ్యాకులచిత్తముతో తిరిగివిసిగితుద కొకచోనుండెను. ఆయన సంసార వివిధ విషయములు విడనాడి సమాధిలో శ్రీ దేవీ స్వరూపమును ధ్యానించుచు కాలము గడువుచుండెను. అపుడు చరాచర ప్రపంచమంతయు కళాసౌభాగ్యములు కోల్పోయెను. గిరులు-సంద్రములు-దీవులు శక్తిహీనము లయ్యెను. ఎల్లర హృదయములందలి యానందరేఖలును సమసిపోయెను. ఎల్లలోకములు చింతాగ్రస్తములై దిక్కుమాలి యుండెను. అవి దుఃఖ సాగరమున మునిగి రోగగ్రస్తములయ్యెను. ఎల్ల సురలును-గ్రహములను గతులు తప్పిరి. రాజా! ఇదంతయును శ్రీసతీదేవి లేని కారణముననే జరిగెను. అట్టి చెడుకాలమున తారకుడను మహాసురుడు పుట్టెను. అతడు బ్రహ్మవలన వరముల బడసి త్రిలోకములకు నాయకుడయ్యెను. శివుని కన్న కొడుకు నిన్ను చంపగలడని బ్రహ్మయతనితో ననెను. ఇట్లు తారకుని చావు నీర్ణీతమయ్యెను. అప్పటికి శివునకు కుమారుడు డలుగనందున తారకు డహంకారముతో విఱ్ఱవీగుచుండెను. అతని మహోప ద్రవముల కెల్ల దేవతలును స్థానభ్రష్ఠులైరి. శివునకు కన్నకొడుకు లేమింపజేసి వారు చింతాక్రాంతులైరి. శంకరునకు భార్యయే లేదుగదా! కొడుకెట్లు గల్గును.? మన మెంతటి దురదృష్ట వంతులము. ఇక మనపని యెట్లు నెఱవేరగలదు.?

ఇతి చింతాతురాః సర్వే జగ్ముర్వైకుంఠ మండలే | శశంసుర్హరి మేకాంతే సచోపాయం జగాద హ. 14

కుత శ్చింతాతురా.ః సర్వే కామకల్పద్రుమా శివా | జాగర్తి భూవనేశానీ మణి ద్వీపాధి వాసినీ. 15

అస్మాక మనయా దేవ తదుపేక్షాస్తి నాన్యథా | శిక్షైవేయం జగన్మాతా కృతాస్మ చ్చిక్షణాయ చ. 16

లాలనే తాడనే మాతు ర్నాకారుణ్యం యథార్బకే | తద్వదేవ జగన్మాతు ర్నియంత్రీ గుణదోషయోః 17

అపరాథో భవత్యేవ తనయస్య పదేపదే | కోపరః సహతే లోకే కేవలం మాతరం వినా. 18

తస్మాద్యూయం పరాంబాం తాం శరణం యాత మాచిరమ్‌ | నిర్వ్యాజయా చిత్తవృత్త్యాసా వః కార్యం విధాస్యతి. 19

ఇత్యాదిశ్య సురాన్సర్వా న్మహావిష్ణుః స్వజాయయా| సంయుతో నిర్జగామాశు దేవైః సహ సురాధిపః 20

ఆజగామ మహాశైలం హిమవంతం నగాధిపమ్‌ | అభవంశ్చ సురాః సర్వే పురశ్చరణ కర్మిణః 21

అంబా యజ్ఞా విధానజ్ఞా అంబాయజ్ఞంచ చక్రిరే | తృతీయాది వ్రతన్యాశు చక్రుః సర్వే సురా నృప. 22

కేచి త్సమాధి నిష్ణాతాః కేచిన్నాదు పరాయణాః | కేచిత్సూక్త పరాః కేచి న్నామ పారాయణోత్సుకాః. 23

మంత్రపారాయణ పరాః కేచి చ్ర్ఛాద్ధాధి కారిణః | అంతర్యాగ పరాః కేచి త్కేచిన్న్యాస పరాయణాః 24

హృల్లేకయా పరాశ##క్తేః పూజాం చక్రు రతంద్రితాః | ఇత్యేవం బహువర్షాణి కాలోగా జ్జనమేజయ. 25

అకస్మాచ్ఛైత్రమాసీయ నవమ్యాం చ భృగోర్దినే | ప్రాదుర్బభూవ పురతస్తన్మహః శ్రుతిబోధితమ్‌. 26

అని తలపోయుచు వేల్పులు వైంకుఠ మేగి యేకాంతమున హరికి సర్వము నివేదించిరి. అంత హరి వారి కొకయుపాయము చెప్పెను. మీరెల చింతింతురు? శివా భవాని కామకల్పతరువు-మణిద్వీపనివాసిని-భువనేశ్వరి. ఆమె మనపాలగలదు. దేవి- జగదేకమాత. మనకు బుద్ది చెప్పుటకొఱకే మన బాధలు గనియు నామె పట్టించుకొనకున్నది. అంతేకాని వేరేమియు గాదు. తల్లి తన పిల్లవానిని కొట్టునప్పుడును లాలించునప్పడును దయమాలి యుండదు. అటులే యీ జగన్ని యంత్రి మనము చేయు తప్పోప్పులకు దయమాలి యుండదు. అడుగడుగునకు కొడుకు తప్పులు చేయుచునే యుండును. వాని నెల్ల తల్లిగా కితరు లెవ్వరీ లోకమున సైచి యుండగలరు.కనుక మీరెల్లరును జాగుసేయక పరాంబికను పొపపొచ్చెములేని చిత్తముతో శరణువేడుడు. ఆమె మీ పనులన్నిటిని చక్కపఱచగలదు. అని వాక్రుచ్చి సురాధిపతియగు మహా విష్ణువు తన భార్యను వెంటగొని దేవతలనుగూడి బయలుదేరెను. విష్ణువు పర్వతరాజు మహాశైలమునగు హిమగిరి కేగెను. అట దేవత లెల్లరును దేవీమంత్ర పురశ్చరణ చేయసాగిరి. అంబాయాగ విధాన మెఱింగిన వా రంబాయాగము సాగించిరి. కొందఱు తృతీయాది వ్రత మాచరించుచుండిరి. మఱికొంద ఱంబను గూర్చి సమాధి నిమగ్నులైరి. ఇంకను కొందఱు శ్రీదేవీ నామజప పరాయణత్వమున నుండిరి. కొందఱు దేవీసూక్తము పఠించిరి. కొందఱు నవార్ణమంత్రము జపింపసాగరి. కొందఱు క్బచ్ర్చ చాంద్రాయణ వ్రతము సాగించిరి. కొంద ఱంతర్యాగపరులు. కొందఱు న్యాసపరులైరి. కొందఱు నిశ్చల ముగ పరాశక్తి యంత్రము పూజింపసాగిరి. జనమేజయా! ఈ విధానమున పెక్కేండ్లకాలము గడిచెను. ఆ దయామతల్లిని దర్శించి దేవత లెల్లరును నమస్కరించి అంతట నొక యేటి చైత్ర శుద్ద నవమీ శుక్రవారమునాడు వేదసమ్మతమగు పరంజ్యోతి వారి యెట్టయెదుట ప్రత్యక్షమయ్యెను.

చతుర్దిక్షు చతుర్వేదైర్మూర్తిమద్బి రభిష్టుతమ్‌ | కోటిసూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలమ్‌. 27

విద్యుత్కోటి సమానాభ మరుణం త త్పరం మహః | నైవ చోర్ద్వం న తిర్యక్చ న మధ్యే పరిజగ్రభత్‌. 28

ఆద్యంతరహితం తత్తు న హస్తాద్యంగసంయుతమ్‌ | నచ స్త్రీరూప మథవా నపుంరూప మథోభయమ్‌. 29

దీప్త్యా పిధానం నేత్రాణాం తేషా మాసీన్మహీ పతే | పునశ్చ ధైర్య మాలంబ్య యావత్తే దదృశుః సురాః. 30

తావత్తదేవ స్త్రీరూపే ణాభాద్దివ్యం మనోహరమ్‌ | అతీవ రణీయాంగీం కుమారీం నవ¸°వనామ్‌. 31

ఉద్యత్పీనకుచద్వంద్వ నిందితాంభోజ కుట్మలమ్‌ | రణత్కింకిణికాజాల శింజన్మంజీర మేఖలామ్‌. 32

కనకాంగదకేమూరగ్రైవేయక విభూషితామ్‌ | అనర్ఘ్యమణి సంభిన్నగలబంధ విరాజితామ్‌. 33

తను కేతక సంరాజ న్నీల భ్రమర కుంతలామ్‌ | నితంబబింబ సుభగాం రోమరాజి విరాజితామ్‌. 34

కర్పూరశకలోన్మి శ్ర తాంబూలాపూరి తాననామ్‌| కనత్కనకతాటం కవిటంకవదనాంబుజామ్‌. 35

అష్టమీ చంద్రబింబాభలలాటా మాయతభ్రువమ్‌ | రక్తారవిందనయనా మున్నసాం మధురాధరామ్‌. 36

కుందకుట్మల దంతాగ్రాం ముక్తా హారవిరాజితమ్‌ | రత్న సంభిన్నముకుటామింద్ర రేఖావతంసినీమ్‌. 37

మల్లికామాలతీమాలా కేశపాశవిరాజితామ్‌ | కాశ్మీరబిందునిటలాం నేత్ర త్రయ విలాసినీమ్‌. 38

దేవి తేజము దెసల రూపుదాల్చిన నాల్గు వేదములచేత సన్నుతింపబడుచుండెను. కోటి సూర్యుల ప్రభలతో విరాజిల్లుచుండెను. నిండు పున్నమ జాబిలి కోటుల చల్లందనముతో నొప్పుచుండెను. ఆ తేజము కోటి మెఱపు తీగెలోక్కటై తళుక్కుమన్నట్లు మెఱసెను. అరుణారుణ కాంతులు వెలార్చుచుండెను. పైని-క్రింద-నడుమ-అడ్డము అను బేధములేకెల్లెడల వెల్గులు చిమ్ముచుండెను. ఆ మహా మహస్సునకు మొదలు- చివర- చేతులు మున్నగు నంగములు లేవు. స్త్రీ-పుం-నపుంసకతా బేదములులేవు. -రాజా! అట్లు వెల్గుచున్న పరమ రమణీయ శోభను దర్శించగనే దేవతల కన్నులు చూడలేక మూతలు పడెను. మరలవారు ధైర్యమవలంబించి చూచిరి. అంతలోనా దివ్యతేజోరాశి మొత్తమొక దివ్వమనోహర స్త్రీ రూపమున చెన్ను దలిర్చెను. ఆమెరమణీయాంగి-కుమారి-నవ ¸°వన- యైయొప్పెను. ఈ మాతృదేవికి తమ్మిమొగ్గలను దెగడ గబ్బిబిగి గుబ్బల జంట గలదు. కిణకిణమను కింకిణుల మంజుల రావమున నినదించు మంజీర మేఖల గలదు. దేవి బంగారుటంగద - కేయూర గ్రైవేయ భూపలచేత నలకరింపబడెను. దేవి గళసీమలో విలువైన జాతి మణుల వివిధ హారకాంతులు దీపించుచుండెను. ఆమె ముంగురులలో తుఱిమిన కేతకీ సుమముల సువాసనలకు గండు తుమ్మెదలు ఝమ్మనుచుండెను. ఆమె సోబగైన పిఱు దులతో నందనమైనది. నూగారు వరుసతో శోభిల్లు చుండెను. ఆమె కప్పురము వేసిన తాంబులములతో నొప్పు ముఖము గలది. ప్రకాశించుచున్న బంగారు తాటంకములచే చెన్నొందు ముఖ కమలము గలది. ఆమె యష్టమినాటి చందురునిబోలు నొసలు గలది. పొడవు వెడల్పైన కన్బోమలు-ఎఱ్ఱని కమలనయనయములు-ఎత్తగు ముక్కు -మధురాధరము గలది. దేవి దంతముల చివరలు కుందముల మొగ్గలు- మంచి ముత్తెముల హారము నవరత్న వజ్రములు పొదిగిన కిరీటముగల్గి ఇంద్రరేఖ యాభరణ ములు గల్గి యుండెను. ఆమె కేశపాశములు మల్లికా- మాలతీ సుమముల హారాలతో గుబాళించెను.

పాశాంకుశవరాభీతి చతుర్బాహుం త్రిలోచనామ్‌ | రక్త వస్త్రపరీధానాం దాడిమీకుసుమ ప్రభామ్‌. 39

సర్వశృంగారవేషాడ్యాం సర్వదేవనమస్కృతామ్‌| సర్వాశాపూరికాం సర్వమాతరం సర్వమోహినీమ్‌. 40

ప్రసాదసుముఖీ మంబాం మందస్మీత ముఖాంబుజామ్‌ | అవ్యాజకరుణామూర్తిం దదృశుః పురతః సురా. 41

దృష్ట్వా తాం కరుణా మూర్తిం ప్రణముః సకలాః సురాః |

వక్తుం నా శక్నువ న్కించి ద్బాష్ప సంరుద్ద నిః స్వనాః. 42

కథంచి త్థ్సై ర్య మాలంబ్య భక్త్యా చానత కంధరాః | ప్రేమాశ్రు పూర్ణనయనా స్తుష్టువు ర్జగ దంబికామ్‌. 43

దేవా ఊచుః నమో దేవ్యై మహాదేవ్యై వివాయై సతతం నమః |

నమః ప్రకృత్యై భద్రా యై నియతాః ప్రణతాః స్మతామ్‌. 44

తానగ్ని వర్ణాం తపసాజ్వలం తీం వైరోచనీం కర్మ ఫలేషుజుష్టామ్‌ |

దుర్గాం దేవీం శరణ మహం ప్రసద్యే సుతరసి తరసే నమః 45

దేవీం వాచమజనయంత దేవా స్తాం విశ్వరూపాః వశవో వదం తి |

సా నో మంద్రేష మూర్జం దుహానా ధేను ర్వాగస్మా నుపసుష్టుతైతు. 46

కాలరాత్రీం బ్రహ్మస్తుతాం వైష్ణవీం స్కందమాతరమ్‌ |

సరస్వతీ మదితిం దక్షదు హితరం నమామః పావనాం శివామ్‌. 47

మహాలక్ష్మ్యై చ విద్మహే సర్వశ##క్త్యై చ ధీమహి | తన్నో దేవీ ప్రచోదయాత్‌. 48

నమో విరాట్స్వ రూపిణ్యౖ నమః శ్రీ బ్రహ్మమూర్తయే | నమోవ్యాకృతరూణిణ్యౖ నమః సూత్రాత్మమూర్తయే. 49

యదజ్ఞానా జ్జగద్బాతి రజ్జు సర్పస్రగాదివత్‌ | యత్‌ జ్ఞానాల్లయ మాప్నోతి నుమస్తాం భువనేశ్వరీమ్‌. 50

ఆమె కస్తూరీ తిలకమున నలరారు నెన్నుదురుగల్గి మూడు కన్నులు గలది. ఆమె రక్త వస్త్రముదాల్చి దానిమ్మపూవువలె ప్రభలు జిమ్ముచుండెను. నాల్గు చేతులందు పాశ-అంకుశ-వర-అభయములు గలది. ముక్కంటి. ఈ విధముగ దేవి సకల శృంగార వేషములు దాల్చి సర్వ దేవతలచేత నమస్కరింపబడు విశ్వమాత- సర్వమోహిని-ఎల్ల దిక్కులనిండు కాంతిగలది. ఇట్టిదయామయి-సుముఖి-చిర్నగవులు చిందించు ముఖకమలము గలది- అవ్యాజ ప్రేమదయామూర్తి- యగు మాతృదేవిని సురలు తమ యెదుట సందర్శించిరి. ఆ దయామతల్లిని దర్శించి దేవత లెల్లరును నమస్కరించిరి. వారికనులనిండ నందబాష్ఫములు నిండగ నోట మాట రాకుండిరి. నారు తుదకెట్టులో గుండె చిక్కబట్టుకొని భక్తి వినమ్రతతో తలలు వంచి కన్నుల ప్రేమాశ్రులు నిండార జగదంబను సన్నుతింపసాగిరి. శ్రీదేవి - మహ దేవి - శివ- పరాప్రకృతి - భద్రయగుతల్లికి నిరంతరము తప్పక మేము నమస్సు లర్పింతుము. జ్ఞానులలో హృదయాగ్ని రూపిణి- చైతన్య రాశి-కర్మఫలము లందిపంనెల్లర సేవలందుకొను తల్లి-సంసారతారిణి-తపః సముజ్జ్వలయగు దుర్గకు మనస్సులర్పింతుము. దేనతలు దైవీభషను సృజించిరి. ప్రాణులు దానిని పెక్కరూపముల పేర్కొందురు. అట్టి వాక్‌స్వరూపిణి-కామధేనువు-దేని - మాకన్నాదులుప్రసాదించుగాక.శ్రీకాళరాత్రి-బ్రహ్మస్తుత-వైష్ణవి-స్కందమాత-సరస్వతి-అదితి-దక్షకన్య-పావన-పావన-శివయగు తల్లికి నమస్సు లర్పింతుము. మేము శ్రీమహలక్ష్మిని తెలిసికొనుచున్నాము. అమెను సర్వశక్తిస్వరూపిణిగ ధ్యానించుచున్నాము. అట్టి శ్రీ దేవి మాబుద్దులను ప్రేరించుగాక. శ్రీ విరాట్స్వరూపిణి-సూత్రాత్మమూర్తి- అవ్యాకృత రూపిణి- బ్రహ్మమూర్తియగు తల్లికి నమస్సులర్పింతుము. త్రాటిని చూడగపామను భ్రమ గలునటుల నిన్ను తెలియనందున జగద్ర్బాంతి గల్గును. ఏ దేవి జ్ఞానము జగద్ర్బ తొలగునో యట్టి త్రిభువనేశ్వరికి నమస్సు లర్పింతుము.

నుమ స్తత్పదలక్ష్యార్దాం చిదేకరసరూ పిణీమ్‌ | అఖండా నందరూపాం తాం వేదతాత్పర్య భూమికామ్‌. 51

పంచకోశాతిరిక్తాం తా మవస్థాత్రయ సాక్షిణీమ్‌ | పున స్త్వం పద లక్ష్యర్ధా ప్రత్యగాత్మ స్వరూపిణీమ్‌. 52

నమః ప్రణవరూ పాయై నమో హ్రీంకాముర్తయే | నానా మంత్రాత్మికా యైతే కరుణాయై నమోనమః 53

ఇతి స్తుతా తదా దేవై ర్మణీద్వీపాధివాసిని | ప్రాహ వాచా మధురయా మత్తకో కిలనిః స్వనా. 54

శ్రీదేవ్యువాచః వదంతు విబుధాః కార్యాం యదర్ధ మిహ సంగతాః |

వరదాహం సదాభక్త కామ కల్ప ద్రుమాస్మిక చ. 55

తిష్టంత్యాం మయి కా చింతా యుష్మాకం భక్తి శాలినామ్‌ | సముద్దరామి మద్బక్తా న్దుఃఖ సంసార సాగరాత్‌. 56

ఇతి ప్రతిజ్ఞాం మే సత్యాం జానీధ విబుధోత్తమాః ఇతి ప్రేమాకులాం వాణీం శ్రుత్వా సంతుష్టమానసాః 57

నిర్బయా నిర్జరా రాజ న్నూ చుర్దుఃఖం స్వకీయకమ్‌ | దేవాః నాజ్ఞాతం కించిదప్యత్ర భవత్యాస్తి జగత్త్ర యే. 58

సర్వజ్ఞాయా సర్వసాక్షిరూపిణ్యా పరమేశ్వరి | తారకేణా సురేంద్రేణ పీడితాః స్మోది వానిశమ్‌. 59

శివాంగజా ద్వధస్తస్య నిర్మితో బ్రహ్మణా శివే | శివాంగనా తు నైనాస్తి జానాసి త్వం మహేశ్వరి. 60

సర్వజ్ఞ పురతః కి వా వక్తవ్యం పామరైర్జనైః | ఏత దుద్దేశతః ప్రోక్త మపరం తర్కయాంబికే. 61

సర్వదా చరణాంభోజే భక్తిః స్యాత్తవనిశ్చలా | ప్రార్దనీయ మిదం ముఖ్య మపరం దేహహేతవే. 62

తత్పలక్ష్యాద్గ - చిదేకరసస్వరూపిణి - అఖండానం దరూప - వేదతాత్పర్య భూమికయగు దేవికి నమస్సులర్పింతుము.

పంచకోశాతిరిక్త - అవస్దాత్రయ సాక్షిణి | త్వంపదలక్ష్యార్ద- ప్రత్యగాత్మ స్వరూపిణియగు దేవికి నమస్సులర్పింతుము. ప్రణవ రూప - హ్రుంకారమూర్తి - నానా మంత్రాత్మిక - దయామయియగు దేవికి నమస్సు లర్పింతుము. అని మణి ద్వీపాధినాసినిని దేవత లెల్ల రభినుతించిరి. అంత దేవి మత్తకోకిల కంఠముతో తీయగ వారికిట్లు పలితెను. ఓ దేవతలారా! మీరే మి పని మీద ఇట గుమిదూడితిరి. నేను నిత్యమును వరము లోసంగుదానను. ఎప్పుడును భక్తుల కోర్కులు దీర్చు కల్పకమను నేను మీ యందుండగ మఱి భక్తి పరులగు మీ కిక చెంత యేల ? నేను నా సద్బక్తులను తప్పక దుఃఖసంసార సాగరమునుండి తరింపచేయగలను. ఓ యమరులారా! ఇదే నా సత్యప్రతిజ్ఞ నా యెఱంగుడు. అను దేవి ప్రేమపూర్ణవచనము లాలించి వేల్పులు సంతోషించిరి. రాజా! అపుడు దేవతలు నిరభయముగ తమ దుశఖ మిట్లు తెల్పుకొనిరి. ఓ దేవీ ! ఈ ముల్లోకము లందు నీ వెఱుంగనిది కొంచెమైనను లేదు. పరమేశ్వరీ ! నీవు సర్వజ్ఞవు. సర్వ సాక్షిస్వరూపిణివి. మేము రేయింబవళ్ళు తారకాసురుడు పెట్టు భాదాలు తాళ##లేకునానము. ఓ మహేశ్వరి! వాడు శివున కుద్బవించు కుమారుని వలనగాని చావడని బ్రహ్మ నిర్ధేశించును. శివున కిపుడా భార్యలేదని నీకు తెలియును గదా. సర్వజ్ఞురాలవగు నీ యందు పామరుల మేము పలుక గలము. అంతయును సూక్ష్మముగ దెలిపితిమి. తల్లీ! సర్వము నీవే యెఱుంగుము. నీ దివ్యపదపద్మములం దేమఱక మా చిత్తము నిశ్చలముగ నుండుగాత. శివుని కుమారనికొఱకు నీవు తనువు దాల్చవలయునని మా ప్రార్థన.

ఇతి తేషాం వచః శ్రుత్వా ప్రోవా చ పరమేశ్వరీ | మమ శక్తిస్తు యా గౌరీ భవిష్యతి హిమాలయే. 63

శివాయ సా ప్రదేయా స్యా త్సావః కార్యం విధాస్యతి | భక్తిర్య చ్చరణాంభోజే భూయాద్యుశ్మాక మాదరాత్‌. 64

హిమాలయో హి మనసా మాముపాసే తిభక్తితః | తతస్తస్య గృహే జన్మ మమ ప్రియకరం మతమ్‌. 65

హిమాలయో పి తచ్చ్రుత్వాత్యనుగ్రహకరం వచః | బాషై#్పః సంరుద్దకంఠాక్షో మహీరాజ్ఞీం వచోబ్రవీత్‌. 66

మహత్తరం తం కురుషే యస్యానుగ్రహ మిచ్చసి | నోచేత్క్వాహం జడః స్దాణుః క్వత్వం సచ్చత్స్వరూపిణీ. 67

అసంభావ్యం జన్మశ##త్తైస్త్వ త్పితృత్వం మమానఘే | అశ్వమేధాది పుణ్యౖర్వాపుణ్యౖర్వా తత్శమాధిజైః 68

అద్య ప్రపంతే కీర్తిః స్యా జ్జగన్మాతా సుతాభవత్‌ | అహో హిమాలయస్యాస్య ధన్యోసౌ భాగ్యవానితి. 69

యస్యాస్తు జఠరే సంచి బ్రహ్మాండానాం చ కోటయః | సైవ యస్య సుతా జాతా కో వా స్యాత్తత్సమో భువి. 70

నజనేస్మత్పితృణాం కిం స్దానం స్యాన్నిర్మితం పరమ్‌ |

ఏతాదృశానాం వాసాయ యేషాం వంశేస్తి మాదృశః 71

ఇదం య ధా దత్తం మే కృపయా ప్రేమపూరణయా | సర్వ వేదాంతసిద్ధం చ త్వ ద్రూపం బ్రూహి మే తధా. 72

యోగం త భక్తిసహితం జ్ఞానం చ శ్రుతిసమ్మతమ్‌| వదస్వ పరమేశాని | త్వమేవా హం యతో భ##వేః 73

ఇతి తస్య వచః శ్రుత్వా ప్రసన్న ముఖపంకజా | వక్తు మారభతాంబా సా రహస్యం శ్రుతిగూతమ్‌. 74

ఇతి శ్రీదేవి భాగవతే మహాపురాణ సప్తమస్కంధే దేవిగీతాయా మేక త్రింశోధ్యాయః

అను వారి వేడుకోలు విని దేవి యిట్ల పలికెను. నా యొక శక్తి హిమాలయముపై గౌరి యన నవతరింపగలను. అమెకు శివునితో పెండ్లియగును. అమె మీ కార్యము సాధింపగలదు. మీకు సతతము నా పదములందు భక్తి నిల్చుగాక! హిమాలయ పతియుము నన్నే పరమ భక్తితో నుపాసించుచున్నాడు. కనుక నతని యింట జన్మమెత్తుట నా క త్యంతము ప్రియముగనున్నది. దేవి ప్రసన్న వాక్కులు విని హిమాచలపతి డగ్గుత్తికచే తొట్రిలు మాటలతో కన్నీట మహారాజ్ఞి కిట్లనెను. ఓ దేవి ! నీవెవనిని అను గ్రహింతువో వానిని మహాపురుషునిగ జేతువు. కానిచో కదలని జడమగు నేనెక్కడ ! సచ్చిదానంద రూపిణివి నీ వెక్కడ! ఓ పావనీ ! నాకు నూఱు జన్మములకైన నీకు తండ్రిగ బుట్టుట సంభవముగాను అశ్వమేధాదుల పుణ్యముననో నీ దివ్య సమాధి పుణ్యముననోకాని యిది సంభవించదు. ఓహో! హిమాలయుడెంచటి ధన్యుడు ! ఎంత దృష్టవంతుడు ! జగన్మాతను తన కుతురుగ బడసెనను కీర్తి జగమందంట వ్యాపించును. ఏ జగజ్జనని గర్బమునందు బ్రహ్మండకోటులు నిండియుండెనో యా తల్లి యొకనికి తనయగ పుట్టుటచే నతనివంటివాడు నేలపై లేడు. నావంటి వాడు తమ వంశములో జన్మించె నని సంతసించి నా పితరు లెంతటి యుత్తమగుతులందుదురో! ఓ మాతా ! నీవు ప్రేమనీరదయతో నా కీ వరమిచ్చిన విధముగ సర్వ వేదాంత ప్రతిపాద్యవగు నీ స్వరూపముము నాకు వివరింపుము. ఓ పరమేశానీ ! భక్తితోడి యోగమును వేద సమ్మతమగు జ్ఞానమును గుఱిచి నాకు తేట పఱచుము. దాని వలన నేను నిన్నే కొల్చుచుండగలను. అ హిమాలయుని మాటలు వినియంబ విప్పారిన ముఖ పద్మముతో వేదాంత రహస్యము గూర్చి వారికి తెల్పుటకిట్లు ప్రారింభించెను.

ఇది శ్రీ దేవి భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున శ్రీదేవీ గీతలందు ముప్పదొకటవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters