Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచవింశోధ్యాయః.

సూతః : ఏకదా తు గతో రంతుం బాలకైః సహితో బహిః | వారాణస్యా నాతిదూరే రోహితాఖ్యః కుమారకః. 1

క్రీడాం కృత్వా తతో దర్బాన్గ్రహీతు ముపచక్రమే | కోమలానల్పమూలాం శ్చ సాగ్రాఞ్చ క్త్యనుసారతః. 2

ఆర్యప్రీత్యర్థ మిత్యుక్త్వా హస్తయుగ్మేన యత్నతః | సలక్షణాశ్చ సమిధో బర్హిరిధ్మం సలక్షణమ్‌. 3

పలాశకాష్ఠాన్యా దాయ త్వగ్నిభోమార్థమాదరాత్‌ | మస్తకే భారకం కృత్వా ఖిద్యమానః పదే పదే. 4

ఉదకస్థాన మాసాద్య తదా బాల స్తృషాన్వితః | భువి భారం వినిక్షిప్య జలస్థానే తదా శిశుః. 5

కామతః సలిలం పీత్వా విశ్రమ్య చ ముహూర్తకమ్‌ | వల్మీకోపరి విన్య స్త భారో హర్తుం ప్రచక్రమే. 6

విశ్వామిత్రజ్ఞయా తావత్కృష్ణసర్పో భయావహః | మహావిషో మహాఘోరో వల్మీకా న్నిర్గత స్తదా. 7

తేనాసౌ బాలకో దష్టస్తదైవ చ పపాత హ | రోహితాఖ్యం మృతం దృష్ట్వాయయుర్బాలాద్విజాలయమ్‌. 8

త్వరితా భయసంవిగ్నాః ప్రోచుసన్మాతుర గ్రతః | హే విప్రదాసి తే పుత్రః క్రీడాం కర్తుం బహిర్గతః. 9

అస్మాభిః సహిత స్తత్ర సర్పదష్టో మృత స్తతః | ఇతి సా తద్వచః శ్రుత్వా వజ్రపాతోపమం తదా. 10

పపాత ముర్చితా భూమౌ ఛిన్నేవ కదళీ యథా | అథ తాం బ్రాహ్మణో రుష్టః పానీయేనాభ్యషించత. 11

ముహూర్తా చ్చేతనాం ప్రాప్తా బ్రాహ్మణస్తా మథా బ్రవీత్‌ | బ్రాహ్మణః : అలక్ష్మీ కారకం నింద్యం జానతీ త్వం నిశాముఖే. 12

రోదనం కురుషే దుష్టే లజ్జా తే హృదయే న కిమ్‌ | బ్రాహ్మణనైవ ముక్తాసా న కించిద్వాక్య మబ్రవీత్‌. 13

ఇరువదియైదవ అధ్యాయము - హరిశ్చంద్రోపాఖ్యానము

సూతు డిట్లనెను : ఒకనాడు రోహిత కుమారకుడు తోడి బాలురతో నాడుకొనుటకు కాశికిబయట కొంత దూర మేగెను. కొంత తడ వాడుకొనిన పిదప నతడు చివరలుగల మెత్తని చిఱుదర్బలను తన శక్తికొలది కోయుచుండెను. ఇవి ఏల యని బాలు రడుగగ నా స్వామి బ్రాహ్మణుడు. ఇవి అతని ప్రీతికని పలికెను. అతడు తన రెండు చేతులతో యజ్ఞలక్షణము గల్గి అగ్నిదీపకమగు సమిధ గ్రహించెను. అత డగ్నిలో వేల్చుటకు మోదుగు సమిధలను తీసికొని వాని మోపెటులో నెత్తిని పెట్టుకొని యడుగడుగున దుఃఖించుచు ముందునకు సాగెను. అతడు దప్పికొని నీరున్నచోటికి వెళ్ళి మోపుదింపి నీట దిగెను. అతడు దప్పితీర నీరుత్రాగి యొక మూర్తముసేపు సేదదీర్చుకొని తిరిగి మోపెత్తుకొనుటకు దాని నొక పుట్టపై నుంచెను. అంతలో విశ్వామిత్రు నానతి నొక కాలసర్పము ఘోరభీకరముగ విషాగ్నులు గ్రక్కుచు పుట్ట వెడలెను. పాము రోహితుని కాటు వేయగ నతడు నేలపడి యసువులు బాసెను. చచ్చిన రోహితునిగని బాలురు విప్రు నింటి కేగిరి. వారు భయముతో వణకుచు రోహితుని తల్లితో నిట్లనిరి : ఓ విప్రదాసీ : నీ కుమారు డాటలాడుకొనుటకు బయటకు వెళ్ళెను. అతని నొక పాము కాటు వేసెను. అతడు వెంటనే చనిపోయెను. వారి మాటలు విని యామెకు పిడుగు పడినట్లయ్యెను. పిడుగుదెబ్బ కరటిచెట్టు పడినట్లామె నేలగూలెను. పిమ్మట విప్పుడు కోపముతో నామె మొగముపై చన్నీరు చల్లెను. ఆమె యొక మూర్తమున తెలి వొందగ విప్రుడామె కిట్లనెను. నీవు రాత్రి సమయమున నేడువరాదు. అది నింద్యము. అలక్ష్మీకరము. ఓసి దుష్టురాలా! ఏడ్చుచున్నావే : నీ హృదయములో సిగ్గు లేదే! అని బ్రాహ్మణుడు పలుకగ నామె పలుకక మిన్నకుండెను.

రురోద కరుణం దీనా పుత్రశోకేన పీడితా | అశ్రుపూర్ణముఖీ దీనా ధూసరా ముక్తమూర్థజా. 14

అథ తాం కుపితో విప్రో రాజపత్నీ మభాషత | ధిక్త్వాం దుష్టే క్రయం గృహ్య మమ కార్యం విలుంపసి. 15

అశక్తా చేత్కథం తర్హి గృహీతం మమ తద్దనమ్‌ | ఏవం నిర్బర్త్సితా తేన క్రూరవాక్యైః పునః పునః. 16

రుదితా కారణం ప్రాహ విప్రం గద్గదయా గిరా | స్వామి న్మమ సుతో బాలః సర్పదష్టో మృతో మహిః. 17

అనుజ్ఞాం మే ప్రయచ్ఛస్వ ద్రుష్టుం యాస్వామి బాలకమ్‌ | దుర్లభం దర్శనం తేన సంజాతం మమ సువ్రత. 18

ఇత్యుక్త్వా కరుణం బాలా పునరేవ రురోద హ | పున స్తాం కుపితో విప్రో రాజపత్నీ మభాషత. 19

బ్రాహ్మణః : శ##ఠే దుష్టసమాచారే కిం న జానాసి పాతకమ్‌ | యః స్వామివేతనం గృహ్య తస్యకార్యం విలుంపతి. 20

నరకే పచ్యతే సోథ మహారౌరవపూర్వకే | ఉషిత్వా నరకే కల్పం తతోసౌ కుక్కుటో భ##వేత్‌. 21

కి మనేనాథవా కార్యం ధర్మసంకీర్తనేన మే | య స్తు పాపరతో మూర్ఖః క్రూరో నీచోనృతః శఠః. 22

తద్వాక్యం నిష్పలం తస్మిన్బవే ద్బీజ మివోషరే | ఏహి తే విద్యతే కించి త్పరలోకభయం యది. 23

ఏవ ముక్తాథసా విప్రం వేపమానాబ్రవీద్వచః | కారుణ్యం కురు మే నాథ ప్రసీత సుముఖో భవ. 24

ప్రస్థాపయ ముహుర్తం మాం యావద్దృక్ష్యామి బాలకమ్‌ | ఏవ ముక్తాథ సా మూర్ద్నా నిపత్య ద్విజపాదయోః. 25

రురోద కరుణం బాలా పుత్రశోకేన పీడితా | అథహ కుపితో విప్రః క్రోధసంరక్తలోచనః. 26

ఆమె తీరని పుత్రశోకమున పీడితురాలై తలవెండ్రుకలు విడివడగ నేలపైబడి పొరలి యాడుచు కన్నీటిమోముతో దీనముగ నేడ్చేను. అందులకు విప్రుడు కోపించి రాజపత్ని కిట్లనెను. ఓసి దుష్టురాలా! నీవు పనికిమాలినదానవు. నిన్ను డబ్బిచ్చి కొంటిని. ఐన నా పని కడ్డు గల్గించుచున్నావు. నీకు పనిచేతకానిచో నా ధనమేల తీసికొంటివి? అని యతడు నిష్ఠురముగ మాటిమాటి కామెను తూలనాడెను. అపు డామె డగ్గుత్తికతో నేడ్చుచు నిట్లనెను : ఓ స్వామీ ! నా కొడు కూరిబయట పాముచే కాటు వేయబడియున్నాడు. అతనిని మరల చూడను. కనుక నా కనుమతి యిచ్చినచో నతనిని కడసారి చూపు చూచుటకు వెళ్ళుదును. అని యామె ఱాల్గరగునట్లు విలపించగ విప్పుడు మఱల కోపించి రాజపత్ని కిట్లనియెను. ఓసి దుర్మార్గులారా! ఓసి మొండిదానా! నీకు పాపభీతి లేదేమో! ఒక యజమాని ధనము తీసికొన్నవాడు తన యజమానుని పని నెఱవేర్చవలయును. అట్లు చేయనిచో నతడు మహారౌరవ నరకమున గూలును. అత డచ్చట చాలాకాల ముండి పిదప కోడిగ పుట్టును. ఇపుడు నా కీ ధర్మపన్నాలు వల్లించుటతో పని యేమి? పాపరతులు-మూర్ఖులు-క్రూరులు-నీచులు-శఠులు-నగు వారుందురు. అట్టివారి కీ మాటలు చవిటినేల నాటిన విత్తనములవలె వ్యర్థములు. నీకు పరలోక భయమున్నచో రమ్ము. నా యింటిపని చేయుము. అని యనగ నామె గడగడలాడుచు విప్రునితో నిట్లనెను. ఓ స్వామీ! సంతోషించి యీ దీనురాలిపై నింత దయ బూనుము. నా కొడుకును చూచి వెంటనే వత్తును. ఒక్క మూర్తము సమయమిమ్ము. అని యామె విప్రుని పాదాలపై తలనిడి బూనుము. నా కొడుకును చూచి వెంటనే వత్తును. ఒక్క మూర్తము సమయమిమ్ము. అని యామె విప్రుని పాదాలపై తలనిడి వేడుకొనెను. ఆమె తీరని పుత్రశోకముతో పీడితురాలై దీనముగ రోదించెను. అపుడు విప్రుడు క్రోధ ముతో కనుగ్రుడ్లెఱ్ఱచేసి యిట్లనెను.

విప్రవాచ : కిం తే పుత్రేన మే కార్యం గృహకర్మ కురుష్యమేక్రిం న జానాసిమేక్రోధం కశాఘాతఫల ప్రదమ్‌.

ఏవముక్తా స్థితాధైర్యా ద్గృహకర్మ చకార హ | అర్ధరాత్రో గత స్తస్యాః పాదభ్యంగాది కర్మణా. 28

బ్రాహ్మణనాథసా ప్రోక్తా పుత్రపార్శ్వం ప్రజాధునా | తస్య దాహాదికం కృత్వా పునరాగచ్ఛ సత్వరమ్‌. 29

న లుప్యేత యథా ప్రాత ర్గృహకర్మమ మేతి చ | తతస్త్వేకాకినీ రాత్రౌ విలవంతీ జగామ హ. 30

దృష్ట్వా మృతం నిజం పుత్రం భృశం శోకేన పీడితా | యూథభ్రష్టా కురంగీవ వివత్సా సౌరభీయథా. 31

వారాణస్యా బహిర్గత్వా క్షణాద్ధృష్వా నిజం సుతమ్‌ | శయానం రంకవ ద్బూమౌ కాష్ఠదర్బతృణోపరి. 32

విలలాపాతి దుఃఖార్తా శబ్దం కృత్వా సునిష్ఠురమ్‌ | ఏహిమే సమ్ముఖం కస్మా ద్రోషితోసి వదాధునా. 33

ఆయాస్యభిముఖో నిత్యమంబేత్యుక్త్వా పునః పునః | గత్వా స్ఖలత్పదా తస్య పపాతోపరి మూర్చితా. 34

పునః సా చేతనాం ప్రాప్య దోర్బ్యా మాలింగ్య బాలకమ్‌ | తన్ముఖే వదనం న్యస్య రురోదార్త స్వనై స్తదా. 35

కరాభ్యాం తాడనం చక్రే మస్తకస్యో దరస్య చ హా బాల హా శిశో వత్స హా కుమారక సుందర. 36

హా రాజన్క్వ గతో సి త్వం పశ్యేమం బాలకం నిజమ్‌ | ప్రాణభ్యోపిగరీయాంసం భూతలే పతితం మృతమ్‌. 37

తథాపశ్య న్ముఖం తస్య భూయో జీవిత శంకయా | నిర్జీవవదనం జ్ఞాత్వా మూర్చితా నిపపాత హ. 38

హస్తేన వదనం గృహ్య పునరేవ మభాషత | శయనం త్యజ హే బాల శీఘ్రం జీగృహి భీషణమ్‌. 39

నిశార్ధం వర్ధతే చేదం శివాశతనినాదితమ్‌ | భూతప్రేత పిశాచాదిడాకినీయుథనాదితమ్‌. 40

నీ కొడు కేమైన నాకేమి? మొదట నా పనులు చక్క పెట్టుము. నా కోపము నీకు తెలియదా! నా కొరడాదెబ్బ యపుడే మఱచితివా! అని బ్రాహ్మణు డనగ నామె తన గుండె ఱాయిచేసికొని యింటిపనులు చేసెను. నడిరేయి తన స్వామి పాదము లొత్తెను. అపుడు విప్పుడామెతో నిట్లనెను : ''ఇక నీవు నీ కొడుకు దగ్గఱకేగి యతని యంత్యక్రియలు జరిపి వెంటనే తిరిగి రమ్ము. తెల్లవారు సరికి వచ్చి నాయింటి పనులకు లోపము గల్గగూడదు.'' అని విని యామె యదే రాత్రి యొంటిగ నేడ్చుచు వెళ్ళెను. ఆమె చనిపోయిన తన కొడుకుమనుగాంచి గుంపునుండి చీలిన లేడివలె దూడ చనిపోయిన యావువలె మిక్కిలి శోకపీడిత యయ్యెను. ఆమె కాశీపురి బయటకేగి నేలమీద గడ్డి-కట్టెలు-దర్బ-పై దిక్కులేనివానివలె పడుయున్న తన కొడుకును చూచెను. ఆమె దుఃఖార్తయై భోరున నిట్లు విలపించెను : నా కుమారా ! నామీద నీకింత రోష మేలరా! ఇపుడు నాయొద్దకు రారా ! ప్రతిదినము నీవమ్మా అమ్మా యని పలుసార్లు నా కెదురుగ వచ్చు చుందువే ! ఇపుడు రావేమి? యని యామె యడుగులు తడబడ నతనిమీద పడి మూర్చితురాలయ్యెను. ఆమె పిదప తెలివొంది తన రెండు చేతులతో బాలుని కౌగిలించుకొని యతని ముఖముపై తన ముఖముంచి దీనార్తితో రోదించెను. ఆమె పిదప తన చేతులతో నతని తల పోట్ట తాకుచు హా బాలా! హా శిశూ! హా సుందరా: అయ్యో చిన్నారీ! యని గుండె చెఱువుకాగ నేడ్చెను. రాజా! నీవు నీ ప్రాణాలకన్న మిన్నగ చూచుకొను నీ కొడుకు నేడు నేలపై పడియున్నాడు. నీ వెక్కడనుంటివో; వచ్చి నీ కుమారుని చూచు కొమ్ము. తన బాలుని ముఖలక్షణములుగని యతడు బ్రతికియే యున్నాడని యామె గ్రహించెను. కాని యతని నల్లబడిన ముఖము తాకి యిట్లెనెను : ఓ కుమారా ! నిదురలెమ్ము. వెంటనే మేలుకొమ్ము. ఇపుడు భయంకరమైన నడిరేయి చిమ్మచీకటి. ఈ రాత్రి భూతప్రేతపిశాచ డాకినుల గుంపులు కేకలు పెట్టుచున్నవి.

మిత్రాణి తే గతా న్యస్తా త్త్వమేక స్తు కుతః స్థితః | సూతః : ఏవ ముక్త్వా పున స్తన్వీ కరుణం ప్రరురోదహ. 41

హాశిశో బాల హా వత్స రోహితాఖ్య కుమారక | రే పుత్ర ప్రతిశబ్దం మే కస్మత్త్వం నప్రయచ్చసి. 42

తవాహం జననీ వత్స కిం నజానాసి పశ్య మామ్‌ | దేశత్వాగా ద్రాజ్యనాశాత్పుత్రభర్త్రా స్వవిక్రయాత్‌. 43

యద్దాసీత్వా చ్చ జీవామి త్వాం దృష్ట్వా పుత్ర కేవలమ్‌ | తే జన్మసమయే విపై#్ర రాదిష్టం యత్త్వనాగతమ్‌. 44

దీర్ఘాయుః పృథివీరాజః పుత్రపౌత్రసమన్వితః | శౌర్యదానరతిః సత్త్వో గురుదేవద్విజార్చకః. 45

మాతాపిత్రో స్తు ప్రియకృత్సత్యవాదీ జితేంద్రియః | ఇత్యాది సకలం జాత మసత్య మధునా సుత. 46

చక్రమత్స్యానాత పత్ర శ్రీవత్సస్వస్తికధ్వజాః | తవ పాణితలే పుత్ర కలశ్చామరం తథా. 47

లక్షణాని తథాన్యాని త్వద్దస్తే యాని సంతి చ | తానిసర్వాణి మోఘాని సంజాతాన్యధునా సుత. 48

హా రాజ న్పృథివీనాథ క్వతే రాజ్య క్వ మంత్రిణః | క్వతే సింహాసనం ఛత్రం క్వ తే ఖడ్గః క్వతద్దనమ్‌. 49

క్వ సాయోద్యా క్వ హార్మ్యాణి క్వ గజాశ్వరథ ప్రజాః | సర్వ మేతత్తథా పుత్ర మం త్యక్త్వా క్వగతోసిరే. 50

హా కాంత హా నృపాగచ్ఛ పశ్యేమం స్వసుతం ప్రియమ్‌ | యేన తే రింగతా వక్షః కుంకుమేనావలేపితమ్‌. 51

స్వశరీరరజః పంకై ర్విశాలం మలినీకృతమ్‌ | యేన తే బాలభావేన మృగనాభివిలేపితః. 52

భ్రంశితో భాలతిలక స్తవాంకస్థేన భూపతే | యస్య వక్త్రం మృదాలిప్తం స్నేహాద్వై చుంబితం మయా. 53

నీ నిచ్చెలికాండ్రు వెళ్ళిపోయిరి. నీ వొక్కడవే యిక్క డేల? యని యామె మఱల విలపించెను. సూతు డిట్లనెను; ఇటు లామె మఱల పలికి దీనముగ వాపోయెను. అయ్యో! నా ముద్దుల పట్టీ! నా బాలుడా! నా రోహితుడా! నాకొడుకా! నాతో మారు మాటాడవేమిరా! ఓ గారాల పట్టీ ! నేను నీ యమ్మనురా ! నన్నే యెఱుగవురా : నన్ను చూడుము. నేను దేశ మును రాజ్యమును వదిలిపెట్టి వచ్చితిని. నేను నా భర్తచే నమ్ముడుపోతిని. నేను కేవలను నీ మొగము చూచుకొనియే బ్రతుకుచున్నానురా? నీవు పుట్టగనే బ్రాహ్మణులు నీ భవిష్యత్తుగూర్చి యిట్లు తెల్పిరి. నీవు దీర్ఘాయుష్మతుడవు- చక్రవర్తివి- పుత్రపౌత్రవంతుడవు-- శూరుడవు- దానశీలుడవు- సాత్వికుడవు- గురుదేవ విప్రపూజకుడవు- సత్యవాదివి-తల్లిదండ్రులకు ప్రియ కరుడవు- జితేంద్రియుడుగా గలవని నీ జాతకమున గలదు. అవన్నియు నేడు నీ యెడల నసత్యము లయ్యెను గదా. నీ యఱచేతిలో చక్రము- మత్స్యము- గొడుగు- శ్రీవత్సము- స్వస్తిక చహ్మము- కలశ చామరములు- మిగిలిన శుభలక్షణములు- ఎన్నియో కలవు. నేడవన్నియు నసత్యము లయ్యెను గదరా కొడుకా! అయ్యో రాజా! ఆ నీ రాజ్యమెక్కడ! ఆ నీ మంత్రు లెక్కడ! ఆ నీ సింహాసన మెచట! నీ ఛత్రము నీ ఖడ్గము నీ ధనము నెక్కడ! ఆ నీ యయోధ్యాపురము- ఆ రమ్యహర్మ్య ములు- ఆ గజాశ్వరథములు అవన్ని యెక్కడ : ఓ కొడుకా! నీవు వానన్నిటిని వదలి యెక్కడి కేగితివిరా. ఓ నరపతీ ! ఓ ప్రియా ! ఒక్కసారి రమ్ము. దొగాడుచు ఱొమ్మునను కుంకుమ పూసికొనిన నీ యీ కొడుకు కొంటెతనమున తన మేని నిండ మన్ను పూసికొనెనో ఏ నీ కొడుకు బాలభావమున కస్తూరి మేన పూసికొనెనో-రాజా! నీ తొడపై నున్నయే నీ కొడుకు నీ నొసటి తిలకమును చెపనెనో-ఎవని మంటి నోటిని వాత్సల్యమున నేను ముద్దాడితినో-

తన్ముఖం మక్షికాలింగ్యం పశ్యేః కీటై ర్విదూషితమ్‌ | హారాజ న్పశ్య తం పుత్రం భువిస్థం రంకవన్మృతమ్‌. 54

హా దేవ కిం మయాకృతం పూర్వ భవాంతరే | తస్య కర్మఫలస్యేహ న పార ముపలక్షయే. 55

హా పుత్ర హా శిశో వత్స హా కుమారక సుందర | ఏవం తస్యా విలాపం తే శ్రుత్వా నగరపాలకాః. 56

జాగృతా స్త్వరితా స్తస్యాః పార్శ్వమీయుః సువిస్మితాః | జనా ఊచుః : కా త్వం బాలశ్చ కస్యాయం పతిస్తే కుత్ర తిష్ఠతి. 57

ఏకైవ నిర్బయా రాత్రౌకస్మాత్త్వమిహ రోదిషి | ఏవ ముక్త్వాథ సా తన్వీ న కించిద్వాక్యమబ్రవీత్‌. 58

భూయోపి పృశాసా తూష్ణీం స్తభ్ధీభూతా బభూవహ | విలలాపాతి దుఃఖార్తా శోకా శ్రుప్లుతలోచనా. 59

అథ తే శంకితా స్తస్యాం రోమాంచితతనూరహాః | సంత్రస్తాః ప్రాహురన్యోన్య ముద్దృతాయుధపాణయః. 60

నూనం స్త్రీ న భవత్యేషా యతః కించిన్న భాషతే | తస్మాద్వధ్యా భ##వేదేషా యత్నతో బాలఘాతినీ. 61

శుభాచేత్తర్హి కిం హ్యత్ర నిశార్ధం తిషతే బహిః | భక్షార్థ మనయా నూనమానీతః కస్యచిచ్ఛిశుః. 62

ఇత్యుక్త్వా తైర్గృహీతా సా గాఢాం కేశేషు సత్వరమ్‌ | భుజయో రపరైశ్చైవ కైశ్చాపి గలకేతథా. 63

ఖేచరీ యాస్యతీ త్యుక్తం బహుభిః శస్త్రపాణిబిః | ఆకృష్య పక్కణ నీతా చాండాలాయ సమర్పితా. 64

హే చాండాల బహిర్దృషా హ్యాస్మాభిర్బాలఘాతినీ | వధ్యతాం వధ్యతా మేషా శీఘ్రం నీత్వాబహిః స్థలే. 65

చాండాలః ప్రాహ తాం దృష్ట్వా జ్ఞాతేయం లోకవిశ్రుతా | న దృష్టపూర్వా కేనాపి లోకడింభా న్యనేకధా. 66

నేడా నీ కొడుకు మొగముపై నీగలుదోమలు ముసరగ చూడనలవి కాకున్నది. రాజా! అట్టి నీ కొడుకు నేడు దిక్కుమాలిన వానివలె పడియున్నాడు. అక్కట దైవమా! వెనుకటి జన్మములోనే నెట్టి చేయరాని పని చేసితినో! దాని ఫలితముగ నేను నేడిట్టి చెడు ఫలిత మనుభవించుచున్నాను. అయ్యో కొడుకా! హా శిశూ! ఓ వత్సా! అయ్యయ్యో సుందర బాలకా! అను నామె విలాపములను నగరపాలకులు వినిరి. వారు త్వరగ మేల్కొని యామె చెంతకేగి విస్మయముతో నిట్లనిరి. నీవెవరవు? ఈ బాలు డెవనివాడు? నీ పతి యెవరు? ఎక్కడున్నాడు? నీ వొంటరిగ నిర్బయముగ నడిరేతిరి శోకింతు వేల? అని వారెంత యడిగినను నామె మారు పలుకలేదు. అట్లు వారు పెక్కుసారు లడిగిన నామె పలుకక మిన్న కుండెను. ఆమె దుఃఖార్తితో శోకాశ్రులు కన్నుల నిండగ కుమిలి యేడ్చెను. పిమ్మట వారి కామెపై ననుమానము గల్గెను. వారు భయపడి మేనులు పుల్కరింప నాయుధములు చేతబూని తమలోతా మిట్లనుకొనిరి. ఈమె స్త్రీ కాదు. అందులకే మాటలాడుట లేదు. ఈమె తప్పక మాయావి-రక్కసి-బాలఘాతిని-గావచ్చును. ఈమె మంచిదైనచో నింత రాత్రిలో నెవని పిల్లవానినో తెచ్చి యూరిబయట తినదలచునా! అని కొంద ఱామె వెండ్రుకలు పట్టి-మఱికొందరు మెడపట్టి-యింక కొందఱు చేతులుపట్టి-లాగిరి. ఇదొక ఖేచరి. ఎటకో పోవుచున్నదని శస్త్రపాణు లామె నీడ్చుకొనిపోయి చండాలున కప్పగించి యిట్లనిరి : ఓ చండాలా! ఈ బాలఘాతిని మాకు బయట కనిపించెను. ఈమెను శీఘ్రముగ బయటకు గొనిపోయి చంపుము-చంపుము. అపుడు చండాలుడు వారిని చూచి యిట్లనెను. ఈమె యందరికి తెలిసినదే. ఎఱుగనివా రెవరున లేరు. ఈమె యెందరనో పిల్లలను తిన్నది.

భక్షితా న్యనయా భూరి భవద్బిః పుణ్యమార్జితమ్‌ | ఖ్యాతి ర్వః శాశ్వతీ లోకే గచ్ఛధ్వం చయథాసుఖమ్‌. 67

ద్విజ స్త్రీ బాలగోఘాతి స్వర్ణస్తేయీచయో నరః | అగ్నిదో వర్త్మఘాతీ చ మద్యపో గురుతల్పగః. 68

మహాజన విరోధీ చ తస్యపుణ్య ప్రదో వధః | ద్విజస్వాపి స్త్రీయెదాపి నదోషో విధ్యతే వధే. 69

అస్యా వధశ్చ మే యోగ్య ఇత్యుక్త్వా గాఢబంధనైః | బద్ధ్వా కేశేష్వథాకృష్య రజ్ఞుభిస్తామతాడయత్‌. 70

హరిశ్చంద్ర మథోవాచ వాచా పరుషయా తదా | రే దాస వధ్యతా మేషా దుష్టాత్మా మా విచారయ. 71

తద్వాక్యం భూపతిః శ్రుత్వా వజ్రపాతోపమం తదా | వేపమానోథ చాండాలం ప్రాహస్త్రీవధశంకితః. 72

న శక్తోహ మిదం కర్తుం ప్రేష్యం దేహి మమాపరమ్‌ | అసాధ్యమపి యత్కర్మ తత్కరిష్యే త్వయోదితమ్‌. 73

శ్రుత్వా తదుక్త పచనం శ్వపచో వాక్య మబ్రవీత్‌ |

మాభై షీ స్త్వం గృహాణా సిం వధోస్యాః పుణ్యదో మతః. 74

బాలానా మేవ భయదా నేయం రక్ష్యా కదాచన | తచ్ఛ్రుత్వా వచనం తస్య రాజా వచన మబ్రవీత్‌. 75

స్త్రీయో రక్ష్యాః ప్రయత్నేన న హంతవ్యాః కదాచన | స్త్రీ వధే కీర్తితం పాపం మునిబిర్ధర్మతత్పరైః. 76

పురుషో యం స్త్రీయం హన్యాత్‌ జ్ఞానతోజ్ఞానతోపివా | నరకే పచ్యతే సోథ మహారౌరవపూర్వకే. 77

చాండాలః : మా వదా సిం గృహాణౖనం తీక్ష్నం విద్యుత్సమ ప్రభమ్‌ |

యత్రైకస్మి న్వధం నీతే బహూనాం తు సుఖం భ##వేత్‌. 78

తస్య హింసా కృతా నూనం బహుపుణ్యప్రదా భ##వేత్‌ | భక్షితా న్యనయా భూరి లోకే డింభాతి దుష్టయా. 79

ఈమెను చంపిన మీకు పున్నెము కీరితి శాశ్వతముగ గల్గును. కనుక మీరు సుఖముగ వెళ్ళుడు. ఎవడు విప్రుని - స్త్రీని-బాలురను-ఆవులను-చంపునో బంగారము దొంగలించునో-నిప్పుపెట్టునో-బాటలు చెడగొట్టునో-మద్యము త్రాగునో-గురుతల్ప మెక్కునో-ఎవడు సాధులతో వైరము బూనునో-యట్టివానిని చంపుట పుణ్యము. ఈ పనులు చేసినవారు విప్రులైనను-స్త్రీయైనను-వారిని చంపిన దోషము రాదు. కనుక నీమెను చంపుట మంచిదే యనుకొని చండాలు డామెను గట్టిగ బంధించి త్రాళ్ళతో గట్టి పటిలాగి జుట్టుపట్టికొట్టెను. అతడు హరిశ్చంద్రునితో పరుశముగ నిట్లనెను. ఓరి దాసుడా! నీ వీ దుష్ఠురాలిని ముందువెనుకలు చూడక చంపివేయుము. అను పిడుగుపాటువంటి మాట విని హరిశ్చంద్రుడు స్త్రీ వధ నను మానించి వణకుచు చండాలున కిట్లనెను: ఈ పని మాత్రము నాచేత గాదు. ఇంకే పనియైనను చెప్పుము. అదెంత యసాథ్యమైనదైనను తప్పకచేయగలను. అను మాటలువిని చండాలుడు మరల నిట్లనెను. భయపడకుము. కత్తి చేతబట్టుకో, దీనిని చంపిన నీకు పున్నెమే కల్గును. ఇది చిన్న పిల్లలను భయపెట్టునది. దీనిని దయతలచి వదలరాదు. అను మాటలువిని రాజు చండాలున కిట్లనెను : స్త్రీలు రక్షింపదగినవారేగాని చంపబడదగినవారు గారు. స్త్రీవధ మహాపాపమని ధర్మతత్పురులు-మునులు-వక్కాణింతురు. తెలిసియో-తెలియకో యొక స్త్రీని చంపినవాడు తప్పక ఘోర రౌరవనరకములందు గూలును. చండాలు డిట్లనెను : ఈ మాటలు కట్టిపెట్టుము. మెఱపుతీగవంటి వాడి కత్తి చేపట్టుము. ఈ యొక్క దానిని చంపినందున పెక్కురకు సుఖము గల్గును సుమా. ఈ దుష్టురాలు లోకమందలి పెక్కురు చిన్న పిల్లలను పొట్టను పెట్టుకొన్నది. దీనిని చంపినందున నీకు పుణ్యమే కల్గును.

తత్షిప్రం వధ్యతా మేషా లోకః స్వస్థోభవిష్యతి | రాజోవాచ : చాండాలాధిపతే తీవ్రం వ్రతం స్త్రీవధవర్జనమ్‌. 80

ఆజన్మత స్తతో యత్నం న కుర్వాం స్త్రీవధే తవ |

చాండాలః : స్వామి కార్యం వినా దుష్ట కిం కార్యం విద్యతే పరమ్‌. 81

గృహీత్వా వేతనం మేద్య కస్మాత్కార్యం విలుంపసి | యః స్వామివేతనం గృహ్య స్వామికార్యం విలుంపతి. 82

నరకా న్నిష్కృతి స్తత్య నాస్తి కల్పాయుతైరపి | రాజోవాచ : చాండాలనాథమేదేహి ప్రాప్యమన్యత్సుదారుణమ్‌. 83

స్వశత్రుం బ్రూహితంక్షిప్రం ఘాతయిష్యామ్య సంశయమ్‌ | ఘాతయిత్వా తు తం శత్రుం తవదాస్యామిమేదినీమ్‌. 84

దేవదేవోరగైః సిద్దైర్గంధర్వైరపి సంయుతమ్‌ | దేవేంద్ర మపి జేష్యామి నిహత్య మిశితైః శ##రైః 85

ఏతచ్ఛ్రుత్వా తతో వాక్యం హరిశ్చంద్రస్య భూపతేః | చాండాలః కుపితః ప్రాహ వేపమానం మహీపతిమ్‌. 86

చాండాలః : ''నైత ద్వాక్యం సుఘటితం యద్వాక్యం దాసకీర్తితమ్‌''

చాండాలదాసతాం కృత్వా సురాణాం భాషసే వచః | దాస కిం బహునా నూనం శృణుమే గదతో వచః. 87

నిర్లజ్జ తవ చేదస్తి కించిత్వాపభయం హృది | కిమర్థం దాసతాం యాత శ్చాండాలస్యతు వేశ్మని. 88

గృహాణౖనం తతః ఖడ్గమస్యాశ్ఛింది శిరో ంబుజమ్‌ | ఏవ ముక్త్వాథ చాండాలో రాజ్ఞే ఖడ్గం న్యవేదయత్‌. 89

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే హరిశ్చంద్రోపాఖ్యానే పంచవింశోధ్యాయః.

కనుక దీనిని తప్పక చంపుము. లోకము సుఖముండుగాత. రాజిట్లనెను: ఓ చండాలాధిపతీ! నేను స్త్రీవధ చేయనని తీవ్రవ్రతము బూనితిని. కనుక నేను స్త్రీ వధకు తలపడకున్నాను. నేను పుట్టిననాటినుండి స్త్రీవథ చేయలేదు. చండాలు డిట్లనెను: ఓరి దుష్టుడా! స్వామి కార్యమును మించిన కార్య మింకేమి గలదు. నా యుప్పుపులుసుతిని నా చెప్పిన పని యేల చేయవురా! తన స్వామిజీతముతిని స్వామి పని నెఱవేర్చవలయును. అట్లు చేయనివానికి వేయికల్పములకైనను నరకమునుండి ముక్తిలేదు. రాజిట్లనెను: ఓ చండాలనాయకా! నాకు సుదారుణమైన యింకొక పని చూపుము. నీ కెవడైన పగవాడున్నచో చెప్పుము. అట్టి నీ శత్రుని చంపి యీ భూమి యంతయును నీ కైవసము గావింపగలను. దేవ-ఉరగ-సిద్ధ-గంధర్వులను వెంటబెట్టుకోని దేవేంద్రు డేతెంచినప్పటికీ నా వాడి బాణములతో నతని నోడింపగలను. అను హరిశ్చంద్రరాజు మాటలువిని చండాలుడు కోపాతిరేకముతో వణకుచు నతని కిట్లనెను. నీవు పలుకు మాట లొక దాసునకు తగినవి గావు. నీ వొక చండా లునకు దాసుడవయ్యు పెద్ద దేవతల పల్కులు పల్కుచున్నావు. ఓరి దాసుడా! పెక్కేల ! నా మాట నమ్ముము. ఓరి సిగ్గు మాలినవాడా! నీ యెడదలో పాపభీతి యున్నచో నొక చండాలునకు దాసుడ వెందుల కైతివి? ఇదిగో! ఈ కత్తి తీసికొ. దాని తల తెగ నఱకుము. అని పలికి చండాలుడు రాజు చేతికి కత్తి యిచ్చెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున హరిశ్చంద్రోపాఖ్యానమున నిరువదియైదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters