Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకోనవింశోధ్యాయః

వ్యాసః : ఇత్యేవం సూర్యవంశ్యానాం రాజ్ఞాం చరిత ముత్తమమ్‌ | సోమవంశోద్బవానాం చ వర్ణనీయం మయా కియత్‌. 1

పరాశక్తి ప్రసాదేవ మహత్త్వం ప్రతిపేదిరే | రాజ న్సు నిశ్చితం విద్ధి పరాశక్తి ప్రసాదతః. 2

యద్యద్విభూతి మ త్స త్త్వం శ్రీమదూర్జిత మేవవా | తత్తదేవావగచ్ఛ త్వం పరాశక్త్యం శసంభవమ్‌. 3

ఏతే చాన్యే చ రాజానః పరాశ##క్తే రుపాసకాః | సంసారతరు మూలస్య కుఠారా అభవ న్నృప. 4

తస్మా త్సర్వప్రయత్నేన సంసేవ్యా భువనేశ్వరీ | పలాల మివ ధాన్యార్థీ త్యజేదన్య మశేషతః. 5

అమథ్య వేద దుగ్ధాబ్ధిం ప్రాప్తం రత్నం మయా నృప | పరాశక్తి పదాంభోజం కృతకృతోస్మ్యహం తతః. 6

పంచబ్రహ్మాసనారూఢా నాస్త్యన్యా కాపి దేవతా | తత వ మహాదేవ్యా పంచబ్రహ్మాసనం కృతమ్‌. 7

పంచభ్యస్త్వధికం వస్తు వేదేవ్యక్తిమితీర్యతే | యస్మిన్నోతం చ ప్రోతం చ సైవ శ్రీభువనేశ్వరీ. 8

తా మవిజ్ఞాయ రాజేంద్రనైవ ముక్తో భ##వేన్నరః | యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః 9

తదా శివా మవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి | అతఏవ శ్రుతౌ ప్రాహుః శ్వేతాశ్వతరశాభినః. 10

తే ధ్యానయోగానుగతా అపశ్య న్దేవాత్మ శక్తిం స్వగుణౖర్నిగూఢామ్‌ | 11

తస్మా త్సర్వప్రయత్నేన జన్మ సాఫల్య హేతవే |

లజ్జయా వా భ##యేనాపి భక్త్వా వా ప్రేమయుక్త యా | సర్వసంగం పరిత్యజ్య మనో హృది నిరుధ్య చ. 12

తన్నిష్ఠ స్తత్పరో భూయా దితి వేదాంత డిండిమః | యేనకేన మిషేణాపి స్వపం స్తిష్ఠ న్ర్వజన్నపి. 13

కీర్తయే త్సతతం దేవీం సవై ముయ్యేత బంధనాత్‌ | తస్మా త్సర్వప్రయత్నేన భజ రాజ న్మహేశ్వరీమ్‌. 14

విరా డ్రూపాం సూత్రరూపాం తథా ంతర్యామి రూపిణీమ్‌ | సోహనక్రమతః పూర్వం తతః శుద్ధేతు చేతసి. 15

ఇరువదితొమ్మిదవ అధ్యాయము-శ్రీదేవీ గీతలు

వ్యాసు డిట్లనియెను : ఈ ప్రకారముగ సూర్యచంద్రవంశము లందలి పేరుగాంచిన రాజులు యుత్తమ చరితములు నాచే కొంత వర్ణింపబడదగినవి గలవు. ఓ రాజా! వీరెల్లరును శ్రీపరాశక్తి ప్రసాదము వలననే యింతగ మహనీయత్వముబడసిరని తెలిసికొనుము. ఎచ్చటెచ్చట మహదైశ్వర్యములు-ఓజోగుణము-విభూతిమత్త్వవము నుండునో యచ్చటచ్చట నదంతయును శ్రీపరాశక్త్యంశమువలననే కల్గినదని నిక్క మెఱుంగుము. వీరును మఱి తక్కిన రాజులును శ్రీయాదిపరాశక్తి నుపా సించిన వారనియు సంసార వృక్షమూలమును ఛేదించు గొడ్డలివంటి వారనియు తెలియుము. కనుక ధాన్యార్థియైన ప్రతివాడు వడ్లపొట్టునువలె సంసార విషయములను వదలి శ్రీత్రిభువనేశ్వరి నెల్లవిధముల సంసేవింపవలయును. ఓ రాజా! ఈ సకల వేదములనెడు పాలసంద్రలను మథించి మథించి తుదకు శ్రీజగదంబికా పాదకమలములనెడు జాతిరత్నములు పడసి ధన్యభాగ్యుడ నైతిని. పంచబ్రహ్మాసనారూఢ-శ్రీపరాశక్తి యొక్కతెయే - మఱవ్వరునుగారు. కనుక నామెకు బ్రహ్మ-విష్ణు-రుద్ర-శివ-ఈశ్వర-సదాశివులు వరుసగ భూమి-జలము-అగ్ని-వాయువు-ఆకాశము అను భూతముల కధిపతులు. ఈ పంచ తత్త్వములకంటె ఇతరమగునది వేదములందవ్యక్తమని చెప్పబడును. ఆమె మణులందు దారమువలె నంతట వ్యాపించియుండుటచే త్రిభువనేశ్వరి యయ్యెను. రాజా! శ్రీమాతృదేవత నెఱుగక జీవుడు జన్మకోటులకైన మోక్షసుఖ మందజాలడు. నీలాల నింగిని తోలుతో గప్పలేము గదా! అటులే శ్రీమంగళ##దేవత నెఱుగక మానవులు సుఖములు పడయరు. కనుకనే శ్వేతాశ్వతర శాఖీయులు త్రిగుణములచేత నిగూఢయగు సర్వదేవతాత్మకశక్తిని నెఱుంగగలుగుదురని శ్రుతులయందు ప్రవచించున్నారు. కనుక మానవుడు తన జన్మము తరించుట కెల్ల ప్రయత్నములతో సిగ్గుచేగాని భీతిచేగాని భక్తిచేగాని ప్రేమచేగాని సర్వసంగములు వదలి మనస్సును హృదయమున నిలుపవలయును. శ్రీదేవీ నిష్ఠుడు శ్రీమాతృపూజా తత్పరుడై యుండవలయునని వేదాంతభేరి మ్రోగుచున్నది. ప్రతివాడు నెట్టి నెపముతోనైనను నిదురించుచు నడచుచు నిలుచుండుచు శ్రీదేవిని దలచవల యును. శ్రీదేవిని నిరంతరము కీర్తించవలయును. బంధములను బాయవలయును. కనుక రాజా! సర్వప్రయత్నముతో శ్రీమహేశ్వరినే భజింపవలయును. మొదట శ్రీదేవతయొక్క విరాడ్రూపమును తర్వాత సూక్ష్మరూపము నటుతర్వాత సర్వాంతర్యామి స్వరూపమును మెల్లమెల్లగ మెట్టు లెక్కునట్టుల గనవలయును. అపుడు చిత్తము నిశ్చలము నిర్మలము నగును.

సచిదానంత లక్ష్యార్ధరూపాం తాంబ్రహ్మ రూపిణీమ్‌ | ఆరాధయ పరాం శక్తిం ప్రపంచోల్లాసవర్జితామ్‌. 16

తస్యాం చిత్తలయో యః స తస్యా ఆరాధనం స్మృతమ్‌ | రాజ న్రాజ్ఞాం పరాశక్తి భక్తానాం చరితం మయా. 17

ధార్మికాణాం సూర్యసోమ వంశజానాం మనస్వినామ్‌ | పావనం కీర్తిదం ధర్మబుద్ధిదం సద్గతి ప్రదమ్‌.18

కథితం పుణ్యదం పశ్చాత్కి మన్యచ్ఛ్రోతు మిచ్చసి | జనమేజయః : గౌరీలక్ష్మీ సరస్వత్యో దత్తాః పూర్వం పరాంబయా. 19

హరాయ హరయే తద్వన్నాభి పద్మోద్బవాయ చ | తుషారాద్రేశ్చ గౌరీ కన్యేతి విశ్రుతమ్‌. 20

క్షీరోదధేశ్చ కన్యేతి మహాలక్ష్మీ రితిస్మృతమ్‌ | మూలదేవ్యు ద్బవానాం చ కథం కన్యాత్వ మన్యయోః. 21

అసంభావ్య మిదం భాతి సంశయోత్ర మహాన్మునే | ఛింధి జ్ఞానాసినా తం త్వం సంశయచ్ఛేద తత్పరః. 22

వ్యాసః : శృణు రాజ న్ర్పవక్ష్యామి రహస్యం పరమాద్బుతమ్‌ | దేవీభక్తస్య తే కంచి దవాచ్యం నహి విద్యతే. 23

దేవీత్రయం యదా దేవత్రయా యాదా త్పరాంచికా | తదా ప్రభృతి తే దేవాః సృష్టికార్యాణి చక్రిరే. 24

కస్మిం శ్చి త్సమయే రాజ న్దైత్యా హాలాహలాభిదాః | మహాపరాక్రమా జాతా సై#్త్రలోక్యం తైర్జితం క్షణాత్‌. 25

బ్రహ్మాణో వరదానేన దర్పితా రజతాచలమ్‌ | రురుధు ర్ని జసేనాభి స్తథా వైకుంఠ మేవ చ. 26

కామారిః కైటభారి శ్చ యుద్ధోద్యోగం చ చక్కతుః | షష్టి వర్షసహస్రాణా మభూ ద్యుద్ధం మహోత్కటమ్‌. 27

హాహాకారో మహానాసీ ద్దేవదానవసేనయోః | మహతాథ ప్రయత్నేన తాభ్యాం తే దానవా హతాః. 28

స్వస్వస్థానేషు గత్వా తా వభిమానం చ చక్రతుః | స్వ శక్త్యో ర్నికటే రాజ న్య ద్వశాదేవ తే హతాః. 29

అభిమానం తయో ర్జాఞత్వా చ్ఛలహాస్యం చ చక్రతుః | మహాలక్ష్మీ శ్చ గౌరీ చ హాస్యం దృష్ట్వా తయోస్తు తౌ. 30

అపు డీ ప్రపంచ విషయ వానస లుజ్జగించి శ్రీపరాశక్తి-పరబ్రహ్మ స్వరూపిణి-యగు సచ్చిదానంద స్వరూపిణి నారాధింపుము. రాజా! ఆ తల్లియందు చిత్తము లయ మొనర్చుటే భక్తి-యారాధన-యగును. అట్టివారే పరాశక్తి భక్తులు. వారే ధార్మికులు. సూర్యచంద్రవంశజులు-మహామనస్వులు రాజులునైన వారి మహత్త్వ పూర్ణచరిత్రము నిటుల వర్ణించితిని. ఇది పావనము-కీర్తిమంతయు-ధర్మబుద్ధిని-సద్గతిని-నొసంగునది. పుణ్యప్రదము. రాజా! దీనితర్వాత నీ కింకేమి విన కుతూహల మగుచున్నదో తెల్పుము. జనమేజయ డిట్లనెను: పూర్వము శ్రీపరాంబిక గౌరీ-లక్ష్మీ-సరస్వతులను వరుసగ శివ-విష్ణు- బ్రహ్మలను త్రిమూర్తుల కొసంగెను. మఱి దక్షునకు-హిమవంతునకు గల్గిన కన్య గౌరి యెవరు? మఱి పాలసంద్రము కూతురు మహాలక్ష్మి యందురు గదా! గౌరీలక్ష్మలకు మఱల కన్యాత్వ మెట్లు గల్గెను. ఓ మునీశా! ఇదంతయు నసంభవమని నాకు దోచుచున్నది. ఇందు సందియమును గల్గుచున్నది. నీ జ్ఞానఖడ్గముతో నా యీ సందేహము బాపుము. వ్యాసు డిట్లనెను : రాజా! శ్రీదేవీ భక్తుడవగు నీకు చెప్పరాని దొక్కటియు నుండదు. నీ వడిగిన పరమాద్బుత రహస్యము వెల్లడింతును. అవ ధరింపుము. శ్రీపరాంబిక పూర్వము దేవీత్రయమును త్రిమూర్తుల కొసంగెను. ఆనాటినుండి త్రిమూర్తులు తమతమ సృష్టి కార్యములు సాగించిరి. రాజా! మునుపు హాలాహలులను దైత్యులు మహావిక్రములు. వారొకప్పుడు క్షణములో ముల్లోకములు గెలిచిరి. వారు బ్రహ్మవరమున బలిసి కైలాస వైకుఠములపై దండెత్తిరి. వారితో హరిహరులును యుద్ధమునకు సిద్ధపడిరి. అట్లు వారికి ఘోరముగ నారు వేలేండ్లు సమరము జరిగెను. అపుడు దేవదానవ సేనలలో హాహాకారములు మిన్ను ముట్టెను. హరిహరులచేత నెందఱందఱో రక్కసు లుక్కడంగిరి. అంత హరిహరులు తమ తమ నెలవుల కరిగి తమ తమ భార్యల యెదుట తమ వలననే రక్కసులు మడిసిరని గొప్పలు చెప్పుకొనిరి. వారి స్వాహిమానమునకు లక్ష్మీగౌరులు కపటముగ నవ్విరి. హరిహరులు వారి నవ్వు చూచిరి.

దేవావతీవ సంక్రుద్ధౌ మోహితా వాదిమాయయా | దురుత్తరం చ దదతు రవమాన పురః సరమ్‌. 31

తతస్తే దేవతే తస్మిన్‌ క్షణ త్య క్త్వాతు తౌ పునః | అంతర్హితే చాభవతాం హాహా కార స్తదా హ్య భూత్‌. 32

నిస్తేజస్కౌ చ నిః శక్తీ విక్షిప్తౌ చ విచేతనౌ | అవమానా త్తయోః శక్త్యో ర్జాతౌ హరిహరౌ తదా. 33

బ్రహ్మా చింతాతురో జాతః కిమేత త్సముపస్థితమ్‌ | ప్రధనౌ దేవతా మధ్యే కథం కార్యాక్షమా వమూ. 34

అకాండే కిం నిమిత్తేన సంకటం సముపస్థితమ్‌ | ప్రలయో భవితా కిం వా జగతోస్య నిరాగసః. 35

నిమిత్తం నైవ జానేహం కథం కార్యా ప్రతిక్రియా | ఇతి చింతాతురోత్యర్ధం దధ్యౌ మీలితలోచనః. 36

పరాశక్తి ప్రకోపాత్తు జాతమేత దితి స్మ హ | జానం స్తదా సావధానః పద్మజోభూన్నృపోత్తమ. 37

తతస్తయో శ్చయత్కార్యం స్వయమేవాకరో త్తదా | స్వశ##క్తేశ్చ ప్రభావేణ కియత్కాలం తపోనిధిః. 38

తతస్తయోస్తు స్తస్త్యర్థం మన్వాదీ స్స్వసుతా నథ | ఆహ్వాయామాస ధర్మాత్మా సనకాదీం శ్చ సత్వరః. 39

ఉవాచ వచనం తేభ్యః సన్న తేభ్య స్తపోనిధిః | కార్యాసక్తో హ మధునా తపః కర్తుం న చ క్షమః. 40

పరాశ##క్తేస్తు తోషార్థం జగద్బారయుతోస్మ్య హమ్‌ | శివవిష్ణూ విక్షప్తౌ పరాశక్తి ప్రకోపతః. 41

తస్మాత్తాం పరమాం శక్తిం యూయం సంతోషయంత్వథ | అత్యద్బుతం తపః కృత్వా భక్త్యా పరమయా యుతాః. 42

యథా తౌ పూర్వ వృత్తౌ చ స్యాతాం శక్తియుతా వపి | తథా కురుత మత్పుత్రా యశోవృద్ది ర్బ వేద్ధి వః. 43

కులే యస్య భ##వే జ్జన్మ తయోః శక్త్యో స్తు తత్కులమ్‌ | పావయే జ్జగతీం సర్వాం కృతకృత్యం స్వయం భ##వేత్‌. 44

పితామహ వచః శ్రుత్వా గతాః సర్వే వనాంతరే | రియాదయషవః సర్వే దక్షాద్యా విమలాంతరాః. 45

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే ఏకోనత్రింశోధ్యాయః.

వారాది మాయాశక్తికి మోహితులై వారిపై మిక్కిలిగ కోపము జెందిరి. వారు వారి కవమానము గల్గునట్లుగ నోటికి వచ్చునట్లు మాటలాడిరి. ఆ క్షణముననే లక్ష్మీగౌరు లందర్ధానము జెందిరి. అపుడు పెద్దగ కలకలము బయము దేరెను. లక్ష్మీగౌరుల నవమానించుటవలన హరిహరులు తేజము-శక్తి-చేతనము-గోల్పోయి చపలచిత్తులైరి. అంత బ్రహ్మ యిట్లు చింతించెను. ఏమి ఈ వింత! దేవతలలో ప్రముఖులు హరిహరులు గదా! నేడు వారు కార్యదక్షులు గాకుండి రేల? ఈ కాలముగాని కాలమునం దేమి ఈ వైపరీత్యము. ఏ పాప మెఱుగని యీ జగమునకు ప్రళయము ముంచుకొని రాలేదు గదా! దీని కారణమో తెలియక ప్రతి క్రియ యెట్లు జరుపగలను? అని యీ రీతిగ చింతించి బ్రహ్మ కనులు మొగిడ్చెను. అపుడా పరాశక్తి కోపముననే యంతయును జరిగినదని యెఱిగి బ్రహ్మ సావధానుడయ్యెను. అపుడు తపోనిధియగు బ్రహ్మ తన సుతులగు మున్వాదులను సనకాదుల నాహ్వానించెను. వారు వచ్చి నమస్కరింపగ బ్రహ్మ వారి కిట్లనెను: నే నిపుడొక పనిలో మునిగియున్నాను. నేను తపము చేయజాలను. హరిహరులు శ్రీపరాశక్తి కోపమునకు గురియై శక్తిహీనులైరి. ఆమె సంతోషించుట కీ జగద్బారమంతయు నేనే వహింపగలను. కనుక మీరలైకాంతిక భక్తితో నత్యద్బుతమైన తప మాచరించి పరాంబికను సంతోషపెట్టుడు. ఓ నా పుత్రులారా! హరిహరులు తిరిగి శక్తియుక్తు లగునటుల చేయుడు. మీ కీరితి వర్ధిల్లు గాత. ఆ యిర్వురు మహాశక్తులెవని యింట నుద్బవింతురో యా వంశలో లోకముల నెల్ల పవిత్ర మెనర్చును. ఆ కన్న వారును ధన్యజీవు లగుదురు. అను బ్రహ్మ వాక్కులు విని దక్షాదు లెల్లరును నిర్మలమనస్కులై శ్రీజగదంబ నారాధింపగోరి వనముల కేగిరి.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున నిరువది తొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters