Sri Devi Bagavatham-2    Chapters   

అథ దశమో7ధ్యాయః.

వ్యాస ఉవాచ : బ్రహ్మలోకా దూర్ధ్వభాగే సర్వలోకో7స్తి యః శ్రుతః | మణిద్వీపః స ఏవాస్తి యత్ర దేవీ వితరాజతే. 1

సర్మస్మా దధికోయస్మా త్సరవలోకస్తతఃస్మృతః | పురా వరాంశ##యై వాయం కల్పితో మనసేచ్ఛయా. 2

సర్వాదౌ నిజవాసార్థం ప్రకృతి మూలభూతయా | కైలాసా దధికో లోకో వైకుంఠా దపి చోత్తమః. 3

గోలోకాదపి సర్వస్మా త్పర్వలోకో7ధికః స్మృతః | న తత్సమం త్రిలోక్యాం తు సుందరం విద్యతే క్వచిత్‌. 4

ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకమ్‌ | ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ. 5

బహుయోజన విస్తీర్ణో గభీర స్తావదేవ హి | మణిద్వీపస్య పరితో వర్తతే తు సుధోదధిః. 6

మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగశత సంకులః | రత్నాచ్ఛవాలుకాయుక్తో ఝషశంఖ సమాకులః. 7

వీచిసంఘర్ష సంజాత లహరీకణ శీతలః | నానా ధ్వజసమాయుక్త నానాపోతగతాగతైః. 8

పదవ అధ్యాయము

మణిద్వీప వర్ణనము

శ్రీవ్యాసు డిట్లనెను : బ్రహ్మలోకమునకు పైని సర్వలోకము విరాజిల్లుచుండును. దానినే మణిద్వీప మనియు నందురు. అందు శ్రీత్రిభువనేశ్వరీదేవి ప్రకాశించుచుండును. అన్నిలోకముల కన్న నధికమైన దగుట వలన మణిద్వీపమును సర్వలోక మనియు నందరు. శ్రీపరాంబిక దానిని తన సంకల్ప మాత్రముననే నర్మించెను. శ్రీమూలప్రకృతిదేవి యీ సకల సృష్టికి పూర్వము మణిద్వీపమును తన నివాసముగ నేర్పఱచుకొనెను. అది కైలాసము కన్న మిన్నగను వైకుంఠము కంటె నుత్తమముగను గోలోకమునకంటె శ్రేష్టముగను తనరారుచున్నది. కనుకనే దానిని సర్వలోక మందురు. ఈ త్రిలోకములందును దానిని మించి సుందరతరమైన నగర మింకొకటి లేనేలేదు. అది ముజ్జగములకు గొడుగు వంటిది. సంసార సంతాపమును నశింపజేయునుది. బ్రహ్మాండము లన్నిటికిని చల్లని నీడ వంటిది. ఇజేన్ని యామడల వైశాల్యము గలదో యంత గంభీరమైనది. ఆ మణిద్వీపమునకు నాల్గువైపుల నమృత సముద్రము విలసిల్లుచుండును. అందు గాలి తాకిడుల కువ్వెత్తుగ లేచు చల్లని కెరటములును రతనాల యిసుక ప్రదేశములును - దక్షిణావర్తము మున్నగు వివిధ శంఖములును - పలు వన్నెల చేపలును కనులపండువు చేయును. అందు తరంగముల వరుసలచే గల్గిన చల్లని నీటి తుంపురులును - వివిధములైన టెక్కెములు టెక్కుతో నటు నిటు పయనించు నందాల పడవలునందు శోభలుపవెలార్చుచుండును. ఆ పొడవైన తీరములందు కనుకల కింపైన సొంపైన బంగారు చెట్ల వరుసలు గలవు.

విరాజమానః పరిత స్తీరరత్న ద్రుమో మహాన్‌ | తదుత్తరమయోధాతు ర్నిర్మితో చగగనే తతః. 9

సప్తయోజన విస్తీర్ణః ప్రాకారో వర్తేతే మహాన్‌ | నానాశస్త్ర ప్రహరణా నానాయుద్ధవిశారదాః. 10

రక్షకా నివసంత్యత్ర మోదమానాః సమంతతః | చతుర్ద్వార సమాయుక్తో ద్వారపాల శతాన్వితః. 11

నానాగణౖః పరివృతో దేవీభక్తియుతైర్నృప | దర్శనార్థం సమాయాంతి యే దేవా జగదీశితుః. 12

తేషాం గణా వసంత్యత్ర వహనాని చ త త హి | విమానశత సంఘర్ష ఘంటా స్వనసమాకులః. 13

హయహేశాఖురాఘాత బధిరీ కృత దిజ్ముఖః | గణౖః కిలకిలారావై ర్వేత్రబసై#్త శ్చ తాడితాః. 14

సేవకా దేవసంఘానాం భ్రాజంతే తత్ర భూమిప | తస్మిన్కోలహాలే రాజ న్న శబ్దః కేనచి త్క్వచిత్‌. 15

కస్యచిచ్ఛ్రూయతే7త్యంతనానాధ్వనిసమాకులే | పదేపదే మిష్టవారి పరిపూర్ణ సరాంసి చ. 16

వాటికా వివిధా రాజన్‌ రత్న ద్రుమని రాజితాః |

వాని కావల నినుముతో నిర్మించబడి ఏడామడల ఎత్తుగల దృఢ ప్రాకారము గలదు. అందు పెక్కు శస్త్రాస్త్రము లుపయోగించి పోరుటలో నేర్పరులగు రక్షకులు వీరోత్సాహముతో నివసించుచుందురు. దానికి నాలుగు ద్వారములు గలవు పతి ద్వారమందును వందల కొలది ద్వారపాలకులు కాపుందురు. అందు దేవీభక్తులు గణములుగ నివసింతురు. వారెప్పుడును జగదీశ్వరీదేవి దివ్య దర్శనమున కేతెంచుచుందురు. ఆ దేవీభక్తులు తమ తమ దివ్య వాహనములపై నరుదెంతురు. వార వేలాది విమానముల గంటల చప్పుడులును వారి గుఱ్ఱముల సకిలింపులును వాని డెక్కల టక - టక ధ్వనులును దిక్కులకు చెవుడు పట్టునట్లు మారుమ్రోగుచుండును. అచట దేవీ జనములు వేత్రహస్తలై కిలకిలారావములు చేయుచు గోల చేయవద్దనుచు దేవసేవకులను మోదుచుందురు. రాజా! ఆ కోలహలము నడుమ నెవ డేమి చప్పడు చేసెనో తెలియ వీలు కాకుండును. అంత మహాధ్వనిలో నొకరిమాట - యింకొకరికి వినిపించదు. అచ్చోట నడుగడుగన చల్లని - తీయని కొలంకులు స్వచ్ఛములు గలవు. అచ్చోట రత్నమయతరువులతో తనరారు నుద్యానములు గలవు.

దదుత్తరం మహాసారదాతు ర్నిర్మిత మండలః. 17

సాలో7పరో మహానస్తి గగనస్పర్శి యచ్చిరః | తేజసా స్వా చ్చతగుణః పూర్వశాలాదయం పరః. 18

గోపుర ద్వారసహితో బహువృక్ష సమన్వితః | యా వృక్ష జాతయః సంతి సర్వా స్తా స్తత్ర సంతి చ. 19

నిరంతరం పుష్పయుతాః సదాఫల సమన్వితాః | నవపల్లవ సంయుక్తా వరసౌరభ సంకులాః. 20

పనసా వకులా లోధ్రాః కర్ణికారాశ్చ శింశుపాః | దేవదారు కాంచనారా ఆమ్రాశ్చైవ సుమేరవః. 21

లికుచా హింగులాశ్చైలా లవంగాః కట్ఫలా సథా | పాటలా ముచుకుందాశ్చ ఫలిన్యో జఘనేఫలాః. 22

తాలాస్తమాలాః సాలాశ్చ కంకోలా నాగభద్రకాః | పున్నాగాః పీలవః సాల్వకావై కర్పూరశఖినః. 23

అశ్వకర్ణా హస్తికర్నా స్తాలపర్ణాశ్చ దాడిమాః | గణికా బంధుజీవాశ్చ జంబీరాశ్చ కురండకాః. 24

చాంపేయా బంధూజీవాశ్చ తధా వై కనకద్రుమాః | కాలాగురు ద్రుమాశ్చైవ తథా చందన పాదపాః. 25

ఖర్జూరా యూథికా స్తాలపర్ణ్యశ్చైవ తథేక్షవః | క్షీరవృక్షాశ్చ ఖదిరాశ్చించా భల్లాతకా స్తథా. 26

రుచకాః కుటాజా వృక్షా బిల్వవృక్షా సథైవచ | తులసీనాం వనాన్యేవం మల్లికానాం తథైవ చ. 27

ఇత్యాదితరుజాతీనాం వనాన్నుపవాని చ | నానావాపీశ##తై ర్యుక్తా న్యేవం సంతి ధరాధిప. 28

కోకిలారావ సంయుక్తా గుంజ ద్ర్బమరభూషితాః | నిర్యాస స్రావిణః సర్వే స్నిగ్ధచ్ఛాయా స్తరూత్తమాః. 29

నానా ఋతుభవా వృక్షా నానాపక్షి సమాకులాః | నానారస స్రావిణీభి ర్వదీభి రతిశోభితాః. 30

పారావత శుకవ్రాత సారికా పక్షమారుతైః | హంసపక్ష సమద్బూతా వాతవ్రాతైశ్చలద్ద్రుమమ్‌. 31

సుగంధగ్రాహి పవనపూరితం తద్వనోత్తమమ్‌ | మహితం హరిణీయూథై ర్దావమానైరిత స్తతః. 32

నృత్య ద్బర్హి కదంబస్యకేకారావైః సుఖప్రదైః | నాదితం తద్వనం దివ్యం మధు సావి సమంతతః. 33

దానికి నెగువ లోపలి వైపున మహాసార (కంచు) ధాతువుతో నిర్మితమైన పెద్ద సాలము కలదు. ఈ కంచు ప్రాకరము గగనమును తాకున ట్లుండును. ఇది యినుప ప్రాకారము కన్న నూఱురెట్లు గొప్పది. కంచు ప్రాకారపు గోపుర ద్వారాములు చాల ఎత్తుగ నున్నవి. చెట్లలో నెన్ని జాతులు గలవో యన్ని జాతుల చెట్లు నచట గలవు. ఆ చెట్ల కెల్లవేళలను కొంగ్రోత్త లేజిగుళ్ళును - కముగ వాసించు రంగురంగుల పూల గుత్తులును - తీయని పండ్లును విలసిల్లుచుండును. అచట పనస వకుళ లో ధ్ర కర్ణికార శంశుపా దేవదారు కాంచనార చూత నమేరు లికుచ హింగులైలా లవంగ కట్పల పాటల ముచుకుంద ఫలినీ జఘ నేఫల తాల తమాల సాల కంకోల నాగభద్ర పున్నాగ పీలు సాల్వక కర్పూరాశ్వకర్ణ హస్తికర్ణ తాల పర్ణ దాడిమీ గణికా బంధుజీవక జంబీర కురండక చాంపేయ బంధుజీవ కనక ద్రుమ కాలాగురు చందన ఖర్జూన యూథికా తాలపర్ణీక్షు క్షీరవృక్ష ఖదిర చించా భల్లాతక రుచట కుటజ బిల్వ తులసీ మల్లికాది వృక్షములుగల తోటలు మనోహరము లైనవి గలవు. ఈ విధముగ నచట పలువిధములైన వృక్షములు - వనములు - ఉపవనములు - వందల కొలది దిగుడుబావులు నెంతయో యందముగ నొప్పారుచుండును. ఆ చెట్లపై కూయు కోయిలల కుహూనాదములును గండుతుమ్మెదల ఝంఝమ్మను రొదలను చెవుల పండువు సేయును; చెట్లు దట్టమైన చల్లని నీడ నిచ్చునవి. ఆయా చెట్లు పలువిధముల పక్షులకు నివాస యోగ్యములు; పలురసములు ప్రవహించు నదులు తీరు భూములందు సొంపు మీరుచుండును. చిలుకలు - గోరువంకలు - పావురములు - రాయంచలు మున్నగు పక్షల ఱక్కల గాలులచే చెట్లకొమ్మ లూగుచుండును. ఇటువంటి చెట్లు సువాసనలు విరజిమ్ము గాలులతో నచటి వనములు పరిమళములు గుబాళించును. ఆ వనములందు జింకల గుంపు లిటునటు బితరిగంతులు వేయుచుండును. అట నెమళ్ల గుంపులు నర్తించుచుండును. వాని తీయని కేకారవమలు దెసలకు వ్యాపించును. ఈ విధముగ మణద్వీపమునందు సుఖదాయకమై మధురావములు గల్గి తేనెలు స్రవించు చెట్లతో వనము లలరారుచుండును.

కాంస్యసాలా దుత్తరే తు తామ్రసాలః ప్రకీర్తితః | చతురస్రసమాకార ఉన్నత్యా సప్తయోజనః. 34

ద్వయోస్తు సాలయో ర్మధ్యే సంప్రోక్తా కల్పవాటికా | యేషాం తరూణాం పుష్పాణి కాంచనాభాని భూమిప. 35

ప్రత్రాణి కాంచనాభాని రత్వబీజఫలాని చ | దశయోజనగంధోహి పసర్పతి సమంతతః. 36

తద్వనం రక్షితం రాజ న్వసంతేన ర్తునానిశమ్‌ | పుష్పసింహాసనాసీనః పుశ్పచ్ఛత్రవిరాజితః. 37

పుష్పభూషాభూషిత శ్చ పుష్పాసవ విఘూర్ణితః | మధుశ్రీర్మాధవశ్రీ శ్చ ద్వేభార్యే తస్య సమ్మతే. 38

క్రీడతఃస్మేరపదనే సుమస్తబకకందుకైః | అతీవరమ్యం విపినం మధుస్రావి సమంతతః. 39

దశయోజనపర్యంతం కునుమామోదవాయునా | పరీతం దివ్య గంధర్వైః సాంగనై ర్గానలోలుపైః. 40

శోభితం తద్వనం దివ్యం మత్త కోకిలనాదితం | వసంతలక్ష్మీ సంయుక్తం కామికామ ప్రవర్ధనమ్‌. 41

ఆ కంచు ప్రాకారమునకు నెగువగ లోపలివైపున రాగి ప్రాకారము గలదు. అది చతురస్రాకారముగ నే డామడల యోత్తుగ తనర్చుచుండును. కంచు - రాగి ప్రాకారముల మధ్యలో కల్పవనములు గలవు. ఆ చెట్ల పూవులు సువర్ణపుష్పములవలె కాంతులతో సోబగు లీనుచుండును. వాని యాకులు - బంగారు రేకులుగను భీజఫలములు - రత్నముల వలెను సొంపు గూర్చుచుండును. ఆచెట్ల కమ్మని పరిమళముల కెరటాలు పది యామడల వఱకు వ్యాపించును. రాజా! ఆ కల్పవనమునందు వసంతరాజు రేయింబవళ్ళు కొలువై వకసంతశోభలు వెలార్చును. వసంతరాజు పూల గొడుగుల క్రింద పుగద్దెపై విరాజిల్లుచుండును. అతడు పూలసోమ్ములు దాల్చి పూతేనియులు గ్రోలి మత్తెక్కి యుండును. అతని భార్యాలు మధుశ్రీ - మాదవశ్రీలు. వారు నిరంతరము లేనగవులు గ్రుమ్మరింతురు. వసంతరాజు తన రాణులను గూడి వలపు పూగుత్తుల బంతులతో నాడుచుండును. ఇట్లు తేనియలు జాలువారు కల్పకవన మెంతయో సమ్మోదము గూర్చును. ఈ తోటలోని కమ్మని తెమ్మెరలు -చుట్టు పదామడలు వ్యాపించును. ఆ పూల వాసనలు గుబుల్కోన వనమునందు గానలాలసలైన గంధర్వ కామినులు గుత్తపు కౌగిళ్ల బంధాలలో గంధర్వ యువకులు సయ్యాటలాడుచుందురు. ఆ దివ్యవనము మత్తకోయిలల కలరావములతో వసంతశ్రీలశోభలతో కాముకులలో వలపు తలపులు రేపుచుండును.

తామ్రసాలా దుత్తరత్ర సీససాలః ప్రకీర్తితః | సముచ్ఛ్రాయః స్మృతో ప్యస్య సప్తయోజన సంఖ్యయా. 42

సంతానవాటికామధ్యే సాలయో స్తు ద్వయో ర్నృప | ధశయోజన గంధస్తు ప్రసూనానాం సమంతతః. 43

హిరణ్యాభాని కుసుమా న్యుత్ఫుల్లాని నిరంతరమ్‌ | అమృత ద్రవ సంయుక్త ఫలాని మధురాణి చ. 44

గ్రీశ్మర్తు ర్నాయకస్తస్యా వాటికాయ నృపోత్తమ | శక్రశ్రీ శ్చ శుచిశ్రీ శ్చ ద్వేభార్యే జనసంమతే. 45

సంతాపత్రస్తలోకా స్తు వృక్షమూలేఘ సంస్థితాః | నానాసిద్ధైః పరివృతో నానాదేవైః సమన్వితః. 46

విలాసినీనాం బృందై స్తు చందన ద్రవ పంకిలైః | పుష్పమాలా భూషితై స్తు తాలవృంత కరాంబుజైః. 47

రాగి ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున సీస ప్రాకారము గలదు. అది యే డామడల యంత యెత్తున నలరుచున్నది. రాగి - సీసపు ప్రాకారముల నడుమ సంతానవాటిక గలదు. అందలి పూలతెమ్మెరల కెరటాలు పదామడల వఱకు వ్యాపించును. అందలి పూవులు - బంగారు కాంతు లీనుచు నెల్లవేళల విప్రారియే యుండును. అందలి ఫలములు - మధుర రసములై తీయగ నుండును. సంతానవాటికకు గ్రీశ్మ ఋతువు నాయకుడు. అతని భార్యలు శుక్రశ్రీ - శుచిశ్రీలు. సంసాప తాపములకు భయపడిన వారా వృక్షముల మొదట శాంతిగ విశ్రమింతురు.అచట నెందఱో దేవతలు - సిద్ధులు నివాస ముందురు. అచ్చొట మేనులందు చందనములందుకొని పూలమాలలు మెడ దాల్చి తాటాకు విసనకఱ్ఱలు చేత బూనిన నవవిలాసినులు గుంపులు గుంపులు నొయ్యారము లొలుకబోతురు. ప్రాకారఃశోభితో రాజానో శీతలాంబునిశేవిభిః ! సీససాలా దుత్తరత్రాప్యారకూటమయః శుభః. 48

ప్రాకారో వర్తతే రాజ న్మునియోజనదైర్ఘ్యవాన్‌ | హరిచందన వృక్షాణాం వాటీ మధ్యే తయోః స్మృతా. 49

సాలయో రధినాథ స్తు వర్షర్తుర్మేఘవాహనః | విద్యుత్పింగలనేత్ర శ్చ జీమూతకవచః స్మృతః. 50

వజ్రనిర్ఘోషముఖర శ్చేంద్రధాన్వా సమంతతః | సహస్రశోవారిధారా ముంచన్నాస్తే గణా గ్రతః. 51

సభః శ్రీ శ్చ సభస్యశ్రీః స్వరస్యా రస్యమాలినీ | అంబాదులా నిరత్నిశ్చా భ్రమంతీ మేఘయంతికా. 52

వర్షయంతీ చిపుణికా వారిధారా చ సంమతాః | వర్శర్తో ర్ద్వాదశప్రోక్తాః శక్తయో మదవిహ్వాలాః. 53

నవపల్లవ వృక్షాశ్చ నవీనలతికాన్వితాః | హరితాని తృణాన్యేవ వేష్టితా యోర్ధరా7ఖిలా. 54

నదీనద ప్రవాహా శ్చ ప్రవహంతి చ వేగతః | సరాంసి కలుషాంబూని రాగిచిత్తసమాని చ. 55

వసంతి దేవాః సిద్ధా శ్చ యే దేవీ కర్మకారిణః | వాపీకూపతటాకా శ్చ యే దేవ్యర్థే సమర్పితాః. 56

తే గణా నివసంత్యత్ర సవిలాసా శ్చ సాంగనాః |

రాజా! అచట ప్రాణులు చల్లని మంచితీర్థములు గ్రోలుదురు. అ సిసపు ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున నందమైన యిత్తడి ప్రాకారము గలదు. ఇత్తడి ప్రాకారము ఏడామడల ఎత్తున గలదు. సీసపు - ఇత్తడి ప్రాకారముల నడము హరి చందన వృక్షముల వనము చెన్నొందుచుండును. వాని కధిపతి మేఘవహనుడైన వర్షాఋతువు. అతని కన్నులు మెఱపులవలె పింగళవర్ణములు గలవి. అతని కవచము - మేఘములు గుంపు. అతడు వజ్రము పగిది గర్జించుచు నింద్రధనువుచేత బూని కుంభద్రోణముగ నెల్లెడల వర్షించుచు గణములను గూడియుండును. నభఃశ్రీ - నభస్యశ్రీ - స్వరస్య - రస్య మాలిని - అంబాదుల - నితంతి - భ్రమంతి - మేఘయంక - వర్షయంతి - చిపుణిక - వారిధార - మదవిహ్వల - యనువారలు వర్షాఋతువు నకు పండ్రెండుగురు మదవతులైన శక్తులుగ పేరొందిరి. ఆ చోటంతయును కొంగ్రోత్తగ చిగురించిన చెట్ల వరుసలతోను లేదీగెలతోను పచ్చని పైరులతోను కన్నులపండువు చేయుచుండును. అచటి నదీనదములు నిరంతరము ప్రవహవేగముతో హృదయానందము గూర్చును. కొలంకులందిలి కలుషడలములును రాగుల యంతరంగములవలె చెన్నొందును. అచ్చట శ్రీదేవి మహోత్సవములు జరుపునట్టి సిద్ధులు - దేవతలును నివసింతురు. అచట వాపీకూపములు - తటాకములు దేవిసేగకు వినియోగపడుచుండును అచట ఆగణములు విలాసినులగుతమ యంగనలను గూడి విహరింతురు.

ఆరకూటమయాదగ్రే సప్తయేజన దైర్ఘ్యవాన్‌. 57

పంచలోహాత్మకః సాలో మధ్యేమందారవాటికా | నానాపుష్పలతాకీర్ణా నానాపల్లవశోభితా. 58

అధిష్ఠాతా7త్ర సంప్రోక్తః శరదృతురనామయః | ఇషలక్ష్మీ రూర్జ లక్ష్మీ ర్ద్వేభార్యే తస్యసంమతే. 59

నానాసిద్ధా వసంత్యత్ర సాంగనాః సపరిచ్ఛదాః |

ఆ యిత్తడి ప్రాకారమునకు ఎగువ వైపున లోపలగా ఏడామడల ఎత్తున పంచలోహముల ప్రాకారము గలదు. ఇత్తడి పంచలోహములు ప్రాకారముల నడుమ మందారవనము చెలువొందుచుండును. ఆ చెట్లు పూల తీగెలతోను పలు విధముల యెఱ్ఱని చిగుళ్లతో నందగించును. ఏ రోగమును లేని శరధృతువు దాని కధిష్టాత. ఇషలక్ష్మి-ఊర్జలక్ష్మి యను వారు శరదృతు భార్యలు. అచట సిద్దులు తమ భార్యలతో కాపురములు చేయుచుందురు.

పంచలోహమయా దగ్రేసప్తయోజనదైర్ఘ్యవాన్‌. 60

దీప్యమానో మహశృంగై ర్వర్తతే రౌప్యసాలకః | పారిజాతాటవీ మధ్యే ప్రసూన స్తబకాన్వితా. 61

దశయోజనగంధీని కుసుమాని సమంతతః | యోదయంతి గణాన్సర్వా న్యే దేవీకర్మకారిణః. 62

తత్రాధినాథః సంప్రోక్తోహేమంతర్తుర్మహోజ్జ్వలః | సగణః సాయుధః సర్వాన్‌ రాగిణోరంజయన్నృప. 63

సహశ్రీ శ్చ సహస్యశ్రీ ర్ద్వే భార్యేతస్య సంమతే | వసంతి తత్ర సిద్దా శ్చ యే దేవీవ్రతకారిణిః. 64

ఆ పంచలోహ ప్రాకారమునకు ఎగువ లోపలి వైపున నేడామడల ఎత్తున ఎతైన శిఖరములతో వెండి ప్రాకారము తళతళ మెఱయుచుండును. అచటి పారిజాత వృక్షములకు క్రొత్త పూగుత్తులు నెత్తావు లీను చుండును. వాని పరిమళాలు పదామడల వఱకు వ్యాపించి దేవీ పూజలు భక్తులకు ప్రసన్నత చేకూర్చుచుండును. రాజా! దాని కధిపతి మహోజ్జ్వల మైన హేమంతఋతువు. అతడు తన గణములతో నాయుధములతో ననురాగవతుల మనసులను పరవశింపజేయును. అతని భార్యలు సహఃశ్రీ - సహస్యశ్రీలు. అచట దేవీవ్రతము లాచరించు సిద్ధులు నివసించుచుందురు.

రౌప్యసాకాలమయా దగ్రే సప్తయోజనదైర్ఘ్యవాన్‌ | సౌవర్ణసాలః సంప్రోక్త స్తప్తహాటకకల్పితః. 65

మధ్యే కదంబవాటీతు పుష్ప పల్లవశోభితా | కందబమదిరాధారాః ప్రవర్తంతే సహస్రశః. 66

యాభిర్నిపీతపాతాభి ర్విజానందో7ను భూయతే | తత్రాదినాథః సంప్రోక్తః శైశిరర్తుర్మహోదయః. 67

తపఃశ్రీశ్చ తపసశ్రీర్ద్వే భార్యే తస్య సంమతే | మోదమానః సహైతాభ్యాం వర్తతే శిశిరాకృతిః. 68

నానావిలాససంయుక్తో నానాగణ సమావృతః | నివసంతి మహాసిద్ధా యే దేవీదానకారిణః. 69

నానాభోగసముత్పన్న మహానందసమన్వితాః | సాంగనాః పరివారై స్తు సంఘశః పరివారితాః. 70

ఆ వెండి ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున బంగారు ప్రాకారము క్రాగిన మేలిమి బంగారముతో నేడామడల ఎత్తున వెలుగుచుండును. వెండి - బంగారు ప్రాకారముల నడుమ పూలతో - చిగుళ్లతో శోభిల్లునట్టి కదంబవనము గలదు. ఆ తెట్లనుండి కదంబమద్యము వేలధారలుగ స్రవించుచుండును. ఆ రసధారలు స్వేచ్ఛగ క్రోలుట వలన నాత్మానందనము గల్గును. దాని కధిపతి శిశిరర్తువు. అతని భార్యలు తపఃశ్రీ - తపస్య శ్రీలు శిశిరర్తువు వారిని గూడి యంతట ప్రమోదించు చుండును. అచ్ఛో మహాసిద్ధులు పలువిధముల గణములతో హావభావవిలాసములతో గూడి దేవీ ప్రీతిగ దానము లిచ్చుటకు సిద్ధముగ నుందురు. వారు తమ తమ రమణులతో కాపురములు చేయుచు సుఖభోగము లనుభవించుచు సంతోషముగ నుందురు.

స్వర్ణసాలమయా దగ్రే మునియోజన దైర్ఘ్యవాన్‌ | పుష్పరాగమయః సాలః కుంరుమారుణ విగ్రహః. 71

పుష్పరాగమయీ భూమిర్వనాన్యుపవనాని చ | రత్న వృక్షాలవాలాశ్చ పుష్పరాగమయాః స్మృతాం. 72

ప్రాకారో యస్య రత్నస్య తద్రత్నరచితా ద్రుమాః | వనభూః పక్షిణశ్చైవ రత్మ వర్ణజలానిచ. 73

మండపా మండప స్తంభాః సరాంసి కమలాని చ | ప్రాకారే తత యద్యత్స్యాత్తత్సర్వం తత్సమం భ##వేత్‌. 74

పరిభాషేయ ముదిష్టా రత్న శాలాదిషు ప్రభో | తేజసా స్యాల్లక్షగుణః పూర్వసాలాత్పరో నృప. 75

దిక్పాలా నివసత్యత్ర ప్రతిబ్రహ్మండవర్తినామ్‌ | దిక్పాలానాం సమష్ట్యాత్మరూపః స్పూర్జద్వరాయుధాః. 76

ఆ బంగారు ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున ఏడామడల ఎత్తున పుష్పరాగమణుల ప్రాకారము చెన్నొందును. అదెఱ్ఱకుంకుమవలె నుడును. అచటి నేల - వనములు - ఉపవనము లన్నియును పుష్పరాగమయములే. అచటి రత్నతరువులు పుష్పరాగపు చెట్లపాదులు సొంపుగ నుండును. అచట రత్న ప్రాకారమును గలదు. దానిలోని చెట్లు - పక్షులు - వనభూములు నన్నియును రత్నమయములే. మండపములు - స్తంభములు - సరోవరములు - కమలములు నన్నియును రత్నమయములే. రత్నప్రాకారము గూర్చి తెల్పితిని. ఇది యితర ప్రాకారముల క్న లక్షరేట్లుగ ప్రకాశించుచుండును. అచట ప్రతి బ్రహ్మాండమందలి దిక్పతులైన యింద్రాదులు వరాయుధములు దాల్చి దిక్పాల సమష్ట్యాత్మరూపముతో వెలుగొందుచుందురు.

పూర్వశాలం సముత్తుంగశృంగా పూరమరావతీ | నానోపనవసంయుక్తా మహేంద్రస్తత్ర రాజతే. 77

స్వర్గశోభా చ యా స్వర్గే యావతీ స్యాత్తతో7ధికా | సమష్టితనేత్రస్య సహస్రగుణతః స్మృతా. 78

ఐరావత సమారూఢో వజ్రహస్తః ప్రతాపవాన్‌ | దేవసేనాపరివృతో రాజతే త్ర శతక్రతుః. 79

దేవాంగనాగణయుతా శచీ తత్ర విరాజతే | వహ్నికోణ వహ్ని పురీ వహ్ని పూః సదృశీ నృప. 80

స్వాహాస్వధా సమాయుక్తా వహ్విస్తత్ర విరాజతే | నిజవాహన భూషాఢ్యో నిజదేవగణౖ ర్వృతః. 81

యామ్యాశాయాం యమపూరీ తత్ర దండధరో మహాన్‌ | స్వభ##టైర్వేష్టితో రాజన్‌ చిత్రగుప్త పురోగమైః. 82

నిజశక్తియుతో భాస్వత్తనయో7స్తి యమో మహాన్‌ | నైరృత్యాం దిశి రాక్షస్యాం రాక్షసైః పరివారితః. 83

ఖడ్గధారీ స్ఫురన్నాస్తే నిర్‌ ఋతి ర్నిజశక్తియుక్‌ | వారుణ్యాం వరుణో రాజా పాశధారీ ప్రతాపవాన్‌. 84

మహాఝష సమారూఢో వారుణీమధు విహ్వలః | నిజశక్తి సమాయుక్తో నిజయాదోగణాన్వితః. 85

సమాస్తే వారుణ లోకే వరుణానీరతాకులః | వాయుకోణ వాయులోకో వాయుస్తత్రాధితిష్ఠతి. 86

వాయుసాధన సంసిద్ధ యోగిభిః వరివారితః | ధ్వజహస్తో విశాలాక్షో మృగవాహన సంస్థితః. 87

ఆ ప్రదేశమునకు తూర్పుగ నెతైన శిఖరములుగల యమరావతీ పట్టణము పలు విధముల వనములతో నలరారును. అచట మహేంద్రుడు విరాజిల్లుచుండును. అచట స్వర్గసీమలోని శోభ కన్న నధికమైన పరమశోభ వెల్గుచుండును. అట వేల యింద్రుల తేజముగల మహేంద్రుడు వజ్రపాణియై ఐరాత మధిరోహిచిదేవసేనలను గూడి గంభీరముగ వెలుగొందు చుండును. ఇంద్రాణియును దేవాంగనలను గూడియుండును. దాని కాగ్నేయనునం దగ్వి మయపట్టణమో యమ నగ్నిపురము ప్రకాశించుచుండును. అగ్ని యచట తన భార్యలగు స్వాహా స్వధాదేవులను గూడి తన వాహన భూషణ దేవగణనులతో వెలుగొందుచుండును. దక్షిణ దిశయందు యమపురము గలదు. అందు యముడు దండధారియై చిత్రగుప్తుడు మొదలగు వారితో గూడి యుండును. అట సూర్యతనయుడగు యముడు తన శక్తితో గూడియుండును. నైరృత దిశయందు రాక్షసులుందురు. అట రాక్షసులను గూడి ఖడ్గధారియై నిరృతి తల శక్తి వెలుగుచుండును. పడమట వరుణదేవుడు పాశపాణియై ప్రతాపియై యొప్పుచుండెను. అతడు మహామత్స్యము నధిరోహించి వారుణీ మదమత్తయగు తన శ్తిని గూడి జలజంతువులతో వరుణలోకమందు వరుణానితో జేరి రతిక్రీడల మునిగి తేలుచు ప్రమద మొందుతుడను. ఇక వాయవ్యమున వాయులోకమున వాయుదేవుడు వాస ముండును. అతడు వాయుసాధనమున సిద్ధులైన యోగులనుగూడి ధ్వజిహస్తుడు విశాలాక్షుడు మృగవాహనుడై చెలువొందును. అతడు తను మరుద్గణములు సేవింపగ తల శక్తిని గూడుయుండును.

మరుద్గణౖః పరివృతో నిజశక్తి సమన్వితః | ఉత్తరస్యాం దిశి మహా న్యక్షలోకో స్తి భూమిప. 88

యక్షాధిరాజస్తత్రా77స్తే వృద్ధి ఋద్ద్యాది శక్తిభిః | నవభిర్నిధిభి ర్యుక్త స్తుందిలో ధననాయకః. 89

మణిభద్రః పూర్ణభద్రో మణిమాన్మణికంధరః | మణిభూషోమణిస్రగ్వీ మణికార్ముక ధారకః. 90

ఇత్యాదియక్షసేనానీసహితోనిజశక్తి యుక్‌ | ఈశానకోణ సంప్రోక్తో రుద్రలోకో మహత్తరః. 91

అనర్ఘ్య రత్నఖచితో యత్ర రుద్రో7ధి దైవతమ్‌ | మన్యుమాన్దీప్తనయనో బద్దపృశ్ఠ మహేషుధిః. 92

స్ఫూర్జ ద్ధనుర్వామహస్తో7ధిజ్య ధన్వభి రావృతః | స్వసమానై రసంఖ్యాతరుద్రైః శూలవరాయుధైః. 93

వికృతాసై#్యః కరాలాసై#్య ర్వమద్వహ్విభిరాస్యతః | దశహసై#్తః శతకరైః సబస్రభు సంయుతైః. 94

దశపాదైర్దశగ్రీవై స్త్రినేత్రైరుగ్ర మూర్తిభిః | అంతరిక్షచరా యే చ యేచ భూమిచరాః స్మృతాః. 95

రుద్రాధ్యాయే స్మృతా రుద్రా సై#్తః సర్వైశ్చ సమావృతః | రుద్రాణీకోటీసహితో భద్రకాళ్యాది మాతృభిః. 96

నానాశక్తి సమావిష్ట డామర్యాదిగణావృతః | వీరభద్రాదిసహితో రుద్రో రాజన్విరాజతే. 97

ముండమాలాధరో నాగలవలయో నాగకంధరః | వ్యాఘ్రచర్మపరీధానో గజచర్మో త్తరీయకః. 98

చితాభస్మానులిప్తాంగః ప్రమాథాదిగణావృతః | నినిదడ్డమరుధ్వానైర్బధిరీకృతదిజ్ముఖః. 99

అట్టహాసాస్ఫోటశ##బ్దైః సంత్రాసితనవభస్తలః | భూతసంఘసమావిష్టో భూతావాసే మహేశ్వరః. 100

ఈశానదిక్పతిః సో యం నామ్నాచేశాన ఏవచ. 101

ఇతి శ్రీదేవి భాగవతే మహాపురాణ ద్వాదశస్కంధే దశమో7ధ్యాయః.

రాజా! ఉత్తరమున యక్షలోకము వెలుగొందుచుండును. అచట వృద్ధి - బుద్ధులను శక్తులను గూడి యక్ష రాజు విరాజిల్లుచుండును. అతడు ధనపతి; నవనిధుల కధిపతి; మణిభద్రుడు పూర్ణభద్రుడు మణిమంచుడు మణికంధరుడు మణిభూషుడు మణిమాలాధారి మణికార్ముకుడు మొదలగు యక్షసేనానులను గూడి కుబేరుడు తన శక్తితో నధిక సంపన్నుడై తేజరిల్లును. దాని కీశాన్యమున మహారుద్రలోకము విరాజిల్లుచుండును. అది విలువైన రత్నములతో నిర్మించబడినది. అందు మహారుద్రుడు స్వయముగ ప్రకాశించుచుండును. అతడు మహోగ్రుడు దీప్తనయనుడు మూపున నమ్ములపొది దాల్చినవాడు. అతడు తన యెడమచేత ప్రకాశించు ధనువు దాల్చి తనకు సరితూగగల పెక్కు రుద్రలతో జేరియుండును. ఆ రుద్రులును వరాయుధములును ధనువులను దాల్చియుందురు. వారి వికృత భీకర ముఖములనుండి నిప్పులు గురియుచుండును. వారిలో కొందఱు పది చేతులు - నూఱు చేతులు - వేయి భుజములు - పది పాదములు - పది మెడలు - మూడు నేత్రములు గలవారును భయంకర విగ్రహులునై కొందఱు నేలపై కొంద ఱాకాశమున తిరుగుచుందురు. అచట రుద్రాధాయయమందు చెప్పబడిన రుద్రులను - మాతలను పలు విధెములైన శక్తులను డామర్యాది గణములను వీరభద్రాదులను గలిసి మహారుద్రుడు కొలువై విరాజిల్లుచుండును. అచట ముండమాలాధరుడు - నాగకంకణుడు నాదకంఠుడు పులితోలు దాల్చినవాడు ఏనుగుతో లుత్తరీయముగ గలవాడు చితాభస్మము మేనుల కలం దుకొనినివాడు ప్రమథాది గణములతో గూడినవాడు నినదించు దమరుమ్రోతలతో దిక్కులు పిక్కటిల్ల జేయువాడు మహాట్టహాసముతో స్పోటశబ్దముతో నింగిని భయపెట్టువాడు భూతసంఘములతో గూడిన భూతావాసుడు నగు మహేశ్వరుడు ఈసాన దిక్కునకు పతి యగుట వలన ఈశాను డనబడును. అతడ్టుమూర్తియు మహారుద్రుడునై విరాజిల్లుచుండును.

ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి ద్వాదశ స్కంధమున దశమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters