Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్వింశోధ్యాయః

శౌనకః : తతః కి మకరో ద్రాజా చాండాలస్య గృహే గతః త్రద్బ్రూహి సూతవర్యత్వం పృచ్ఛతః సత్వరంహిమే. 1

సూతః : విశ్వామిత్రే గతే విప్రే శ్వపచో హృష్టమానసః | విశ్వామిత్రాయ తద్ధ్రవ్య దత్త్వా బధ్వా నరేశ్వరమ్‌. 2

అసత్యో యాస్యసీ త్యుక్త్వా దండేనాతాడయత్తదా | దండప్రహార సంభ్రాంత మతీవ వ్యాకులేంద్రియమ్‌. 3

ఇష్టబంధు వియోగార్త మానీయ నిజపక్కణ | నిగడే స్థాపయిత్వా తం స్వయం సుష్వాప విజ్వరః. 4

నిగడ స్థ స్తతో రాజా వసంశ్చాండాల వక్కణ | అన్నపానే పరిత్యజ్య సదా వై తదశోచయత్‌. 5

తన్వీ దీనముఖీ దృష్ట్వా బాలం దీనముఖం పురః | మాం స్మరత్యసుఖావిష్టా మోక్షయిష్యతి నౌ నృపః. 6

ఉపాత్త విత్తో విప్రాయ దత్త్వావిత్తం ప్రతిశ్రుతమ్‌ | రోదమానం సుతం వీక్ష్య మాం చ సంబోధయిష్యతి. 7

తాతపార్శ్వం ప్రజామీతి రుదంతం బాలకం పునః | తాత తాతేతి భాషంతం తథా సంబోధయిష్యతి. 8

న సా మాం నృగశాబాక్షీ వేత్తి చాండాలతాంగతమ్‌ | రాజ్యనాశః సుహృత్త్యాగో భార్యతనయ విక్రయః. 9

తత శ్చాండాలతా చేయమహో దుఃఖపరంపరా | ఏవం స వివస న్నిత్యం స్మరంశ్చ దయితాం సుతమ్‌. 10

నినాయ దివసా న్రాజా చతురో విధిపీడితః | అథాహ్ని పంచమే తేన నిగడాన్మో చితో నృపః. 11

ఇరువదినాలుగవ అధ్యాయము

రాజు చండాలు నింటి కేగిన పిమ్మట యేమి చేసెను? ఓ సూతవర్యా! అదంతయును నిన్నడుగుచున్నాను. సత్వర ముగ నాకు దెల్పుము అని శౌకనుడడగు సూతు డిట్లనెను: చండాలునినుండి ధనముగొని విశ్వామిత్రుడు వెళ్ళిపోయెను. చండా లుడు సంతోషముతో నరపతిని బంధించెను. అసత్య మేల పల్కితివని యతడు రాజును కట్టెతో గొట్టెను. కట్టె దెబ్బలకు రాజు బాధపడి కలత జెందిన మనస్సుగలవాడయ్యెను. తన యిష్ట బంధుల వియోగమునకు కుందుచున్న రాజును చండాలుడు తన యింటికి తెచ్చి యతనిని గొలుసుల చేత కట్టి నిశ్చింతగ నిద్రించెను. చండాలు నింట రాజు సంకెళ్ళలో బద్ధుడై యన్న పానములు వదలి యీ రీతిగ చింతింపసాగెను. ఇపుడు నా భార్య దీనయై తన ముందు దీన వదనుడై యున్న బాలునిగాంచి నేను వచ్చి తమ్ము తప్పక కాపాడుదునని యిటుల నన్నామె స్మరించుచుండును. 'నా పతి ధనము సంపాదించి తన మాట ప్రకారము మునికి ధనమిచ్చి వచ్చి యేడ్చుచున్న కొడుకును గని నాకు జాగృతి గల్గించగలదు. నేను నాయన దగ్గఱకే పోయెద. ఓ నాయనా! నామనా! యని కన్నీరు గార్చుచున్న చిన్నారి బాలుని నా పతి వచ్చి యోదార్చగలడు. నేను నా మంత్రులను విడిచి భార్యా పుత్రుల నమ్ముకొని రాజ్యము గోల్పోయి చండాలత్వమందుట నా భార్యకు తెలియదా: అక్కటా : ఏమి యీ చండాలత్వబాధ! అయ్యో! కష్టాల మీద కష్టాలు దాపురించెనే! అని రాజు అనుదినము తన భార్యాపుత్రులను దలంచును. అట్లు రాజు విధి పీడితుడై సంకెళ్లలో నాల్గు నాళ్ళునుండి అయిదవనాడు సంకెలల బాధ నుండి ముక్తుడయ్యెను.

చాండాలే నానుశిష్ట శ్చ మృతచైలాపహారణ | క్రుద్ధేన పరుషైర్వాక్యై ర్నిర్బర్స్య చ పునః పునః. 12

కాశ్యా శ్చ దక్షిణ భాగే శ్మశానం విద్యతే మహత్‌. | తద్రక్షస్వ యథాన్యాయం న త్యాజ్యం తత్తయాక్వచిత్‌. 13

ఇమంచ జర్జరం దండం గృహీత్వా యాహి మాచిరమ్‌ | వీరబాహో రయం దండ ఇతి ఘోషస్వ సర్వతః. 14

సూతః : కస్మిం శ్చి దథ కాలేతు మృతచైలాపహారకః | హరిశ్చంద్రోభవ ద్రాజా శ్వశానే తద్వశానుగః. 15

చాండాలే నానుశిష్ట స్తు మృతచైలాపహారిణా | రాజా తేన సమాదిష్టో జగామ శవమందిరమ్‌. 16

పుర్యా స్తు దక్షిణ దేశే విద్యమానం భయానకమ్‌ | శవమాల్య సమాకీర్ణం దుర్గంధ బహుధూమకమ్‌. 17

శ్వశానం ఘోరసన్నాదం శివాశతసమాకులమ్‌ | గృధ్రగోమాయు సంకీర్ణం శ్వబృందపరివారితమ్‌. 18

అస్థిసంఘాత సంకీర్ణం మహాదుర్గంధ సంకులమ్‌ | అర్థదగ్ధ శవాస్యాని వికసద్దంత పంక్తిభిః. 19

హసంతీ వాగ్ని మధ్యస్థ కాయసై#్యవం వ్యపస్థితిః | నానామృత సుహృన్నాదం మహాకోలాహలాకులమ్‌. 20

హా పుత్ర మిత్ర హా బంధో భ్రాతర్వత్స ప్రియాద్యమే | హావ్యతే భాగినేయార్హ హా మాతుల పితామహ. 21

మాతామహ పితః పౌత్ర క్వగతోస్యేహి బాంధవ | ఇతి శ##బ్దైః సమాకీర్ణం బైరవైః సర్వదేహినామ్‌. 22

జ్వలన్మాంస వసామేద చ్ఛూమితి ధ్వనిసంకులమ్‌ | అగ్నే శ్చటచటాశబ్దో భైరవో యత్ర జాయతే. 23

పిదప చండాలుడు కోపముతో మాటిమాటికి పరుషముగ రాజును బెదిరించుచు శవములపై గప్పిన వస్త్రములు లాగుటకు రాజు నాజ్ఞపించెను. ఈ కాశికి దక్షిణమున గొప్ప శ్మశాన భూమి గలదు. అందు మనకు న్యాయముగ వచ్చునది తీసికొనుము. ఎంత మాత్రము వదలకుము. ఈ ప్రాత దండమును తీసికొని శీఘ్రముగ వెళ్ళుము. ఇది వీరబాహుని దండమని యంతట ప్రకటించుము. సూతుడిట్లనెను: ఈ విధముగ హరిశ్చంద్ర మహా రాజంతటి వాడొకనాడు చండాలునకు వశుడై శ్మశానమున శవ వస్త్రములు గ్రహించుటకు నియమింపబడెను. ఇట్లు శవ వస్త్రములు లాగుటకు చండాలునిచే నాదేశింపబడి రాజు వల్లకాటికి వెళ్ళెను. అది కాశీపురికి దక్షిణ భాగమున దుర్వాసనలతో చచ్చినవారి యొముకలతో పీనుగుల పెంటగ రోతగ నుండెను. అట నక్కలు - కుక్కలు - రాబందులు - గ్రద్దలు - గుంపులు గుంపులుగ గుమి గూడి మాంస విహారములతో ఘోరముగ నఱచుచుండెను. అటు క్రుళ్ళిన యొముకల ప్రోగులు దుర్గంధము నిండియుండెను. ఒక చోట సగము కాలిన శవములు నోళ్ళు తెఱచుకొని యుండెను. అవిఎల్లవారునిట్లే నిప్పు మంటలలో కావలసిన వారే యని పరిహసించు చున్నట్లుండెను. అట మృతుల బంధుల యేడ్పుల కోలాహల మితింతనరాదు. హా కొడుకా! హా మిత్రమా! అయ్యో నా బంధువా! ఓ సోదరా! ఓ బావా! హా మేనమామ! హా తాత! ఓమాతామహా! ఓ తండ్రీ! హా! మనుమడా! ఎక్కడకు పోతివి. మఱొక్కమాఱు రమ్ము. అను ప్రాణుల భెరవ శబ్దములు వ్యాపించియుండెను. చితుల మంట లందు శవముల మాంసము - మెదడు - మజ్జలు భూ భూ చిటపట చప్పుళ్ళు చేయుచు మహా భయంకరముగ నుండెను.

కల్పాంతసదృశా కారం శ్వశానం తత్సుదారుణమ్‌ | స రాజా తత్ర సంపాప్తో దుఃఖాదేవ మశోచత. 24

హాభృత్యా మంత్రిణోయూయం క్వతద్రాజ్యం కులోచితమ్‌ | హాప్రియేపత్ర మే బాలమాం త్వక్త్వామంద భాగ్యకమ్‌. 25

బ్రాహ్మణస్య చ కోపేన గతాయూయం క్వదూరతః | వినా ధర్మం మనుష్యాణాం జాయతేన శుభం క్వచిత్‌. 26

యత్నతో ధారయే త్తస్మా త్పురుషో ధర్మమేవ హి | ఇత్యేవం చింతయం స్తత్ర చాండాలోక్తం పునః పునః. 27

మలేన దిగ్దసర్వాంగః శవానాం దర్శనే వ్రజన్‌ | లకుటాకారకల్పశ్చ ధావంశ్చాపి తతస్తతః. 28

అస్మిఞ్చవ ఇతం మౌల్యం శతం ప్రాప్స్యామి చాగ్రతః | ఇతం మమ ఇదం రాజ్ఞ ఇతం చాండాలకస్య చ. 29

ఇత్యేవం చింతయ న్రాజా ప్యవస్థాం దుస్తరాం గతః | జీర్ణైక పటసు గ్రంథి కృతకంథా పరిగ్రహః. 30

చితాభస్మంరజోలి ప్త ముఖబాహూదరాఘ్రికః | నానామేదోవసా మజ్ఞాలిప్త పాణ్యంగులిః శ్వసన్‌. 31

నానాశవౌదన కృతక్షున్ని వృత్తి పరాయణః | తదీయమాల్య సంశ్లేష కృతమస్తకమండలః. 32

న రాత్రౌ న దివా శేతే హాహేతి ప్రవదన్ముహుః | ఏవం ద్వాదశమాసా స్తు నీతా వర్షశతోపమాః. 33

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కధే చతుర్వింశోధ్యాయః.

ఆశ్మశానము కల్పాంతమందువలె నుండెను. ఆ చోటికి రాజువెళ్ళి దుఃఖముతో పలురీతుల నిట్లు వలవల యేడ్చెను. ఓ నా మంత్రులారా! భృత్యులారా! మీరెచట నున్నారు నా కులోచితమైన రాజ్య మెక్కడ! హా! ప్రియురాలా! హా కుమారా! మందభాగ్యుడనగు నన్ను వదిలి వెళ్ళితిరా : మీరు మునిశాపమునకు గురియై యెంత దూరతీరాలనుంటిరో కదా! ధర్మ మాచరింపని మానవులకు లోకాన మేలు గలుగదు. కనుక పురుషు డెల్ల భంగుల ప్రయత్నించి ధర్మ మాచరింపవలయును. అనుచు తలంచునుంతలో రాజునకు చండాలుని మాటలు జ్ఞప్తికి వచ్చెను. రాజు పూచికపుల్లవలె సన్నని మేనితో మురికి పట్టిన తనువుతో పీనుగులను చూచుట కటునిటు పరుగెత్తెను. అంతలో రాజొక శవమునుగని దీనికి నూఱుముద్రల వెల పొందుదును. వీనిలో - నిది రాజునకు - ఇది చండాలునకు - ఇది నాకు. అని తనలో తానూహించుకొనుచు నొక చినిగిన చిల్లుబొంతను మీద కప్పుకొని తీరని దురవస్థ పాలయ్యెను. చితిబూడిద-ధూళి- రాజుయెక్క వేగమున చేతులపై - పొట్టపై - కాళ్ళపై నిండగ పెక్కు శవాల మేదస్సు - మజ్జ-వస-తన వ్రేళ్ళకంటుకొంటవలన రాజు పెక్కు శవాన్నములు తిని యాకలిమంట చల్లార్చుకొనుచు నెముకల దండలు మెడనిండ వ్రేలాడ వేసికొనుచుండెను. పగలుగాని రేతిరిగాని కంటికి కునుకైన పట్టనందున అయ్యో! అయ్యో-యని మొత్తుకొనుచు రాజు వందలయేండ్లు గడపినట్లు పండ్రెండు నెలలు గడపెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున నిరువదినాల్గవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters