Sri Devi Bagavatham-2    Chapters   

అథాష్టమో7ధ్యాయః.

జనమేజయ ఉవాచ : భగవన్సర్వ ధర్మజ్ఞ సర్వశాస్త్ర స్త్రవతాం వర | ద్విజాతీనాం తు సర్వేషాం శక్త్యు పాస్తిః శ్రుతీరితా. 1

సంధ్యా కాలత్రయే7న్యస్మి న్కాలే నిత్యతయా విభో |

తాం విహాయ ద్విజాః కస్మాత్‌ గృహ్ణీయుశ్చాన్య దేవతాః. 2

దృశ్యంతే వైష్ణవాః కేచి ద్గాణాపత్యా స్తథా పరే | కాపాలికా శ్చీనమార్గరతా వల్కల ధారిణః. 3

దిగంబరా స్తథా బౌద్ధా శ్చార్వాకాఏవమాదయః | దృశ్యంతే బహవోలోకే వేదశ్రద్ధా వివర్జితాః. 4

కిమత్ర కారణం బ్రహ్మం స్తద్బవాన్వక్తు మర్హతి | బుద్ధిమంతః పండితాశ్చ నానాతర్క విఛక్షణాః. 5

అపి సంత్యేవ వేదేషు శ్రద్ధయాతు వివర్జితాః | నహి కశ్చిత్స్వ కల్యాణం బుద్ద్యా హాతు మిహేచ్ఛతి. 6

కిమత్ర కారణం తస్మా ద్వద వేదవిదాంవర | మణి ద్వీపస్య మహిమా వర్ణితో భవతాపురా. 7

కీదృక్తదస్తి యద్దేవ్యాః పరంస్థానం మహత్తరమ్‌ | తచ్చాపి వద భక్తాయ శ్రద్దధానాయమే7నఘ. 8

ప్రసన్నాస్తు వదంత్యేవ గురవో గుహ్యమప్యుత | సూత ఉవాచ : ఇతి రాజ్ఞోవచః శ్రుత్వా భగవాన్బాదరాయణః. 9

నిజగాద తతః సర్వం క్రమేణౖవ మునీశ్వరాః | యచ్చ్రుత్వాతు ద్విజాతీనాం వేద శ్రద్ధా వివర్ధతే. 10

వ్యాస ఉవాచ : సమ్య క్పృష్టం త్వయా రాజ న్సమయే సమయోచితమ్‌ |

బుద్ధిమానసి వేదేషు శ్రద్ధావాంశ్చైవ లక్ష్యసే. 11

ఎనిమిదవ అధ్యాయము

గాయత్రీజపము మోక్షప్రదమనుట

జనమేజయుం డిట్లనెను : సకల ధర్మము లెఱింగిన భగవానుడా ! శాస్త్రవిదులలో శ్రేష్ఠుడా ! ద్విజులకు శక్త్యుపాసన ముఖ్యమని వేదములు పలికినవి. త్రికాలములందును గాయత్రీమాత పరమయని ద్విజులుపాసింపవలయును గదా! అట్టిచో నితర దేవతల నుపాసించు టేల? వైష్ణవులు గాణాపత్యులు కాపాలికులు చీనమార్గరతులు వల్కలధారులు దిగంబరులు - బౌద్ధులు - చార్వాకులు - ఇట్టు లెందరో పెక్కు తెగలవారు వేదములందు శ్రద్ధలేనివారై వర్తింతురు గదా ! ఇంత ఱిన్ని దేవతలను కొల్చుటకు కారణ మేమి? దీనికి నీవే సమాధానము చెప్పజాలుదువు. మతిమంతులు పండితులు నానా తర్కములందు నేర్పరులును వేదములందు శ్రద్ధ మాని వర్తింతురు. ఎవడైన తన బుద్ధితో తన మేలు తాను చెడగొట్టుకొనడు గదా! వేద విద్వరా! ఈ భిన్నత్వమునకు కారణమేమో తెలుపుము. మునుపు నీవు మణిద్వీప మహిమ వర్ణించితివి. శ్రీదేవి పరమధామ మెటు లున్నదో భక్తివ్రపత్తులు గల నాకు మరల నొకసారి తెలియపలుకుము. ప్రసన్నులైన గురువు లెంతెంతటి రహస్యము నైన తేలికగ తేటపరతురు. అను రాజు మాటలను వ్యాస భగవానుడు విని వరుసగ నంతటికిని సమాధాన మిచ్చెను. మును లారా! అదంతయును విన్నచో ద్విజులకు తప్పక వేదములందు శ్రద్ధ గలిగి తీరును. వ్యాసు డిట్లనియెను : రాజా! నీవు సమ యోచితముగ ప్రశ్న వేసితివి. నీవు బుద్ధిశాలివి. వేదములందు శ్రద్ధగలవాడవు.

పూర్వం మదోద్ధతాదైత్యా దేవైర్యుద్ధం తు చక్రిరే | శత వర్షం మహారాజ మహావిస్మయ కారకమ్‌. 12

నానాశస్త్ర ప్రహరణం నానామాయా విచిత్రితమ్‌ | జగత్షయకరం నూనం తేషాం యుద్ధమభూన్నృప. 13

పరాశక్తి కృపావేశా ద్దేవైర్దైత్యా జితా యుధి | భువంస్వర్గం పరిత్యజ్య గతాః పాతాళ##వేశ్మని. 14

తతః ప్రహర్షితా దేవాః స్వపరాక్రమ వర్ణనమ్‌ | చక్రుః పరస్పరం మోహాత్సాభిమానాః సమంతతః. 15

జ యో స్మాకం కుతో నస్యాదస్మాకం మహిమాయతః | సర్వోత్తరః కుత్ర దైత్యాః పామరా నిష్పరాక్రమాః. 16

సృష్టిస్థితిక్షయకరా వయం సర్వే యశస్వినః | అస్మ దగ్రే పామరాణాం దైత్యానాం చైవ కాకథా. 17

పరాశక్తిప్రభావం తే నజ్ఞాత్వామోహమాగతాః | తేషా మనుగ్రహం కర్తుం తదైవ జగదంబికా. 18

ప్రాదురాసీత్కృపాపూర్ణా యక్షరూపేణ భూమిప | కోటిసూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలమ్‌. 19

విద్యుత్కోటి సమానాభః హస్తపాదాది వర్జితమ్‌ | అతష్టపూర్వం తద్దృష్ట్వా తేజః పరమ సుందరమ్‌. 20

సవిస్మయాస్తదా ప్రోచుః కిమిదంకిమిదంత్వితి | దైత్యానాం చేష్టితం కింవామాయాకాపిమహీయసీ. 21

కేనచిన్నిర్మితా వా7థ దేవానాం స్మయకారిణీ | సంభూయ తే తదా సర్వే విచారం చక్రురుత్తమమ్‌. 22

మొట్ట మొదట మదగర్వితులైన దైత్యులు దేవతలతో నాశ్చర్యము గల్గునట్లు నూఱు సంవత్సరములు యుద్ధ మొనరించిరి. వారి యుద్దము పెక్కు విచిత్ర మాయలతో పెక్కు శస్త్రప్రహారములతో లోకక్షయకరముగ సాగెను. అందు దేవతలు పరాశక్తి దయవలన గెలిచిరి. దానవు లోడి స్వర్గభూములు వదలి పాతాళమున కేగిరి. దేవతలు తమ తమ గొప్పలు గోరంతలు కొండంతలు చేసి యభిమానగర్వము నిట్లు వెలిపుచ్చిరి. మేము సర్వశ్రేష్ఠులము; మాలో గొప్ప మహిమలు గలవు; మాకు జయ మేల చేకూరదు ! దైత్యులు పామరులు - శక్తిహీనులు. మేము సృష్టి స్థితి లయకారకులము - కీర్తిమంతులము - ఇక మా ముందు పామరులగు దైత్యుల యాటకట్టినట్లే. ఇట్లు పలికి దేవతలు పరాశక్తి మహిమ మెఱగలేక మోహితులైరి. అంతలో జగదంబ వారికి కనువిప్పు గల్గింపదలచినది. అంత దేవి దయాపూర్ణయై యక్షరూపమున నవతరించెను. ఆ తల్లి కోటి కోటి సూర్యుల కాంతులు విరజిమ్ముచు కోట్ల చంద్రుల చల్లదనము వెదజల్లుచు కోటి మెఱుపు తీగల తళతళలో కాలుసేతులు - అంగములు లేనిదై మున్ను కన్నది - విన్నది - గాక పరమ రమణీయమైన జ్యోతియై వెలుగొందు చున్నది. ఆ దివ్యతేజముగాంచి యిదేమి - యదేమి యని వారందఱు నివ్వెఱపొందిరి. ఇదెవ్వ డేని దైత్యుడు చేసిన మాయయో ! చెడు చేతలో ! కాక యే దేవతలేని విస్మయకరముగ నిట్లు కల్పించిరో ! యని సురులెల్లరును పలురీతుల నాలోచింపసాగిరి.

యక్షస్య వికటేగత్వా ప్రష్టవ్యం కస్త్వమిత్యపి | బలాబలం తతో జ్ఞాత్వా కర్తవ్యాతు ప్రతిక్రియా. 23

తతో వహ్నిం సమాహూయ ప్రోవాచేంద్రః సురాధిపః |

గచ్ఛ వహ్నే త్వ మస్మాకం యతో7సి ముఖముత్తమమ్‌. 24

తతో గత్వాతు జానీహి కిమిదం యక్షమిత్యపి | సహస్రాక్షవచః శుత్ర్వా స్వపరాక్రమ గర్బితమ్‌. 25

వేగాత్స నిర్గతో వహ్నిర్య¸° యక్షస్యసన్నిధౌ | తదా ప్రోవాచయక్ష న్తంత్వంకో7సీతి హుతాశనమ్‌. 26

వీర్యం చత్వయి కింయత్తద్వద సర్వం మమాగ్రతః | అగ్నిరస్మి తథా జాతవేదా అస్మీతి సో7బ్రవీత్‌. 27

సర్వస్య దహనే శక్తి ర్మయి విశ్వస్య తిష్ఠతి | తదా యక్షం పరం తేజస్తదగ్రే నిదధౌతృణమ్‌. 28

దహైనం యతితేశక్తి ర్విశ్వస్య దహనే స్తిహి | తదా సర్వ బలే నైవా7కరోద్యత్నం హుతాశనః. 29

నశశాక తృణం దగ్ధుం లజ్జితో7గాత్సురాన్ర్పతి | పృష్టే దేవైస్తు వృత్తాంతే సర్వం ప్రోవాచహవ్యభుక్‌. 30

వృథా7భిమానో హ్యాస్మాకం సర్వేశత్యాదికే సురాః | తతస్తు వృత్రహా వాయుం సమాహూయేద మబ్రవీత్‌. 31

త్వయిప్రోతం జగత్సర్వం త్వచ్చేష్టాభిస్తు చేష్టితమ్‌ | త్వం ప్రాణరూపః సర్వేషాం సర్వశక్తి విధారకః. 32

త్వమేవ గత్వా జానీహి కిమిదం యక్షమిత్యపి | నాన్యః కో7పి సమర్థో7స్తి జ్ఞాతుం యక్షం పరం మహః. 33

మన మా యక్ష సన్నిధి కేగి నీ వెవరవని యడుగుదము. బలాబలము లెఱింగి ప్రతిక్రియ జరుపుదము. అపుడింద్రు డగ్నిని పిలిచి యిట్లనెను. అగ్నీ! ''నీవు మాకు ముఖమువంటివాడవు. నీవు వెళ్ళుము. ఆ యక్షమెవరో యెఱుంగుము,'' అను నిందరుని మాటలు వినగనే యగ్ని కభిమానము ముంచుకొనివచ్చెను. అగ్ని వేగిరమే యక్ష సన్నిధి కేగెను. అపుడు యక్ష మగ్ని కిట్లనియెను. ''నీ వెవడవు; నీ బల మెంతటిది? అంతయు నాకు దెలుపుము.'' అపు డగ్ని యిట్లని యెను : ''నే నగ్నిని; జాతవేదుడను; ఈ విశ్వ మంతటిని కాల్చు శక్తి నాలో గలదు.'' అపు డా పరమతేజస్వియగు యక్ష మగ్నిముందొక గడ్డిపోచ నుంచెను. యక్ష మిట్లనెను : ''నీలో వివ్వ మంతటిని కాల్చు శక్తి యున్నచో దీనిని కాల్చు చూతము.'' అపు డగ్ని తన పూర్ణ శక్తితో ప్రయత్నించి చూచెను. కాని దానిని కాల్చలేకపోయెను. అపుడగ్ని తలవంచు కొని సురలచెంత కేగి వా రడుగగ జరిగిన దంతయు నిటుల తెలిపెను : ''దేవతలారా! మనము సర్వేశ్వరులమని మనలో దురభిమానము మెండుగ గలదు.'' అపు డింద్రుడు వాయువును బిలిచి యిట్లనియెను : ''ఈ జగమంతయును నీలో గలదు. ఇది నీ చేతలచేత చైతన్యవంతమై యున్నది. నీ వందఱికిని ప్రాణరూపవు. అందఱ శక్తులు నీవు ధరింపగలవు. కనుక నీవు వెళ్ళి యా యక్షమెవరో తెలియుము. అతని నెఱుగుటలో నీవు గాకితరుడు సమర్థుడు లేడు.''

సహస్రాక్షవచః శ్రుత్వా గుణగౌరవ గుంఫితమ్‌ | సాభిమానో జగామా77శు యత్యక్షం విరాజతే. 34

యక్షం దృష్ట్వా తతో వాయుం ప్రోవాచ మృదుభాషయా | కో7సి త్వం త్వయినాశ క్తిర్వద సర్వం మమాగ్రతః. 35

తతో యక్షవచః శ్రుత్వా గర్వేణ మరు దబ్రవీత్‌ | మాతరిశ్వా7హమస్మీతి వాయురస్మీతి చాబ్రవీత్‌. 36

వీర్యం తు మయి సర్వస్య చాలనే గ్రహణస్తి హి | మచ్చేష్టయా జగత్సర్వం సర్వవ్యాపారవ ద్బవేత్‌. 37

ఇతి శ్రుత్వా వాయువాణీం నిజగాద పరం మహః | తృణమేతత్తవాగ్రే యత్తచ్చాలయ యథేప్సితమ్‌. 38

నోచేద్గర్వం విహాయైవ లజ్జితో గచ్ఛ వాసవమ్‌ | శ్రుత్వా యక్షవచోవాయుః సర్వశక్తి సమన్వితః. 39

ఉద్యగోమకరోత్త చ్చ స్వస్థానాన్న చ చాలహ | లజ్జితో7గాద్దేవ పార్శ్వం హిత్వాగర్వం స చానిలః. 40

వృత్తాంత మవదత్సర్వం గర్వ నిర్వాప కారణమ్‌ | నైతత్‌ జ్ఞాతుం సమర్థాః స్మమిథ్యాగర్వాభిమానినః. 41

అలౌక్కిం భాతియక్షం తేజః పరమ దారుణమ్‌ | తతః సర్వే సురగణాః సహస్రాక్షం సమూచిరే. 42

దేవరాడసి యస్మాత్త్వం యక్షం జానీహితత్త్వతః | తత ఇంద్రో మహాగర్వాత్త ద్యక్షం సముపాద్రవత్‌. 43

ప్రాద్రవచ్చ పరంతేజో యక్షరూపం పరాత్పరమ్‌ | అంతర్ధానం తతః ప్రాప తద్యక్షం వాసవాగ్రతః. 44

అను నింద్రుని మాటలు విని యాత్మస్తుతితో - దురభిమానముతో వాయువు యక్ష సన్నిధి కేగెను. యక్షము వాయువును చూచి మెల్లమెల్లగ నిట్లనెను : ''నీ వెవరవు? నీ శక్తి యెంతటిది? నాకు తెలుపుము.'' అను యక్ష వచనములు విని గర్వముతో వాయు విట్లనెను : నేను వాయువును మాతరిశ్వుడను. నాలోనెల్ల వస్తువులను కదలించు శక్తి - గ్రహించు శక్తియు గలదు. నా వలననే విశ్వమంతయును క్రియాశీల మగుచున్నది. అను వాయువు వాక్కులు విని యక్షమిట్లనెను : ''నీ ముం దీ గడ్డిపోచ నుంచితిని. దీనిని కొంచెము కదలించి చూడుము. నీ చేత గానిచో తలవంచుకొని యింద్రుని చెంత కేగుము.'' సర్వశక్తియుతుడగు వాయువు యక్షము పలుకులు వినెను, వాయువు తన పూర్తి శక్తి వినియోగించెను. కాని దానిని కదలింపజాలకపోయెను. అపుడతడు చేయునది లేక గర్వము వదలి యింద్రుని చెంత కేగెను. అతడు తన గరువ మంతయును దిగిన సంగతి తెలిపి యిట్లనెను : ''మనము పనికిమాలినవారము. తలబిరుసువారము. అతని నిజరూప మెఱుగు శక్తి మనకు లేదు - లేదు. ఆ యక్షములో పరమమైన లోకాతీతమైన తేజము గలదు'' అని వాయు వనెను. అపుడు సుర లందఱు నింద్రునితో నిట్లు పలికిరి. నీవు దేవరాజవు. ఆ యక్షము తత్త్వమును నీవే యెఱుంగుము. అనగ నింద్రుడు మహా గర్వముతో బయలుదేరెను. అంతలో యక్ష పరాత్పరతేజ మింద్రుని ముందుండి తటాలున మాయ మయ్యెను.

అతీవ లజ్జితో జాతో వాసవో దేవరాడసి | యక్షసంభాషణాభావాల్లఘుత్వం ప్రాపచేతసి. 45

అతః పరం న గంతవ్యం మయాతు సురసంసది | కిం మయా తత్ర వక్తవ్యం స్వలఘుత్వం సురాన్ర్పతి. 46

దేహత్యాగో వరస్తస్మా న్మానో హి మహతాం ధనమ్‌ | మానే నష్టే జీవితం తు మృతితుల్యం న సంశయః. 47

ఇతి నిశ్చిత్య తత్రైవ గర్వం హిత్వా సురేశ్వరః | చరిత్ర మీదృశం యస్య తమేవ శరణం గతః. 48

తస్మిన్నేవ క్షణ జాతా వ్యోమవాణీ నభస్తలే |మాయాబీజం సహస్రాక్ష జప తేన సుఖీ భవ. 49

తతో జజాప పరమం మాయాబీజం పరాత్పరమ్‌ | లక్షవర్షం నిరాహారో ధ్యానమీలితలో చనః. 50

అకస్మాచ్చైత్ర మాసీయన వమ్యాం మధ్యగే రవౌ | తదే వావిరభూత్తేజ స్త స్మిన్నేవ స్థలేపునః. 51

తేజో మండల మధ్యేతు కుమారీం నవ¸°వనామ్‌ | భాస్వజ్జపా ప్రసూనాభాం బాలకోటి రవి ప్రభామ్‌. 52

బాలశీతాంశు ముకుటాం వస్త్రాంత ర్వ్యంజితస్తనీమ్‌ | చతుర్బిర్వరహసై#్త స్తు వరపాశాంకుశాభయాన్‌. 53

దధానాం రమణీయాంగీం కోమలాంగలతాం శివామ్‌ | భక్త కల్ప ద్రుమా మంబాం నానాభూషణ భూషితామ్‌. 54

త్రినేత్రాం మల్లికామాలా కబరీజూట శోభితామ్‌ | చతుర్దిక్షు చతుర్వేదై ర్మూర్తిమద్బి రభిష్టుతామ్‌. 55

దంతచ్ఛటాభిరభితః పద్మరాగీ కృతక్షమామ్‌ | ప్రసన్నస్మేరవదనాం కోటి కందర్ప సుందరామ్‌. 56

రక్తాంబరపరీధానాం రక్తచందనచర్చితామ్‌ | ఉమాభిధానాం పురతో దేవీం హైమవతీం శివామ్‌. 57

నిర్వ్యాజ కరుణా మూర్తిం సర్వకారణ కారణామ్‌ | దదర్శ వాసవస్తత్ర ప్రేమగద్గదితాంతరః. 58

అపుడా యక్షము మాటయైన వినకపోతినేయని యింద్రుడు తను తాను తక్కువవానిగ తలచెను. అత డిట్లనుకొనెను : నే నిపుడు దేవసభకు వెళ్ళజాలను. దేవతల ముందు తల యెత్తుకొని తిరుగజాలను. నా తేలికదనమును వారితో నెట్లు తెలుపగలను. కనుక ఈ తనువు చాలించుటే మంచిది. ఏలన మానధనుల కభిమానమే గొప్పధనము. అట్టి యభిమానమునకే హాని గలుగగ నతని బ్రదుకు చావువంటిదే. ఇది నిజము. అని నిశ్చయించుకొని యింద్రు డచటనే తన గర్వము దిగవిడిచి యంతటి యద్బుత చరిత్రగల వ్యక్తిని నేను శరణు వేడుచున్నానని పలికెను. అదే క్షణమున గగనము నుండి అశరీరవాణి యిట్లు వినబడెను. ఇంద్రా ! మాయా బీజము జపించుము. అది జీవామృతసారము. దానివలన నీకు సుఖము గల్గును. అంత నింద్రుడు పరాత్పర మాయబీజము జపించుచు నిరాహారుడై ధ్యానమగ్నుడై లక్ష సంవత్సరములు దేవిగూర్చి తపించెను. ఒక చైత్రశుద్ధ నవమినాడు పట్టపగలకస్మాత్తుగ నదే దివ్యతేజ మదే చోట నవతరించెను. ఆదివ్యతేజ మందొక కుమారి జపాకుసుమ కాంతులతో బాలకోటి సూర్యుల ప్రభలతో వెలుగుచుండెను - ఆ భగవతి తన కిరీటమందు నెల బాలుని దాల్చి తన మీది పైట మాటున గూఢముగనున్న స్తనములుగల్గి తన నాల్గు చేతులందును పాశాంకుశ - వరాభయ ముద్రలు దాల్చి పరమలావణ్య సీమయై కుసుమకోమలియై నానాభూషణ భూషితయై భక్తులపాలిటి కల్పతరువై విరాజిల్లు చుండెను. ఆమె త్రిణత్ర - తెల్లకాంతులు విరజిమ్ము మల్లికామాలలతో శోభించు కేశపాశములు గలది. నలుదెసలందును రూపు గొన్న నాల్గు వేదములచేత ప్రస్తుతింపబడునది. తన దంత కాతులతో నెల్లెడల పద్మరాగకాంతులు విరజిమ్మునది. సుప్రసన్న హాసిని - కోటి మదన సుందరాంగి రక్తవస్త్రము - రక్తచందనము దాల్చి ''ఉమ'' యనబరగు హైమవతీదేవి. ఆమె యకారణ కరుణామయి - సర్వకారణకారణ - అట్టి శ్రీదేవి తన యెదుట వెలుగుచుండగ దర్శించి యింద్రుడు ప్రేమ గద్గదకంఠుడయ్యెను.

ప్రేమా శ్రుపూర్ణనయనో రోమాంచితతనుస్తతః | దండవత్ప్రణనామాథ పాదయోర్జగదీశితుః. 59

తుష్టావ వివిధైః స్తోత్రై ర్బక్తి సన్నతకంధరః | ఉవాచ పరమ ప్రీతః కిమిదం యక్ష మిత్యపి. 60

ప్రాదుర్బూతం చ కస్మాత్త ద్వద సర్వం సుశోభ##నే | ఇతి తస్య వచః శ్రుత్వా ప్రోవాచ కరుణార్ణవా. 61

రూపం మదీయం బ్రహ్మైత త్సర్వ కారణకారణమ్‌ | మాయాధిష్ఠాన భూతం తు సర్వసాక్షి నిరామయమ్‌. 62

సర్వే వేదాయత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి |

యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తేపదం సంగ్రహేణ బ్రవీమి. 63

ఓ మిత్యేకాక్షరం బ్రహ్మతదేవాహు శ్చ హ్రీంమయమ్‌ | ద్వే బీజే మమ మంత్రౌ స్తో ముఖ్యత్వేన సురోత్తమ. 64

భాగద్వయవతీ యస్మా త్సృజామి సకలం జగత్‌ | తత్రైకభాగః సంప్రోక్తః సచ్చిదానందనామకః. 65

మాయా ప్రకృతి సంజ్ఞ స్తు ద్వితీయో భాగఈరితః | సా చ మాయా పరాశక్తిః శక్తిమత్యహ మీశ్వరీ. 66

చంద్రస్య చంద్రికేవేయం మమాభిన్నత్వ మాగతా | సామ్యావస్థాత్మికా చైషా మాయా మమ సురోత్తమ. 67

ప్రళ##యే సర్వజగతో మదభిన్నైవ తిష్ఠతి | ప్రాణికర్మ పరీపాకవశతః పునరేవ హి. 68

రూపం తదేవ మవ్యక్తం ప్యక్తీభావముపైతి చ | అంతర్ముఖాతు యా7వస్థా సా మాయేత్యభిధీయతే. 69

ప్రేమాశ్రువులొలుకగ పులకిత శరీరుడై యింద్రుడు శ్రీభువనేవ్వరి చరణకమలములకు దండప్రణామము లాచరించెను. ఆతడు నిర్మలభక్తితో తలవంచుకొని పలురీతుల నా తల్లిని ప్రస్తుతించెను. మఱియు కడువినయముతో ''ఆ యక్ష మెవరు? దివ్యస్వరూపిణీ! ఎచ్చటి నుండి ప్రాదుర్బవించెను. నాకు తెలుపుము'' అను నింద్రుని మాటలువిని దయామృత తరంగిణి యగు దేవి యిట్లనియెను. ఆ కారణకారణమును - బ్రహ్మరూపమునైన దంతయును నా మాయయే. నా రూపు మాయాధిష్ఠానము - సర్వసాక్షి - నిరామయము - ఎల్లవేదము లే దివ్యపదము నభివర్ణించునో యెల్ణ తపములేదేవి గుణములు కీర్తించునో దేని బడయగోరి బ్రహ్మచర్యము సాగునో యా పదముగూర్చి నీకు సంక్షేమముగ తెల్పుదును వినుము. ఓంకారము - ఏకాక్షరము; అది బ్రహ్మము; అదే హ్రీం స్వరూపము; సురనాయక! ఆ రెండును నా మంత్రమునకు ముఖ్యమైన బీజ ములు. ఆ రెండు భాగములతో నే నీ జగములను సృజింతును. అందొక భాగము సచ్చిదానంద స్వరూపమున బరగును. రెండవ భాగము ఫ్రకృతి; పరమమైన మాయ; ఆ మాయయే పరాశక్తి; ఆ యీశ్వరీ శక్తి - ఇవన్నియును నేనే సుమా! నెలరాజు నుండి వెన్నెల వేరుగానట్లు నా మాయయు నాకు వేరుగాదు. సురోత్తమా! నా యీ మాయ సామ్యానస్థ గలది. ప్రళయ మం దీ జగమంతయును నాకంటె భిన్నముగ నుండదు. మరల ప్రాణుల కర్మపరిపాకవశమున సృష్టి జరుగును. అపుడు నా యవ్యక్త రూపమే వ్యక్తరూపము దాల్చును. నా యంతర్ముఖమగు నవస్థయే మాయ యనబడును. బహిర్ముఖాతు యా మాయా తమఃశ##బ్దేవ సోచ్య తే | బహిర్ముఖా త్తమోరూపాజ్జాయతే సత్త్వసంభవః. 70

రజోగుణస్త దైవస్యా త్సర్గా దౌ సురసత్తమ | గుణత్రయాత్మకాః ప్రోక్తా బ్రహ్మవిష్ణు మహేశ్వరాః. 71

రజోగుణాధికో బ్రహ్మా విష్ణుః సత్త్వాదికోభ##వేత్‌ | తమోగుణాధికో రుద్రః సర్వకారణరూపధృక్‌. 72

స్థూలదేహో భ##వేద్ర్బహ్మా లింగదేహో హరిః స్మృతః | రుద్రస్తు కారణో దేహ స్తురీయా త్వహమేవ హి. 73

సామ్యావస్థాతు యాప్రోక్తా సర్వాంతర్యామి రూపిణీ | అత ఊర్ధ్వం పరం బ్రహ్మ మద్రూపం రూపవర్జితమ్‌. 74

నిర్గుణం సగుణం చేతి ద్విధా మద్రూపముచ్యతే | నిర్గుణం మాయయా హీనం సగుణం మాయయా యుతమ్‌. 75

సా హం సర్వం జగత్సృష్ట్వా తదంతః సంప్రవిశ్య చ | ప్రేరయామ్యనిశం జీవం యథాకర్మయథాశ్రుతమ్‌. 76

సృష్టి స్థితి తిరోధానే ప్రేరయా మ్యహమేవహి | బ్రహ్మాణం చ తథా విష్ణుం రుద్రంవై కారణాత్మకమ్‌. 77

మద్బయా ద్వాతి పవనో భీత్యా సూర్యశ్చ గచ్ఛతి | ఇంద్రాగ్ని మృత్యవస్తద్వ త్సా7హం సర్వోత్తమా స్మృతా. 78

మత్ర్ప సాదాద్బవద్బిస్తు జయో లబ్ధో7స్తి సర్వథా | యుష్మానహం నర్తయామి కాష్ఠపుత్తలికోపమాన్‌. 79

కదా చిద్దేవ విజయం దైత్యానాం విజయం క్వచిత్‌ | స్వతంత్రా స్వేచ్ఛయా సర్వం కుర్వే కర్మానురోధతః. 80

నా బహిర్ముఖమగు మాయ తమ మన బడును. బహిర్ముఖమైన తమోరూపమునుండియే సత్త్వరూప ముదయించును. సురేశా! దానినుండి రజోగునము గల్గును. దానినుండి త్రిగుణాత్మకులైన బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులుద్బ వింతురు - అందు రజోగుణ మెక్కువైన బ్రహ్మయును సత్త్వగుణ మెక్కువైన విష్ణువును తమోగుణ మెక్కువైన సర్వకారణ రూపుడగు రుద్రుడు నుద్బవింతురు. స్థూలదేహము - బ్రహ్మ; లింగదేహము - హరి; కారణదేహము - రుద్రుడు; తురీయస్వరూపము నేనే. ఈ త్రిగుణముల సామ్యావస్థయే నా యంతర్ముఖత్వము. అది సర్వాంతర్యామి స్వరూపము. అదే తురీయమైన యుపాధితో గూడినది. దీని కావల రూపము లేని పరబ్రహ్మము గలదు. నా రూపములు సగుణ - నిర్గుణములని రెండు విధములు. మాయను కనుక నేనే యెల్ల జగములు సృజించి వానియందు ప్రవేశించి వారివారి కర్మానుగుణముగ నిరంతరము జీవులను ప్రేరేపింతును. కారణరూపులగు బ్రహ్మ - విష్ణు - రుద్రులను సృష్టి - స్థితి - సంహారములకు నేనే ప్రేరేపింతును. నా భయము చేత గాలివీచును; సూర్యు డుదయించును. ఇంద్రాగ్నులు - మృత్యువును నా భయమువలన తమ తమ పనులు చక్కగ నిర్వహింతురు. నేను సర్వోత్తమురాలను. నా దయవలననే నీ వెల్ల విధముల జయము బొందుచున్నావు. నేను మిమ్ము కట్టె బొమ్మలవలె నాడింపజాలుదును. ఒకప్పుడు దేవతలకును మఱియొకప్పుడు దానవులకును విజయము చేకూర్తును. అందఱును తమతమ కర్మలననుసరించి సర్వస్వతంత్రనగు నా స్వేచ్ఛచే తమతమ పనులు నిర్వహింతురు.

తాం మాం సర్వాత్మికాం యూయం విస్మృత్య నిజగర్వతః |

అహంకారావృతాత్మానో మోహమాప్తా దురంతకమ్‌. 81

అనుగ్రహం తతః కర్తుం యుష్మద్దేహాదనుత్తమమ్‌ | నిఃసృతం సహసా తేజో మదీయం యక్షమిత్యపి. 82

అతః పరం సర్వభావైర్హిత్వా గర్వంతు దేహజమ్‌ | మా మేవ శరణం యాత సచ్చిదానంద రూపిణీమ్‌. 83

వ్యాస ఉవాచ : ఇత్యుక్త్వా చ మహా దేవీ మూల ప్రకృతిరీశ్వరీ | అంతర్ధానం గతా సద్యో భక్త్వా దేవైరభిష్టుతా. 84

తతః సర్వే స్వగర్వం తు విహాయ పద పంకజమ్‌ | సమ్యగారా ధయామాసు ర్బగవత్యాః పరాత్పరమ్‌. 85

త్రిసంధ్యం సర్వదా సర్వే గాయత్రీజపతత్పరాః | యజ్ఞ భాగాదిభిః సర్వే దేవీం నిత్యం సిషేవిరే. 86

ఏవం సత్యయుగే సర్వేగాయత్రీజపతత్పరాః | తారహృల్లేఖయోశ్చాపి జపేనిష్ణాతమానసాః 87

నవిష్ణూపాసనా నిత్యా వేదేనోక్తాతు కుత్రచిత్‌ | నవిష్ణుదీక్షా నిత్యాస్తి శివస్యాపి తథైవ చ. 88

గాయత్ర్యుపాసనానిత్యా సర్వవేదైః సమీరితా | యయా వినా త్వధః పాతో బ్రాహ్మణస్యాస్తి సర్వథా. 89

తావతా కృతకృత్యత్వం నాన్యా పేక్షా ద్విజస్య హి | గాయత్రీమాత్రనిష్ణాతో ద్విజో మోక్షమవాప్నుయాత్‌. 90

కుర్యా దన్యన్నవా కుర్యాప్రాహ మనుః స్వయమ్‌ | విహాయ తాం తు గాయత్రీం విష్ణూపాస్తిపరాయణాః. 91

శివోపాస్తిరతో విప్రో నరకం యాతి సర్వథా | తస్మా దాద్యయుగే రాజ న్గాయత్రీ జపతత్పరాః | దేవీ పదాంబుజరతా ఆసన్నర్వే ద్విజోత్తమాః. 92

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ద్వాదశస్కంధే7ష్టమోధ్యాయః.

అట్టి సర్వాత్మిక నగు నన్ను గర్వాంధులై - దురహంకారులై మీరు మఱచితిరి. మోహగ్రస్తులైతిరి. మిమ్మును గ్రహించుటకే మీ యందఱ శరీరములనుండి నా యక్షరూపమగు తేజమావిర్బవించెను - ఇంక మీరు మీమీ తనువునబుట్టిన గర్వములు విడనాడి సచ్చిదానందస్వరూపిణి నగు నన్ను శరణువేడుడు. వ్యాసుడిట్లనెను : ఈ విధముగ వచించి సర్వేశ్వరి - మూలప్రకృతి - భగవతి భక్తిప్రపత్తులుగల దేవతలచేత సన్నుతులందుకొని యంతర్ధాన మొందెను. అపుడు దేవతలెల్లరును గర్వములుడిగి భగవతియైన పరాత్పర శక్తి చరణ కమలముల నారాధించిరి. అందఱును త్రికాలము లందు నపుడు గాయత్రీ ధ్యానమున మునిగిరి. యజ్ఞ భాగములతో నెల్లరును శ్రీదేవిని సంసేవించిరి. ఈ విధముగ నెల్లరును సత్యయుగమున గాయత్రీ జపపరాయణులైరి. వారు ప్రణవము - హృల్లేఖయు నను మంత్రములు జపించుట యందే నిష్ఠితులైరి. వేదములందెచ్చటను విష్ణూపాసనగాని విష్ణుదీక్షగాని శివోపాసనగాని చెప్పబడలేదు. సర్వవేదములును శ్రీ గాయత్రి నుపాసించ వలయునని నొక్కి వక్కాణించినవి. ఆ తల్లి నుపాసించని బ్రాహ్మణుడెల్ల భంగుల నధః పతితుడు గాక మానడు. బ్రాహ్మణు డొక్క గాయత్త్రి జపముననే ధన్యజీవుడగును - మఱియే యితర మార్గమునను గాడు. గాయత్రీ జప పరాయణుడైన ద్విజుడు నిక్కముగ మోక్ష పదవి నలంకరించగలడు. ఇతరములు చేసినను - చేయకున్నను బ్రాహ్మణుడు గాయత్రిని మాత్రము తప్పక జపించవలయునని మనువు చెప్పెను. అట్టి గాయత్రిని వదలి విష్ణు నుపాసించువారు శివు నుపాసించు వారునగు విప్రులు నెల్ల విధముల నరకమున గూలుదురు. కనుక రాజా! తొల్లిటి సత్యయుగమం దెల్ల ద్విజులును గాయత్రీ జపతత్పరులై - శ్రీదేవీ పదాంబుజ నిరతులై యుండిరి. కనుక నెల్లదేవతలును శ్రీగాయత్రి చరణకమలములనే భక్తితో గొల్చు చుందురు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ద్వాదశ స్కంధమున నెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters